ఏసిబి కేసులో ఆరోపణలు ఎదుర్కుంటూ రాజమండ్రి జైల్లో ఉన్న ధూళిపాళ్ల నరేంద్ర, అలాగే సంగం డైరీ ఎండీ గోపాలకృష్ణ ఇద్దరూ అస్వస్థతకు గురయ్యారు. మొన్న రాజమండ్రి నుంచి విజయవాడ ఏసిబి ఆఫీస్ కు తీసుకు వెళ్లి, మళ్ళీ రాజమండ్రి తీసుకురావటం జరిగింది. అయితే నిన్నటి నుంచి సంగం డైరీ ఎండీ గోపాలకృష్ణ అస్వస్థతకు గురయ్యారు. ఊపిరి తీసుకోవటంలో ఇబ్బందులు ఎదురు అయ్యింది. అయితే ఆయనకు పరీక్షలు చేపించగా క-రో-నా గా నిర్ధారణ అయ్యింది. అయితే ఆయనకు సిటి స్కాన్ చేయటానికి రాజమండ్రి కో-వి-డ్ హాస్పిటల్ కు పంపించగా, అక్కడ సిటి స్కాన్ పని చేయక పోవటంతో, ప్రైవేటు హాస్పిటల్ కు తరలించారు. ఇప్పుడు ఆయనకు రాజమహేంద్రవరం ప్రభుత్వ కోవిడ్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇక ఇది ఇలా ఉంటే, ధూళిపాళ్ల కూడా అస్వస్థతకు గురి కావటంతో, అందరూ ఆందోళన చెందుతున్నారు. నిన్న రాత్రి నుంచి ఆయన జ్వరం, దగ్గుతో బాధ పడుతున్నారు. అయితే ఆయన టెస్ట్ రిపోర్ట్ ఇప్పటి వరకు రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఆయన్ను వెంటనే మంచి ప్రైవేటు హాస్పిటల్ కు తీసుకువెళ్ళి వైద్యం అందించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవటంతో, ఏసిబి కోర్టులో పిటీషన్ దాఖలు చేసారు.

dhulipalla 04052021 2

ధూళిపాళ్ల నరేంద్రకు ఆరోగ్యం సరిగ్గా లేదని, ఆయన జ్వరంతో బాధ పడుతున్నారని, ఇప్పుడున పరిస్థితిలో ఆయనకు వెంటనే వైద్యం అందించాలని, ప్రైవేటు హాస్పిటల్ లో వైద్యం అందించేందుకు అనుమతి ఇవ్వాలి అంటూ, పిటీషన్ దాఖలు చేసారు. అయితే అనూహ్యంగా ఏసిబి తరుపున ఉన్న పీపీ, ఆయనకు ప్రైవేటు హాస్పిటల్ లో వైద్యం అందించే అంశం పై అభ్యంతరం వ్యక్తం చేసారు. తమకు కౌంటర్ దాఖలు చేయటానికి సమయం కావలని కోర్టు ని కోరారు. అయితే ఏసిబి తీరు పై తెలుగుదేశం పార్టీ మండి పడుతుంది. కావలని కో-వి-డ్ కేసులు ఉన్న జైల్లో బంధించారని, వాళ్ళు నేరస్తులు కారని, విచారణ కోసం అని చెప్పి, ఇప్పటికీ ఇన్ని రోజులు గడుస్తున్నా సాగదీస్తున్నారని, వారి ఆరోగ్యానికి ఏ హాని జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాలని, ధూళిపాళ్ల నరేంద్ర కుమార్తె వైదీప్తి ఆవేదన వ్యక్తం చేసారు. మరో పక్క ఇదే అంశం పై, నారా లోకేష్ కూడా స్పందించారు. వారి ఆరోగ్యం క్షీణిస్తే బాధ్యత మొత్తం జగన్ రెడ్డిదే అని, వెంటనే వారికి మెరుగైన చికిత్స అందించాలని డిమాండ్ చేసారు.

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై, గత 40 ఏళ్ళుగా మచ్చ వేద్దామని అనేక మంది అనుకుని చతికిలబడ్డారు. అప్పటి ఇందిరా గాంధీ నుంచి, నేటి జగన్ మోహన్ రెడ్డి వరకు, ఆయన్ను టార్గెట్ చేస్తూనే ఉన్నారు కానీ, ఇప్పటి వరకు చంద్రబాబు పై ఆరోపణలు తప్ప, ఆయన తప్పు చేసారని ఒక్కటంటే ఒక్క ఆరోపణ కూడా రుజువు చేయలేక పోయారు. 2019 ఎన్నికల ముందు, ప్రధాని నరేంద్ర మోడీ ఆఫీస్ లో, చంద్రబాబుని ఏదో ఒక అవినీతి కేసులో ఇరికించాలని, ఫైల్స్ అన్నీ తిరగేవేసారని, ఒక్క ఆధారం కూడా లేకపోవటంతో, కేవలం రాజకీయ ఆరోపణలతోనే సరి పెట్టారని చెప్తూ ఉంటారు. చంద్రబాబు అంత నిజాయతీగా ఉన్నారు కాబట్టే, ఆయన 40 ఏళ్ళు ఏ మచ్చ లేకుండా రాజకీయాల్లో ఉన్నారు. ఇక ఆయన పై ఎన్నో కేసులు ఎంతో మంది వేసారు, వేస్తూనే ఉన్నారు. అయితే, ఇలాంటి కేసుల్లో ఒకటి లక్ష్మీపార్వతి వేసిన ఒక కేసు. 2005లో చంద్రబాబుకి ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయి అంటూ, అప్పటి రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ప్రోద్బలంతో, లక్ష్మీపార్వతి, ఏసిబిలో కేసు వేసారు. అయితే అప్పట్లో చంద్రబాబు ఆ కేసు పై స్టే తెచ్చుకున్నారు. ఇప్పటికి చంద్రబాబు పై, కేవలం ఈ ఒక్క కేసులోనే స్టే ఉంది. అయితే, ఈ మధ్య సుప్రీం కోర్టు కొన్ని ఆదేశాలు ఇచ్చింది.

lp 03052021 2

రాజకీయ నాయకుల పై కేసులు తెల్చేయలని చెప్పటంతో, చంద్రబాబు కేసు పై ఉన్న స్టే ఎత్తివేసారు. దీంతో లక్ష్మీపార్వతి ఏసిబి లో వేసిన కేసు పై, ఏసిబి కోర్టులో గత కొన్ని నెలలుగా విచారణ జరిగింది. అయితే దీని పై విచారణ చేసిన కోర్టు, అసలు లక్ష్మీపార్వతి వేసిన పిటీషన్ కు అర్హత లేదని తేల్చి చెప్పింది. ఈ రోజు ఈ కేసుని కొట్టేసింది. ఈ కేసులో తగిన ఆధారాలు ఏమి ఆమె చూపించలేకపోయారని, ఏసిబి కోర్టు స్పష్టం చేస్తూ, ఈ కేసుని కొట్టేసింది. దీంతో ఇప్పటి వరకు స్టే ఉన్న ఈ ఒక్క కేసులో కూడా చంద్రబాబు ఫ్రీ అయ్యారు. ఇప్పుడు కేవలం జగన్ మోహన్ రెడ్డి, తాజాగా వేసిన అమరావతి ఏసిబి కేసు తప్పితే చంద్రబాబు పై ఒక్క కేసు కూడా స్టే లేదు. మొన్నటి దాకా 18 స్టేలు అంటూ తప్పుడు ప్రచారం చేసిన బులుగు మీడియా, ఇప్పటికైనా సరిగ్గా రిపోర్టింగ్ చేస్తుందో లేదో మరి. అయితే ఇది మాత్రం లక్ష్మీపార్వతికి షాక్ అనే చెప్పాలి. అప్పట్లో రాజశేఖర్ రెడ్డి వేయమంటే కేసు వేసారు కానీ, ఆధారాలు చూపించలేక పోవటం, ఇప్పుడు కొడుకు హయాంలో కేసు కొట్టేసారు.

మూడు ముక్కల రాజధాని, రాజధాని ప్రాధికార అభివృద్ధి సంస్థ (సీఆర్ డీఏ) రద్దు బిల్లులపై దాఖలైన పిటిషన్లపై సోమవారం హైకోర్టు విచారణ చేసింది. అమరావతి రాజధాని తరలింపు, సీఆర్డీఏ రద్దును వ్యతిరేకిస్తూ హైకోర్టులో వంద వరకు పిటిషన్లు దాఖలయ్యాయి. గత ఏడాది క-రో-నా నేపధ్యంలో వర్చువల్ ద్వారా విచారణ జరపాలని హైకోర్టులో ప్రయత్నించింది. అయితే సాధ్యపడలేదు. రెండోదశ వైరస్ వ్యాప్తి విజృంభణతో అసలు విచారణ జరుగుతుందా.. లేదా అనేది సందేహాలు ఉన్న వేళ, ఈ సారి కూడా హైకోర్టు ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. పిటీషనర్ తరుపు న్యాయవాదులు విజ్ఞప్తి మేరకు, వైరస్ వ్యాప్తి నేపధ్యంలో, కేసుని ఆగస్టు 23కు కేసుని వాయిదా వేసింది. దీంతో తొందరగా విశాఖ వెళ్ళిపోదాం అని అనుకున్న ప్రభుత్వానికి, మళ్ళీ ఆగష్టు నెల దాకా ఎదురు చూడటం, అలాగే అప్పుడు వాదనలు మొదలు అయితే, మరొక మూడు నెలలకు పైగా టైం పడుతూ ఉండటంతో, ఈ ఏడాది కూడా విశాఖ వెళ్ళిపోదాం అనే ఆలోచనకు బ్రేక్ పడింది అనే చెప్పాలి. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజధాని గ్రామాల్లో ఆందోళన నిర్వహిస్తున్న రైతుల్లో ఈ రోజు విచారణ సందర్భంగా ఏమి జరుగుతుందా అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.. క-రో-నా రెండవ దశ ఉధృతంగా విస్తరిస్తున్న నేపథ్యంలో సోమవారం నుంచి విచా రణ జరు గుతుందా..లేదా.. అనే సందేహాలు న్యాయవాద వర్గాల్లో కూడా వ్యక్తమయ్యాయి.

hc 03052021 2

క-రో-నా దృష్ట్యా ఇప్పటికే ఏప్రిల్ 21వ తేదీ వరకు వెలువరించిన మధ్యంతర ఉత్తర్వులన్నింటినీ జూన్ 30వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది. ఈ పరిస్థితుల్లో రాజధాని తరలింపుపై దాఖలైన వ్యాజ్యాలపై ఏ రకంగా స్పందిస్తుందనే విషయమై సందేహాలు వ్యక్తమయ్యాయి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప కుమార్ గోస్వామి నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం రాజధానికేసులను ఈ రోజు విచారణ చేపట్టింది. వికేంద్రీకరణ బిల్లులపై మొదటి సారి ఈ ఏడాది మార్చి 26న విచారణ జరిపిన ధర్మాసనం మే 3వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. రాజధాని తరలింపు, సీఆరీ ఏ రద్దుకు సంబంధించి హైకోర్టులో దాదాపు వంద వరకు పిటి షన్లు దాఖలయ్యాయి. వీటిపై గత ఏడాది కొంత వరకు విచారణ జరిగింది. అయితే గత ఏడాది ఇదే పరిస్థితుల కారణంగా నిరవధిక వాయిదా పడింది. ఈ లోపు రాష్ట్రంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు, వాటిపై దాఖలైన పిటిషన్లతో రాజధాని కేసుల విచారణ వాయిదా పడింది. వికేంద్రీకరణ, సీఆర్టీ ఏ బిల్లులను వ్యతిరేకిస్తూ రాజధాని గ్రామాల్లో 500వ రోజులకు పైగా దీక్షలు కొనసాగుతున్నాయి. సోమవారం నుంచి వర్చువల్ వీడియో ద్వారా విచారణ జరిపేందుకు హైకోర్టు ధర్మాసనం సిద్ధం కాగా, పిటీషనర్ల విజ్ఞప్తి మేరకు, ఆగష్టు నెలకు వాయిదా వేసింది.

క-రో-నా ఉధృతి రోజురోజుకీ ఎక్కువవుతోందని, నిన్నకూడా దేశ వ్యాప్తంగా 3లక్షల70వేలకు పైగా కేసులు నమోదయ్యా యని, మన రాష్ట్రంలో 24వేలకు పైగా గుర్తించారని, ప్రపంచ వ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో సగానికి పైగా భారత్ లోనే నమోదవడం ఆందోళనకరమని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. సోమవారం ఆయన విలేకరు లతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే "ఇలాంటి క్షిష్టపరిస్థితుల్లో ప్రజల ప్రాణాలు కాపాడాలంటే వ్యాక్సినేషనే ముఖ్యం. వ్యాక్సినేషన్ గురించి రెండ్రోజుల క్రితం మాట్లాడాను. రాజస్థాన్, ఢిల్లీ, మహారాష్ట్ర, పంజాబ్ , ఒడిశా వంటి అనేక రాష్ట్రాలు వ్యాక్సిన్లకు ఆర్డర్లు పెట్టే ఆలోచనలో ఉన్నాయని చెప్పాను. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత వ్యాక్సిన్ల పైనే ఆధార పడకుండా అనేక రాష్ట్రాలు సొంతంగా వ్యాక్సిన్ల కొనుగోలు కోసం ప్రయత్నిస్తు న్నాయి. మనరాష్ట్రం మాత్రం ఆ దిశగా ఎందుక ప్రయత్నాలు చేయడంలేదు? 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు వారికి రాష్ట్రంలో వ్యాక్సిన్లు ఇవ్వాలంటే, రూ.1600కోట్ల వరకు ఖర్చవుతుంది. ఆ మాత్రం సొమ్ముకూడా ఖర్చుపెట్టలేని స్థితిలో ఈ ముఖ్యమంత్రి, ప్రభుత్వం ఉన్నాయా అని రెండ్రోజు ల క్రితమే మీడియా సాక్షిగా నిలదీశాను. రాష్ట్రవ్యాప్తంగా వ్యాక్సినేషన్ చేపట్టాలంటే ఈ ప్రభుత్వం రూ. 5 నుంచి రూ. 6వేలకోట్ల వరకు ఖర్చుపెట్టాల్సి ఉంటుంది. ఆ మాత్రం నిధులుకూడా ఈ ప్రభుత్వానికి అందుబాటులో లేవా? రాష్ట్రం అంత లాదివాలా తీసిందా? ఒక వేళ దివాలా తీసుంటే, అందుకు కారణం జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అవినీతి, ప్రభుత్వంచేస్తున్న దుబారాఖర్చే కారణం. ముఖ్యమంత్రి ఎంతలా దిగజారిపోయాడంటే, ఉద్యోగస్తుల జీతాలకు కోతపెట్టి, వ్యాక్సిన్లు అందిస్తానంటున్నాడు. ప్రజలందరికీ వ్యాక్సిన్లు ఇవ్వడానికి ఉద్యోగుల జీతాలకు కోతపెడతాడా? అస్సలు ఏమైనా సిగ్గుందా ఈముఖ్యమం త్రికి? ఒకపక్కన ఉచితంగా వ్యాక్సిన్లు ఇస్తాననిచెప్పి, ఇప్పుడేమో ఉద్యోగుల జేబులుకొట్టేసి వ్యాక్సిన్లుఇస్తామని చెబుతున్నాడు.

విద్యుత్ శాఖలో ఉన్న ఏపీ డిస్కమ్ లకు సంబంధించిన సీఎమ్ డీలు ఇచ్చిన సర్క్యులర్ ఒకసారి పరిశీలిస్తే, ఏపీ సీపీడీసీఎల్ ఛైర్మన్, మరియు మేనేజింగ్ డైరెక్టర్ ఇచ్చిన సర్క్యులర్ ని 27-04-2021న ఇచ్చారు. దానిలో ఏముందయ్యా అంటే, డిస్కమ్ ల పరిధిలో ఉన్న ఉద్యోగలందరి ఒకరోజు జీతాన్ని వ్యాక్సినేషన్ కోసం కట్ చేస్తున్నట్లు, అందుకోసం ఉద్యోగులంతా వారి సమ్మతి ని తెలియచేశారని ఉంది. కానీ వాస్తవానికి ఏ ఒక్క ఉద్యోగిని సంప్రదించలేదు. వారెవరూ కూడా వారి సమ్మతి తెలియ చేయలేదు. ఉద్యోగుల జేఏసీ వారు ఏప్రియల్ 28న ఒక లేఖ రాశారు. తామేమీ తమసమ్మతిని తెలియచేయలేదని, తమను ఎవరూ సంప్రదించలేదని, జీతాలు కట్ చేయడానికి ఒప్పుకోమని లేఖలో పేర్కొన్నారు. క-రో-నా సమయంలో ఉద్యోగులందరూ కూడా వారిప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్నారు. అటువంటివారి జీతాల్లో కోత పెట్టడమేంటి? అసలు ఈముఖ్యమంత్రి మనిషేనా? ఉద్యోగుల జీతాలకు కోతపెట్టి వ్యాక్సినేషన్ ఇస్తామని చెప్పడమేంటి? ఇచ్చిన సర్క్యులర్ పై ఏం సమాధానం చెబుతారు? ముఖ్యమంత్రి కోతపెట్టాల్సింది ఉద్యోగులజీతాల్లో కాదు. మద్యంపై, ఇసుకపై, ఇతరత్రాదందాల రూపంలో ముఖ్యమంత్రికి వస్తున్న సొమ్ములో ఆయన కోతపెట్టుకో వాలి.

ఆ విధంగా ఆయన తనకు వచ్చే సొమ్ముని, కమీషన్లను కట్ చేసుకుంటే, రాష్ట్రంలోఉన్న ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ ఇప్పించవచ్చు. ఏరాష్ట్రంలోనైనాసరే ఇటువంటి దిక్కుమాలిన సర్క్యులర్లు ఇచ్చారా? ఉద్యోగస్తుల జీతాల్లో కోతపెట్టి వ్యాక్సినేషన్ చేస్తామని ఏ రాష్ట్రమైనా నిర్ణయం తీసుకుందా? ఈ పనికిమాలిన ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని ఏవిధంగా దివాలా తీయించాడో, చివరకు వ్యాక్సినేషన్ కోసం ఉద్యోగులజీతాలకు కోతపెట్టాలని చూస్తున్నాడో ప్రజలంతా ఆలోచించాలి. ఉద్యోగుల జీతాలకు కోతపెట్టికాదు. తక్షణమే వ్యాక్సిన్లు కొని, ముఖ్యమంత్రి ప్రజలకు అందించాలని టీడీపీ తరపును డిమాండ్ చేస్తున్నాము. అవసరమైతే ఈ విషయంపై న్యాయపరంగా అయినా పోరాటంచేస్తామని హెచ్చరిస్తున్నాం. ఉద్యోగస్తుల జీతాలకు కోతపెట్టి వ్యాక్సిన్లు కొనాలనే దిక్కుమాలిన ప్రణాళికలకు ముఖ్యమంత్రి వెంటనే స్వస్తిచెప్పాలని కూడా డిమాండ్ చేస్తున్నాం.

Advertisements

Latest Articles

Most Read