గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి ఆకస్మిక బదిలీ ఇప్పుడు చర్చనీయంసం అయ్యింది. రెండు రోజుల క్రిందట సిఐడి చీఫ్ సునీల్ కుమార్ చేతిలో ఉన్న ఒక అదనపు శాఖను కూడా తొలగించిన సంగతి తెలిసిందే. నిన్న అమ్మిరెడ్డిని బదిలీ చేయటం కూడా గమనించాల్సిన అంశం. అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి స్థానంలో, ఎస్‌ఈబీ అదనపు ఎస్పీగా పని చేస్తున్న అరిఫ్‌ అజీజ్‌ను ప్రభుత్వం నియమించింది. అయితే అమ్మిరెడ్డికి మాత్రం ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు. ఆయన్ను డీజీపీ ఆఫీస్ లో రిపోర్ట్ చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వ పెద్దలతో అమ్మిరెడ్డికి మంచి సంబంధాలు ఉన్నాయనే ప్రచారం మధ్య, ఆయన బదిలీ పలువురుని విస్మయానికి గురి చేసింది. వచ్చే వారం పది రోజుల్లో పెద్ద ఎత్తున ఐపిఎస్, ఐఏఎస్ బదిలీలు ఉంటాయనే ప్రచారంలో, అమ్మిరెడ్డికి మరింత ప్రాధాన్యం ఉన్న చోట కూర్చోబేడతారు అనే ప్రచారం మధ్య, ఈ ఆకస్మిక బదిలీతో పాటుగా, ఆయనకు ఎక్కడా కూడా పోస్టింగ్ ఇవ్వకపోవటం, అలాగే డీజీపీ ఆఫీస్ లో రిపోర్ట్ చేయాలని చెప్పటం, చర్చనీయంసంగా మారింది. ఈ మొత్తానికి కారణం, రఘురామరాజు ఢిల్లీలో కదుపుతున్న పావులుగా కూడా ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా ఎస్పీ అమ్మిరెడ్డి పై, అనేక ఆరోపణలు ఉన్నాయి. అయితే అవన్నీ రాష్ట్ర స్థాయి వరుకే పరిమితం కావటంతో, పెద్ద చర్చ జరగలేదు.

ammireddy 02062021 2

ఇటీవల రఘురామకృష్ణం రాజు అరెస్ట్ నేపధ్యంలో, అది పెద్ద ఎత్తున జాతీయ స్థాయిలో చర్చ అవ్వటం, ఈ ఎపిసోడ్ మొత్తంలో, అమ్మిరెడ్డి పాత్ర పై విమర్శలు రావటం, అలాగే అమ్మిరెడ్డి పై, రఘురామకృష్ణం రాజు, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు ఫిర్యాదు చేసిన నేపధ్యంలో, ఆయన బదిలీకి దానికి ఏమైనా లింక్ ఉందా అనే చర్చ బలంగా జరుగుతుంది. రఘురామరాజు ఆర్మీ హాస్పిటల్ లో ఉన్న సందర్భంలో, ఆయన డిశ్చార్జ్ అవ్వగానే, మరో కేసులో రఘురామరాజుని అరెస్ట్ చేయటానికి ఎస్పీ అమ్మిరెడ్డి ప్రయత్నం చేసారని, దీనికి ఆర్మీ హాస్పిటల్ రిజిస్టార్ కేపీ రెడ్డి, అలాగే మరో అధికారి ధర్మారెడ్డి సహకరించారు అంటూ, ఈ మొత్తం ఎపిసోడ్ కి సంబంధించి ఆధారాలను కూడా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు రఘురామరాజు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే దీని పై కేంద్రం ఏమైనా విచారణ చేసి, ఆయన పై చర్యలు తీసుకోమని ఆదేశించిందా ? లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభువమే ముందు జాగ్రత్త చర్యగా జాగ్రత్త పడిందా ? లేదా ఇది సాధారణ ప్రకరియలో జరిగిన బదిలీనా అనేది కొద్ది రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాసం ఉంది.

నర్సాపురం ఎంపీ రఘురామరాజు చాలా రోజులు తరువాత మీడియా ముందుకు వచ్చారు. గతంలో రఘురామకృష్ణం రాజు, ప్రతి రోజు రాజధాని రచ్చబండ పేరుతో మీడియా సమావేశం పెడుతూ, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను టార్గెట్ చేస్తూ ఉండేవారు. అయితే అయన అరెస్ట్ తదనంతర పరిణామాలు అన్నీ తెలిసినవే. సుప్రీం కోర్టు బెయిల్ ఇవ్వటంతో, ప్రస్తుతం ఆయన ఢిల్లీలో ఉంటున్నారు. అయితే ఆయన బెయిల్ ఇచ్చిన దగ్గర నుంచి రఘురామరాజు ఇప్పటి వరకు, మీడియాతో మాట్లాడలేదు. ఎట్టకేలకు ఈ రోజు రఘురామరాజు మీడియా ముందుకు వచ్చారు. ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు పిటీషన్ పై, సిబిఐ కోర్ట్ లో వాదనలు జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జగన్ తరుపు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేస్తూ, రఘురామరాజు పై తీవ్ర ఆరోపణలు చేసారు. ఆ ఆరోపణలకు సమాధానంగా, రఘురామరాజు ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ. ముందుగా ఆయన మాట్లాడుతూ, గత 15 రోజులుగా జరిగిన ఘటనలు అన్నీ మీకు తెలుసు అని, అందుకే మీకు నేను అందుబాటులో ఉండలేక పోయాను అంటూ, రఘురామరాజు చెప్పారు. ఆ పరిణామాల పై తాను ఇప్పుడు ఏమి మాట్లాడలేనని అన్నారు. బహుసా, సుప్రీం కోర్టు ఈ కేసు పై ఏమి మాట్లాడవద్దు అని చెప్పినందుకు అయి ఉండవచ్చు.

rrr 01062021 2

ఇక తను జైలులో ఉన్న సమయంలో, ఆలాగే తన ఆరోగ్యం బాగోలేని సమయంలో, తాను కోలుకోవాలని, జైలు నుంచి బయటకు రావాలని ఆకాంక్షిస్తూ ప్రార్ధించిన అందరికీ పాదాభివందనం చేస్తున్నాని, మీ అభిమానం వల్లే తాను ఈ రోజు ఇలా మీ ముందు ఉన్నానని చెప్పారు. ఇక ఈ రోజు జరిగిన బెయిల్ పిటీషన్ రద్దు విచారణ పై ఆయన స్పందించారు. ఎన్నో కేసుల్లో ఏ1 గా ఉన్న జగన్ మోహన్ రెడ్డి, దాదాపుగా మూడు వాయిదాల తరువాత, సిబిఐ కోర్టులో కౌంటర్ దాఖలు చేసారని, ఈ కౌంటర్ లో తనని టార్గెట్ చేసిన విషయన్ని ఖండించారు. తన పై సిబిఐ నమోదు చేసిన రెండు ఎఫ్ఐఆర్ లు కూడా ఇంకా ప్రాధమిక దశలోనే ఉన్నాయని అన్నారు. ఇక తన నియోజకవర్గంలో ఒకేసారు ఏడు కేసులు పెట్టి, నాకు పిటీషన్ వేసే అర్హత లేదు అంటున్నారని, తన మీద ఉన్న కేసులు అన్నీ ఇంకా ఎఫ్ఐఆర్ స్టేజ్ లోనే ఉన్నాయని చెప్ప్పారు. దీని పై తమ కౌంటర్ ని కూడా మారో వారం రోజుల్లో సిబిఐ కోర్టులో ఇస్తామని, ప్రజలకు జరుగుతున్న అన్యాయం పై పోరాడుతూనే ఉంటానని, మిగిలినది అంతా ఆ వెంకటేశ్వర స్వామి చూసుకుంటారు అంటూ, రఘురామరాజు చెప్పుకొచ్చారు.

జడ్జి రామకృష్ణ కుమారుడు హైకోర్టు చీఫ్ జస్టిస్ కు రాసిన లేఖపై హైకోర్టులో విచారణ జరిగింది. జడ్జి రామకృష్ణ కుమారుడు వంశీకృష్ణ రాసిన లేఖపై హైకోర్టు విచారణ చేపట్టింది. జడ్జి రామకృష్ణకు జైలులో ప్రా-ణ-హా-ని ఉంది అంటూ, వంశీకృష్ణ తన లేఖలో తెలిపారు. అయితే ఇదే విషయం పై, హైకోర్టు ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది. జడ్జి రామకృష్ణ విషయంలో జైలులో ఏమి జరుగుతుందో చెప్పాలని కోరింది. అయితే జడ్జి రామకృష్ణను వేరే బ్యారేక్ లో మార్చమని, ప్రభుత్వ న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. అయితే దీని పై తమకు పూర్తి వివరణ ఒక నివేదిక రూపంలో ఇవ్వాలని, ప్రభుత్వ న్యాయవాదికి, హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసు పై తదుపరి విచారణను హైకోర్టు, గురువారానికి వాయిదా వేసింది. ఈ అంశం పై తెలుగుదేశం పార్టీ కూడా తీవ్రంగా స్పందించింది. చిత్తూరుజిల్లా కారాగారంలో పెద్ద కు-ట్ర జరుగుతోందని, అక్కడ రిమాండ్ ఖైదీగా ఉన్న మేజిస్ట్రేట్ రామకృష్ణను హ-త్య చేయడానికి పెద్ద కు-ట్ర పన్నారని, రిమాండ్ ఖైదీగా ఉన్న వ్యక్తిని జైల్లోనే హ-త-మా-ర్చేం-దు-కు పెద్ద కు-ట్రే జరుగుతోందని, టీడీపీ జాతీయప్రధాన కార్యదర్శి మరియు పొలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య ఆరోపించారు. సోమవారం ఆయన తన నివాసం నుంచి విలేకరులతో మాట్లాడారు.

ramakrishna 31052021 2

ఆ వివరాలు ఆయన మాటల్లో "కు-ట్ర జరగడం లేదని ఎవరూ చెప్పలేక పోతున్నారు. ప్రభుత్వ పెద్దల ప్రమేయం, వారి భాగస్వామంతోనే కు-ట్ర జరుగుతోంది. అందులో ప్రధాన పాత్రధారి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అతనికి, రామకృష్ణపై దశాబ్దకాలంగా శ-త్రు-త్వం-, ప-గ, కోపం ఉన్నాయి. రిటైర్డ్ జడ్జీ నాగార్జున రెడ్డికి కూడా రామకృష్ణపై కోపముంది. నాగార్జున రెడ్డి ఇంపీచ్ మెంట్ కి రామకృష్ణే ప్రధాన కారకుడు. పార్లమెంట్ లో నాగార్జున రెడ్డిపై ఇంపీచ్ మెంట్ పిటిషన్ వేశారు. దానికి రామకృష్ణే కారకుడని నాగార్జున రెడ్డి అతనిపై ప-గ-బ-ట్టా-డు. మరొక రిటైర్డ్ జడ్జి ఈశ్వరయ్యకూడా రామకృష్ణపై ప-గ-బూ-నా-డు. ఎట్టపరిస్థితుల్లోనూ రామకృష్ణను హ-త్య చేయాలనే చూస్తున్నారు. నాగార్జున రెడ్డి, మంత్రిపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఈశ్వరయ్యల గురించి రామకృష్ణ మాట్లాడడంతో పాటు, ముఖ్యమంత్రి సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తిని ఉద్ధేశించి లేఖ రాసిన విషయాన్నికూడా బయట పెట్టాడు. అందువల్ల రామకృష్ణపై ముఖ్యమంత్రికి కూడా క-క్ష ఉంది. వారందరి లక్ష్యం ఒక్కటే. రామకృష్ణ జీవించిఉండటానికి వీల్లేదనే వారందరూ భావిస్తున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ వ్యవహారాన్ని ముందుండి నడిపిస్తున్నాడు. పెద్దిరెడ్డి దెబ్బకు అమాయకుడైన రామకృష్ణను జైల్లో పెట్టాల్సి వచ్చిందని చిత్తూరుజిల్లా ఎస్పీసహా, ప్రతిఒక్కరూ చెబుతారు. దేశద్రోహ నేరంకేసుపెట్టి రామకృష్ణను 45 రోజులుగా రిమాండ్ లోఉంచారు. ముఖ్యమంత్రి అయినా, మంత్రి అయినా చట్టం తనపని తానుచేసుకుపోయేలా సవాంగ్ వ్యవహరించా లని కోరుతున్నాం. తోటి దళితుడిని కాపాడాలని డీజీపీకి నమస్కరించి వేడుకుంటున్నాం. రామకృష్ణ ప్రా-ణా-ల-కు ఏదైనాజరిగితే, దానికి డీజీపీ చాలా భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నాం." అని రామయ్య అన్నారు.

హైదరాబాద్ సిబిఐ కోర్టులో జగన్ బెయిల్ ని రద్దు చేయాలని చెప్పి,నర్సాపురం ఎంపి రఘురామకృష్ణం రాజు వేసిన పిటీషన్ పై, మూడు వాయిదాల అనంతరం ఈ రోజు, జగన్ మోహన్ రెడ్డి తరుపున కౌంటర్ దాఖలు చేసారు. అదే విధంగా సిబిఐ కూడా తమ కౌంటర్ దాఖలు చేసింది. అయితే జగన్ దాఖలు చేసిన కౌంటర్ లో ప్రధానంగా ఎనిమిది విషయాలు పేర్కొన్నారు. ఇది ప్రభుత్వానికి, ఒక వ్యక్తికి మధ్య జరుగుతున్న ఈ కేసులో, మూడో వ్యక్తి జోక్యం చేసుకోకూడదు అంటూ, గతంలో కోర్టులు ఇచ్చిన తీర్పులను పేర్కొన్నారు. రఘురామకృష్ణం రాజు తమ పార్టీకి చెందిన వ్యక్తి అని, ఆయన పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడటంతో, ఆయన్ను బహిష్కరించాలని లోకసభ స్పీకర్ కు కూడా ఫిర్యదు చేసామని, వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం, స్వార్ధం కోసమే, ఆయన న్యాయ వ్యవస్థను ఉపయోగించుకుంటున్నారని పేర్కొన్నారు. ఇక మరో అంశంగా, జగన్ విచారణ హాజరు కావటం లేదు అనే దానికి కౌంటర్ ఇస్తూ, తాను ముఖ్యమంత్రిగా ఉండటం, ప్రస్తుతం క-రో-నా ఎక్కువగా ఉండటం వలన, విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని, అందుకే బిజీగా ఉంటున్నారని, కోర్ట్ అనుమతితోనే హాజరు కావటం లేదని తెలిపారు. రఘురామకృష్ణం రాజు నేర చరిత్ర కూడా ఉందని, ఆయన పై ఉన్న కేసులు కోర్టుకు తెలియచేయలేదని మరో అంశాన్ని కూడా పేర్కొన్నారు.

cbi 01062021 2

ఈ కేసులతో పాటుగా, బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టటంతో, ఆయన పై సిబిఐ కేసులు కూడా ఉన్నాయని కూడా కౌంటర్ లో తెలిపారు. దీంతో పాటుగా, ఎంపీ విజయసాయి రెడ్డి, అయోధ్యరామ రెడ్డి లాంటి వారి పేర్లను రఘురామరాజు చెప్పటం పై అభ్యంతరం వ్యక్తం చేసారు. ఇక కేసుల్లో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లను జగన్ వద్ద పెట్టుకున్నారు అని చెప్పిన విషయం పై కూడా అభ్యంతరం తెలిపారు. మొత్తం 98 పేజీలు  కౌంటర్ వేయగా, అందులో 80 పేజీల వరకు రఘురామరాజు కేసులు పైనే ఉండటం గమనించాల్సిన విషయం. ఇది ఇలా ఉండగా, ఇక్కడ సిబిఐ వేసిన కౌంటర్ చూసి చాలా మంది షాక్ తిన్నారు. కేవలం ఒకే ఒక లైన్ లో సిబిఐ కౌంటర్ వేస్తూ, చట్ట ప్రకారం, కోర్టు ఏ నిర్ణయం తీసుకున్నా మాకు సమ్మతమే అంటూ, తప్పించుకునే ధోరణిలో సిబిఐ కౌంటర్ వేయటం పై, పలువురు అభ్యంతరం తెలిపారు. ఇదే విషయం పై, రఘురామ రాజు లాయర్ కూడా, సిబిఐ వాస్తవాలు ఏమి చెప్పకుండా, ఇలా కౌంటర్ వేయటం ఏమిటి అని కోర్టు దృష్టికి తేవటంతో, మీ అభ్యంతరాలు కౌంటర్ రూపంలో ఇవ్వాలని ఆదేశిస్తూ, కేసుని 14వ తేదీకి వాయిదా వేసారు.

Advertisements

Latest Articles

Most Read