పోలవరం జాతీయ ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి టీడీపీ ప్రభుత్వం అహోరాత్రాలు శ్రమించిందని, రూ.11,600 కోట్లకుపైగా ఖర్చుపెట్టి, 72శాతం పనులు పూర్తి చేసిందని, స్పిల్ వే దాటి, స్పిల్ ఛానల్ ద్వారా గోదావరి వరద ప్రవాహమంతా మెయిన్ స్ట్రీమ్ లో కలిసేలా చేయడం జరిగిందని టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, 2019 జూలైలో ఆ విధంగా పారుతున్ననీటిని, అక్కడ జరిగిన నిర్మాణ పనులను అన్ని ప్రసార మాధ్యమాలు చూపించాయన్నారు. స్పిల్ వే, కాపర్ డ్యామ్ నిర్మాణం సహా, మెజారిటీ పనులన్నీ గతంలో టీడీపీ ప్రభుత్వమే చేయడం జరిగిందన్నారు. ప్రాజెక్ట్ పరిధిలోని 18,500 నిర్వాసిత కుటుంబాల ను ఖాళీ చేయించాక కాపర్ డ్యామ్ పనులను పూర్తి స్థాయిలో పూర్తి చేయాలని ఆనాటి ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అప్పర్ కాపర్ డ్యామ్, లోయర్ కాపర్ డ్యామ్ పూర్తిచేయాలంటే విధిగా 18,500 కుటుంబాలను ఖాళీ చేయించాల్సి ఉందన్నారు. ఈ ప్రభుత్వం రెండేళ్లలో రూ.880 కోట్ల వరకు ఖర్చుపెట్టి, పోలవరం ప్రాజెక్ట్ లో ఎందుకు నీటిని నిల్వచేయ లేకపోయందన్నారు. 18,500 నిర్వాసిత కుటుంబాలకు ఇస్తానన్న రూ.10లక్షల పరిహారం ఏమైందో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని మాజీమంత్రి డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వం గడచిన రెండేళ్లలో ఎన్ని నిర్వాసిత కుటుంబాలకు న్యాయం చేసిందో చెప్పాలన్నారు. ఆఖరికి నిర్వాసితులకు చెందాల్సిన సొమ్ముని కూడా ఈ ప్రభుత్వం దిగమింగుతోందని టీడీపీ ఇప్పటికే ఆధారాలతో సహా బయటపెట్టడం జరిగిందన్నారు. మచ్చామహాలక్ష్మీ, మదకం సావిత్రి వంటివారు ఎందరున్నారో.. వారి పేర్లతో కాజేసిన రూ.2 కోట్లకు పైగా సొమ్ము ఏమైందో చెప్పాలన్నారు పేద గిరిజనులకు దక్కాల్సిన సొమ్ముని కూడా ఈ ప్రభుత్వం దిగిమింగుతోందంటే, అంతకంటే దారుణం మరోటి ఉండదన్నారు. రెండేళ్ల ఈ ప్రభుత్వ పాలనలో ప్రాజెక్ట్ పరిధిలో హెడ్ వర్క్స్ పనులు ఎంత జరిగాయో చెప్పాలన్నారు. తమ ప్రభుత్వంలో చేసిన పనులు వివరాలను ఎప్పటికప్పుడు మీడియాకు వెల్లడించే వారమని, సెంట్రల్ వాటర్ కమిషన్ కు పంపేవారిమని, ఎప్పటికప్పుడు పనులు వివరాలు ఆన్ లైన్లో ఉంచేవారమని, అలాచేసే దమ్ము,ధైర్యం ఈ ప్రభుత్వానికి ఎందుకు లేవని దేవినేని ప్రశ్నించారు. ఈ రెండేళ్లలో ఏ రోజైనా ఈ ప్రభుత్వం ఏం చేసిందో ఒక్క రోజు కూడా చెప్పింది లేదన్నారు. టీడీపీ ప్రభుత్వంలో పోలవరం పునాదులే లేవలే దని చెప్పినవారు, ఈరోజు గేట్లు ఎలా పెడుతున్నారో చెప్పాలన్నారు.
రివర్స్ టెండరింగ్ డ్రామాలాడి, ప్రాజెక్ట్ పనులన్నీ ఒకే కంపెనీకి కట్టబెట్టారని, రూ.700కోట్లవరకు ఆదాచేశామని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. గోదావరి నీటిని 6.69కిలోమీటర్లుతిప్పేస్తే, ఎక్కడ నుంచి ఎటు తిప్పారో చెప్పాలన్నారు. నిర్వాసితులకుపరిహారం ఇవ్వకుండా 18,500కుటుంబాలను ముంచేయడానికి ఈప్రభుత్వం సిద్ధమైందన్నారు. టీడీపీప్రభుత్వం చేసిన పనిని ప్రజలకుచెప్పకుండా, బడాయికబుర్లతో కాలయాపన చేస్తూ, ప్రజలను నమ్మించాలని చూస్తున్నారని దేవినేని ఆగ్రహం వ్యక్తంచేశారు. టీడీపీప్రభుత్వం ఖర్చుపెట్టిన రూ.11వేలకోట్ల పైచిలుకుసొమ్ములోనే రూ.4వేలకోట్లకు పైగా సొమ్ముని ఈప్రభుత్వ కేంద్రంనుంచి తెచ్చుకుందన్నారు. ఆ సొమ్ములో గిరిజనులకు ఎంత ఖర్చుపెట్టారో చెప్పాలన్నారు. జగన్మోహన్ రెడ్డి, కేంద్రజలవనరుల శాఖా మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశాడంటున్నారని, కలిసి ఏంసాధించాడో, ప్రాజెక్ట్ నిర్మాణానికి ఎంతసొమ్ము రాబట్ట బోతున్నాడో చెప్పాలన్నారు. రూ.55,548కోట్లవరకు పోలవరంప్రాజెక్ట్ డీపీఆర్ 2కు టీడీపీప్రభుత్వంలోనే కేంద్రం ఆమోదం పొందడంజరిగిందన్నారు. దానిపై ఈ ముఖ్యమంత్రి ఇప్పుడుకొత్తగా ఆమోదింపచేయాల్సిన అవసరం ఏముందన్నారు? ఢిల్లీ వెళ్లిన జగన్ నిజంగానే పోలవరం డీపీఆర్ కు ఆమోదం పొందేలాచేస్తున్నాడని అందరం భావించామని, కానీ తనకేసులు, బాబాయ్ మర్డర్ కేసులవ్యవహారమే ఆయనకు సరిపోయిందన్నారు. పోలవరం జాతీయప్రాజెక్ట్ ని ఈ ముఖ్యమంత్రి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ గా మార్చాడన్న ఉమా, పట్టిసీమ దండగన్న వ్యక్తే, మరో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీముకి రూ.913కోట్లుఎందుకు కేటాయించాడన్నారు. ముఖ్యమంత్రి పోలవరానికి నిధులివ్వాల్సిందేనని కేంద్రాన్ని ఎందుకు డిమాండ్ చేయలేకపోతున్నాడో, రాష్ట్ర సమస్యలను ప్రధాని ముందుంచి, ఆయన్ని ఎందుకు ఒత్తిడి చేయడంలేదో చెప్పాలన్నారు.