"ఢిల్లీ కోటను కూడా బద్దలు కొట్టేస్తాం"... ఇది వైసీపీ ఎమ్మెల్యే అసెంబ్లీ సాక్షిగా చేసిన ప్రకటన... ఇదేదో ప్రత్యెక హోదా కోసమే, పోలవరం నిధుల కోసమే, లేకపోతే మరేదో రాష్ట్ర సమస్యల కోసం అనుకునేరు. వైసీపీ నేతలకు ఢిల్లీ అంటే భయం కదా, రాష్ట్ర సమస్యల పై ఇంత మాట అన్నారా అనుకునేరు. కాదు కాదు.. జగన్ జోలికి వస్తే ఎవరినైనా, ఎంతటి వారినైనా, ఆకరుఖు ఢిల్లీ కోటను కూడా బద్దలు కొట్టేస్తాం అంటున్నారు. ఈ మాటలు మోడి గారు, అమిత్ షా గారు వింటే వారి రియాక్షన్ ఎలా ఉంటుందో కానీ, ఈయన గారి మాటలకు మెచ్చుకున్న జగన్ మోహన్ రెడ్డి గారు, మీ మాటల్లో ఆప్యాయత కనిపిస్తుంది, ధన్యవాదాలు అంటూ, ఆయన్ను మెచ్చుకున్నారు. ఇక విషయానికి వస్తే, ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు ఒక్క రోజు పాటు జరిగాయి. ఒక్క రోజు పాటు అసెంబ్లీ ఏమిటో అని ఆశ్చర్యపోయినంత సేపు పట్టలేదు, సమావేశాలు కూడా జగన్ గారి నామస్మరణతో, ప్రజల ఎదుర్కుంటున్న ఒక్క సమస్య పై కూడా చర్చించకుండా ముగిసిపోయాయి కూడా. బడ్జెట్ కోసమని, అదీ ఆరు నెలల లోపు సమావేశాలు పెట్టక పొతే ప్రభుత్వం పడిపోతుందని మొక్కుబడి సమావేశాలు పెట్టారు. అయితే ఈ కొద్ది పాటి సమయంలో కూడా చంద్రబాబుని, అలాగే తమ అధినేత చేస్తున్న పనులు విమర్శించే వాళ్ళని టార్గెట్ చేసుకున్నారు.

jogi 20052021 2

వైసీపీ ఎమ్మల్యే జోగి రమేష్ మాట్లాడుతూ, తమ అధినేత జగన్, పేద ప్రజల కోసం అనుక్షణం తపించిపోతున్నారని, ఆయన అంత ఇదిగా పని చేస్తుంటే, చంద్రబాబుతో పాటుగా, ఇతర నేతలు తమ ప్రభుత్వం పై కుట్రలు పన్నుతున్నారని అన్నారు. తమ పార్టీలో గెలిచిన ఒక లుచ్చాగాడు, వెధవ అంటూ, రఘురామకృష్ణం రాజు పై బూతులు మాట్లాడారు. అయితే ఆయన అలా మాట్లాడుతున్నా, స్పీకర్ ఖండించలేదు. చివరకు ఏమి అనుకున్నారో ఏమో, శ్రీకాంత్ రెడ్డి వచ్చి, ఒక పేపర్ మీద రాసి ఇవ్వటంతో, వేరే సభలో ఉన్న వారి పై, ఇక్కడ మాట్లాడుకూడదు అనే నిబంధన గుర్తుకు వచ్చి, మళ్ళీ ఏమి అవుతుందో అని, క్షమాపణలు చెప్పారు. ఇదే సందర్భంలో మా ముఖ్యమంత్రి గారి జోలికి ఎవరు వచ్చినా, ఎవరిని వదిలి పెట్టం అని, చివరకు ఢిల్లీ కోటలు అయినా సరే బద్దలు కొడతాం అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఢిల్లీలో సిబిఐ కేసుల్లో ఏదైనా కదలిక వచ్చే సూచనలు ఉన్నాయని ప్రచారం జరుగుతన్న నేపధ్యంలో, జోగి రమేష్ వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి.

రాష్ట్రంలో నిత్యం రాజ్యాంగం అవమానాలకు గురవుతోందని, ప్రాథమిక హక్కులను ప్రభుత్వం హననం చేస్తోందని, జీవించే హక్కు, భావ ప్రకటనా స్వేచ్ఛ హక్కు ప్రజలకు లేకుండా చేస్తోందని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు స్పష్టంచేశారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ -19, ఆర్టికల్ -21 ద్వారా పౌరులకు జీవించే హక్కు, భావ ప్రకటన హక్కు సంక్రమించాయని, కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాటికి విరుద్ధంగా వ్యవహరిస్తోందన్నారు. వైసీపీకి 51శాతం మంది ప్రజలు ఓట్లేశారని, ప్రతిపక్షాలకు ఓట్లేసిన మిగిలిన 49శాతం మందికి ఈ రాష్ట్రం లో జీవించేహక్కే లేదన్నట్టుగా ప్రభుత్వం వ్యవహరించడం దుర్మార్గమన్నారు. రాజ్యహింస ఎలా ఉంటుందో ప్రభుత్వం చేసి చూపిస్తోందన్నారు. ప్రభుత్వంలోని వారు, అధికారపార్టీ నేతలు మాట్లాడితే, రాజ్య పరిరక్షణ కిందకు వస్తుందంటున్నారని, ప్రతిపక్షాలవారు, ప్రశ్నించేవారు, ప్రజలు మాట్లాడితే, రాజద్రోహం కింద పరిగణిస్తున్నారని ఆనందబాబు వాపోయారు. ఆఖరికి మీడియాకు, కోర్టులకు కూడా ప్రభుత్వం పసుపు రంగు వేసే దుస్థితికి దిగజారిందన్నారు. కొందరి కార్యక్రమాలను మీడియాలో చూపించడాన్ని తప్పుపడుతూ, ప్రభుత్వం కొన్నిఛానళ్లపై తప్పుడు కేసులు పెట్టిందన్నా రు. టీడీపీప్రభుత్వంలో సాక్షి మీడియాపై ఎన్ని రాజద్రోహం కేసులుపెట్టారో, ఇప్పుడు అధికారంలో ఉన్నవారు సమాధానం చెప్పాలని ఆనందబాబు డిమాండ్ చేశారు. ప్రభుత్వం సాగిస్తున్న దమనకాండ మరీ పతాక స్థాయికి చేరిందన్నారు. సోషల్ మీడియాలో ప్రభుత్వంపై స్పందించేవారిపై కూడా తప్పుడు కేసులు పెడుతున్నారని, గుంటూరులో వరదలు వచ్చినప్పుడు తమనెవరూ పట్టించుకోలేదన్న వ్యక్తిపై, ఒకే అంశానికి సంబంధిచి పది పోలీస్ స్టేషన్లలో పదిరకాల కేసులుపెట్టడం జరిగిందన్నారు. టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏవో ఒకటో, రెండోకేసులు పెడితే, కడుపు మండి మాట్లాడినవారిపై కేసులెలా పెడతావు చంద్రబాబూ అంటూ జగన్మో హన్ రెడ్డి హూంకరింపులకు దిగాడని ఆనందబాబు తెలిపా రు. ఆనాడు కడుపు మండినట్టే, ఇప్పుడు కూడా ప్రజలకు కడుపు మండే మాట్లాడుతున్నారనే వాస్తవాన్ని ముఖ్య మంత్రి ఎందుకు గ్రహించడంలేదన్నారు?

క-రో-నా కారణంగా ప్రజలు చనిపోతుంటే, చూసి తట్టుకోలేని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే నేరమెలా అవుతుందో ముఖ్యమంత్రే చెప్పాలన్నారు . గుంటూరు లో మహేశ్, కల్యాణ్ అనే ఇద్దరిని సోషల్ మీడియాలో ఏవో పోస్టులు పెట్టారంటూ అరెస్ట్ చేసి, అంతర్జాతీయ టెర్రరిస్ట్ ల మాదిరిగా పోలీసులు వారిని ముసుగులేసి మీడియా ముందుకు తీసుకొచ్చారని ఆనంద బాబు చెప్పారు. వారిపై సెక్షన్లు 294 (బీ), 500, 67(ఐటీ యాక్ట్) ల కింద కేసు నమోదు చేశారన్నారు. వారుచేసిన నేరమేమిటంటే విజయసాయిరెడ్డిపై ఏవో పోస్టులు పెట్టడమేనన్నారు. సుప్రీం కోర్టు ఏడేళ్లలోపు శిక్షలు పడే కేసుల్లో ఎవరినీ అరెస్ట్ చేయవద్దని, అకారణంగా కేసులుపెట్టి, వారిని జైళ్లకు పంపవద్దని స్పష్టంగా చెప్పినా కూడా ప్రభుత్వం కక్షసాధింపులకు దిగుతూనే ఉందన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలనుకూడా ధిక్కరించి, అంతటి అత్యుత్సాహంతో పోలీస్ అధికారులు ఎవరికోసం పనిచేస్తున్నారో కాస్త ఆలోచించుకోవాలని మాజీ మంత్రి సూచించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు పోలీసులు ఈవిధంగా ప్రవర్తించారా అని ఆనందబాబు ప్రశ్నించారు. రాష్ట్రంలో రూల్ ఆఫ్ లేదని ప్రజలకు అర్థమైందని, ఏబీఎన్, టీవీ5 సంస్థలపై కేసులుపెట్టడం ప్రజాస్వామ్యానికే ప్రమాదకరమనే వాస్తవాన్ని ప్రతిఒక్కరూ గ్రహించాలన్నారు. గతంలో ఎక్కడైనాఒక విలేకరిపై, ఒక మీడియాసంస్థపై కేసులు పెడితే, అందరూ ముక్తకంఠంతో వ్యతిరేకించేవారని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు ఎక్కడా కనిపించడంలేదన్నారు.

సాక్షి ఎప్పుడైతే పుట్టిందో, అప్పటినుంచే మీడియా కూడా వర్గాలు, కులాలవారీగా విచ్ఛిన్నమైందని ఆనందబాబు ఆవే దన వ్యక్తం చేశారు. మీడియా సంస్థలన్నీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నాయని ఇప్పుడు సంబరపడటం కాదని, భవి ష్యత్ లో ఎవరి పరిస్థితి ఎలా ఉంటుందో పాలకులు గ్రహిస్తే మంచిదన్నారు. ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడుపడితే అప్పుడు టీడీపీ కార్యకర్తలను కొందరు అధికారులు హింసి స్తున్నారని, కావాలని వారిపై ఏదో కక్ష ఉన్నట్టుగా వ్యవహరిస్తున్నారని, అది ఎంత మాత్రం మంచిది కాదని టీడీపీనేత హితవుపలికారు. పగబట్టినట్టుగా పోలీసులు ప్రవర్తిస్తున్నారని, వారంతా ఏదో ఒక రోజు సమాధానం చెప్పి తీరాల్సిందేన న్నారు. భవిష్యత్, అధికారం ఎవరికీ శాశ్వతంకాదని, జగన్మోహన్ రెడ్డేమీ రాజు కాడని, ఇక్కడున్నది రాచరిక వ్యవస్థ కాదని ఆనందబాబు తేల్చిచెప్పారు. కొందరు పోలీసులు తమకు సంబంధంలేని విషయాల్లో కూడా అత్యుత్సాహం చూపుతున్నారన్నారు. రఘురామరాజు వ్యవహారంతో చంద్ర బాబునాయుడికి ఏం సంబంధముందని, ఆయన టీడీపీలో గట్టిగా రెండు వారాలు కూడా లేడన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపైనే చంద్రబాబునాయుడు ప్రశ్నిస్తున్నారు తప్ప, వ్యక్తులను దృష్టిలోపెట్టుకొని కాదన్నా రు. ప్రభుత్వం ఇప్పటికైనా ప్రజా వ్యతిరేక విధానాలు మానుకోవాలని, పాలకులు విచక్షణతో, వివేకంతో మసులకోవాలని ఆనందబాబు సూచించారు.

అసెంబ్లీ అనేది ప్రజా సమస్యలకు పరిష్కారంచూపే చర్చా వేదికని, దేవాలయం లాంటి అసెంబ్లీని జగన్మోహన్ రెడ్డి లోటస్ పాండ్ లా, వైసీపీ కార్యాలయంలా మార్చేశాడని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, శాసనసభ్యులు నిమ్మల రామానా యుడు ఆరోపించారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు "ఒకరోజు అసెంబ్లీని నిర్వహిస్తున్నారు. మార్చినెలలో బడ్జెట్ సమావేశాలు జరపొచ్చు. ఏపీలో మార్చి నెలలో పెద్దగా క-రో-నా కేసులు కూడా లేవు. కేంద్రం పార్లమెంట్ లో బడ్జెట్ సమావేశాలు నిర్వహించింది. పొరుగున ఉన్న కర్ణాటక ప్రభుత్వం కూడా బడ్జెట్ సమావేశాలు నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం బడ్జెట్ సమావేశాలు పెట్టకుండా, దొంగచాటుగా ఆర్డినెన్స్తో బడ్జెట్ ను ఆమోదింప చేసుకున్నారు. కేవలం రాజ్యాంగపరమైన నిబంధనలతో తన ప్రభుత్వం ఎక్కడ కూలిపోతోందోనన్న భయంతోనే ముఖ్యమంత్రి ఇప్పుడు ఒకరోజు బడ్జెట్ సమావేశాలకు సిద్ధమయ్యాడు. రాజ్యాంగప రమైన విధానాలు, బడ్జెట్ ను ఆమోదింప చేసుకోవడానికే తాము సమావేశాలు పెడుతున్నట్లు నిస్సిగ్గుగా సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రెండేళ్లపా టు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ ముఖమే చూడలేదు. అసెంబ్లీ అంటే ఏమాత్రం గౌరవంలేకుండా వ్యవహరించాడు. ఇప్పుడు అధికారంలో ఉన్నా కూడా అదేవిధమైన నిర్లక్ష్యంతో ఉన్నాడు . అందుకే మొక్కుబడిగా ఒక్కరోజు బడ్జెట్ సమావేశాల నిర్వహణ చేపట్టాడు. ప్రజల సమస్యలపై ప్రభుత్వ వైఖరి ఎలా ఉందో చెప్పడానికి మొక్కుబడిగా నిర్వహిస్తున్న అసెంబ్లీ సమావేశాలే నిదర్శనం. అందుకే తెలుగుదేశంపార్టీ ఒకరోజు నిర్వహిస్తున్న అసెంబ్లీని బాయ్ కాట్ చేయాలని నిర్ణయించింది. దానికి సమాంతరంగా ప్రభుత్వతీరుని నిరసిస్తూ, ప్రజల సమస్యలే ప్రధాన అజెండాగా మాక్ అసెంబ్లీ నిర్వహించాలని నిర్ణయించాము. దానిలో భాగంగా నేడు బీఏసీ సమావేశం కూడా నిర్వహించాము. ఆ సమావేశంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక అజెండాను నిర్ణయించాము.

మాక్ అసెంబ్లీని రెండు రోజులు పాటు నిర్వహించాలని, ప్రధానంగా కో-వి-డ్ అంశంపై చర్చ చేపట్టాలని, ప్రభుత్వం ప్రజల ప్రాణాల విషయంలో వ్యవహరిస్తున్న తీరుని ఎండగట్టాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించాము. మాక్ అసెంబ్లీలో తొలిరోజు ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దుచేసి, కోవిడ్ అంశంపైన చర్చ సాగాలని నిర్ణయం తీసుకున్నాము. దానిపై అవసరమైతే వాయిదా తీర్మానం కూడా ఇవ్వాలనుకుంటున్నాము. స్పీకర్ కు తమ పార్టీ నుంచి వాయిదా తీర్మానం పంపించి, దాన్నిఆయన అనుమతించేలా చూస్తాము. ప్రభుత్వం కో-వి-డ్ నివారణలో ఘోరంగా విఫలమైంది. పడకలు, ఆక్సిజన్ దొరక్క ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. కో-వి-డ్ తొలిదశ, రెండోదశకు ఆరునెలల విరామం ఉన్నా కూడా ప్రభుత్వం తగినవిధంగా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టలేకపో యింది. అలానే చేతివృత్తులు, కులవృత్తుల వారిని ఆదుకునేలా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడంలేదు. మాక్ అసెంబ్లీలో రెండోరోజు ప్రశ్నోత్తరాల సమయానికి కేటాయిస్తాం. దానిలో పింఛన్ల అంశంపై జగన్మోహన్ రెడ్డి ఎలా ప్రజలను మోసగించాడో చర్చిస్తాం. వారంరోజులలో సీపీఎస్ రద్దు చేస్తానన్న పెద్దమనిషి రెండేళ్లైనా దానిఊసేత్త డంలేదు. అదేవిధంగా బ్రాహ్మణులు, బీసీలు, కాపులు, వైశ్యులు, ఎస్సీ,ఎస్టీల కార్పొరేషన్లు ఎలా నిర్వీర్యమాయ్యాయో కూడా మాక్ అసెంబ్లీలో చర్చించబోతున్నాం. వాటితో పాటు దిశా పోలీస్ స్టేషన్లు, రాష్ట్రంలో మహిళలకు అందుతున్న న్యాయంపై కూడా చర్చిస్తామన్నారు. ఆడబిడ్డలకు అన్యాయం జరిగితే బుల్లెట్ కంటే వేగంగా జగన్ వస్తాడనిచెప్పారు. మరిప్పుడు జగన్ ఇంటినుంచే బయటకు రావడంలేదు. ప్రభుత్వం రెండేళ్లలో అనేకఅంశాల్లో ఘోరంగా విఫలమైంది. వాటిలో అతిముఖ్య మైనది రైతులు, వ్యవసాయరంగం. దానిపై కూడా ప్రధానంగా చర్చించేలా ప్రణాళిక ఏర్పాటుచేస్తున్నాం. వాటన్నింటిపై చర్చించడానికి తమకు కూడా రెండురోజుల సమయం సరిపోదు. వైసీపీప్రభుత్వంలో అంకెలగారడీగా మారిన బడ్జెట్ పై కూడా మాక్ అసెంబ్లీలోచర్చిస్తాం.

ఈ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. అయితే ఈ సమావేశాలు కేవలం ఈ ఒక్క రోజు మాత్రమే జరగనున్నాయి. అసెంబ్లీ సమావేశాలు ఆరు నెలలకు ఒకసారి పెట్టకపోతే ప్రభుత్వం పడిపోతుంది కాబట్టి, ప్రభుత్వం ఈ రోజు ఒక్క రోజు సమావేశాలు పెట్టింది. ఈ రోజే బడ్జెట్ కూడా ప్రవేశ పెట్టారు. ఉదయం క్యాబినెట్ మీటింగ్, గవర్నర్ ప్రసంగం, తరువాత బీఏసి సమావేశం, తరువాత బడ్జెట్, ఇవన్నీ చకచకా జరిగిపోయాయి. మొక్కుబడి సమావేశాలు అంటూ ఇప్పటికే తెలుగుదేశం పార్టీ బహిష్కరించింది. దీని స్థానంలో మాక్ అసెంబ్లీ అంటూ, ప్రజలకు ఉపయోగపడే ప్రజా సమస్యలు గురించి ఈ సమవేసలో చర్చించనున్నారు. ఇది పక్క పెడితే, ఈ రోజు అసెంబ్లీలో జగన్ మోహన్ రెడ్డి తీరు పై, నారా లోకేష్ ఫైర్ అయ్యారు. జగన్ మోహన్ రెడ్డి గారు, ఈ రోజు కూడా అసెంబ్లీలో మాస్క్ పీట్టుకోకుండా వచ్చారు. ప్రతి రోజు అంటే, నాలుగు గోడల మధ్య సమీక్షలు, కాబట్టి సమర్ధించుకున్నారు కానీ, ఇప్పుడు ఏకంగా ఒక 200 మంది ఉండే చోట కూడా, ఏకంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తీ మాస్క్ పెట్టుకోకుండా ఉండటం పై, అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే విషయం పై, జగన్ మోహన్ రెడ్డి పై అనేక విమర్శలు వస్తున్నాయి. ఇదే కోవలో నారా లోకేష్, జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో మాస్క్ పెట్టుకోకుండా ఉన్న ఫోటో తీసి, ట్విట్టర్ లో పోస్ట్ చేసి, జగన్ పై విరుచుకు పడ్డారు. క-రో-నా సమయంలో ప్రజలు అందరూ మాస్కు వేసుకోవాలి అంటూ, వేల కొద్ది ప్రకటనలు మీరే కదా ఇచ్చిందని అన్నారు.

jagan 20052021 2

ఆ ప్రకటనల్లో మీ బొమ్మ కూడా వేసుకున్నారు కదా అని ఎద్దేవా చేసారు. కోట్లు ఖర్చు పెట్టి ప్రకటనలు ఇచ్చి, ఇప్పుడు మీరే మాస్క్ పెట్టుకోకుండా ప్రజలకు ఏమి సందేశం ఇస్తున్నారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న మీరే మాస్కు పెట్టుకోకుండా ఉంటే, ఇక మీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎందుకు మాస్కు పెట్టుకుంటారు అంటూ ప్రశ్నించారు. మొదట్లో క-రో-నా అనేది ఒక చిన్న వైరస్, ఇదేమి చేయదు, చిన్న జ్వరం లాంటిది, వస్తుంది పోతుంది, బ్లీచింగ్ పౌడర్ చల్లితే పోతుంది, పారాసిటమాల్ వేసుకుంటే పోతుంది అని చెప్పి, సహజీవనం చేయాలని, లైట్ తీసుకుని, ప్రజలను బలి తీసుకున్నారని అన్నారు. ఇప్పుడు సెకండ్ వేవ్ లో రాష్ట్రం అల్లకల్లోలం అవుతుంటే, నవ్వుతూ, మాస్కు లేకుండా తిరుగుతూ, మిమ్మల్ని చూసి మిగతా వారు కూడా మాస్కు పెట్టుకోకుండా ఉంటే, ఇంకా ఎంత మంది పోతారో అని అన్నారు. మాస్కు వేసుకుని మనిషిగా ఉంటారో, మాస్కు పెట్టుకోకుండా మూర్ఖుడిగా ఉంటారో మీ ఇష్టం అంటూ, లోకేష్ ట్వీట్ చేసారు.

Advertisements

Latest Articles

Most Read