తెలంగాణలో కొత్త పార్టీ పెట్టిన వైఎస్ షర్మిల, ఈ మధ్య ఆక్టివ్ అయ్యారు. తెలంగాణాలో ఉద్యోగాల సమస్య పై, ఆమె దీక్ష కూడా చేసారు. అయితే దీక్ష సందర్భంగా, ఆమె జగన్ మోహన్ రెడ్డికి చెందిన సాక్షి మీడియాని ఉద్దేశించి, మీరు మాకు ఎలాగూ కవరేజ్ ఇవ్వరు, పక్కకి తప్పుకోండి అంటూ, బహిరంగంగా స్టేజి పై, పక్కన విజయమ్మ ఉండగానే ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. షర్మిల బహిరంగంగా ఈ వ్యాఖ్యలు చేయటంతో, జగన్ మోహన్ రెడ్డికి, ఆమెకు మధ్య గ్యాప్ వచ్చింది నిజమే అని అందరూ అనుకున్నారు. అయితే ఇప్పుడు షర్మిలకు, అమరావతి మహిళలు లేఖ రాసారు. తెలంగాణాలో దీక్ష చేసిన మీకు, ఆ సందర్భంగా గాయాలు కావటం, సాటి మహిళలుగా మాకు కూడా ఇబ్బంది అనిపించింది అంటూ, వాళ్ళు షర్మిలకు రాసిన లేఖలో తెలిపారు. మీరు తెలంగాణాలో చేస్తున్న పోరాటంలో ఎంత న్యాయం ఉందని మీరు అనుకుంటున్నారో, అలాగే మేము అమరావతి కోసం 491 రోజులుగా అదే విధంగా న్యాయం కోసం, ఈ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్నట్టు తెలిపారు. మిమ్మల్ని తెలంగాణా పోలీసులు కేవలం, ఒక్క రోజు మాత్రమే అడ్డుకుని అవమానించి, గాయపరిచారని, మమ్మల్ని మాత్రం , ఇక్కడ జగన్ మోహన్ రెడ్డి, ఏడాది కాలంగా ఇబ్బంది పెడుతూనే ఉన్నారని అన్నారు.

sharmila 21042021 2

అలాగే తెలంగాణాలో మీరు చేస్తున్న పోరాటానికి, అక్కడ మీ వదిన గారు భారతి గారి నిర్వహణలో ఉన్న సాక్షి ఏ విధంగా కవరేజ్ ఇవ్వటం లేదో, ఇక్కడ కూడా మాకు అమరావతి కోసం చేస్తున్న పోరాటానికి కూడా, ఇక్కడ సాక్షి మీడియా చూపించటం లేదని, మహిళలు అని కూడా చూడకుండా, మాకు కనీసం సాక్షిలో కవరేజ్ ఇవ్వక పోగా, వ్యతిరేకంగా కధనాలు రాస్తున్నారని షర్మిలకు తెలిపారు. ఈ విషయంలో, మీరు, మేము కూడా సాక్షి బాధితులమే అని తెలిపారు. అలాగే మీ పై తెలంగాణా ప్రభుత్వం వ్యవహరించిన తీరు పై విజయమ్మ గారు ఆక్షేపించారు. అది వాస్తవం, తెలంగాణా ప్రభుత్వం తప్పు చేసింది, అలాగే ఇక్కడ మా పైన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న దమనకాండను కూడా , విజయమ్మ గారి ఖండించాలని కోరారు. అప్పుడు తెలంగాణాలో మీరు చేస్తున్న పోరాటానికి విశ్వసనీయత వస్తుందని అన్నారు. మీరు తెలంగాణా కోడలిగా అక్కడ ఎలా పోరాటం చేస్తున్నారో, మేము కూడా ఇక్కడ ఆంధ్రా బిడ్డలుగా చేస్తున్నాం అని, మా బాధలు వినటానికి మీరు అపాయింట్మెంట్ ఇవ్వాలని కోరుతున్నామని, షర్మిలని కోరారు.

జగన్ మోహన్ రెడ్డి అక్రమా ఆస్తుల కేసు 2012 నుంచి సాగుతూనే ఉంది. అప్పట్లో జగన్ మోహన్ రెడ్డి పై 11 సిబిఐ కేసులు, 5 ఈడీ కేసులు వేసి, చార్జ్ షీట్లు కూడా వేసారు. జగన్ మోహన్ రెడ్డితో పాటు, ఇతర నిందితులు, 16 నెలల పాటు జైలు జీవితం కూడా గడిపారు. ఛార్జ్ షీట్లు ఫైల్ అవ్వటంతో, కోర్టు కండీషనల్ బెయిల్ కూడా ఇచ్చింది. ఇదే క్రమంలో, ఈడీ కొన్ని ఆస్తులు కూడా జప్తు చేసింది. అయితే కేసుల విచారణ మాత్రం సాగుతూనే ఉంది. గత ఏడాదికి పైగా, అసలు జగన్ విచారణకు హాజరు కాలేదు. ఇదే విషయం పై, కోర్టులో జగన్ బెయిల్ రద్దు చేయమని, రఘురామకృష్ణం రాజు పిటీషన్ కూడా దాఖలు చేసారు. ఇది ఇలా ఉంటే, ఆస్తుల జప్తు విషయంలో, ఇప్పుడు ఈడీ వేసిన పిటీషన్, కోర్టులో విచారణకు వచ్చింది. భారతి సిమెంట్స్ కేసులో డైరెక్టర్ గా ఉన్న జెల్లా జగన్‌మోహన్‌రెడ్డి ఆస్తులు ఇది వరకు ఈడీ జప్తు చేసింది. అయితే ఆ ఆస్తులు జప్తు నుంచి విడుదల చేయవచ్చు అంటూ, ఢిల్లీలోని అప్పీలేట్‌ ట్రైబ్యునల్‌ గతంలో తీర్పు ఇచ్చింది. అయితే ఈ తీర్పుని సవాల్ చేస్తూ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ తీర్పు పై హైకోర్టులో సవాల్ చేసింది. ఈడీ చేసిన అపీల్ పై, మంగళవారం, తెలంగాణాలో ఉన్న హైకోర్టులో వాదనలు జరిగాయి. హైకోర్టులో నిన్న వాదనలు ముగిసాయి.

ed 21042021 2

దీని పై తీర్పుని హైకోర్టు వాయిదా వేసింది. వచ్చే వాయిదాలో, ఈడీ చేసిన అపీల్ పై హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. జగన్ మోహన్ రెడ్డి అక్రమ ఆస్తుల కేసు విషయంలో భారతి సిమెంట్స్ పై నమోదు అయిన కేసు విషయంలో, ఆ కంపెనీ డైరెక్టర్ గా ఉన్న, జెల్లా జగన్‌మోహన్‌రెడ్డి అస్తులు ఈడీ గతంలో జప్తు చేసింది. జెల్లా జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సన్నిహితుడు. జెల్లా జగన్‌మోహన్‌రెడ్డికి చెందిన ల్యాంకోహిల్స్‌లో ఉన్న ఒక అపార్ట్ మెంట్ తో పాటుగా, కడపలో ఉన్న 27 ఎకరాల భూమిని కూడా ఈడీ జప్తు చేసింది. అయితే దీని పై అపీల్ కు వెళ్ళిన జెల్లా జగన్‌మోహన్‌రెడ్డికి, అప్పీలేట్‌ ట్రైబ్యునల్‌ లో ఊరట లభించింది. జప్తు చేసిన ఆస్తులు విడుదల చేయాలని తీర్పు వచ్చింది. అయితే అప్పీలేట్‌ ట్రైబ్యునల్‌ తీర్పు పై, ఈడీ హైకోర్టు లో సవాల్ చేసింది.ఈ కేసుని జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డి ధర్మన్సం విచారణ చేస్తుంది. ఈడీ తరుపున సొలిసిటర్‌ జనరల్‌ టి.సూర్యకరణ్‌రెడ్డి, ఈ కేసుని వాదించారు. అయితే ఈ కేసు పై తీర్పు, ఎలా వస్తుందో చూడాలి.

నవ్యాంధ్ర విధ్వంసం, ప్రజా వేదికతో మొదలై, ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. తాజాగా పోలవరం విషయంలో చూస్తుంటే, అసలు ఈ ప్రాజెక్ట్ బహుళార్థ సాథక ప్రాజెక్ట్, ఇప్పుడు అది కాస్త ఓక్ చిన్న రిజర్వాయర్ కాబోతోంది. గ్రావిటీ ప్రాజెక్ట్.. ఎత్తిపోతల ప్రాజెక్ట్ కాబోతోంది అంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. పోలవరంలో చంద్రబాబు అడ్డంగా దోచేసారని, అందుకే రివర్స్ టెండరింగ్ అనే విధానం అవలభిస్తున్నాం అని, ఇక మీదట జరిగే పనులు అన్నిటికీ రీటెండరింగ్ వేస్తామని, దానికి ఎవరు అయితే తక్కువ కోట్ చేస్తారో, వారికి పనులు ఇస్తామని, దీని ద్వారా ప్రజాధనం ఆదా అవుతుందని చెప్పారు. పోలవరం రీటెండరింగ్ లో, మొత్తం 700 కోట్లు అదా చేసామని, బాకా కొట్టారు. దీనికి ఒక న్యాయ కమిటీ కూడా ఉందని, వారి కనుసన్నల్లోనే జరుగుతుందని, ఎక్కడా ప్రభుత్వం, రాజకీయ నాయకుల ప్రమేయం ఉందని చెప్పారు. అయితే వారు చెప్పిన దానికి చేస్తున్న దానికి మాత్రం పోలిక లేదు. పోలవరం వాళ్ళు చెప్పింది 700 కోట్లు అదా చేసామని, అయితే పత్రికల్లో గత రెండు రోజులుగా వస్తున్న వార్తలు చూస్తే, ఒక్కసారిగా 2200 కోట్ల వరకు, పోలవరం అంచనాలు అమాంతం పెంచేసారు. అసలు ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్తుందా వెళ్ళదా ? కేంద్ర ప్రభుత్వం ఉన్న పంచాయతీ ఏంటి ? గత ప్రభుత్వంలో డీపీఆర్ 2 ఆమోదించుకి కూడా, ఇప్పటికీ సాధించలేక పోయారు.

polavaram 21042021 2

కేంద్ర అనేక కొర్రీలు పెడుతుంది, 20 వేల కోట్లు మాత్రమే ఇస్తామని అంటుంది, దీని పై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ తెచ్చుకోలేదు. తెచ్చుకోక పోగా, ఇప్పుడు మళ్ళీ 2200 కోట్ల వరకు అంచనాలు పెంచేశారు. ఇందులో మెయిన్ డ్యాంకే, 1600 కోట్లు పెంచేసారు. అయితే ఇంకోటి, ఇక్కడ పోలవరంలో కొత్తగా ఎత్తిపోతల పెడతాం అనటం, మరింత అనుమానాలకు దారి తీస్తుంది. గతంలో పట్టిసీమ కడితే, దాన్ని దోచేశారు, అని గోల గోల చేసారు. అయితే దాని ఉపయోగం ఏంటో ప్రజలకు తెలిసింది. ఇప్పడు అసలు పోలవరంలో డెడ్ స్టోరేజ్ నుంచి, ఎత్తిపోతల అని చెప్పటం, దానికి మళ్ళీ 900 కోట్లు కేటాయించటం అనుమానాలకు దారి తీస్తుంది. ఇక ఇంతకు ముందే, ఇసుక కోసం అని, మరో 500 కోట్లు పెంచేసారు. మొత్తం మీద, ఇవన్నీ కలిపి, 3200 కోట్ల వరకు, పోలవరం అంచనాలు పెంచేశారు. మరి గతంలో చెప్పిన రివర్స్ టెండరింగ్ ఆదా 700 కోట్లు అనే విషయం ఏమిటి ? ఇప్పుడు ఎందుకు పెంచారు ? కేంద్రం ఎలాగూ ఇవ్వదు కాబట్టి, రాష్ట్ర డబ్బులు నుంచే కాంట్రాక్టర్ కు ఇవ్వాలి కదా ? అసలు గ్రావిటీ ద్వారా వచ్చే పోలవరంలో, ఎత్తిపోతల ఎందుకు ? ప్రభుత్వం ఈ ప్రశ్నలకు సామధనలు చెప్పాలి.

సొంత ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి చేసే తప్పుల పైన, తనదైన శైలిలో స్పందించే వైఎస్ఆర్ కాంగ్రేస్ పార్టీ ఎంపీ రఘురామకృష్ణ గారు, ఈ రోజు రాజధాని రచ్చబండలో, చంద్రబాబు గారి పై, విజయసాయి రెడ్డి పెట్టిన మురికి ట్వీట్ పై విరుచుకు పడ్డారు. నిన్న చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా, అందరూ ఆయన ఆరోగ్యంగా ఉండాలని విషెస్ చెప్తుంటే, విజయసాయి రెడ్డి మాత్రం, ఏప్రిల్ 20 న పుట్టారు కాబట్టి, చంద్రబాబుని 420 అంటూ, పేటీయం కూలీల చేత ఒక చెత్త పోస్టర్ చేపించి అది పోస్ట్ చేసారు. దీని పై అన్ని వైపుల నుంచి, విజయసాయి రెడ్డి పై విమర్శలు వచ్చాయి. అలాగే సొంత పార్టీ నుంచి కూడా ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి. విజయసాయి రెడ్డి పెట్టిన ట్వీట్ పై, ఎంపీ రఘురామకృష్ణం గారు మండి పడ్డారు. విజయసాయి రెడ్డి పీట్టిన ఆ ట్వీట్ ఒక దిక్కుమాలిన, దౌర్భాగ్యమైన ట్వీట్ అంటూ నిప్పులు చెరిగారు. ఈ రోజు శ్రీరామ నవమి అని, మన ప్రత్యర్ధి అయిన సరే, గౌరవించాలని రామాయణంలో రాసిన విషయం గుర్తు చేసారు. చిన్నప్పటి నుంచి ఇలాంటి గ్రంధాలు, పురాణాలు చదువుకుని ఉంటే, కొంచెమైన మర్యాదస్తులకు ఉండే లక్ష్యణాలు విజయసాయి రెడ్డికి వచ్చి ఉండేయని వాపోయారు. విజయసాయి రెడ్డి పెట్టిన ట్వీట్ వల్ల, అతనికి ఏమో కానీ, పార్టీ పరువు అయితే పోయిందని అన్నారు.

rrr 21042021 2

విజయసాయి రెడ్డి సంస్కారం లేకుండా పెడుతున్న ట్వీట్ ల వల్ల , పార్టీ పరువు పోతుందని రఘురామరాజు అన్నారు. ఆయన మా పార్టీ జాతీయ కార్యదర్శి అని, అలాగే రాజ్యసభలో సభ్యడు అని, అంతే కాకుండా, మా ఎంపీలు అందరికీ నాయకుడు అని, ఇలాంటి మాటలు మాట్లాడటానికి బుద్ధి ఉందా, ఇదేనా నీ సంస్కారం అంటూ ధ్వజమెత్తారు. జగన్ మోహన్ రెడ్డి విష్ చేసారు, నేను చేసాం,అనేక మంది చేసారు, ఈ సాయి రెడ్డికి ఏమైందో, సంకుచిత స్వాభావం చూపించారు అంటూ ధ్వజమెత్తారు. మీరు పెట్టే ఆ మురికి ట్వీట్స వల్ల, సంస్కారం ఉన్న ఎవరూ కూడా వాటిని లైక్ చేయరని, ఇలాంటి వాటి వల్ల న్యూట్రల్ గా ఉండే ప్రజలు, పార్టీ నుంచి దూరం అవుతారని అన్నారు. జగన్ మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తూ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో ఇలాంటి వారిని కాకుండా వేరే వారిని పెట్టాలని, ఉమ్మారెడ్డి లాంటి పెద్దల్ని ఆ స్థానంలో పెట్టాలని, అలా కాదు, మీరే విజయసాయి రెడ్డి చేత, ఆ ట్వీట్ పెట్టించి ఉంటే, ఇక నేను మాట్లాడేది ఏమి లేదు అంటూ రఘురామకృష్ణం రాజు చెప్పుకొచ్చారు.

Advertisements

Latest Articles

Most Read