నర్సాపురం ఎంపీ రఘురామరాజు చాలా రోజులు తరువాత మీడియా ముందుకు వచ్చారు. గతంలో రఘురామకృష్ణం రాజు, ప్రతి రోజు రాజధాని రచ్చబండ పేరుతో మీడియా సమావేశం పెడుతూ, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను టార్గెట్ చేస్తూ ఉండేవారు. అయితే అయన అరెస్ట్ తదనంతర పరిణామాలు అన్నీ తెలిసినవే. సుప్రీం కోర్టు బెయిల్ ఇవ్వటంతో, ప్రస్తుతం ఆయన ఢిల్లీలో ఉంటున్నారు. అయితే ఆయన బెయిల్ ఇచ్చిన దగ్గర నుంచి రఘురామరాజు ఇప్పటి వరకు, మీడియాతో మాట్లాడలేదు. ఎట్టకేలకు ఈ రోజు రఘురామరాజు మీడియా ముందుకు వచ్చారు. ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు పిటీషన్ పై, సిబిఐ కోర్ట్ లో వాదనలు జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జగన్ తరుపు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేస్తూ, రఘురామరాజు పై తీవ్ర ఆరోపణలు చేసారు. ఆ ఆరోపణలకు సమాధానంగా, రఘురామరాజు ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ. ముందుగా ఆయన మాట్లాడుతూ, గత 15 రోజులుగా జరిగిన ఘటనలు అన్నీ మీకు తెలుసు అని, అందుకే మీకు నేను అందుబాటులో ఉండలేక పోయాను అంటూ, రఘురామరాజు చెప్పారు. ఆ పరిణామాల పై తాను ఇప్పుడు ఏమి మాట్లాడలేనని అన్నారు. బహుసా, సుప్రీం కోర్టు ఈ కేసు పై ఏమి మాట్లాడవద్దు అని చెప్పినందుకు అయి ఉండవచ్చు.

rrr 01062021 2

ఇక తను జైలులో ఉన్న సమయంలో, ఆలాగే తన ఆరోగ్యం బాగోలేని సమయంలో, తాను కోలుకోవాలని, జైలు నుంచి బయటకు రావాలని ఆకాంక్షిస్తూ ప్రార్ధించిన అందరికీ పాదాభివందనం చేస్తున్నాని, మీ అభిమానం వల్లే తాను ఈ రోజు ఇలా మీ ముందు ఉన్నానని చెప్పారు. ఇక ఈ రోజు జరిగిన బెయిల్ పిటీషన్ రద్దు విచారణ పై ఆయన స్పందించారు. ఎన్నో కేసుల్లో ఏ1 గా ఉన్న జగన్ మోహన్ రెడ్డి, దాదాపుగా మూడు వాయిదాల తరువాత, సిబిఐ కోర్టులో కౌంటర్ దాఖలు చేసారని, ఈ కౌంటర్ లో తనని టార్గెట్ చేసిన విషయన్ని ఖండించారు. తన పై సిబిఐ నమోదు చేసిన రెండు ఎఫ్ఐఆర్ లు కూడా ఇంకా ప్రాధమిక దశలోనే ఉన్నాయని అన్నారు. ఇక తన నియోజకవర్గంలో ఒకేసారు ఏడు కేసులు పెట్టి, నాకు పిటీషన్ వేసే అర్హత లేదు అంటున్నారని, తన మీద ఉన్న కేసులు అన్నీ ఇంకా ఎఫ్ఐఆర్ స్టేజ్ లోనే ఉన్నాయని చెప్ప్పారు. దీని పై తమ కౌంటర్ ని కూడా మారో వారం రోజుల్లో సిబిఐ కోర్టులో ఇస్తామని, ప్రజలకు జరుగుతున్న అన్యాయం పై పోరాడుతూనే ఉంటానని, మిగిలినది అంతా ఆ వెంకటేశ్వర స్వామి చూసుకుంటారు అంటూ, రఘురామరాజు చెప్పుకొచ్చారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read