కొద్ది సేపటి క్రితం ఎంపీ రఘురామకృష్ణం రాజు పంపినటువంటి మెసేజ్ లో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారిక వెబ్సైటులో ఎంపీల జాబితా నుంచి తన పేరు తొలగించారని చెప్పారు. నిన్నటి వరకు ఆ వెబ్సైటులో తన పేరు ఉందని, ఈ రోజు తన పేరు తొలగించారని, పార్టీలో నుంచి సస్పెండ్ చేసారా ఏంటి అనే విషయం తనకు తెలియదు అంటూ ఆయన మెసేజ్ మీడియాకు పంపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారిక వెబ్సైటు అంటూ రఘురామకృష్ణం రాజు పంపిన మెసేజ్ లో ఆయన పేరు అయితే లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన లోకసభ ఎంపీలు 22 మంది అయితే, ఇక్కడ మాత్రం కేవలం 21 మంది మాత్రమే ఉన్నారు. రాజ్యసభ సభ్యులతో కలిసి మొత్తం 28 మంది ఎంపీలు కాగా, ఇక్కడ మాత్రం 27 మందిని మాత్రమే పెట్టారు. రఘురామకృష్ణం రాజు పేరు మాత్రం, ఇందులో నుంచి మాయం అయ్యింది. అయితే ఇప్పటి వరకు రఘురామకృష్ణం రాజుని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ఎక్కడా అధికారిక ప్రకటన అయితే రాలేదు. మరి ఇక్కడ ఎందుకు ఆయన పేరు లేదు అనే అంశం పై మాత్రం క్లారిటీ లేదు. అయితే ఇదే ప్రశ్న రఘురామరాజు లేవనెత్తారు. తాను పార్టీలో ఉన్నానో, లేదో చెప్పాలని, క్లారిటీ ఇవ్వాలని రఘురామకృష్ణం రాజు ఆ మెసేజ్ లో ప్రశ్నలు సందించారు.

rrr 1206 2021 2

ఇది ఇలా ఉంటే, ఇప్పటికే ఒకసారి రఘురామరాజు ఎంపీ పదవి పై అనర్హత వేటు వేయాలి అంటూ, గతంలోనే ఫిర్యాదు చేసిన వైసీపీ, నిన్న జగన్ ఢిల్లీ పర్యటన అనంతరం మళ్ళీ స్పీకర్ ని కలిసి, రఘురామరాజుని అనర్హుడిగా ప్రకటించాలని కోరారు. ఆయన పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పాడుతున్నారని, అందుకే ఆయన పదవి నుంచి అనర్హుడిగా ప్రకటించాలని ఎంపీ మార్గాని భరత్ కోరారు. అయితే ఒక పక్క ఎంపీ పదవి నుంచి అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూనే, ఇప్పుడు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా అనేది తేడా కొడుతుంది. అలా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే మాత్రం, ఆయన ఎంపీ పదవి అలాగే ఉంటుంది. ఇప్పుడు ఈ పాయింట్ పట్టుకుని, రఘురామకృష్ణం రాజు, స్పీకర్ వద్దకు వెళ్లి ఇదే అంశం చెప్పే అవకాసం ఉంటుంది. అయితే రఘురామరాజు మాత్రం, నేను ఎక్కడా పార్టీ కార్యకలాపాలు చేయలేదని, ప్రభుత్వంలో జరుగుతున్న తప్పులు మాత్రమే ఎత్తి చూపుతున్నా అని, తన పై అనర్హత అనేది అయ్యే పని కాదని తెగేసి చెప్తున్నారు. అయితే ఇప్పుడు వైసీపీ అయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసిందా లేదా అనేది తెలియాల్సి ఉంది.

పోలవరం జాతీయ ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి టీడీపీ ప్రభుత్వం అహోరాత్రాలు శ్రమించిందని, రూ.11,600 కోట్లకుపైగా ఖర్చుపెట్టి, 72శాతం పనులు పూర్తి చేసిందని, స్పిల్ వే దాటి, స్పిల్ ఛానల్ ద్వారా గోదావరి వరద ప్రవాహమంతా మెయిన్ స్ట్రీమ్ లో కలిసేలా చేయడం జరిగిందని టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, 2019 జూలైలో ఆ విధంగా పారుతున్ననీటిని, అక్కడ జరిగిన నిర్మాణ పనులను అన్ని ప్రసార మాధ్యమాలు చూపించాయన్నారు. స్పిల్ వే, కాపర్ డ్యామ్ నిర్మాణం సహా, మెజారిటీ పనులన్నీ గతంలో టీడీపీ ప్రభుత్వమే చేయడం జరిగిందన్నారు. ప్రాజెక్ట్ పరిధిలోని 18,500 నిర్వాసిత కుటుంబాల ను ఖాళీ చేయించాక కాపర్ డ్యామ్ పనులను పూర్తి స్థాయిలో పూర్తి చేయాలని ఆనాటి ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అప్పర్ కాపర్ డ్యామ్, లోయర్ కాపర్ డ్యామ్ పూర్తిచేయాలంటే విధిగా 18,500 కుటుంబాలను ఖాళీ చేయించాల్సి ఉందన్నారు. ఈ ప్రభుత్వం రెండేళ్లలో రూ.880 కోట్ల వరకు ఖర్చుపెట్టి, పోలవరం ప్రాజెక్ట్ లో ఎందుకు నీటిని నిల్వచేయ లేకపోయందన్నారు. 18,500 నిర్వాసిత కుటుంబాలకు ఇస్తానన్న రూ.10లక్షల పరిహారం ఏమైందో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని మాజీమంత్రి డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వం గడచిన రెండేళ్లలో ఎన్ని నిర్వాసిత కుటుంబాలకు న్యాయం చేసిందో చెప్పాలన్నారు. ఆఖరికి నిర్వాసితులకు చెందాల్సిన సొమ్ముని కూడా ఈ ప్రభుత్వం దిగమింగుతోందని టీడీపీ ఇప్పటికే ఆధారాలతో సహా బయటపెట్టడం జరిగిందన్నారు. మచ్చామహాలక్ష్మీ, మదకం సావిత్రి వంటివారు ఎందరున్నారో.. వారి పేర్లతో కాజేసిన రూ.2 కోట్లకు పైగా సొమ్ము ఏమైందో చెప్పాలన్నారు పేద గిరిజనులకు దక్కాల్సిన సొమ్ముని కూడా ఈ ప్రభుత్వం దిగిమింగుతోందంటే, అంతకంటే దారుణం మరోటి ఉండదన్నారు. రెండేళ్ల ఈ ప్రభుత్వ పాలనలో ప్రాజెక్ట్ పరిధిలో హెడ్ వర్క్స్ పనులు ఎంత జరిగాయో చెప్పాలన్నారు. తమ ప్రభుత్వంలో చేసిన పనులు వివరాలను ఎప్పటికప్పుడు మీడియాకు వెల్లడించే వారమని, సెంట్రల్ వాటర్ కమిషన్ కు పంపేవారిమని, ఎప్పటికప్పుడు పనులు వివరాలు ఆన్ లైన్లో ఉంచేవారమని, అలాచేసే దమ్ము,ధైర్యం ఈ ప్రభుత్వానికి ఎందుకు లేవని దేవినేని ప్రశ్నించారు. ఈ రెండేళ్లలో ఏ రోజైనా ఈ ప్రభుత్వం ఏం చేసిందో ఒక్క రోజు కూడా చెప్పింది లేదన్నారు. టీడీపీ ప్రభుత్వంలో పోలవరం పునాదులే లేవలే దని చెప్పినవారు, ఈరోజు గేట్లు ఎలా పెడుతున్నారో చెప్పాలన్నారు.

రివర్స్ టెండరింగ్ డ్రామాలాడి, ప్రాజెక్ట్ పనులన్నీ ఒకే కంపెనీకి కట్టబెట్టారని, రూ.700కోట్లవరకు ఆదాచేశామని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. గోదావరి నీటిని 6.69కిలోమీటర్లుతిప్పేస్తే, ఎక్కడ నుంచి ఎటు తిప్పారో చెప్పాలన్నారు. నిర్వాసితులకుపరిహారం ఇవ్వకుండా 18,500కుటుంబాలను ముంచేయడానికి ఈప్రభుత్వం సిద్ధమైందన్నారు. టీడీపీప్రభుత్వం చేసిన పనిని ప్రజలకుచెప్పకుండా, బడాయికబుర్లతో కాలయాపన చేస్తూ, ప్రజలను నమ్మించాలని చూస్తున్నారని దేవినేని ఆగ్రహం వ్యక్తంచేశారు. టీడీపీప్రభుత్వం ఖర్చుపెట్టిన రూ.11వేలకోట్ల పైచిలుకుసొమ్ములోనే రూ.4వేలకోట్లకు పైగా సొమ్ముని ఈప్రభుత్వ కేంద్రంనుంచి తెచ్చుకుందన్నారు. ఆ సొమ్ములో గిరిజనులకు ఎంత ఖర్చుపెట్టారో చెప్పాలన్నారు. జగన్మోహన్ రెడ్డి, కేంద్రజలవనరుల శాఖా మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశాడంటున్నారని, కలిసి ఏంసాధించాడో, ప్రాజెక్ట్ నిర్మాణానికి ఎంతసొమ్ము రాబట్ట బోతున్నాడో చెప్పాలన్నారు. రూ.55,548కోట్లవరకు పోలవరంప్రాజెక్ట్ డీపీఆర్ 2కు టీడీపీప్రభుత్వంలోనే కేంద్రం ఆమోదం పొందడంజరిగిందన్నారు. దానిపై ఈ ముఖ్యమంత్రి ఇప్పుడుకొత్తగా ఆమోదింపచేయాల్సిన అవసరం ఏముందన్నారు? ఢిల్లీ వెళ్లిన జగన్ నిజంగానే పోలవరం డీపీఆర్ కు ఆమోదం పొందేలాచేస్తున్నాడని అందరం భావించామని, కానీ తనకేసులు, బాబాయ్ మర్డర్ కేసులవ్యవహారమే ఆయనకు సరిపోయిందన్నారు. పోలవరం జాతీయప్రాజెక్ట్ ని ఈ ముఖ్యమంత్రి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ గా మార్చాడన్న ఉమా, పట్టిసీమ దండగన్న వ్యక్తే, మరో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీముకి రూ.913కోట్లుఎందుకు కేటాయించాడన్నారు. ముఖ్యమంత్రి పోలవరానికి నిధులివ్వాల్సిందేనని కేంద్రాన్ని ఎందుకు డిమాండ్ చేయలేకపోతున్నాడో, రాష్ట్ర సమస్యలను ప్రధాని ముందుంచి, ఆయన్ని ఎందుకు ఒత్తిడి చేయడంలేదో చెప్పాలన్నారు.

జగన్మోహన్ రెడ్డి కో-వి-డ్ సమయంలో, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రజలను పట్టించుకోకుండా, వారికి అవసరమైన ఆర్థిక చేయూతను అందించకుండా, వారి సొమ్ముని తనకు అవసరమైన వారికి, రాజ్యాంగ విరుద్ధంగా తాను చేస్తున్న పనులకు సహకరిస్తున్నవారికి కోట్లాది రూపాయలు దోచిపెడుతున్నాడని, టీడీపీ జాతీయ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే క్లుప్తంగా మీకోసం...! ఎవరినైతే ఆదుకోవాలో, ఎవరికైతే అండగా ఉండాలో, ప్రజల సొమ్ముని ఎవరికైతే ఖర్చుపెట్టాలో వారికి మాత్రం ఈ ముఖ్యమంత్రి రూపాయికూడా సాయం చేయడంలేదు. తాను చేస్తున్న రాజ్యాంగ వ్యతిరేకమైన పనులకు సహకరించేవారికి మాత్రం భారీగా అదనపు సౌకర్యాలు, వసతలు కల్పిస్తున్నాడు. గతేడాది డిసెంబర్ 9వ తేదీన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జాస్తి నాగభూషణం అనే న్యాయవాదిని ప్రభుత్వ రెండో అదనపు అడ్వకేట్ జనరల్ గా నియమించింది. అప్పటికే రాష్ట్రానికి ఒక అడ్వకేట్ జనరల్, మరొక అదనపు అడ్వకేట్ జనరల్ ఉన్నారు. అయినా కూడా అదనంగా నాగ భూషణాన్ని అదనపు అడ్వకేట్ జనరల్ గా నియమించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గానీ, విభజన తర్వాత ఏపీలోగానీ, తెలంగాణలో గానీ రెండో అదనపు అడ్వకేట్ జనరల్ నియామకం జరగలేదు. ఒక అడ్వకేట్ జనరల్, అదనపు అడ్వకేట్ జనరల్ ఉండటమనేది సహజంగా జరిగిందే. కానీ నాగభూషణంపై ఉన్న ప్రత్యేకమైన అభిమానంతో జగన్మోహ న్ రెడ్డి ఆయన్ని రెండో అదనపు అడ్వకేట్ జనరల్ గా నియమించారు. అదనపు బెంచ్ లు లేకుండా, ఒకేఒక హైకోర్టు ఉన్న ఏరాష్ట్రంలోనూ కూడా ఇద్దరు అదనపు అడ్వకేట్ జనరల్స్ లేరు. జాస్తి నాగభూషణంపై జగన్మోహన్ రెడ్డికి ఎందుకంత ప్రత్యేక మైన అభిమానమో అందరూ ఆలోచించాలి. నాగభూషణమేమీ పెద్ద పేరు మోసిన, అనుభవమున్న న్యాయవాదేమీ కాదు . వృత్తిపరంగా ఎలాంటి గుర్తింపు లేకపోయినా కూడా ముఖ్య మంత్రి నాగభూషణానికి ఎందుకంత ప్రాముఖ్యతనిచ్చాడో అర్థంచేసుకోవాలి. నాగభూషణానికున్న ఏకైక అర్హత ఏమిటంటే, సుప్రీంకోర్టు మాజీన్యాయమూర్తి అయిన జాస్తి చలమేశ్వర్ కుమారుడు కావడమే. నా ప్రశ్నలపై ముఖ్యమంత్రిగానీ, జాస్తి నాగభూషణం గానీ సమాధానం చెప్పాలి.

తండ్రీకొడుకులైన జాస్తి చలమేశ్వర్, నాగభూషణాలకు నజరానాగా 09-12-2020న నాగభూషణాన్ని అదనపు అడ్వకేట్ జనరల్ గా నియమించారు. టీడీపీప్రభుత్వం, 2016లో ఇచ్చిన జీవోనెం-219ప్రకారం అదనపు అడ్వకేట్ జనరల్ కి, ఒక్కో అప్పియరెన్స్ కి రూ.7,500 మాత్రమే ఇస్తామనిచెప్పడం జరిగింది. ఆ జీవోకి మార్పులుచేసి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మార్చి 15-2021న జీవోనెం-69 ఇచ్చింది. దానిలో చీఫ్ సెక్రటరీతో సరిసమానంగా అదనపు అడ్వకేట్ జనరల్ కు కూడా ఇంటి అద్దె, (హెచ్ ఆర్ ఏ) ఇతరఅలవెన్సులు కల్పిస్తూ, జీవోఇచ్చారు. తిరిగి 12-03-2021న జీవోనెం-63తో అప్పియరెన్స్ కి రూ.7,500లుగా ఉన్నఫీజుని రూ.8,500లకు పెంచారు. రోజుకి గరిష్టంగా 5 అప్పి యరెన్సు లు ఉండాలనే నిబంధననుమార్చేసి, దాన్నిరోజుకి 8 అప్పియరెన్సులు చేశారు. అంటే రోజుకి రూ.68,000లు ఇచ్చేలా చేశారు. టీడీపీప్రభుత్వహాయాంలో గరిష్టంగా రూ.38వేలు మాత్రమే ఇచ్చేవారు. వాటితోపాటు, కేవలం ఈ ఐదునెలల్లోనే రూ.50లక్షలపైన అదనంగా జాస్తినాగభూషణం డ్రా చేశారు. 27-05-2021న ఇచ్చిన జీవోనెం-150చూస్తే, ఒకే జీవోలో రూ.9లక్షల18వేలు చెల్లిస్తున్నట్లు చెప్పారు. ఒక్క మార్చినెలకే నాగభూషణాని కి రూ.9లక్షల18వేలు చెల్లించారు. హైకోర్టు అప్పియరెన్స్ లపేరుతో ఇలా లక్షలకులక్షలు తగలేస్తున్నదిచాలక, మరోపక్కన సుప్రీంకోర్టు అప్పియరెన్స్ ల కింద కూడా నాగభూషణానికి లక్షలకొద్దీ సమర్పిస్తున్నారు. ఫీజులుపెంచి, అప్పియరెన్స్ లుపెంచి, సౌకర్యాలుపెంచి, ఇలా అన్నిరకాలుగా నాగభూషణానికి దోచిపెడుతున్నారు. కోర్టులద్వారా శిక్షపడుతుందని తెలిసే ఈ ముఖ్యమంత్రి అడ్డగోలుగా న్యాయవ్యవస్థపై ఎదురు దా-డి చేస్తున్నాడు. ఏరోజు కూడా పట్టుమని పదికేసులు కూడా వాదించనివ్యక్తి, రాష్ట్రానికి అడిషనల్ అడ్వకేట్ జనరలా? ముఖ్యమంత్రి ఏరకంగా ప్రజలసొమ్ముని దోచిపెడుతున్నాడో అందరూ అర్థంచేసుకోవాలి. తానుచేస్తున్న రాజ్యాంగవిరుద్ధపదవు ల్లో నాగభూషణం తనకు సహకరిస్తున్నాడనే ముఖ్యమంత్రి అతనికి అన్నివిధాలా దోచిపెడుతున్నాడు. తాము లేవనెత్తిన అంశాలపై ప్రజముందుకొచ్చి ముఖ్యమంత్రి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.

ప్రసుతం దేశం మొత్తం సోనుసూద్ హీరో అంటుంటే, సోనుసూద్ మాత్రం, చంద్రబాబు హీరో అంటున్నారు. ఈ రోజు ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్వహించిన ఒక సమావేశంలో చంద్రబాబుతో పాటు, సోనుసూద్ పాల్గున్నారు. ఆయన మాట్లాడుతూ, చంద్రబాబుని పొగడ్తలతో ముంచెత్తారు. సోనుసూద్ మాట్లాడుతూ, "నేను సినిమా రంగంలో కెరీర్ ప్రరంభించిన సమయంలో, హైదరాబాద్ తో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో షూటింగ్ లకు వస్తూ ఉండేవాడిని. నేను ఎప్పుడూ చెప్తూ ఉండే వాడిని, హైదరాబాద్ ఎంతో అద్భుతంగా ఉంటుంది. హైదరాబాద్ లో ఉన్న మౌళిక వసతులు అద్భుతంగా ఉంటాయి. హైదరాబాద్ లో ఐటి ఇలా ఉంది అంటే, దానికి కారణం చంద్రబాబు గారు. ఇంతలా హైదరాబాద్ ఉంది అంటే, దానికి ఒకే ఒక పేరు చెప్పాలి, అదే చంద్రబాబు నాయుడు సర్. హైదరాబాద్ ఎదుగుదల వెనుక ఉంది ఆయనే. ఆయన ఒక విజనరీ. నేను నా కో ఆర్టిస్ట్ లతో, ఇతరులతో అంటూ ఉండే వాడిని, చంద్రబాబు గారిని కొన్ని రోజులు మన రాష్ట్రాలకు కుడా తీసుకుని వెళ్తే, అక్కడ కూడా ఆయన ఇలాంటి అద్భుతమైన ప్రగతి సాధిస్తారనే నమ్మకం ఉండేది. చంద్రబాబు గారు చేసిన అనేక పనులు నాకు ఇన్సిపిరేషన్. కో-ర-నా సమయంలో చంద్రబాబు గారు చేసిన పని కూడా మాకు ఇన్స్పిరేషన్. క-రో-నా సమయంలో తమ ఫౌండేషన్ తరుపున అనేక సహాయ కార్యక్రమాలు చేసాం. మొదటి వేవ్ లో, ఉపాధి కల్పించాం. అలాగే అనేక మందికి వైద్యం అందించాం.

sonusood 12062021 2

అయితే రెండో వేవ్ వచ్చే సరికి, మొదటి వేవ్ లో నేను సహయ పడిన వాళ్ళు, ఒక సైన్యంలా పని చేసారు. అర్ధరాత్రి పూట కూడా అవసరం ఉంది అంటూ, తమకు ఫోన్లు వచ్చేవి. అలంటి వాటిని కూడా మేము సమర్ధవంతంగా ఎదుర్కుని సహాయం చేసాం. ఒకసారి చంద్రబాబు గారికి కూడా కాల్ చేసి, ఇలా పలానా వ్యక్తికి హెల్ప్ కావాలని కోరితే, ఆయన కూడా రెస్పాండ్ అయ్యారు. ఎవరికి ఏ సహాయం కావాలన్నా, సమయం సందర్భం చూడకండి. ఎవరికి తోచిన సహయం వారు చేయాలి. అప్పుడే అందరం ఒకరినొకరు సహకరించుకోగలం. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆక్సిజన్ ప్లాంట్లు ప్రారంభిస్తున్నాం. నేను ఒకటి సజెస్ట్ చేస్తున్నా, అన్ని సబ్జెక్ట్ లతో పాటుగా, హ్యుమేనిటీ కూడా ఒక సబ్జెక్ట్ గా నేర్పించాలి." అని సోను సూద్ అన్నారు. మనం త్వరలోనే కలుద్దాం అని, చంద్రబాబు అనగా, మీతో కలవటం కోసం ఎదురు చూస్తున్నా అని సోను సూద్ చెప్పారు. మనం కలిసి పని చేద్దామని, ఈ దేశం మిమ్మల్ని చూసి గర్విస్తుందని, మీ నుంచి అందరూ ఇన్స్పిరేషన్ గా తీసుకుంటున్నారని, మీ సేవలు ఇలాగే కొనసాగాలని చంద్రబాబు అన్నారు.

Advertisements

Latest Articles

Most Read