పోలవరం, పురుషోత్తపట్నం, పట్టిసీమ, ఈ మూడు ప్రాజెక్ట్ లకు సంబంధించి పర్యావరణ అనుమతులు లేకుండా ముందుకు వెళ్ళద్దు అని, గతంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది. అదే విధంగా దీని పై ఒక కమిటీ కూడా ఏర్పాటు చేసి, ఆ కమిటీ ఈ మూడు ప్రాజెక్ట్ లు సందర్శించి, ఒక నివేదికను కూడా అందచేయాలి అంటూ, ఆదేశాలు జారీ చేసిన నేపధ్యంలో, ఈ కేసు విచారణ ఈ రోజు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ముందు మళ్ళీ విచారణకు వచ్చింది. పురుషోత్తపట్నం విషయం పై జరిగిన విచారణ సందర్భంగా, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఘాటు వ్యాఖ్యలు చేసింది. అలాగే పోలవరం ముంపుకి సంబంధించి ఎందుకు ఇంత నిర్లక్ష్యం వచించారు అని కూడా గ్రీన్ ట్రిబ్యునల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పర్యావరణ ఉల్లంఘనలు జరిగినా చర్యలు తీసుకోక పోవటం పై, కూడా గ్రీన్ ట్రిబ్యునల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పర్యావరణ అనుమతుల్లేకుండా నిర్మాణాలు చేపట్టినా చర్యలు తీసుకోకపోవడంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. జస్టిస్ ఆదర్శకుమార్ నేతృత్వంలోని ఎన్జీటీ ప్రధాన ధర్మాసనం ఈ రోజు కేసు విచారణ సందర్భంగా, ఏపి ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలవరం, పురుషోత్తపట్నం, పట్టిసీమ ప్రాజెక్ట్ లలో ఉల్లంఘనల పై ఆగ్రహం వ్యక్తం చేసింది.

ngt 09082021 2

ఏ ఒక్క అధికారిపైనా చర్యలు తీసుకోకపోవడంపై ఎన్జీటీ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేస్తూ, పర్యావరణ చట్టాన్ని ఏపీలో తీవ్రంగా ఉల్లంఘించడం సిగ్గుచేటని ఎన్జీటీ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. పోలవరం కాఫర్ డ్యామ్ వల్ల ముంపుపై ఏం చర్యలు తీసుకున్నారని ప్రభుత్వాన్ని నిలదీసింది. పోలవరం ముంపుపై ఎందుకింత నిర్లక్షమని ఎన్జీటీ ప్రశ్నించింది.కేంద్ర పర్యావరణ కాలుష్య నియంత్రణ మండలి కూడా చర్యలు తీసుకోలేదు అంటూ అసహనం వ్యక్తంక్ చేసింది. సీపీసీబీ నివేదికలో కేసు ముగించాలన్న ఆత్రుతే కనిపించిందని, చట్టబద్దంగా నివేదిక ఇవ్వాలన్న చిత్తశుద్ధి లోపించింది అంటూ వారి పై కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. తనిఖీలకు వెళ్లిన అధికారులు వాస్తవాలు వెల్లడించలేకపోయారని కమిటీ పై మండి పడింది. ప్రభుత్వమే పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టులు చేపడితే ఎలా ? అంటూ ప్రశ్నించింది. పర్యావరణ ప్రభావ అంచనా తూతూమంత్రంగా చేశారుని, మూడేళ్ల నుంచి కాఫర్ డ్యాం వల్ల ముంపు జరుగుతున్నా పట్టించుకోలేదని చెప్తూ, సాయంత్రం పూర్తి తీర్పును ఇవ్వనున్నట్లు ఎన్జీటీ ధర్మాసనం పేర్కొంది.

న్యాయమూర్తులు, న్యాయస్థానాలు అదే విధంగా హైకోర్టు, సుప్రీం కోర్టు ఖ్యాతిని దిగజార్చే విధంగా, సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు రాతలు రాసిన కేసులో, ఇప్పటికే సిబిఐ కేసు నమోదు చేసింది, కోర్టు ఆదేశాలు ప్రకారం విచారణ చేస్తుంది. అయితే ఈ కేసులో మొత్తం 16 మంది పై కేసు నమోదు చేయగా, ఇప్పటికీ అయుడుగురిని అదుపులోకి తీసుకుంది సిబిఐ. ఈ రోజు ఈ వార్తా ఏకంగా నేషనల్ మీడియాలో కూడా ప్రముఖంగా ప్రచారం అయ్యింది. ముఖ్యంగా మూడు రోజులు క్రితం జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యలు చేస్తూ, జార్ఖండ్ జడ్జి హ-త్య కేసులో స్పందిస్తూ, సిబిఐ సరిగ్గా వ్యవహరించటం లేదని, జడ్జిల పై ఎలా టార్గెట్ చేస్తున్నారో చూస్తున్నా, సిబిఐ, సరిగ్గా సహకరించటం లేదు అంటూ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో, ఆంధ్రప్రదేశ్ లో ఇదే రకమైన కేసు నడుస్తూ ఉండటం, ఇప్పటి వరకు సిబిఐ సరైన విధంగా స్పందించటం లేదనే అభిప్రాయం ఉండటంతో, చీఫ్ జస్టిస్ వ్యాఖ్యలు తరువాత సిబిఐ అలెర్ట్ అయ్యింది. ఆంధ్రప్రదేశ్ లో జడ్జిల పై వ్యాఖ్యలు చేసిన కేసులో, అయుదుగురిని అరెస్ట్ చేసాం అంత, ఈ రోజు నేషనల్ మీడియాతో కూడా చెప్పటంతో, ఈ కేసు ఇప్పుడు నేషనల్ మీడియాలో కూడా హైలైట్ అయ్యింది. ఈ అయుదుగురులో ఇప్పటికే ఇద్దరిని కోర్టులో కూడా హాజరు పరిచినట్టు చెప్పారు.

cbi 08082021 2

వీరిలో, పి.ఆదర్శ్, ఎల్.సాంబశివరెడ్డి వీరి ఇద్దరినీ అరెస్ట్ చేసామని చెప్పి సిబిఐ ప్రకటించింది. అదే విధంగా ఈ కేసులో ఒక ఎంపీ, ఒక మాజీ ఎమ్మెల్యే పాత్ర పై కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నాం అని పేర్కొంది. ఈ కేసులో ప్రధానంగా భారీ కుట్ర ఉందనే ఉద్దేశంతో, లోతైన దర్యాప్తు చేస్తున్నట్టు కూడా సిబిఐ పేర్కొంది. అదే విధంగా ఎఫ్ఐఆర్ లో పేర్కొన్న పేర్లు, ఎవరైతే సోషల్ మీడియాలో ఉన్నారో, వారు కూడా న్యాయమూర్తులను దుషిస్తూ పోస్టులు పెట్టారో, వారి పాత్ర పై కూడా దర్యాప్తు చేస్తున్నామని పేర్కొంది. ఇక విదేశాల్లో ఉన్న ముగ్గిరి కోసం, ఇప్పటికే నోటీసులు జారీ చేసామని చెప్పింది. ఈ కేసులో కొంత మంది ఇళ్ళ పై దా-డి చేయగా వారు ఇంట్లో విలువైన డాక్యుమెంట్లు కూడా దొరికాయని స్పష్టం చేసింది. ఆ పోస్టులు కూడా డిలీట్ చేసినట్టు సిబిఐ చెప్తూ, వాటిని రిట్రీవ్ కూడా చేస్తామని చెప్పింది. మొత్తంగా చీఫ్ జస్టిస్ వ్యాఖ్యలు తరువాత, ఈ కేసు పై సిబిఐ దూకుడు పెంచి, మొత్తం కుట్ర అంతా బయటకు లాగే పని చేస్తుంది. మరి ఎంత వరకు ఫలిస్తుందో చూడాలి.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామకృష్ణం రాజు, తమ సొంత పార్టీలోని నెంబర్ వన్ అయిన జగన్ మోహన్ రెడ్డి, నెంబర్ టు అయిన విజయసాయి రెడ్డిని వెంటాడుతూనే ఉన్నారు. తన తండ్రి అధికారంలో ఉండగా, జగన్ మోహన్ రెడ్డి అక్రమ ఆస్తులు కూడబెట్టారు అంటూ, సిబిఐ 11 కేసులు, ఈడీ 5 కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తరువాత జగన్ మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి 16 నెలల పాటు జైల్లో కూడా ఉన్నారు. ఆ తరువాత, ఇద్దరికీ కండీషనల్ బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే బెయిల్ ఇచ్చే సమయంలో, బెయిల్ షరతులు ఉల్లంఘించం అంటూ, పూచికర్తు కూడా ఇద్దరూ ఇచ్చారు. ఆ తరువాతే ఇద్దరికీ బెయిల్ వచ్చింది. అయితే ఇప్పుడు ఇదే పాయింట్ పట్టుకున్నారు ఎంపీ రఘురామకృష్ణం రాజు. ముందుగా జగన్ మోహన్ రెడ్డి బెయిల్ షరతులు ఉల్లంఘించారు అంటూ, సిబిఐ కోర్టులో పిటీషన్ వేసారు. ఆయన బెయిల్ రద్దు చేయాలి అంటూ పిటీషన్ వేసారు. అనేక నాటకీయ పరిణామాల మధ్య, ఈ కేసులో వాదనలు ముగిసాయి. ఈ కేసుకు సంబంధించి, తీర్పు ఈ నెల 25న రానుంది. అయితే ఈ కేసు విషయంలో సిబిఐ వ్యవహార శైలి మాత్రం, అందరినీ ఆశ్చర్య పరిచింది. ఇది ఇలా ఉంటే ఇప్పుడు రఘురామరాజు జగన్ వ్యవహారం కొలిక్కి రావటంతో, విజయసాయి రెడ్డిని టార్గెట్ చేసారు.

vsreddy 07082021 2

విజయసాయి రెడ్డి అన్ని కేసుల్లో ఏ2గా ఉన్న సంగతి తెలిసిందే. జగన్ కేసుల్లో ఈయన ముఖ్యమైన వ్యక్తి అని, ప్రస్తుతం ఎంపీగా ఉంటూ ఢిల్లీలో ఉన్నతాధికారులు, హోం శాఖ చుట్టూ తిరుగుతూ, సిబిఐ దర్యాప్తుని ప్రభావితం చేస్తున్నారని, అలాగే న్యాయస్థానాల పట్ల కూడా విజయసాయి రెడ్డి వ్యవహరిస్తున్న తీరు సరిగ్గా లేదని, అందుకే అతని బెయిల్ రద్దు చేయాలి అంటూ, రఘురామకృష్ణం రాజు, వారం రోజులు క్రితం సిబిఐ కోర్టులో పిటీషన్ వేసారు. అయితే ఈ పిటీషన్ సిబిఐ కోర్టు పరిగణలోకి తీసుకుంటుందా, తీసుకోదా అని అందరూ ఆనుకున్న సమయంలో, ఈ రోజు సిబిఐ కోర్టు, విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ చేస్తూ, రఘురామరాజు పిటీషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ నెల 10న దీని పై విచారణ జరుపుతాం అని చెప్పింది. దీంతో ఇప్పుడు విజయసాయి రెడ్డి కౌంటర్ లో ఎలాంటి అంశాలు పొందుపరుస్తారో చూడాల్సి ఉంది. ఈ కేసులతో ఏమవుతుంది అనేది పక్కన పెడితే, జగన్, విజయసాయి రెడ్డికి మాత్రం, రఘురామరాజు చెవిలో జోరీగలా తయారుఅయ్యారు. మరి సిబిఐ తీర్పు ఎలా ఉంటుందో చూడాలి.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. ఒక పక్క జగన్ మోహన్ రెడ్డి, ఇతరులు, మేము కులం చూడం, పార్టీ చూడం అంటూ ఊదరగొడుతూ హడావిడి చేస్తుంటే, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మాత్రం, మా పార్టీని గెలిపించరా ? మీ సర్పంచ్ కు మేము సహకారం అందించాం అంటూ బహిరంగంగా చెప్పారు. అంతే కాదు, అక్కడ ఉన్న అధికారులకు కూడా వేలు పెట్టి మరీ, మీరు సహకరించవద్దు అంటూ, ఆదేశాలు జారీ చేసారు. నెల్లూరు జిల్లా పల్లెపాడు గ్రామ ప్రజలను ఉద్దేశించి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో అందరూ షాక్ అయ్యారు. ఆయన ఏమన్నారో ఆయన మాటల్లోనే, "ఏమి తప్పు చేసామో చెప్పండి. ఇన్ని పనులు చేయటమే తప్పా ? అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు అవసరం లేదా, ఈ గ్రామ ప్రజలకి ? ఇంత కష్టపడి, ఇంత గొడ్డు చాకరీ చేసి, మీ మధ్య ఉంటూ, మీ మధ్య తిరుగుతూ, ఇన్ని పనులు చేస్తే, ఈ గ్రామం వాళ్ళు తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్ధిని గెలిపించారు. చాలా బాధ వేస్తుంది. ఇంత కష్టపడి మీ మధ్య ఉండి, సచివాలయ సిబ్బంది, మా వాలంటీరులు, మా నాయకులు, కార్యక్తలు, గ్రామ స్థాయి అధికారులు మీ కోసం గొడ్డు చాకిరీ చేసాం, నిద్రాహారాలు మాని. జగన్ గారు ఇచ్చిన పధకాలు కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ఏమి తక్కువ చేసాం మీకు ? "

np 07082021 2

"మా అభ్యర్ధిని ఎందుకు ఓడించారు అని ఈ సమావేశం ద్వారా మిమ్మల్ని అడుగుతూ ఉన్నా. ఇది కరెక్ట్ కాదు కదా. ఏమి చేయగలుగుతాడు, మీరు గెలిపించిన తెలుగుదేశం సర్పంచ్ ? మేము అయితే దగ్గరకు రానివ్వం. ఒక్క పని చేయం. గ్రామ కార్యదర్శికి కూడా చెప్తున్నా, అతనికి సహకరించాల్సిన అవసరం లేదు. ఇక్కడ మేము చెప్పిందే జరగాలి. మేము ఏది ఆదేశిస్తే అదే జరగాలి. మరొక్కసారి అధికారులకు కూడా చెప్తున్నా, ఒక్క పని కూడా అవతల పార్టీ వాడికి చేసేది లేదు. ఎవరు చెప్పినా వినాల్సిన పని లేదు. ఈ గ్రామంలో ఏ పని చేయాలి అన్నా, మా పార్టీ నాయకులు చేయాల్సిందే. ఒక్కరిని కూడా మా పార్టీలో చేర్చుకోం. దగ్గరకు కూడా రానివ్వం. ఏమి అవసరం, మీరు మాకు ఎందుకు, మా అధికారులు, మా సచివాలయ సిబ్బంది, మా వాలంటీర్స్ ఉన్నారు. మీకు సహకరించాల్సిన అవసరం మాకు లేదు. " అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. అయితే ఈ వ్యాఖ్యలు విన్న అక్కడున్న అధికారులు అవాక్కయ్యారు. గెలిచిన సర్పంచ్ ను కాదని, ఎలా ఉంటాం అంటూ మాట్లాడుకున్నారు.

Advertisements

Latest Articles

Most Read