టిడిపి నేత, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్రను నిన్న ఏసిబి అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే నరేంద్ర అరెస్ట్ వెనుక రాజకీయం కోణంపై తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి ఆరోపిస్తుంది. ధూళిపాళ్ల నరేంద్ర కొద్ది రోజుల క్రితం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే స్టింగ్ ఆపరేషన్ చేసారు. ఆ కక్షతోనే, ఇలా చేసారని టిడిపి ఆరోపిస్తుంది. అమరావతిలో, దళితుల అసైన్డ్ భూములు దోచేశారు అంటూ, ఆళ్ళ రామకృష్ణా రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు పై సిఐడి, చంద్రబాబు, నారాయణ పై కేసు పెట్టినవ్ విషయమై, ధూళిపాళ్ల నరేంద్ర ప్రెస్ మీట్ పెట్టి వాస్తవాలు అన్నీ చెప్పటమే కాక, స్టింగ్ ఆపరేషన్ వీడియోలు కూడా బయట పెట్టారు. అందులో, మేము ఏమి ఫిర్యాదు చేయలేదని, సంతకాలు పెట్టుంచుకున్నారని, ఎందుకో కూడా చెప్పలేదని చెప్పటంతో, అమరావతి కేసు రాజకీయ ప్రేరేపితమైన కేసు అని అందరికీ అర్ధమై పోయింది. ధూళిపాళ్ల నరేంద్ర ఆ స్టింగ్ ఆపరేషన్ చేసి, జగన్ ప్రభుత్వం చేస్తున్న అక్రమాలు బయట పెట్టినందుకే, ఆయన పై ఇప్పుడు కక్ష పెట్టుకున్నారని లోకేష్ కూడా ఆరోపించారు. కక్ష సాధింపు రాజకీయాలు చేస్తూ, తెలుగుదేశం నేతలను ఇబ్బంది పెడుతున్నారని లోకేష్ అన్నారు. అయుదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రికార్డు ఆయన సొంతం అని, ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేసిన చరిత్ర ఉందని, అలాంటి వారిని, ఇలా అక్రమ కేసులు పెట్టి వేధించటం ఎంత వరకు సమంజసం అని లోకేష్ ప్రశ్నించారు.

dhulipalla 24042021 2

ఇక మాజీ మంత్రి దేవినేని ఉమా కూడా ఇవే ఆరోపణలు చేసారు."క-రో-నా పరిస్థితి పై సమీక్షించాల్సిన ముఖ్యమంత్రి, ఏసీబీ, సీఐడీ అధికారులతో గంటలతరబడి చర్చలు జరుపుతున్నాడు. ఈరోజు ఏమాజీమంత్రిని అరెస్ట్ చేయాలి... ప్రతిపక్షానికిచెందిన ఏనాయకుడిపై ఎలాంటి తప్పుడుకేసులు పెట్టాలని ఆలోచిస్తున్నాడు. ప్రశ్నించే గొంతులను ఎలా నొక్కాలనే దానిగురించి చర్చిస్తున్నాడు. నిన్న వందలకొద్దీ పోలీసులు, ఏసీబీ అధికారులు టీడీపీనేత ధూళిపాళ్ల నరేంద్రఇంటికెళ్లి, ఒక బందిపోటుని, గూండాను తీసుకొచ్చినట్లుగా ఆయన్ని అరెస్ట్ చేశారు. ధూళిపాళ్ల నరేంద్ర తండ్రిగారైన ధూళిపాళ్ల వీరయ్యచౌదరి సంగం డెయిరీని స్థాపించి, రూ.1100కోట్ల టర్నోవర్ వచ్చేస్థాయికి దాన్ని తీసుకెళ్లారు. నేడు ఆ సంస్థ పాడి రైతులకు లీటర్ పాలకు రూ.66చెల్లిస్తోంది. దానితోపాటు బోనస్ లు ఇస్తోంది. ఎంతోమంది పాడిరైతులకు అండగా ఉంటున్న సంగం డెయిరీ ఛైర్మన్ ఇంటిపైకి వందలమంది పోలీసులను పంపి, ఆయనకు అవినీతి మరక అంటించాలని చూస్తారా? దుర్మార్గంగా, దౌర్జన్యంగా ఆయన్ని అరెస్ట్ చేస్తారా? జగన్మోహన్ రెడ్డి చూపుతున్నది నరేంద్రమీద కక్షకాదు, అది సంగం డెయిరీపై ఉన్న కక్ష. ఈ ముఖ్యమంత్రి పెద్దఎత్తున రాష్ట్రంలో అమూల్ డెయిరీని ప్రోత్సహించి, దాన్ని బాగుచేయడంకోసం సంగండెయిరీని దెబ్బకొట్టడానికి, అవినీతికుట్రలో భాగంగా, రాజకీయకక్షలోభాగంగానే నరేంద్రను అరెస్ట్ చేయించాడు. నరేంద్రపై ముఖ్యమంత్రి ఉన్న కోపానికి కారణం.. గతంలో అతను జగన్మోహన్ రెడ్డి అక్రమఆస్తులను, అవినీతి గురించి అసెంబ్లీలో ప్రశ్నించడమే. జగన్ పై ఉన్న సీబీఐ, ఈడీ కేసులను గురించి నరేంద్ర నిలదీశాడు. చంద్రబాబుపై, మాజీమంత్రి నారాయణపై అమరావతి భూములకు సంబంధించి పెట్టిన తప్పుడుకేసుల తాలూకా స్టింగ్ ఆపరేషన్లో ధూళిపాళ్ల నరేంద్ర సమర్థవంతంగా వ్యవహరించాడు. ప్రభుత్వంపెట్టినవన్నీ తప్పుడుకేసులేనని ఆధారాలతో సహా మీడియా ద్వారా నరేంద్ర నిరూపించాడు. నరేంద్ర ప్రభుత్వ తప్పుడుకేసులను ఎత్తిచూపి, వాస్తవాలు బయటపెట్టడంతో , అమూల్ ను భుజానికెత్తుకున్న ముఖ్యమంత్రి, ఆ వంకతో నరేంద్రను లక్ష్యంగా ఎంచుకున్నాడు." అని అన్నారు.

మన తెలుగు వారి అందరికీ గర్వ కారణమైన రోజు. తెలుగు వాడు అనుకుంటే సాధించ లేనిది ఏమి లేదు అని చెప్పే మరొక ఉదాహరణ ఇది. భారత దేశ 48వ చీఫ్ జస్టిస్ అఫ్ ఇండియాగా, మన ఆంధ్రా వారైన జస్టిస్ నూతలపాటి వెంకట రమణ గారు, ఈ రోజు ప్రమాణస్వీకారం చేసారు. భారత రాష్ట్రపతి రాంనాద్ కోవింద్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి, ప్రధాని మోడీ, ఉప రాష్ట్రపతి వెంకయ్య సహా, అతి కొద్ది మంది మాత్రమే, హాజరు అయ్యారు. కో-వి-డ్ నిబంధనలు కారణంగా, అతి కొద్ది మందిని మాత్రం ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. మొత్తంగా, జస్టిస్ ఎన్వీ రమణ కుటుంబ సభ్యులతో పాటుగా, 50 మంది లోపు మాత్రమే ఆహ్వానించారు. భారత ప్రాధాన న్యాయమూర్తిగా, వచ్చే 16 నెలల పాటు ఆయన, చీఫ్ జస్టిస్ గా ఉండబోతున్నారు. అయితే జస్టిస్ ఎన్వీ రమణ ముందు అనేక సవాళ్ళు ఆయన ముందు ఉన్నాయని, న్యాయ నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా జస్టిస్ బాబ్డే చీఫ్ జస్టిస్ గా ఉన్న సమయంలో, అయుదు ఖాళీలు ఏర్పడినా కూడా, ఒక్క ఖాళీ కూడా పూరించలేదు. కోలీజీయం సిఫారుసు చేసినా, కేంద్ర ప్రభుత్వం అమలు చేయని పరిస్థితి ఉంది. ఈ ఏడాది మరో అయుదు ఖాళీలు కూడా రాబోతున్నాయి. మొత్తంగా పది ఖాళీలు రాబోతున్నాయి.

nvramana 24042021 2

జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోనే కొలేజియం పై ఇప్పుడు ఈ బాధ్యత పడుతుంది. ఇప్పుడు ఈ కొలేజియం ఇచ్చే సిఫారుసులు కేంద్రం ఏ విధంగా అమలు చేస్తుంది అనేది చూడాలి. ఇవే కాక అనేక న్యాయ పరమైన నియామకాలు కూడా పెండింగ్ లో ఉన్నాయి. ఇక మరో పక్క, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే కేసులు విషయంలో కూడా, చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఇప్పటికే జస్టిస్ ఎన్వీ రమణ చీఫ్ జస్టిస్ గా నియామకం అవ్వకుండా చూడటానికి, ఆయన పై జగన్ మోహన్ రెడ్డి ఫిర్యాదులు చేయటం కలకలం రేపింది. అయితే అవన్నీ అప్పటి చీఫ్ జస్టిస్ బాబ్డే విచారణ చేసి, అవన్నీ నిరాధార ఆరోపణలుగా కొట్టేసారు. ఈ నేపధ్యంలోనే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి సుప్రీం కోర్టుకు వెళ్ళే అనేక కేసులు పాటి ఆసక్తి ఉంటుంది. ఇలా అనేక సమస్యలు ఆయనకు స్వాగతం పలుకుతున్నాయి. ఇక మరో పక్క క-రో-నా సమస్యలో, న్యాయ వ్యవస్థను ఎలా ముందకు తీసుకు వెళ్తారు. ఇక న్యాయ శాఖలో కొత్త సంస్కరణలు ఎలా తెసుకుని వస్తారో, ఇలా అనేకం, ఇప్పుడు ఆయన పని తీరుకు అద్దం పట్టనున్నాయి.

జగన్ మోహన్ రెడ్డి, కేసిఆర్ మధ్య స్నేహం అందరికీ తెలిసిందే. పోయిన సార్వత్రిక ఎన్నికల్లో, జగన్ గెలుపు కోసం, కేసీఆర్ అన్ని రకాల సహాయాలు చేసారనే పేరు కూడా ఉంది. ఆ తరువాత జగన్ మోహన్ రెడ్డి వచ్చిన కొత్తలో, జగన్, కేసీఆర్ తెగ కులుసుకునే వారు. కలిసిన ప్రతి సారి, ఏపికి ఏది వచ్చేది కాదు కానీ, తెలంగాణాకు మాత్రం ఏదో ఒక లాభం చేకురేలా నిర్ణయాలు వచ్చాయి. ఏమైందో ఏమో కానీ, గత ఏడాది, ఏడాదిన్నర కాలంగా, జగన్, కేసీఆర్ కలుసుకుంది లేదు. ముఖ్యంగా ఏపి చేపట్టిన ఇరిగేషన్ ప్రాజెక్ట్ ల విషయంలో, కేసిఆర్ గరంగరంగా ఉన్నారు. రెండు రాష్ట్రాలు కేసులు కూడా వేసుకున్నాయి. అయితే ఇప్పుడు కేసీఆర్, జగన్ ను కాదని, కర్నాటక ముఖ్యమంత్రి యాడ్యురప్పను కలవాలని నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా ఆర్డీఎస్ విషయంలో కేసీఆర్ అభ్యంతరం చెప్తున్నారు. ఈ ప్రాజెక్ట్ తుంగభద్ర మీద ఉండి, తెలంగాణా, ఆంధ్ర, కర్ణాటక వరకు స్ప్రెడ్ అయి ఉంటుంది. అయితే తెలంగాణాకు రావాల్సిన నీటి వాటా రాకపోగా, ఆర్డీఎస్ కి సమాంతరంగా మరో కాలువ తవ్వటం కోసం ఏపి తీసుకున్న నిర్ణయం పై కేసిఆర్ ఆగ్రహంగా ఉన్నారు. అందుకే యాడ్యురప్పను కలిసి, జగన్ చేస్తున్న పనులకు బ్రేక్ వేయాలని చూస్తున్నారు. మరి పక్క రాష్ట్రాలు పేచీలు పెడితే, జగన్ మోహన్ రెడ్డి, దీన్ని ఎలా ముందుకు తీసుకు వెళ్తారో చూడాలి.

యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామకృష్ణం రాజు, తమ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు కోరుతూ, సిబిఐ కోర్టులో పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే. మా ముఖ్యమంత్రి పై అనవసరపు ఆరోపణలు, బ్లాక్ మెయిల్ చేస్తున్నారని, అందుకే ఏదో ఒకటి తేల్చేయాలి అంటూ, ఈ పిటీషన్ వేసినట్టు రఘురామరాజు తెలిపారు. అయితే, ఈ రోజు రాజధాని రాచ్చబండలో మాట్లాడిన రఘురామకృష్ణం రాజు, జగన్ బెయిల్ పిటీషన్ రద్దు పై మరి కొన్ని గంటల్లో తేలిపోతుందని అన్నారు. అయన మాట్లాడుతూ, జగన్ మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకుని, రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారు అని, అందుకే బెయిల్ రద్దు చేయాలి అంటూ, తాను దాఖలు చేసిన పిటీషన్ కొద్ది గంటల్లో విచారణకు రాబోతుందని అన్నారు. గురువారం మధ్యానం సమయంలో, దీని పై విచారణకు సిబిఐ కోర్టు చేపట్టే అవకాసం ఉందని అన్నారు. అయితే మొన్నటి దాకా ఫిసికల్ గా జరిగిన కోర్టు, ఇప్పుడు మారిన పరిస్థితిలో మళ్ళీ  వర్చువల్ కోర్టులు నడుస్తున్నాయని అన్నారు. రేపు కోర్టు ఆదేశాలు బట్టి, వాళ్ళు ఏమి అడిగితే అది ఇవ్వటానికి, తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. విచారణ తరువాత, ఏమి జరిగిందో మొత్తం రేపు మళ్ళీ మీడియాకు చేప్తనాని రఘురామకృష్ణం రాజు అన్నారు.

Advertisements

Latest Articles

Most Read