వివేక కేసులో సిబిఐ 66వ రోజు విచారణ చేస్తుంది. కడప సెంట్రల్ జైల్ గెస్ట్ హౌస్ వేదికగా విచారణ కొనసాగుతుంది. ముఖ్యంగా పదిహేను రోజులు క్రిందట వాచ్మెన్ రంగన్న ఇచ్చిన స్టేట్మెంట్ తో మొత్తం సీన్ మారిపోయింది. అప్పటి వరకు సిబిఐ ఏమి చేయటం లేదు అనే విమర్శలు వచ్చాయి. అయితే రంగన్న సుపారీతో పాటు, కొంత మంది పేర్లు కూడా చెప్పారు అని చెప్పటంతో, ఈ కేసు మరో మలుపు తిరిగింది. తరువాత సునీల్ యాదవ్ అనే వ్యక్తి పారిపోవటం, అతన్ని అరెస్ట్ చేయటం, అలాగే మూడు రోజులు పాటు ఆయుధాల కోసం గాలించటం తెలిసిందే. అయితే ఇక్కడ మరో ముఖ్యమైన విమర్శ సిబిఐ పైన రావటానికి కారణం, సిబిఐ ఎక్కడా , వైఎస్ సునీత చెప్పిన వారిని ఇప్పటి వరకు ప్రశ్నించలేదు. పెద్ద వాళ్ళని వదిలేసి, చిన్న చిన్న వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు అనే విమర్శలు వచ్చాయి. నిన్న సునీల్ యాదవ్ తండ్రి కూడా ఇదే విషయం పై సిబిఐని ప్రశ్నించారు. తమ కుమారుడు పై బలవంతం చేస్తున్నారని, నేరం ఒప్పుకోమని ఒత్తిడి తెస్తున్నారని, సునీత చెప్పిన అనుమానితులను ఎందుకు ప్రశ్నించటం లేదని ఆయన అడిగారు. దీంతో సిబిఐ పై ఒత్తిడి పెరిగిందో, లేదా తమ విచారణ క్రమంలో భాగంలోనో కానీ, సిబిఐ అధికారులు, ఇప్పుడు అసలు విషయం పై రంగంలోకి దిగారు.
నిన్న ఎంపీ అవినాష్ రెడ్డి పీఏని ఆరు గంటల పాటు విచారణ చేసారు. ఎంపీ అవినాష్ రెడ్డి పీఏలు రాఘవరెడ్డి, రమణారెడ్డితో పాటుగా, హోంగార్డు నాగభూషణం, వేంపల్లికి చెందిన రహంతుల్లా, బండి కేశవ, మల్లీ, సస్పెన్షన్‌లో ఉన్న సీఐ శంకరయ్యను సిబిఐ నిన్న విచారణ చేయటంతో ఒక్కసారిగా మళ్ళీ ఫోకస్ వచ్చింది. అంతే కాకుండా సిబిఐ అధికారులు అసలు పాయింట్ పట్టే పనిలో పడ్డారు. అసలు హ-త్య జరిగిన రోజున, గుండె పోటు వచ్చి చనిపోయారని మొదటి చెప్పింది ఎవరు అనే విషయం ఆరా తీయటం మొదలు పెట్టారు. ఒక ఛానల్ కు చెందిన విలేఖరిని కూడా ఈ విషయంలో ప్రశ్నిస్తున్నారు. అసలు గుండెపోటు వచ్చి పోయారని, ఎందుకు మిస్ లీడ్ చేసారు, ఎవరు చెప్పారు, ఎవరు చెప్పమన్నారు, ఎవరు బయటకు చెప్పారు అనే విషయం ఆరా తీసే పనిలో ఉన్నారు సిబిఐ అధికారులు. మొత్తంగా ఎంపీ అవినాష్‌రెడ్డి పీఏ దాకా విచారణ వెళ్ళటంతో, రేపో మాపో పెద్ద తలకాయాలను కూడా విచారణకు పిలిచే అవకాసం ఉనట్టు తెలుస్తుంది. మరి ఇది ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.