ప్రజారాజధాని అమరావతిని వైసీపీ సర్కారు ఒక ఇంచు కూడా కదల్చలేదా? అమరావతి అంతానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించకపోవడంతో చివరికి సుప్రీంకోర్టులో సర్వశక్తులూ ఒడ్డుతున్న వైసీపీ సర్కారుకి చుక్కెదురు కాక తప్పదని న్యాయనిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి కక్షతో అమరావతిని నాశనం చేయాలనుకుంటే, రాజ్యాంగమే ప్రజారాజధానికి రక్ష కల్పిస్తోందని అంటున్నారు. కేఎం జోసెఫ్ వ్యాఖ్యలతో ట్విస్ట్.అమరావతి పిటిషన్లపై సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణ ఫాస్ట్ ట్రాక్ లో నిర్వహించాలని ఏపీ సర్కారు లాయర్లు చేసిన విజ్ఞప్తిని న్యాయమూర్తి కేఎం జోసెఫ్ తోసిపుచ్చారు. ఈ వ్యవహారం రాజ్యాంగ పరమైన అంశాలతో ముడిపడి ఉందని చెప్పడంతో కేసు విషయంలో సర్కారుకి స్పష్టత వస్తోందని అర్థం అవుతోంది. అమరావతి పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టేందుకు రాజ్యాంగపరమైన ఆంశాల్ని లోతుగా పరిశీలించాల్సి ఉంది. దీన్ని సాధారణ బెంచ్ కంటే రాజ్యాంగ ధర్మాసనం విచారిస్తేనే న్యాయం జరుగుతుందని భావిస్తున్న అమరావతి రైతులకు న్యాయమూర్తి కేఎం జోసెఫ్ చేసిన వ్యాఖ్యలు కూడా కలిసి వస్తున్నాయి. వీలైనంత తొందరగా సుప్రీంకోర్టు విచారణ ముగిస్తే, విశాఖకి రాజధాని షిఫ్ట్ చేసేయొచ్చనే ఆలోచనలో ఉన్నారు సీఎం జగన్ రెడ్డి. కోర్టులో ఉన్న అంశం అని కూడా చూడకుండా పదేపదే తానిక్కడకే వచ్చేస్తున్నానని, ఇదే రాజధాని అని ప్రకటిస్తున్నారు. అయితే విచారణ త్వరితగతిన పూర్తి చేయాలనే డిమాండ్‌ని ధర్మాసనం తోసిపుచ్చడంతోపాటు ఓ రాష్ట్ర భవిష్యత్తు, రాజ్యాంగ అంశాలతో ముడిపడిన ఈ పిటిషన్ల విచారణని రాజ్యాంగ ధర్మాసనంకి అప్పగించేలా జడ్జి వ్యాఖ్యలున్నాయి.రాజ్యాంగ ధర్మాసనం తీర్పే అంతిమతీర్పు కానుందని, దీనిపై ఏ అప్పీల్ కి వెళ్లే అవకాశం లేకపోవడంతో వైసీపీ ఈ అవకాశాన్ని సుప్రీంకోర్టు-కేంద్రం మధ్య వివాదానికి వాడుకుని లబ్ధి పొందే ఎత్తుగడలకు తెరతీస్తోందని వార్తలు వస్తున్నాయి.
news
డెలిగేట్ పేరుతో, వైసీపీ సోషల్ మీడియా టీం... వీడియోలతో పట్టుకున్న టిడిపి..
విశాఖలో రెండు రోజుల గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ ముగిసింది. వైసీపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. ప్రభుత్వం ఏర్పడ్డాక నాలుగేళ్లకి నిర్వహించిన సమ్మిట్ కావడంతో పబ్లిసిటీ బాగానే చేసుకున్నారు. అయితే ఇన్వెస్టర్లు బదులు వైసీపీ కార్యకర్తలు, వైసీపీ సోషల్మీడియా టీము, ఐప్యాక్ ఆర్టిస్టులు సమ్మిట్లో హల్చల్ చేశారు. వీరి చేతిలో ఒప్పంద పత్రాలు పెట్టి ఎంవోయూలు చేసుకున్నామని బాగానే కలరిచ్చారు. అయితే కోతికి కొబ్బరి ముక్క దొరికినట్టు, వీరికి సూటూ బూటూ వేసినా వారి కక్కుర్తిని నివారించలేకపోయారు. భోజనాల దగ్గర, గిఫ్టుల దగ్గర కాట్ల కుక్కల్లాగ ఎగబడి కొట్టుకుని స్టాళ్లు విరగ్గొట్టేశారు. దీనిపై కేసు పెట్టారని మీడియాకి లీకులిచ్చారు. ఇది విపక్షాల కుట్ర ఖాతాలో వేద్దామనుకున్నారు. కానీ సమ్మిట్‌కి వచ్చిన వాళ్లంతా వైసీపీ వాళ్లే. ఎవరిపై కేసు పెడతారు? ఎవరిని బుక్ చేయగలరు? దీంతో మౌనం వహించారు. సమ్మిట్‌కి డెలిగేట్లుగా వెళ్లిన బీచ్ రోడ్డులో ఐస్ క్రీములు అమ్మేవాళ్లు, వైసీపీ ఆఫీసు బోయ్స్ కూడా వీవీఐపీ పాసులు, సూటుబూటులతో దిగిన ఫోటోలను గొప్పగా సోషల్మీడియా పోస్టు చేశారు. వీటిని పట్టుకుని గూగుల్ చేసి వీడు డెలిగేట్ కాదు కేటుగాడంటూ టిడిపి ఆటాడుకుంటోంది. ఐప్యాక్ వాళ్ల పుట్టుపూర్వోత్తరాలు లాగేసి ఇన్వెస్టర్లు కాదు, ఐప్యాక్ ఆర్టిస్టులని నిరూపించారు. అలాగే ఫిల్మోజీ చానల్ వాడు ఓ ఒప్పందం, రవి ట్రావెలర్ అనే యూట్యూబర్‌తో మరో ఎంవోయూ, వైజాగ్ డెస్టినీ అనే పేజీ నడిపించే వైసీపీ సోషల్మీడియా వాడితో ఇంకో ఎంవోయూ కుదుర్చుకున్నారని వరి సోషల్మీడియా పోస్టుల ద్వారా వెల్లడైంది. మొత్తానికి 13 లక్షల కోట్లలో ఎన్ని పెట్టుబడులు వస్తాయో తెలీదు కానీ..వైసీపీ, ఐ ప్యాక్ వాళ్లని ఇన్వెస్టర్లుగా కలర్ ఇవ్వడానికి కొన్న కోట్లు మాత్రం మిగిలాయి.
లోకేష్ పాదయత్రలో వైసిపీ మూకలు... పరిగెత్తించి కొట్టిన టిడిపి శ్రేణులు...
పీలేరులో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రపై దాడికి యత్నించిన వైసీపీ మూకల్ని టిడిపి కేడర్ తరిమేసింది. నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకు పీలేరు నియోజకవర్గంలో జనహోరుతో కదం తొక్కింది. నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి తన సత్తా చాటారు. పీలేరు పట్టణంలో అడుగు తీసి అడుగు వేసే ఖాళీ లేనంతగా జనంతో నిండిపోయింది. నారా లోకేష్‌ని చూసేందుకు రోడ్లవెంట మహిళలు, యువకులు పరుగులు పెట్టారు. పీలేరు పట్టణంలో లోకేష్‌పై అడుగడుగునా పూలవర్షం కురిపించారు. బాణాసంచా మోతలు, డప్పు శబ్ధాలతో పీలేరు హోరెత్తిపోయింది. పెద్దెత్తున యువత పాదయాత్ర ఆరంభమైన నుంచీ రాత్రివరకూ యువనేత వెంటే ఉన్నారు. బహిరంగ సభ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ప్రసంగానికి ఈలలు, చప్పట్లు మారుమోగాయి. వేదికపై నుంచి మంత్రి పెద్దిరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డిపై అవినీతి ఆరోపణలు గుప్పించారు. ఎక్కడ ఎంత దోచారో లెక్కలు ప్రజల ముందుంచారు. పాపాల పెద్దిరెడ్డి, ఆయన పార్టీని ఓడించకపోతే రాష్ట్రానికి భవిష్యత్తు ఉండదని హెచ్చరించారు. యువగళం పాదయాత్ర పీలేరులో అంచనాలకు మించి దిగ్విజయం కావడం వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోయారు. వైసీపీ నేత, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ గిరిధర్ నాథ్ రెడ్డి తన అనుచరులతో కలిపి దాడి చేసేందుకు ప్రయత్నించారు. వేలాదిగా టిడిపి కార్యకర్తలు ఒక్కసారిగా తిరగబడటంతో పారిపోయి మార్కెట్ యార్డులో దాక్కున్నారు. పాదయాత్ర సాగే ప్రాంతాలలో కరెంటు తీసేశారు. పోలీసులు ఎక్కడికక్కడే అడ్డంకులు కల్పించారు. అయినా యువగళం పీలేరులో గర్జించింది. సవాల్ విసిరింది. వైసీపీ మూకలే తోకముడిచాయి.
ఒక్క రోజు తిరగకుండా, జగన్ కు షాక్ ఇచ్చిన కిషన్ రెడ్డి
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంటే మొదటి నుంచీ బీజేపీ సీనియర్ లీడర్ కిషన్ రెడ్డికి అవ్యాజమైన ప్రేమ. హిందుత్వమే అజెండాగా నడిచే బీజేపీలో కీలకనేత అయిన కిషన్ రెడ్డి, క్రిస్టియన్ అయినా జగన్ రెడ్డితో అనుబంధం కొనసాగించడంలో ఎటువంటి మొహమాటం పడరు. సుప్రీంకోర్టులో ఉన్న రాజధాని అంశంపైనా జగన్ కళ్లలో ఆనందం కోసం కేంద్రమంత్రి అయి ఉండి విశాఖ రాజధాని ప్రకటించి కలకలం రేపారు కిషన్ రెడ్డి.దీంతో తీవ్ర దుమారం రేగటంతో మళ్లీ మాట మార్చారు కిషన్ రెడ్డి. ఏపీ రాజధాని అమరావతి అని దిద్దుబాటు ప్రకటన చేశారు. విశాఖపట్టణం రాజధాని అని తాను అన్న మాట, జిల్లా కేంద్రమైన విశాఖపట్టణాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడిన మాటే కానీ, రాష్ట్ర రాజధాని విశాఖపట్టణం అన్నది నా ఉద్దేశం ఎంతమాత్రం కాదని కిషన్ రెడ్డి వివరణ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ‘అమరావతి’ అని బీజేపీ ఇదివరకే ప్రకటన ఇచ్చిందని, దీనికే తామంతా కట్టుబడి వున్నామని కేంద్రమంత్రి పేర్కొన్నారు.ఏపీలో బీజేపీ నేతలకు, కిషన్ రెడ్డికి ఇష్టంలేకపోయినా అమరావతే రాజధాని అని కేంద్ర పెద్దలు సంకేతాలు ఇవ్వడంతో అయిష్టంగానే వారు స్పందిస్తున్నారు. జగన్ రెడ్డి కోసం ఏకంగా కోర్టులో ఉన్న అంశంపైనే కిషన్ రెడ్డి మాట్లాడారంటే, ఎంతగా ఆ ప్రేమ ఉందో తేటతెల్లం అవుతుంది.