జగన్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాల పై ప్రతి రోజు రాజధాని రచ్చబండ పేరుతో, ప్రభుత్వం చేస్తున్న దురాగతాలను చీల్చి చెండాడుతున్న, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామకృష్ణం రాజు ఇంటికి ఏపి సిఐడి అధికారులు వచ్చారు. హైదరాబాద్ లో ఉన్న రఘురామకృష్ణం రాజు ఇంటికి, సిఐడి అధికారులు వచ్చారు. ఆయనకు నోటీసులు ఇచ్చి , ఏ క్షణమైనా అరెస్ట్ చేస్తారని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే రఘురామరాజు పై, ఏపిలో వైసిపీ శ్రేణులు ఏడు కేసులు పెట్టారు. ఏ కేసులో ఇప్పుడు విచారణ కోసం, లేదా అరెస్ట్ కోసం పోలీసులు ఎందుకు వచ్చారో అర్ధం కావటం లేదు. మొత్తంగా 25 మంది సిఐడి పోలీసులు రఘురామకృష్ణం రాజు ఇంటికి వచ్చారని, ఆయన్ను అరెస్ట్ చేయటానికి లోపలకు వెళ్లారు. అయితే లోపల ఆయన్ను లిఫ్ట్ చేయటానికి ప్రయత్నం చేయగా, ఆయనకు ఉన్న సెంట్రల్ ఫోర్సు అడ్డుకుంది. ఇప్పటికే ఏపి పోలీసులు పై నమ్మకం లేదని, ఇప్పటికే ఆయన సెంట్రల్ ఫోర్సెస్ ని తెచ్చుకున్న విషయం తెలిసిందే. అయితే ఇంకా లోపల సస్పెన్స్ కొనసాగుతుంది.

ఆంధ్రప్రదేశ్ తెలంగాణా సరిహద్దులో, తెలంగాణా ప్రభుత్వం ఏపి నుంచి వెళ్ళే అంబులెన్స్ లను అడ్డుకోవటం పై, ఈ రోజు సుజనా చౌదరి సన్నిహితులు వేసిన కోర్టు ధిక్కరణ పిటీషన్ పై, ఈ రోజు తెలంగాణా హైకోర్టులో దాదాపుగా రెండు గంటల పాటు విచారణ జరిగింది. దీని పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. సరిహద్దుల్లో ఎలాంటి అంబులెన్స్ లు ఆపకూడదు అంటూ, తెలంగన ప్రభుత్వానికి చెప్తూ, తెలంగాణా ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు పై హైకోర్టు స్టే విధించింది. ప్రభుత్వం ఇచ్చిన సర్క్యలర్ ని నిలిపుదల చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదు అంటూ, ఆదేశాలు జారీ చేసింది. ఇక నుంచి అంబులెన్స్ లు ఆపవద్దు అని తెలంగాణా పోలీసులకు హైకోర్టు స్పష్టం చేసింది. నేషనల్ హైవేల పై వాహనాలు ఆపటం, రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని అంశం కాదని, కేంద్రానికి ఆ అధికారం ఉంటుందని, హైకోర్టు స్పష్టం చేసింది. పిటీషనర్ తరుపున దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. మెడికల్ ఇన్ఫ్రా కూడా కేంద్ర పరిధిలోని అంశం అని, ఆర్టికల్ 11 ప్రకారం, ఇలా ఆపటం కుదరదు అని, అలాగే సుప్రీం కోర్టులో దీని పై, అనేక డైరక్షన్స్ ఉన్నాయని, పిటీషనర్ తరుపు న్యాయవాది హైకోర్టు ముందు వాదనలు వినిపించారు.

hc 14052021 2

అయితే తెలంగాణా ప్రభుత్వం తరుపున అడ్వకేట్ జెనెరల్ వాదనలు వినిపిస్తూ, ఇతర రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది పేషెంట్లు వస్తున్నారని, ఇక్కడ ప్రతి ఒక్కరికీ వైద్యం అందటం కష్టం అని, ఇక్కడ ప్రజలకు వైద్యం అందటం కష్టం అవుతుందని వాదించారు. అలాగే ఇతర రాష్ట్రాల్లో పాజిటివ్ ఉన్న వారిని రాష్ట్రం లోకి రానివ్వటం లేదని, అలాగే ఇక్కడకు అంబులెన్స్ లలో వచ్చే వాళ్ళు అందరూ పాజిటివ్ ఉన్న వారే అని, వారిని అడ్డుకునే హక్కు తమకు ఉందని కోర్టుకు తెలిపింది ప్రభుత్వం. అయితే దీని పై కోర్టు తీవ్ర ఆగహ్రం వ్యక్తం చేసింది. అందరికీ బ్రతికే హక్కు ఉందని అన్నారు. ఆర్టికల్ 21 ప్రకారం, ప్రాణాలు కాపాడుకునే హక్కు ఈ దేశంలో ఉందని, దాన్ని మీరు హరించలేరని అన్నారు. మేము ఆదేశాలు ఇచ్చిన తరువాత కూడా ఎందుకు ఆపారు అంటూ ఆగహ్రం వ్యక్తం చేసారు. తెలంగాణా ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు వెంటనే సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మరే విధంగా కూడా, కొత్త ఆదేశాలు ఇవ్వకూడదు అంటూ, ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ఏదైనా ఒక విషయంలో ఒకసారి తప్పు జరిగితే, అది అజాగ్రత్త అనుకోవాలి. అదే రెండో సారి కూడా , అదే తప్పు మళ్ళీ జరిగితే, ఏమనాలో ప్రజలే నిర్ణయం తీసుకోవాలి. ఇది ప్రణాలతో చెలగాటం ఆడే సమస్య అయితే, ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి ? రెండు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణాకు వెళ్ళీ అంబులెన్స్ లను, ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోనే, తెలంగాణా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సంఘటన పెద్ద సంచలనం అయ్యింది. చివరకు సుజనా చౌదరి, హైకోర్టులో పిటీషన్ వేయటంతో, తీవ్రంగా స్పందించిన హైకోర్టు, తెలంగాణా ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఇక్కడ గమనించాల్సిన విషయం, ఇంత జరుగుతున్నా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైపు నుంచి జగన్ మోహన్ రెడ్డి గారు అయితే కేసీఆర్ తో మాట్లాడలేదు. కోర్టు జోక్యంతో, ఆ వివాదం సద్దుమణిగింది. అయితే మళ్ళీ ఏమైందో ఏమో కానీ, నిన్న తెలంగాణా ప్రభుత్వం మళ్ళీ కొత్తగా ఉత్తర్వులు ఇచ్చింది. తెలంగాణాలోకి వైద్య సేవలు కోసం వచ్చే ఇతర రాష్ట్రాల వారు, ఇక్కడ హాస్పిటల్స్ నుంచి అనుమతి పత్రం తీసుకోవాలని, అది తెలంగాణా ప్రభుత్వం పెట్టిన కొత్త కాల్ సెంటర్ కు పంపిస్తే, అప్పుడు ఈ పాస్ ఇస్తామని, ఇవన్నీ తెలంగాణా సరిహద్దులో చూపిస్తే, అప్పుడు వేరే రాష్ట్రాల వారికి తెలంగాణాలో వైద్యం చేసుకోవటానికి అనుమతి ఇస్తామని చెప్పారు.

border 14052021 2

అయితే ఈ రోజు ఉదయం నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణాకు వెళ్తున్న వందలాది అంబులెన్స్ లను మళ్ళీ తెలంగాణా ప్రభుత్వం అడ్డుకుంది. కొంత మందికి అనుమతి ఉన్నా, ఈ పాస్ ఉంటేనే అనుమతి ఇస్తామని తెలంగాణా పోలీసులు చెప్తున్నారు. అయితే ఎక్కడెక్కడ నుంచో వచ్చామని, కొత్త నిబంధనలు తెలియదు అని, రోడ్డు మీద ఉన్నామని చెప్పినా, తెలంగణా పోలీసులు కనికరించటం లేదు. అయితే ఏపిలో సరైన వైద్యం దొరక్క హైదరాబాద్ వెళ్తున్న ఏపి ప్రజలు ఇబ్బంది పడుతుంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పట్టించుకోవటం లేదు. నాకు , కేసీఆర్ కు ఎంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పే జగన్, ఎందుకో మరి కేసీఆర్ తో డైరెక్ట్ గా మాట్లాడి సమస్యను పరిష్కరించటం లేదు. ఇప్పటికే ఇద్దరు చనిపోయారని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ అంశం పై మళ్ళీ సుజనా చౌదరి, తన సన్నిహితులు ద్వారా కోర్టులో పిటీషన్ వేసారు. ఈ సారి కోర్టు ధిక్కరణ పిటీషన్ కూడా వేసారు. కోర్టు ఏదో ఒక డైరెక్షన్ ఇచ్చే దాకా, ఇటు జగన్ కానీ, అక్కడ కేసీఆర్ కానీ, స్పందించేలా లేరు మరి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చివరకు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి కూడా, వ్యాక్సిన్లను రాజకీయం చేసి, బంధుత్వం అంట గడితే, బులుగు మీడియా ఏకంగా కులం అంటగట్టి ప్రచారం చేస్తుంది. అయితే భారత్ బయోటెక్ కోవాగ్జిన్ ఉత్పత్తి బాధ్యతను వేరే కంపెనీలకు ఇవ్వాలని జగన్ మోహన్ రెడ్డి రెండు రోజులు క్రితం కేంద్రానికి లేఖ రాసారు. నిజానికి ఆ ప్రక్రియ నెల రోజులు క్రిందటే ప్రారంభం అయ్యింది. BIBCOL, IIL , Haffkine లాంటి సంస్థలతో ఇప్పటికే చర్చలు జరిగాయి కూడా. అవి తెలియకుండా జగన్ మోహన్ రెడ్డి ఈ ఉత్తరం రాసారు. అయితే నిన్న నీతి అయోగ్ విలేఖరుల సమావేశంలో, భారత్ బయోటెక్ కోవాగ్జిన్ తయారీని వేరే వారికి ఇవ్వటానికి ఇప్పటికే ఒప్పుకుంది అంటూ చెప్పారు. అంతే, ఇక ముందు వెనుకా ఆలోచన లేకుండా, కొట్టిన డబ్బానే కొడుతూ, నిన్నటి నుంచి బులుగు మీడియా, బులుగు సోషల్ మీడియా చేస్తున్న హడావిడి అంతా ఇంతా కాదు. జగన్ మోహన్ రెడ్డి లేఖ వల్లే కేంద్రంలో కదలిక వచ్చి, భారత్ బయోటెక్ కోవాగ్జిన్ ఉత్పత్తి బాధ్యతను వేరే కంపెనీలకు ఒప్పుకుంది అంటూ ప్రచారం మొదలు పెట్టారు. అసలు మా జగన్ ఒక విజనరీ, ఆయన చెప్పింది దేశం వింటుంది అంటూ, నిన్నటి నుంచి ప్రచారం చేస్తున్నారు. ఎప్పుడో నెల రోజులు క్రితం అయిపోయన దానికి, జగన్ లేఖతోనే అని డబ్బా కొడుతున్నారు.

nitiayog 14052021 2

నిజానికి నిన్న నీతి ఆయోగ్ ఏమి చెప్పిందో, యధాతధంగా "కొవాగ్జిన్ ఉత్పత్తి బాధ్యతను మరి కొన్ని ఇతర సంస్థలకు ఇవ్వమని కొంతమంది అడుగుతున్నారు. సంతోషించదగిన విషయం ఏమంటే... కొవాగ్జిన్ తయారుచేస్తోన్న సంస్థ కూడా అలాంటి తయారీ సంస్థలను స్వాగతించింది. కొన్ని సంస్థలు కూడా అందుకు ముందుకు వచ్చాయి. భారత్ బయోటెక్ చొరవ ఫలితంగా ఇప్పటికే BIBCOL, IIL , Haffkine లాంటి పబ్లిక్ సెక్టార్ యూనిట్లు ఉత్పత్తి ప్రక్రియలో ఉన్నాయి. ఐసిఎంఆర్ రూపొందించిన ఈ వాక్సిన్ గొప్పదనం ఏంటంటే... ఈ వాక్సిన్ తయారీలో బతికున్న వైరస్ నే నిస్తేజం చేస్తారు. ఈ ప్రక్రియ BSL3 అంటే అత్యాధునిక బయో సేఫ్టీ లెవెల్ 3 లేబరేటరీలలో చేయబడుతుంది. అయితే ఇలాంటి లేబరేటరీ సౌకర్యం దేశంలో వేరే సంస్థల దగ్గర దాదాపుగా లేదు. ప్రతి సంస్థ దగ్గరా ఉండేటువంటి సౌకర్యం కాదిది. అలాంటి ఏర్పాటు కలిగి ఉన్న సంస్థలు ఉంటే రమ్మని కొన్ని నెలల క్రితమే బహిరంగంగా ఆహ్వానించాం. కొవాగ్జిన్ తయారీని కలిసికట్టుగా తయారు చేయించేందుకు మేము కట్టుబడి ఉన్నాం. అలాగే ఈ వాక్సిన్ తయారీ సంస్థ కూడా విశాల దృక్పథంతో ఇందుకు అంగీకరించినందుకు సంస్థకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ సంస్థ కోటి వాక్సిన్ ల ఉత్పత్తి సామర్థ్యాన్ని పది కోట్ల వాక్సిన్ ల ఉత్పత్తికి పెంచే బాధ్యతను కూడా తీసుకుంది. మళ్లీ చెబుతున్నా .. BSL3 ల్యాబ్స్ ఉన్న సంస్థలు ఏవైనా వాక్సిన్ తయారీకి ముందుకు రావచ్చు."

Advertisements

Latest Articles

Most Read