రాష్ట్రాభివృద్ధిపై ప్రభుత్వం చెబుతున్నవన్నీ తప్పుడు లెక్కలే అని, విధ్వంసకర విధానాలతో పారిశ్రామికాభివృద్ది రేటు మైనస్ కు చేరిందని, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి ఎన్.అమర్ నాథ్ రెడ్డి అన్నారు. ఆయన మాట్లాడుతూ, "రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించి ప్రభుత్వం చెబుతున్నవన్నీ తప్పుడు లెక్కలే. ఎక్కడైనా సంపద సృష్టిస్తే ఉపాథి అవకాశాలు పెరుగుతాయి. విశాఖ-చెన్నయ్, చెన్నయ్-బెంగుళూరు, హైదరాబాద్-బెంగుళూరు ఇండస్ట్రియల్ కారిడార్ లను అభివృద్ధి చేయడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు వస్తాయనే ఆలోచనతో చంద్రబాబు హయాంలో ఈ కారిడార్ల అభివృద్ధిపై దృష్టిసారించి ప్రణాళికలు సిద్ధం చేశారు. గత రెండుసంవత్సరాల్లో కారిడార్లలో మౌలిక సదుపాయాలు, అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా తయారైంది. చిన్న పరిశ్రమలకు కేటాయించిన ఎంఎస్ఎంఇ ల భూములను ఇళ్లస్థలాల కోసం లాక్కోవడం, పరిశ్రమలకు గతంలో ఇచ్చిన భూములకు రెట్టింపు రేటు చెల్లించాలని వత్తిడిచేయడం వంటి చర్యల వల్ల వేలాది పరిశ్రమలు వెళ్లిపోయాయి. రాష్ట్రంలో పారిశ్రామిక కారిడార్లలో భూసేకరణకు 50వేలకోట్ల రూపాయాలు అవసరం కాగా, బడ్జెట్ లో కేవలం వెయ్యి కోట్లు మాత్రమే కేటాయించడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. రాష్ట్రంలో 960 కిలోమీటర్ల సముద్ర తీరం పరిశ్రమలకు ఎంతో అనుకూలమైంది. దీనిని దృష్టిలో ఉంచుకొని సముద్ర తీర ప్రాంతంపై టిడిపి హయాంలో ప్రత్యేకశ్రద్ధ పెట్టాం. ప్రస్తుతం ముఖ్యమంత్రి పోర్టులను తమ బంధువులకు అప్పగించే పనిలో నిమగ్నమయ్యారు. రాష్ట్రంలో విధ్వంసకర పాలన సాగిస్తూ పరిశ్రమలు పారిపోయేలా చేస్తున్నారు. అధికారపార్టీ నేతల బెదిరింపుల కారణంగా కియా అనుబంధ సంస్థలు తరలిపోయాయి. కడపలో జువారి సిమెంట్స్, చిత్తూరు జిల్లాలో అమర్ రాజా బ్యాటరీస్ వంటి ప్రతిష్టాత్మక పారిశ్రామిక సంస్థలను పిసిబి నోటీసులతో మూసివేసే ప్రయత్నం చేశారు. ప్రకాశంజిల్లాలో తెలుగుదేశం నేతల క్వారీలపై దా-డు-లు చేసి భారీగా పెనాల్టీ వేసి ఆ పరిశ్రమలను నాశనం చేస్తున్నారు. వేలాదిమంది పాడిరైతులకు బాసటగా నిలుస్తున్న సంగం డెయిరీని మూసివేయడానికి కుట్రపన్ని అమూల్ కు లబ్ధికలిగించే ప్రయత్నం చేస్తున్నారు. కేసులకు భయపడి రాష్ట్రప్రజల జీవనాడి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోకుండా కేంద్రానికి దాసోహమంటున్నారు. ప్రకాశంజిల్లాల ఆసియన్ పేపర్ ఇండస్ట్రీ, వైజాగ్, గన్నవరంలో ఐటి పరిశ్రమలు తరిమేశారు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత రెండేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 17లక్షల కోట్ల పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయాయి.

రాష్ట్రానికి కొత్త పెట్టుబడులు రాకుండా భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్వాకం కారణంగా రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి రేటు -2.58కి, జిఎస్ డిపి -3.26కి పడిపోయింది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రెండంకెలుగా ఉన్న వృద్ధిరేటును వైసిపి ప్రభుత్వ విధ్వంసకర చర్యలతో మైనస్ కు దిగజార్చారు. ఇకనైనా ఈ విధ్వంసాన్ని ఆపండి, లేకపోతే భావితరాల భవిష్యత్ అంధకారం అవుతుంది. అభివృద్ధిపై ప్రభుత్వం చెప్పే మాటలకు, గణాంకాలకు పొంతన లేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో చరిత్ర హీనులుగా మిగిలిపోతారు. ఇక రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనాలోచిత, విధ్వంసకర విధానాల ఫలితంగా గతంలో ఎన్నడూ లేనివిధంగా నిరుద్యోగం గణనీయంగా పెరిగింది. దేశం మొత్తంమీద సగటు నిరుద్యోగిత రేటు 11.9 ఉంటే ఆంధ్రప్రదేశ్ లో 13.5కి చేరుకొంది. జగన్ ప్రభుత్వ అనాలోచిత, చేతగానితనం వల్లే ఈ పరిస్థితి దాపురించింది. లాక్ డౌన్ సమయంలో కూడా మన పొరుగున ఉన్న తెలంగాణా, ఒడిస్సా, కర్నాటక, మహారాష్ట్ర లు ప్రణాళికాబద్ధమైన విధానాలతో నిరుద్యోగితను గణనీయంగా తగ్గించగలిగాయి. వెనుకబడిన రాష్ట్రాలైన అస్సాం, చత్తీస్ ఘడ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు కూడా అతి స్వల్పమైన నిరుద్యోగరేటును నమోదుచేశాయి. ఇక ఉద్యోగాల కల్పన విషయంలో వైసిపి ప్రభుత్వం చెబుతున్నవన్నీ తప్పుడు లెక్కలే. గత రెండేళ్లలో 4,77,953 ఉద్యోగాలు ఇచ్చామని చెబుతున్నారు. అందులో వైసిపి కార్యకర్తలకు ఇచ్చిన 2,59,565 వాలంటీర్ ఉద్యోగాలు, గ్రామసచివాలయాల్లో ఆ పార్టీ వారికే ఇచ్చిన 1,21,518 ఉద్యోగాలు నిరుద్యోగులకు ఇచ్చినట్లు చూపడం ప్రభుత్వ మోసపూరిత చర్యలకు నిదర్శనం. మద్యం షాపుల్లో వైసిపి కార్యకర్తలకు ఇచ్చిన 12వేల ఉద్యోగులు, హెల్త్, ఎడ్యుకేషన్, ఎలక్ట్రిసిటీ విభాగాల్లో గౌరవ వేతనంతో నియమించిన 20వేల తాత్కాలిక ఉద్యోగాలను ప్రభుత్వోద్యోగాలు చూపడం సిగ్గుచేటు. రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులను మూటలు మోసే కూలీలుగా మార్చిన 9,260 రేషన్ డోర్ డెలివరీ వాహనాల డ్రైవర్లు, హెల్పర్లకు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని చెప్పడం సిగ్గుపడాల్సిన విషయం. రాష్ట్రంలో 2లక్షల 30వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీచేయకుండా పెండింగ్ లో ఉన్నాయి. గత రెండేళ్లలలో డిఎస్సీ ఊసేలేదు, ఈ నోటిఫికేషన్ కోసం 2లక్షలమంది నిరుద్యోగ టీచర్లు ఎదురుచూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ అనాలోచిత, విధ్వంసకర విధానాల వల్ల వల్లే రాష్ట్రంలో ఇదివరకెన్నడూ లేనివిధంగా నిరుద్యోగం ప్రబలింది.

కో-వి-డ్ వ్యాక్సినేషన్ విషయంలో సమర్థంగా పనిచేయకపోతే రాష్ట్రం నష్టపోయే ప్రమాదం ఉందని తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరాం అన్నారు. ఈ మేరకు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్రం నూతన మార్గదర్శకాల ప్రకారం 18 ఏళ్లు పైబడిన వారికి ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. ఈ మేరకు గైడ్ లైన్స్ ఇచ్చారు. రాష్ట్రాలకు కూడా వ్యాక్సిన్ ఉచితంగా ఇస్తున్నారు. కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. కేంద్ర గైడ్ లైన్స్ చూస్తే.. కొన్ని షరతులు పెట్టడం జరిగింది. జనాభా ఆధారంగా, కోవిడ్ ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. అదేవిధంగా వేగంగా వ్యాక్సిన్ చేసే రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. వ్యాక్సిన్ వేస్టేజ్ తక్కువగా ఉన్న రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇస్తామని కేంద్రం కొత్త గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. దీనిని బట్టి ఏ రాష్ట్రాలు సమర్థంగా పనిచేస్తాయో వారికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తామని చాలా స్పష్టంగా కేంద్రం చెప్పింది. ఈ గైడ్ లైన్స్ ప్రకారం ఏపీ పరిస్థితి ఏంటో ఆలోచన చేసుకోవాలి. జగన్ రెడ్డి కనుక వేస్టేజ్ లేకుండా వ్యాక్సినేషన్ చేపట్టకపోయినా, వేగంగా చేయకపోయినా, అధిక సంఖ్యలో ప్రజలకు వ్యాక్సిన్ ఇవ్వలేకపోయినా ఆ ప్రభావం రాష్ట్రంపైనా, ప్రజలపైనా పడే ప్రమాదం ఉంది. జగన్ రెడ్డి ఇప్పటికే తన అసమర్థతతో వైఫల్యాలు మూటగట్టుకున్నారు. వ్యాక్సినేషన్, ఆక్సిజన్ సరఫరా, మందుల సరఫరాలో విఫలమయ్యారు. వ్యాక్సినేషన్ లో మనం చాలా వెనుకబడి ఉన్నాం. రెండు డోసులు కలిపి కోటి 9 లక్షల 90 వేలు మాత్రమే ఇప్పటివరకు వ్యాక్సిన్లు అందించాం. 25 శాతం కంటే తక్కువ. ఇంకా 75 శాతం మందికి ఒక డోస్ కూడా అందలేదు. గుజరాత్ లో కోటి 86 లక్షలు, పశ్చిమ బెంగాల్ లో కోటి 65 లక్షలు, కర్ణాటకలో కోటి 54 లక్షలు, మహారాష్ట్రలో 2 కోట్ల 44 లక్షలు, యూపీలో 2 కోట్ల 8 లక్షలు, బీహార్ లో కోటి 11 లక్షలు వ్యాక్సిన్లు వేశాయి. భవిష్యత్ లో సమర్థంగా పనిచేసే రాష్ట్రాలకే ప్రాధాన్యత ఉంటుంది. కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసిన నివేదిక ఆధారంగా జనవరి, ఫిబ్రవరి, మార్చిలో ఫ్రంట్ లైన్ వర్కర్స్ కు వ్యాక్సినేషన్ విషయంలో.. ఇచ్చిన డోసులు పరిశీలిస్తే.. ఏపీ చాలా వెనుకబడి ఉంది.

ఏపీ ఫ్రంట్ లైన్ వర్కర్స్ కు కూడా సరిగా వ్యాక్సినేషన్ జరగలేదు. ఏపీకి 65.5 లక్షల డోసులు పంపిస్తే.. వినియోగించింది 26.10 లక్షలు మాత్రమే. జగన్ రెడ్డి, సజ్జల మాత్రం గొప్పలు చెప్పుకున్నారు. ప్రగల్బాలు పలికారు. కేంద్రం ఇచ్చిన వ్యాక్సిన్లను ఎందుకు సమర్థంగా వినియోగించుకోలేక పోయారో సమాధానం లేదు. 39.8శాతం మాత్రమే వినియోగించుకున్నారు. రాజస్థాన్ 54.11, ఢిల్లీ 55.1, వెనుకబడిన చత్తీస్ ఘడ్ కూడా 45.53 శాతం, జార్ఘండ్ 52.11, కేరళ 54.14 శాతం కేంద్రం ఇచ్చిన వ్యాక్సిన్లను వినియోగించుకున్నాయి. ఏపీ పూర్ ఫెర్ఫార్మెన్స్ కు ఏం సమాధానం చెబుతారు? వ్యాక్సినేషన్ వేస్టేజ్ విషయంలో ఏపీలో 11.6 శాతంగా ఉంది. జాతీయ స్థాయిలో యావరేజ్ గా ఇది 6.5 శాతం మాత్రమే ఉంది. రాజస్థాన్ లో 5.6, అస్సాంలో 5.5, గుజరాత్ 5.3, వెస్ట్ బెంగాల్ లో 4.8శాతం, తమిళనాడులో 3.7శాతం, బీహార్ లో 4శాతంగా ఉంది. వేస్టే జ్ లో కూడా మనం చాలా ఎక్కువస్థాయిలో ఉన్నాం. నూతన గైడ్ లైన్స్ ప్రకారం ఏపీకి ఎక్కువగా వ్యాక్సిన్లు వచ్చే పరిస్థితి లేదు. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్రంలో వ్యాక్సినేషన్ చాలా నెమ్మదిగా సాగుతోంది. దీనిపై ఏం సమాధానం చెబుతారు? జగన్ రెడ్డి అసమర్థత వల్ల వ్యాక్సినేషన్ అందక ప్రజలు నష్టపోయే పరిస్థితి ఉంది. కేంద్రం డిసెంబర్ నాటికి 44 కోట్ల డోసులు అందుబాటులో ఉంటాయని చెప్పడం జరిగింది. రాష్ట్రం సమర్థంగా పనిచేస్తేనే వ్యాక్సిన్ డోసులు ఎక్కువగా వస్తాయి. ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. మెడికల్ కాలేజీల విషయంలో గ్రాఫిక్స్ కే జగన్ రెడ్డి పరిమితం అవుతున్నారు. బడ్జెట్ లో సరైన కేటాయింపులు లేవు. బ్యాంకులు కూడా రుణాలు ఇచ్చే పరిస్థితి లేదు. ప్రజలను మభ్యపెట్టడానికే డ్రామాలు ఆడుతున్నారు. కో-వి-డ్ రోగులకు మౌలిక సదుపాయాల కల్పనలోనూ విఫలమయ్యారు. మరణాలు కూడా దాచిపెడుతున్నారు. బ్లా-క్ ఫం-గ-స్ కేసులు కూడా పెరుగుతున్నాయి. అన్ని విధాలుగా జగన్ రెడ్డి విఫలమయ్యారు. తన అసమర్థత వల్ల చాలా నష్టపోతున్నాం. ఇప్పటికైనా మేలుకుని తన పనితీరును మెరుగుపర్చుకోవాలి. తాడేపల్లి ప్యాలెస్ కే పరిమితం కాకూడదు. క్షేత్రస్థాయిలో పర్యటనలు జరిపి ఆసుపత్రులను సందర్శించి భరోసా ఇవ్వాలి. దిద్దుబాటు చర్యలు తీసుకోని పక్షంలో మనం నష్టపోయే ప్రమాదం ఉంది.

నర్సాపురం ఎంపీ రఘురామరాజు, తనకు జరిగిన అన్యాయం పై, పోరాటం చేస్తూనే ఉన్నారు. తనదైన శైలిలో, తనకు జరిగిన అన్యాయం పై, దేశ వ్యాప్త చర్చకు దారి తీసారు. జగన మోహన్ రెడ్డి అండ్ కో చేస్తున్న దురాగతాలను ఇవి అంటూ వివరిస్తూ, అందరికీ లేఖలు రాస్తున్నారు. ఇప్పటికే రఘురామరాజు ఎంపీలు అందరికీ లేఖలు రాసారు. అలాగే స్టాండింగ్ కమిటీ సభ్యులకు లేఖలు రాసారు. అయితే నిన్న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా ఆయన లేఖలు రాసారు. జగన్ మోహన్ రెడ్డి తప్ప, దేశంలో ఉన్న ముఖ్యమంత్రులకు ఆయన లేఖలు రాసారు. 124 ఏ అనే రాజద్రోహం కేసుని ఎత్తివేసలా కేంద్రం పై ఒత్తిడి తేవాలని, ఆ చట్టం ఎలా దుర్వినియోగం అవుతుంది తెలుపుతూ, ఆయన లేఖలో పేర్కొన్నారు. సిట్టింగ్ ఎంపీ అయిన తన పై, ఇష్టం వచ్చినట్టు ఏపి ప్రభుత్వం ప్రవర్తించిన తీరు పై ఆయన స్పందిస్తూ, లేఖలో మొత్తం వివరించారు. అయితే రఘురామరాజు లేఖపై బీహార్ సియం నితీష్ కుమార్ స్పందించారు. రఘురామరాజు రాసిన లేఖను ఆయన బీహార్ చీఫ్ సెక్రటరీకి, డీజీపీకి, అలాగే న్యాయశాఖ కార్యదర్శులకు పంపించారు. 124 ఏ సెక్షన్ పై రఘురామరాజు లేవనెత్తిన అభ్యంతరాల పై ఎలా స్పందించాలి, చట్టం రద్దు చేసే సాధ్యాసాద్యాల పై కేంద్రానికి ఎలాంటి నివేదిక ఇవ్వాలి అనే అంశం పై వాళ్లకు పంపించి ఉండవచ్చనే చర్చ జరుగుతుంది.

rrr 08062021 2

ఇక ఢిల్లీ సియం కూడా దీని పై స్పందించినట్టు చెప్తున్నారు. ఇక ఇప్పటికే ఎంపీలు, సియంలకు లేఖ రాసిన రఘురామరాజు, గవర్నర్లకు , లెఫ్టినెంట్ గవర్నర్లకు కూడా లేఖలు రాసారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ కు కూడా ఈ లేఖ రసారు. త్వరలోనే గవర్నర్ల సదస్సు జరుగుతుందని, అందుకే ఈ లేఖ రాస్తున్నట్టు తెలిపారు. సెక్షన్ 124ఏ చట్టం రద్దు పై గవర్నర్ల సదస్సులో చర్చించాలని ఆ లేఖలో అందరి గవర్నర్లను కోరారు. ఈ సెక్షన్ ని అందరూ దుర్వినియోగం చేస్తున్నారని, రఘురామరాజు తెలిపారు. తనకు జరిగిన అన్యాయం పై వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అక్రమాలు ప్రశ్నిస్తున్నానని, తన పై రాజద్రోహం కేసు పెట్టారని, అక్రమ కేసులు పెట్టి వేధించారని, ఇది సరైన సంస్కృతి కాదని, ఈ చట్టం వ్యక్తగత కక్ష తీర్చుకోవటానికి, తన పై అక్రమ కేసులు పెట్టారు అంటూ, రఘురామరాజు ఆ లేఖలో తెలిపారు. మొత్తానికి, అన్ని వర్గాల నుంచి రఘురామ రాజు రాసిన లేఖకు మద్దతు లభిస్తుంది. మరి దీని పై జగన్ ఎలా కౌంటర్ ఇస్తారో చూడాలి.

అమరావతిలో ఉన్న ఒక విద్యార్ధికి ఊహించని అనుభవం ఎదురైంది. తాను రాసిన లేఖకు ఏకంగా, భారత దేశ సుప్రీం కోర్టు ప్రధానన్యాయమూర్తి, తాను రాసిన లేఖకు స్పందించటమే కాక, ఏకంగా తనను అభినందించటం పై, ఆ విద్యార్ధి ఉబ్బితబ్బిబ్బుఅవుతున్నారు. అమరావతి అస్తిత్వం కోసం, ఉద్యమం జరుగుతున్న విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం అమరావతిని మూడు ముక్కలు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే దీన్ని వ్యతిరేకిస్తూ, భూములు త్యాగం చేస్తున్న రైతులు ఉద్యమం చేస్తున్నారు. ఇందులో పిల్లా, పెద్ద, ముసలి, ముతకా అందరూ గత ఏడాదిన్నర్రగా ఉద్యమం చేస్తూనే ఉన్నారు. ఈ ఉద్యమంలో, దర్శిత్ అనే విద్యార్ధి చురుకుగా పాల్గుంటు ఉండే వాడు. తన స్పష్టమైన తెలుగు, భాష పై పట్టుతో, ఆ కుర్రాడు చేసే ప్రసంగం అందరినీ ఆకట్టుకుంటూ ఉండేది. అమరావతి రైతు ఉద్యమంలో, తనదైన పాత్ర పోషిస్తున్న దర్శిత్, రైతులు పక్షాన పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తను, కొత్తగా చీఫ్ జస్టిస్ గా బాధ్యతలు స్వీకరించిన సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ కు లేఖ రాసారు. దర్శిత్ రాసిన లేఖ, సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ వరకు చేరింది. ఆయన ఆ లేఖ చదవటమే కాదు, ఏకంగా దర్శిత్ కు ప్రత్యుత్తరం రాసారు. దీంతో దర్శిత్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

ramana 08062021 2

ఆ లేఖలో జస్టిస్ ఎన్వీ రమణ స్పందిస్తూ, చిరంజీవి దర్శిత్ అంటూ సంబోధించారు. చక్కటి తెలుగులో, స్వదస్తూరితో నీవు రాసిన లేఖ నాకు అమితమైన ఆనందాన్ని కలిగించింది అంటూ జస్టిస్ ఎన్వీ రమణ రిప్లై ఇచ్చారు. నీ విద్యాభ్యాసం నిరాఘాటంగా కొనసాగాలని, ఎంచుకున్న రంగంలో నువ్వు కీర్తి శిఖరాలదిరోహించాలని ఆకంక్షిస్తున్నాను, శుభాశీస్సులు అంటూ, జస్టిస్ ఎన్వీ రమణ ఆ లేఖకు స్పందించారు. దీంతో దర్శిత్ కు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ దేశ చీఫ్ జస్టిస్ తన లేఖకు స్పందించటం, తనను ఆశీర్వదించటం అంటే మామూలు విషయమా మరి ? ఇప్పుడు ఈ లేఖ ఇంటర్నెట్ లో వైరల్ అయ్యింది. ముఖ్యంగా జస్టిస్ ఎన్వీ రమణను కూడా, ఆయన ఆ పిల్లవాడికి లేఖ రాసి, ప్రోత్సహించటం, అదీ ఒక చీఫ్ జస్టిస్ నుంచి తెలుగులో ఉత్తరం రావటం పై, పలువురు భాషా ప్రేమికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద, ఇప్పుడు ఈ లేఖ ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది.

Advertisements

Latest Articles

Most Read