ప్రభుత్వ సలహాదారుగా కొనసాగుతున్న పెద్దవాలంటీర్ సజ్జల రామకృష్ణారెడ్డి తనకు, తనపార్టీకి లేనిపవిత్రతను చాటుకోవడానికి పడరానిపాట్లుపడుతూ, ప్రజలకు ఒకతప్పుడుసందేశాన్ని ఇవ్వడా నికి ప్రయత్నించాడని టీడీపీనేత, తెలుగురైతు విభాగం రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి ఎద్దేవాచేశారు. బుధవారం సాయంత్రం ఆయన మంగళగిరిలోనిపార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. మీడియాముఖంగా రామకృష్ణారెడ్డి ప్రజా స్వామ్యాన్నిఅవహేళన చేసేలా మాట్లాడాడని, ఆయనచెప్పిందే మేము తొలినుంచీ చెబుతున్నామని, ఇల్లెక్కి అరిచినంతమాత్రాన అబద్ధాలు నిజాలుకావనే వాస్తవం ఆయనకు, ఆయనపార్టీకే చక్కగా సరిపోతుందని శ్రీనివాసరెడ్డి స్పష్టంచేశారు. పెద్దగా అరిచి గెలవనిచోట్ల గెలుపులను తమవిగాప్రకటించుకున్నంత మాత్రాన అవన్నీ వైసీపీ గెలిచినట్లుకావనే నిజం కూడా సజ్జల గ్రహించాల న్నారు. చిల్లరరౌడీలు, కొందరు అల్లరిమూకలు పట్టణాల్లో పదిమం దిని వెంటేసుకొని ప్రజలను బెదిరిస్తూ, బతికుతుంటారని, అంత మాత్రానవారే ఆపట్టణానికి, ఆప్రాంతప్రజలకు గౌరవనీయులు అవు తారని భావిస్తే అంతకంటే తెలివితక్కువతనం మరోటి ఉండదన్నా రు. అదేమాదిరిగా కడప,చిత్తూరు జిల్లాల్లో అక్రమంగా సంపాదించి న సొమ్ముని ఎరగావేసి, అరాచకముఠాలను అడ్డుపెట్టుకొని కొన్ని పట్టణాల్లో ఏకగ్రీవాలుచేసుకున్నంతమాత్రాన అదేపరిస్థితి రాష్ట్రమం తా కొనసాగుతుందనే మైండ్ గేమ్ తో ప్రజలను దారిమళ్లించడానికి సజ్జల నేడు మీడియాముందు ప్రయత్నించాడన్నారు. 11జిల్లాల్లో వైసీపీదౌర్జన్యాలను, అరాచకాలను ఎదిరించి మున్సిపల్ ఎన్నికల్లో తొడగొట్టి నిలిచిన టీడీపీ అభ్యర్థులు సజ్జలకు గుర్తులేరా అని మర్రెడ్డి ప్రశ్నించారు. రెండుజిల్లాల్లోని రెండు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు వైసీపీ గెలిచినంతమాత్రాన అదేపరిస్థితి రాష్ట్రమంతా ఉన్నట్లుగా ప్రజల్ని నమ్మించేలా సజ్జల చేస్తున్న ప్రయత్నాలన్నీ వృథా ప్రయా సగానే మిగులుతాయన్నారు. సజ్జల మైకులముందు కూర్చొని మాట్లాడేవన్నీ నిజాలుకావని, ఆయనప్రజల్లోకి వెళితే, వారి ఆలోచ నలు ఎలా ఉన్నాయో తెలుస్తుందన్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి ఎటువంటి విశ్వాసంచూపారో సజ్జల చెప్పాలన్నా రు. టీడీపీసహా, ఇతరపార్టీల అభ్యర్థుల నామినేషన్ పత్రాలను బల వంతంగా ఉపసంహరింపచేయడంలో వైసీపీప్రమేయం లేదని పెద్ద వాలంటీర్ చెప్పగలడా అని మర్రెడ్డి నిలదీశారు. ప్రతిపక్షపార్టీల అభ్యర్థుల బంధువులను, స్నేహితులను ఒత్తిడిచేసి, పోలీసుల సాయంతో వైసీపీవారు వారిని ఎలా భయపెట్టాలని చూశారో అందరి కీ తెలుసునన్నారు. అధికారపార్టీ ఇన్నిచేసినా వాటన్నింటినీ త ట్టుకొని టీడీపీ అభ్యర్థులు మున్సిపల్ బరిలో నిలిచారన్నారు. పంచాయతీ ఎన్నికల్లో వైసీపీకి ధీటుగా సత్తాచాటిన టీడీపీ అభ్యర్థు లు, మున్సిపల్ పోరులోకూడా వైసీపీఅనుసరిస్తున్న అప్రజాస్వామి క పోకడలను నిలువరించి విజేతలుగా నిలుస్తారని శ్రీనివాసరెడ్డి తేల్చిచెప్పారు. వైసీపీనేతలకుముకుతాడు బిగించి, వారిని కట్టడి చేయడానికి ప్రజలంతా సిద్ధంగానే ఉన్నారన్నారు. రాష్ట్రప్రజలంతా వైసీపీపై విశ్వాసంచూపారని సజ్జల చెప్పుకోవడం సిగ్గుచేటన్న మర్రెడ్డి, ప్రజాస్వామ్యాన్ని హరిస్తున్నఅధికారపార్టీనిఎలా నిలువరిం చి, నిర్వీర్యంచేయాలనే ఆలోచనలో పౌరులున్నారన్నారు. నాలుగు సీట్లు, రెండుస్థానాలుఏకగ్రీవమయ్యాయని చెప్పుకున్నంత మాత్రా న అంతా అధికారపార్టీకి అనుకూలంగానే ఉందనుకుంటే, అంతకం టే సిగ్గుచేటు ఉండదన్నారు. ఎన్నికలకమిషనర్ పై ఒత్తిడితెచ్చి, ఆయనకింద పనిచేయాల్సిన ప్రభుత్వయంత్రాంగం చేతులెత్తేయడం తో, ఎస్ఈసీ రమేశ్ కుమార్ ఒక నిర్లిప్తధోరణికి వచ్చారన్నారు. ఆయన అలాఉండబట్టే, అధికారపార్టీ ఆగడాలుఅక్కడక్కడా కొనసా గుతున్నాయన్నారు.
ఎస్ఈసీకి ప్రభుత్వయంత్రాంగం సరిగా సహక రించిఉంటే, ప్రభుత్వం రోడ్డుమీదకు వచ్చి చెప్పుకోవడానికి కూడా ఎక్కడా గెలుపులభించేది కాదన్నారు. రుణమాఫీలో భాగంగా రూ.50వేలలోపు రుణాలన్నీ ఒకేసారి టీడీపీ ప్రభుత్వం రద్దుచేసిందనే పచ్చినిజం, 2014లో, 2019లో టీడీపీ విడుదలచేసిన ఎన్నికలమేనిఫెస్టో అమలుకాలేదని చెబుతున్న సజ్జలకు తెలియకపోవడం ఆయనలోని మతిమరుపు వ్యాధికి నిదర్శనమని మర్రెడ్డి ఎద్దేవాచేశారు. రుణమాఫీలో భాగంగా రూ.లక్షా50వేలలోపున్న రుణాలను ఐదువిడతల్లో మాఫీ చేయడా నికి ఆనాడు టీడీపీప్రభుత్వం జీవో తీసుకొచ్చిందని, దానిలో భాగం గా మూడువిడతలవరకుమాఫీ కూడా జరిగిందన్నారు. టీడీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలను జగన్ అధికారంలోకి రాగానే రద్దు చేశాడన్నారు. ఇవేవీతనకుతెలియనట్లు సజ్జల సిగ్గులేకుండా అబ ద్ధాలు చెబుతున్నాడన్నారు. రూ.200ల పింఛన్ ని రూ.2వేలకు చంద్రబాబునాయుడు పెంచితే, రూ.3వేలపింఛన్ ఇస్తామనిచెప్పిన వైసీపీప్రభుత్వం రూ.250పెంపుతో అవ్వాతాతలను దారుణంగా మోసగించిందన్నారు. రూ.1000 పింఛన్ పెంచలేని అసమర్థ ప్రభు త్వం, దేశంలో ఎక్కడాలేనివిధంగా, రైతుసంక్షేమంకోసం చంద్రబాబునాయుడు అమలు చేసిన రైతురుణమాఫీని తప్పు పట్టడం సిగ్గుచేటన్నారు. అరకొర పథకాలతో ప్రజలను తప్పుదారి పట్టిస్తూ, వారినుంచి పన్నులరూపంలో కోట్లకుకోట్లు దండుకుంటు న్న దిక్కుమాలినప్రభుత్వాన్ని సమర్థించడానికి దిక్కుమొక్కూ లేని సజ్జల శతవిధాలా ప్రయత్నిస్తున్నాడన్నారు. వైసీపీ ప్రభుత్వం ఆస్తిపన్ను 5రెట్లకుపైగా పెంచిందని ప్రజలు ఆపార్టీకి ఓటేస్తారా లేక అన్నాక్యాంటీన్లు మూసేసినందుకా..లేక టీడీపీ అమలుచేసిన ఉచితఇసుకవిధానాన్ని తీసేసి, ఇసుకను పొరుగు రాష్ట్రాలకు అమ్ముకుంటూ, భవననిర్మాణ కార్మికులుసహా, 125 విభాగాలకు చెందిన కార్మికులను రోడ్డునపడేసినందుకు వేస్తారో సజ్జల చెప్పాల న్నారు. విద్యుత్, ఆర్టీసీ ఛార్జీలు పెంచి ప్రజలపై భారంవేసినందుకు వారు వైసీపీకి ఓటేస్తారా....లేక నాసిరకం మద్యాన్ని అధికరేట్లకు అమ్ముతున్నందుకు వేస్తారో సజ్జల చెప్పాలన్నారు.
ఒక్కసారి... ఒక్కసారి అని గతంలో వేడుకుంటే ఓట్లేశామని, వేసి నందుకుఇప్పుడు చెప్పుతో కొట్టుకుంటున్నామని ప్రజలంతా గగ్గో లుపెడుతుంటే, వారు తమపార్టీని గెలిపిస్తారని సజ్జల ఏ నమ్మకం తో చెబుతున్నాడని శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు. సజ్జలకు, ఆయన ప్రభుత్వానికి ఉన్ననమ్మకమల్లా దౌర్జన్యం, అరాచకం, చీకటి కార్య క్రమాలేనని మర్రెడ్డి తేల్చిచెప్పారు. వాటిని నమ్ముకొనే అన్ని మున్సిపాలిటీలు తమపార్టీయే గెలుస్తుందని సజ్జలధైర్యంగా చెప్ప గలుగుతున్నాడన్నారు. చీకటిపడగానే ఓట్లలెక్కింపు మొత్తం వైసీ పీకి అనుకూలంగా మారిపోతుందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీవారి నామినేషన్లను వైసీపీవారే దొంగసంతకాలతో విత్ డ్రా చేయిస్తున్నారని, ప్రతిపక్షపార్టీ అభ్యర్థులతోపనిలేకుండా, పోలీసు లు అధికారులసాయంతో ఈ తంతు జరుగుతోందన్నారు. టీడీపీ అభ్యర్థులపై అక్రమకేసులుపెడతామని, గంజాయికేసులు పెడతామ ని, అక్రమమద్యంఅమ్ముతున్నట్లు మూసేస్తామని పోలీసుల బెదిరి స్తున్నది వాస్తవం కాదాఅని మర్రెడ్డి ప్రశ్నించారు. ఏక్షణమైనా వైసీ పీ అరాచకశక్తులు తమను ఎన్నికల్లోపోటీచేయకుండా నిరోధించవ చ్చన్న అనుమానంతోనే పలుప్రాంతాల్లో టీడీపీఅభ్యర్థులు రహస్య ప్రాంతాల్లో ఉన్నారన్నారు. టీడీపీ అభ్యర్థులు ప్రజల్లోకి రాకపోయి నా, వారితరుపున ప్రచారంచేసేవారిని ప్రజలు విశేషంగా ఆదరిస్తు న్నారన్నారు. పిరికిచర్యలతో గెలుపును పొందుతూ, వీరత్వమే సిగ్గుపడేలా సజ్జల మాట్లాడుతున్నాడన్నారు. వైసీపీ అరాచకా లను ఎదిరించి, దౌర్జన్యాలను తట్టుకొని టీడీపీవారు పోటీ చేస్తున్నారంటే, అందుకుకారణం చంద్రబాబునాయుడి అండ, పసుపుజెండానే అని మర్రెడ్డి తేల్చిచెప్పారు.
వైసీపీవారికి పోలీసుల అండ, అధికారబలంలేకుంటే, వారునామినేషన్లు వేసే పరిస్థితి కూడా లేదన్నారు. గతఎన్నికలప్రస్తావన చేస్తున్న సజ్జల, 2013లో స్థానికఎన్నికలు ఎలా జరిగాయో, ఇప్పుడెలా జరుగుతు న్నాయో ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. వైసీపీప్రభుత్వ ఘనత ను, ఆపార్టీ నేతల సిగ్గుమాలినచర్యలు దేశమంతా విస్తరించినందు కు సజ్జల సిగ్గుతో తలదించుకోవాలన్నారు. టీడీపీగెలిస్తే ఏం చేస్తుందో, మేనిఫెస్టో రూపంలో పట్టణాల్లో చెబుతోందని, వైసీపీ గెలిస్తే, లిక్కర్ మాఫియా, ఇసుక, మైనింగ్ మాఫియాలు తప్పఏమీ ఉండవనే వాస్తవం ఎవరూచెప్పకుండానే ప్రజలకు అర్థమైందన్నా రు. చంద్రబాబునాయుడు తనపలుకుబడి, అనుభవం, విజ్ఞానంతో రాష్ట్రాన్ని అభివృద్ధిచేయడానికి ప్రయత్నిస్తాడనే అభిప్రాయానికి ప్రజలు వచ్చేశారన్నారు. రాష్ట్రసంపదసహా, కనపడేప్రతిదాన్ని దోచుకొని, తరతరాలకు తరగనివిధంగా ఆస్తులనుకూడబెట్టుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డనే అభిప్రాయానికి కూడా ప్రజలు వచ్చేశార న్నారు. భవిష్యత్ రాష్ట్ర ప్రభ దేదీప్యమానంగా వెలగాలంటే ప్రజలం తా వారిభవిష్యత్ ను, రాష్ట్ర భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని శ్రీనివాసరెడ్డి తేల్చిచెప్పారు. వాస్త వాలు, ప్రజాభిప్రాయం ఏమిటో తెలుసుకొని సజ్జల అబద్ధాలు ప్రచా రం చేయడం మానుకోవాలన్నారు. ప్రజలవద్దకెళ్లి ఓటు అడిగే అర్హ త కోల్పోయిన వైసీపీ, ప్రభుత్వసలహాదారుఅయిన సజ్జల, ప్రజలను ఏమార్చే వ్యర్థ ప్రయత్నాలుమానుకుంటే మంచిదన్నారు.