రాష్ట్రంలో రెండో అతిపెద్ద ఆలయమైన దుర్గగుడిలో ఏసీబీ తనిఖీలు రాజకీయ రంగు పులుముకుంటు న్నాయి. తెదేపా, జనసేన నేతలు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ లక్ష్యంగా ఆరోపణ లు సంధిస్తుండగా..వెల్లంపల్లి మాత్రం ఆయా నేతలకు సమాధానం చెప్పాల్సి న అవసరం లేదని కొట్టిపారేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ ఒకడుగు ముందు కేసి అవినీతికి పాల్పడలేదంటూ మంత్రి వెల్లంపల్లి ప్రమాణం చేయాలని సవాల్ విసిరడమేకాకతాను ముస్లింను అయినా అమ్మవారి ఆలయంలో ప్రమాణం చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. నగరపాలక సంస్థ ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో విపక్షాలు దుర్గ గుడిలో ఏసీబీ తనిఖీలను అస్త్రంగా చేసుకొని ప్రచారం నిర్వహిస్తు న్నాయి. గత కొంతకాలంగా వివిధ వర్గాలు, రాజకీయ పక్షాలనుంచి దుర్గగుడి అవినీతిపై పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్న నేపధ్యంలో గత మూడు రోజులుగా ఏసీబీ అధికారులు దుర్గగుడిలో తనిఖీలు చేపట్టారు. స్టోర్సు, ప్రసాదం తయారీ, చీరల విభాగంతో పాటు రూ.300 దర్శనం టిక్కెట్ల వ్యవహారంపై ఏసీబీ అధి కారులు తనిఖీలు జరిపారు. కొనుగోలు చేసిన సరుకుల నాణ్యత, రేట్లకు సంబంధించి సిబ్బంది నుంచి వివరాలు సేకరించారు. డిపాజిట్లు, ఉద్యోగుల బదిలీలు సహా అన్ని అంశాలపై ఏసీబీ అధికారులు సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. 25 మంది ఏసీబీ అధికారులు ఐదు బృందాలుగా విడిపోయి వివిధ అంశాలపై తనిఖీలు నిర్వ హిస్తున్నారు.
తొలుత రెండు రోజుల పాటు తనిఖీలకు అధికారులు నిర్ణయించుకున్నప్పటికీ.. ఎంతకూ లెక్కలు తేలకపోవడంతో మూడో రోజైన శనివారం కూడా తనిఖీలు జరిగాయి. అర్ధరాత్రి వరకు తనిఖీలు జరిగే అవకాశం ఉన్నట్లు పేర్కొన్న ఏసీబీ అధికారులు, అవసరమైతే ఆదివారం సైతం తనిఖీలు నిర్వహించేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. మూడో రోజు ఇంద్ర కీలాద్రీలో ఆలయ అభివృద్ధి పనుల నిమిత్తం కేటాయించిన నిధులు వాటికి చెల్లించిన బిల్లులకు సంబంధించిన రికార్డులను వెరిఫై చేశారు. వీటిలో కూడా కొన్ని లోపాలను గుర్తించినట్లు తెలుస్తోంది. పలు విభాగాల్లో కీలక రికార్డులను స్వాధీనం చేసుకుని వాటిని పరిశీలిస్తున్నారు. రాష్ట్ర దేవదాయశాఖ మంత్రిగా వెల్లంపల్లి శ్రీనివాస్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచే ప్రతిపక్షాలు ఆరోపణలు చేసాయి. ఈ క్రమంలోనే దుర్గగుడి ఈవోగా ఎంవీ సురేష్ బాబు రాకతో ఆరోపణలు తీవ్రం చేశారు. అవినీతికి పాల్పడే క్రమంలోనే అర్హుడు కాకున్నా సురేష్ బాబుకు ఈవో బాధ్యతలు అప్పగించారనేది ప్రతిపక్షాల అభిప్రాయం. దుర్గగుడి వెండి రథం మూడు సింహాలు మాయం సహా అన్ని అంశాలపై ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే చోటు చేసుకున్న ఏసీబీ తనిఖీలు మరింత ఆజ్యం పోశాయి. వెల్లంపల్లి టార్గెట్ గానే అధికార పక్షమే, ఈ దాడులు చేపించిందని, లేకపోతే ప్రతిపక్షాల ఆరోపణలు బలం చేకూర్చేలా, ఎన్నికల సమయంలో ఏసీబీ దాడులు చేపించటం వెనుక మర్మం ఏమిటో ఎవరికీ అర్ధం కావటం లేదు.