ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దాఖలు అయిన పిటీషన్ పై, కేంద్ర ప్రభుత్వాన్ని అఫిడవిట్ దాఖలు చేయ్యాల్సిందిగా గతంలో రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం తరుపున సెక్రటరీ ఆర్కే సింగ్, గత రాత్రి కేంద్ర ప్రభుత్వ అఫిడవిట్ ను ఆన్లైన్ లో అప్లోడ్ చేసారు. ఈ అఫిడవిట్ లో ప్రధానంగా కీలక వివరాలు పేర్కొన్నారు. క్యాబినెట్ కమిటీ తీసుకున్న నిర్ణయం మేరకే, విశాఖ స్టీల్ ప్లాంట్ లో వంద శాతం ప్రభుత్వ పెట్టుబడులు ఉపసంహరణకు ఆదేశించామని స్పష్టం చేసారు. ప్రైవేటీకరణలో భాగంగానే, ఈ నిర్ణయం తీసుకున్నాం అని చెప్పటంతో పాటుగా, ప్రైవేటీకరణ చేయటం ద్వారా, ఈ పెట్టుబడులు ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేసారు. కేంద్ర ప్రభుత్వం దేశ ఆర్ధిక పరిస్థితులు, దేశ ఆర్ధిక అవసరాలు దృశ్యా నిర్ణయాలు తీసుకునే అధికారం కేంద్రానికి ఉందని, ఇటువంటి నిర్ణయాలు కోర్టుల్లో ప్రశ్నించజాలవు అని చెప్పి, గతంలో ఒక కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుని ఈ సందర్భంగా అఫిడవిట్ లో ఉదారించారు. పైగా, దీనికి సంబంధించి, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో అత్యంత కీలకమైన అంశం, వంద శాతం పెట్టుబడులు ఉపసంహరణ అనేది, దేశ వ్యాప్తంగా అనేక చోట్ల ఈ నిర్ణయం అమలు జరుపుతున్నాం అని పేర్కొన్నారు.

rrr 28072021 2

అదే విధంగా దీనికి సంబంధించి ఉద్యోగుల విషయంలో కూడా కీలక అంశాలు పేర్కొన్నారు. రాజ్యాంగంలో అంశాలు పేర్కొంటూ, దీని ప్రకారం, ఎక్కడైతే ఉద్యోగాలు పోయాయో, అలాంటి చోటే వారు కొనసాగుతారని, పైగా ఎవరైతే ప్రైవేటు ఉద్యోగులు ఉంటారో, వారికి రాజ్యంగ భద్రత లేదని అఫిడవిట్ లో పేర్కొన్నారు. ఇక క్యాబినెట్ కమిటీలో ప్రధాని మంత్రి, హోం మంత్రి, ఆర్ధిక శాఖ మంత్రి, ఉక్కు శాఖా మంత్రితో పాటు, కార్పొరేట్ అఫైర్స్ మినిస్టర్ కూడా సభ్యులుగా ఉన్నారని, ఉన్నత స్థాయి కమిటీ ఈ నిర్ణయం తీసుకుందని, ఈ సందర్భంగా ఆయన చెప్పారు. అలాగే సిబిఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయాణ ఒక రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి అని, ఆయన పిటీషన్ కొట్టివేయాలని చెప్పి కూడా, అఫిడవిట్ లో కేంద్ర ప్రభుత్వం కార్యదర్శి స్పష్టం చేసారు. ఇటువంటి పిటీషన్ ల వల్ల, ప్రక్రియ వేగవంతం కాదని, జాప్యం జరుగుతుందని కూడా ఆయన తెలిపారు. అందుకే ఈ పిటీషన్ కు విచారణ అర్హత లేదని, అందుకే ఈ కేసు కొట్టేయాలని ఆయన తెలిపారు.

మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నేత దేవినేని ఉమాని పోలీసులు అరెస్ట్ చేసి, నందివాడ పోలీస్ స్టేషన్ లో పెట్టిన విషయం తెలిసిందే. ఇంకా ఆయన్ను జడ్జి మందు హాజారు పరచలేదు. అయితే ఈ వ్యవహారంలో అసలు ఏమి జరిగిందో చూద్దాం. ముందుగా దేవినేని ఉమ మొదటి నుంచి, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, అతని బావ మరిది అక్రమ మైనింగ్ చేస్తున్నారు అంటూ అనేక ఆరోపణలు చేసారు. గతంలో అధికారులు కూడా అక్కడ అక్రమ మైనింగ్ జరుగుతుందని, వాహనాలు సీజ్ కూడా చేసారు. అయినా అక్కడ అక్రమ మైనింగ్ జరుగుతూనే ఉంది. ఈ క్రమంలోనే ఒకానొక సందర్భంలో, వసంత కృష్ణ ప్రసాద్ ప్రెస్ మీట్ పెట్టి, దేవినేని ఉమా ఇలాగే మాట్లాడితే దేహశుద్ధి చేస్తాను, రాసిపెట్టుకో అంటూ తీవ్ర వ్యాఖ్యలు కూడా చేసారు. ఇంత బహిరంగంగా, ఆయన పై వ్యాఖ్యలు చేసినా, పోలీసులు పట్టించుకోలేదు. ఇది ఇలా ఉంటే ఈ క్రమంలో, మళ్ళీ అక్కడ అక్రమ మైనింగ్ జరుగుతుందనే సమాచారం రావటంతో, దేవినేని ఉమా నిన్న మధ్యానం కొండపల్లి వచ్చి, అక్కడ స్థానిక టిడిపి నాయకులతో మాట్లాడి, అక్రమ మైనింగ్ జరుగుతున్న ప్రాంతానికి తరలి వెళ్ళారు. అక్కడకు చేరుకొని, అక్రమ మైనింగ్ జరుగుతున్న ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడ జరుగుతున్న అక్రమ మైనింగ్ అంతా వీడియో తీసారు.

uma 28072021 2

ఇదే సందర్భంలో అక్కడ ప్రెస్ మీట్ కూడా పెట్టారు. ప్రెస్ మీట్ అయిన తరువాత, ఆయన తిరుగు ప్రయాణం అయ్యారు. అయితే సరిగ్గా ఇక్కడే అసలు ట్విస్ట్ ఇప్పుడు బయటకు వచ్చింది. దేవినేని ఉమా తిరిగి వస్తూ ఉండగా, వైసీపీ నేతలున్నారని జి.కొండూరు వైపు వెళ్లాలని కొంత మంది పోలీసులు బైక్ పై వచ్చి చెప్పారని, ఆ తరువాత వెంటనే స్థానిక ఎస్సై వచ్చి గెడ్డమడుగు వైపు వెళ్లాలని చెప్పారని, అటు వెళ్ళగానే అక్కడ దాదాపుగా వంద మంది వరకు వైసీపీ కార్యకర్తలు ఉన్నారని, తమ పై రాళ్ల దా-డి చేసారని దేవినేని ఉమా చెప్తున్నారు. అయితే దేవినేని ఉమా పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటుగా, హ-త్యా-య-త్నా-ని-కి పాల్పడినట్లు 307 సెక్షన్ కింద కూడా కేసులు పెట్టారు. అయితే అసలు దేవినేని ఉమా కారు దిగలేదు, బయట పోలీసులతో తప్ప ఎవరితో మాట్లాడ లేదు, మరి ఆయన పై ఈ కేసులు ఎలా పెడతారో ఎవరికీ అర్ధం కావటం లేదని, ఇదేమి లాజిక అని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయాలు అన్నీ కోర్టుకు చెప్తాం అని, అక్రమ కేసుల పై న్యాయస్థానంలోనే తేల్చుకుంటాం అని, టిడిపి నేతలు చెప్తున్నారు.

జగన్ మోహన్ రెడ్డి పై, దాదాపుగా 11 సిబిఐ కేసులు, అలాగే 5 ఈడీ కేసులు ఉన్న సంగతి తెలిసిందే. తన తండ్రి అధికారంలో ఉన్నప్పుడు, అధికారాన్ని అడ్డు పెట్టుకుని, సూట్ కేసు కంపనీలు పెట్టి, నిధులు మళ్ళించి, తన కంపెనీల్లోనే పెట్టుబడి పెట్టించుకుని, ఇలా రకరకాలుగా క్విడ్ ప్రోకోకి పాల్పడ్డారు అంటూ, ఆయన పై సిబిఐతో పాటుగా, ఈడీ కూడా అభియోగాలు మోపింది. అయితే ఈ కేసులు ఎప్పుడో 2012లో నమోదు అయ్యాయి. ఈ కేసుల్లోనే జగన్ మోహన్ రెడ్డి 16 నెలలు జైలుకు వెళ్లి, ప్రస్తుతం కండీషనల్ బెయిల్ పై బయట ఉన్నారు. అయితే 2012 నుంచి ఈ కేసుల విచారణ ప్రారంభం కాలేదు. ఇప్పటి వరకు డిశ్చార్జ్ పిటీషన్లు అని, ఇలా రకరకాలుగా సాగదీస్తూ తొమ్మిదేళ్ళు గడిపేశారు. ఇంకా ఒక కేసులో కూడా ట్రైల్స్ ప్రారంభం కాకపోవటంతో, అటు సిబిఐ పైన, ఇటు కేంద్రంలో ఉన్న బీజేపీ పైన విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు సిబిఐ కోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. జగన్ మోహన్ రెడ్డి కేసులు తెల్చేసేందుకు సిబిఐ సిద్ధం అవుతుంది. జగన్ మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి, ఇతర వ్యాపార సంస్థల అధినేతలు, అలగే ఐఏఎస్ అధికారులు, అప్పటి మంత్రులు కూడా ఈ కేసుల్లో ఉన్నారు. అయితే మొత్తం 11 సిబిఐ కేసుల్లో, మూడు కేసులు విషయంలో అడ్డంకులు అన్నీ తొలగిపోవటంతో, ఈ కేసులు పై విచారణ ప్రారంభం కానుంది.

cbi 27072021 2

ఈ మేరకు జగన్ మొహన్ రెడ్డిని రెడీ అవ్వాలి అంటూ, సిబిఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా మూడు కేసుల్లో ఈ విచారణ సిబిఐ కోర్టులో ప్రారంభంకానుంది. అరబిందో, హెటిరో కేసు, లేపాక్షి కేసు, గృహనిర్మాణ ప్రాజెక్టుల కేసు, ఈ మూడు కేసుల్లో విచారణకు సిద్ధం కావాలని, జగన మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్య, అరబిందో ఎండీ నిత్యానందరెడ్డి, శరత్ చంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావు, జె.గీతారెడ్డి, ఐఏఎస్ మురళీధర్ రెడ్డి, రిటైర్డ్ అధికారి శామ్యూల్, వైవీ సుబ్బారెడ్డి, కృష్ణప్రసాద్, ఇందూ శ్యాంప్రసాద్ రెడ్డికి విచారణకు రెడీ అవ్వాలి అంటూ, సిబిఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ కేసుల్లో ఇప్పుడు విచారణ ప్రారంభం అయితే, సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఏడాది లోపు ఈ కేసుల విచారణ పూర్తి కానుంది. అలాగే మిగతా ఎనిమిది కేసుల్లో కూడా త్వరలోనే విచారణ మొదలు అయితే, ఇక జగన్ మోహన్ రెడ్డి ఈ కేసుల్లో బిజీ అయిపోతారు. మరి ఈ విచారణ తరువాత, సిబిఐ కోర్టు ఏమి తేల్చుతుందో చూడాల్సి ఉంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలు నానాటికి క్షీణిస్తున్నాయి. అధికార పార్టీ తప్పులు ప్రశ్నిస్తే చాలు, దా-డు-లు చేస్తున్నారు. మొన్నటికి మొన్న రోడ్డులు బాగోలేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని టిడిపి నేతలు సరి చేసే ప్రయత్నం చేస్తే, వారినే తరిమి కొట్టారు వైసీపీ మూకలు. ఇప్పుడు అక్రమాలు ప్రశ్నిస్తున్న మాజీ మంత్రి దేవినేని ఉమాని చం-పే-సే ప్రయత్నం చేసారు. ఆయన కారుని ఆపిన వైసిపీ మూకలు, ఆయన కారు పై రాళ్ళ దా-డి చేసారు. దీంతో, కారు అద్దాలు పగిలిపోయాయి. దేవినేని ఉమాకు ఏమైనా గాయాలు అయ్యాయో లేదో ఇంకా తెలియలేదు. అయితే ఈ దా-డి వెనుక స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఉన్నాడని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. నియోజకవర్గంలో వసంత కృష్ణ ప్రసాద్ ఆగడాలు దేవినేని ఉమా ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు కాబట్టే ఇలా చంపేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇక ఈ రోజు జరిగిన సంఘటన విషయానికి వస్తే, నియోజకవర్గంలో ఎప్పటి నుంచి అక్రమ మైనింగ్ జరుగుతుందని, దేవినేని ఉమా ఆరోపిస్తున్నారు. వసంత కృష్ణ ప్రసాద్ ఇష్టం వచ్చినట్టు కొల్లగొడుతున్నారు అంటూ, గతంలో కూడా దెవినేని ఉమా నిరసన తెలియ చేసారు. ఈ రోజు కూడా ఈ క్రమంలోనే, అక్రమ మైనింగ్ జరుగుతున్న ప్రాంతానికి వెళ్ళారు.

uma 27072021 2

అయితే అక్రమ మైనింగ్ ప్రాంతాన్ని పరిశీలించి, తిరిగి వస్తున్న సమయంలో జి.కొండూరు మండలం గడ్డమణుగ వద్ద, దేవినేని ఉమా ప్రయాణిస్తున్న కారుని వైసిపీ అల్లరి మూకలు ఆపాయి. వెంటనే ఉమా వాహనం పై రాళ్ళ దా-డి చేసారు. ఈ క్రమంలోనే ఆయన వాహనం అద్దాలు కూడా ధ్వంసం అయ్యాయి. కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ లో జరుగుతున్న అక్రమ మైనింగ పరిశీలించి తిరిగి వస్తూ ఉండగా ఈ దా-డి జరిగింది. అయితే దేవినేని ఉమాని చంపటానికే ఒకేసారి వంద మందికి పైగా వచ్చి రాళ్ళ దాడి చేసారని టిడిపి ఆరోపిస్తుంది. తన అక్రమాలు బయట పడుతున్నాయనే అసహనంతోనే, వసంత కృష్ణ ప్రసాద్, ఈ ఆగడాలకు పాల్పుతున్నారని టిడిపి ఆరోపిస్తుంది. అయితే ఈ సంఘటన చీకటి పడిన తరువాత జరగటం, ఈ విషయం తెలియటంతో, టిడిపి, వైసిపీ శ్రేణులు కూడా అక్కడకు చేరుకోవటంతో, పరిస్థితి తీవ్ర ఉద్రిక్తతగా మారింది. అయితే ఇప్పటికీ పోలీసులు రాకపోవటంతో, టిడిపి నేతలు, కార్యకర్తలు ఉమాకి రక్షణగా నిలబడ్డారు.

Advertisements

Latest Articles

Most Read