రాష్ట్రంలో పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్‍ ప్రసాద్ లను బదిలీ చేసినట్టు నిన్న వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా అధికారులను బదిలీ చేస్తున్నట్టు మీడియాకు చెప్పారు. అయితే అన్ని ప్రధాన చానల్స్ లో, ఎలక్షన్ కమిషన్ నిర్ణయం మేరకు, ప్రభుత్వం వీరి ఇద్దరినీ బదిలీ చేసింది అంటూ వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ అంశం పై మరో ట్విస్ట్ ఏర్పడింది. ప్రభుత్వం ఈ ఇరువురు అధికారుల పై చేసిన బదిలీ ప్రతిపాదనను, మేము తిరస్కరిస్తున్నామని, ఎలక్షన్ కమిషన్ కొద్ది సేపటి క్రితం ప్రభుత్వానికి సమాచారం పంపించింది. ఎన్నికల ప్రక్రియ కీలకంగా ఉన్న దశలో, కీలకమైన అధికారులను బదిలీ చేయటం కరెక్ట్ కాదని, ఎలక్షన్ కమిషన్ అభిప్రాయ పడింది. ఒక వేళ, ప్రభుత్వం ఎవర్ని అయినా బదిలీ చేయాలని అనుకుంటే మాత్రం, ఎలక్షన్ కమిషన్ నియమావళి ప్రకారమే బదిలీ చేయాలని ఎలక్షన్ కమిషన్ స్పష్టం చేసింది. అయితే పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది కానీ, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజాశంకర్‍ ప్రసాద్ కానీ, 2021కి సంబంధించిన ఎన్నికల జాబితా ప్రచురించటంలో జాప్యం చేసారని ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

dwivivedi 26012021 2

విధి నిర్వహణలో అలసత్వం వహించారని, గతంలో మొదటి దశ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తున్న సమయంలో, ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, ప్రకటించిన విషయం తెలిసిందే. వారి ఇరువురి పై కూడా సరైన చర్యలు తీసుకుంటామని ఆయన ప్రకటించారు. ఈ నేపధ్యంలోనే ప్రభుత్వం వారిని బదిలీ చేయాలని నిర్ణయం తీసుకుంది. అయితే ఈ బదిలీ ఎన్నికల కమిషన్ సూచన మేరకు జరిగింది అంటూ నిన్న ప్రచారం జరిగింది. అయితే దీని పై ఈ రోజు ఎన్నికల కమిషన్ స్పందిస్తూ, వీరి ఇరువురి బదిలీని తిరస్కరిస్తున్నామని చెప్పటంతో, ప్రభుత్వమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అర్ధం అవుతుంది. అయితే ఇదే సమయంలో ఎలక్షన్ కమిషన్ తన అధికారాలను, ప్రభుత్వానికి కూడా తెలియ చేసినట్టు అయ్యింది. ఎన్నికలు జరుగుతున్న సమయంలో, ఈసి నిర్ణయం లేకుండా, ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటానికి వీలు లేదు అని చెప్పినట్టు అయ్యింది. ఇక ఇప్పటికే ఎలక్షన్ కమీషనర్, తొమ్మిది మంది పై బదిలీ వేటు వేయాలని కోరగా, ఇప్పటి వరకు ప్రభుత్వం, ఆ విషయంలో ఎలాంటి ప్రక్రియ మొదలు పెట్టలేదు. దీని పై ప్రభుత్వం ఎప్పుడు స్పందిస్తుందో చూడాలి.

రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఎన్నికల్లో సహకరించకుండా, సహాయ నిరాకరణ చేసిన అధికారులు పై జూలు విదిల్చారు. గత ఏడాది మర్చిలో, ఎన్నికల నిర్వహణలో అలసత్వం వహించిన కొంత మంది ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. ఆ క్రమంలోనే గుంటూరు, చిత్తూరు, కలెక్టర్లతో పాటుగా, మొత్తం తొమ్మిది మంది పై చర్యలు తీసుకోవాలని కోరిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల నిమ్మగడ్డ మళ్ళీ ఏఅ ఆదేశాలు అమలు చేయాలని లేఖ రాసారు. అయితే దీని పై స్పందించిన చీఫ్ సెక్రటరీ కుదరదు అని చెప్పారు. అయితే ఈ రోజు సుప్రీం కోర్టులో తీర్పు రావటం, మొత్తం వాతావరణం మారిపోవటంతో, ప్రభుత్వం కూడా ఎన్నికలకు సహకరిస్తాం అని చెప్పింది. ఈ నేపధ్యంలోనే, మళ్ళీ రోజు నిమ్మగడ్డ ఈ విషయం పై, చీఫ్ సెక్రటరీకి లేఖ రాసారు. అయితే ఇప్పుడు ఇదే విషయంలో, పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ, కమిషనర్ గిరిజా ప్రసాద్ పై కూడా బదిలీ వేటు వేస్తూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీంతో ప్రభుత్వం కూడా, ఇక గత్యంతరం లేక, ప్రభుత్వం కూడా బదిలీ వేటు వేసింది. వాళ్ళ స్థానంలో, ముగ్గురు పేర్లను నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ప్రభుత్వం పంపించనుంది. వీరి నుంచి, ఎన్నికల కమీషనర్ ఒకరిని సెలెక్ట్ చేయనున్నారు.

dwivvie 25012021 2

మూడు రోజుల క్రితం, ఎన్నికల కమిషన్ రివ్యూకి రావాల్సిందిగా, ఎలక్షన్ కమిషన్, పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ, కమిషనర్ గిరిజా ప్రసాద్ ను తన ఆఫీస్ కు రమ్మని కోరారు. మూడు సార్లు టైం మార్చినా, వాళ్ళు రాలేదు. అలాగే కలెక్టర్ ల వీడియో కాన్ఫరెన్స్ కు కూడా, ఒక్కరు కూడా హాజరు కాలేదు. ఈ ధిక్కరణను ఎన్నికల కమీషనర్ సీరియస్ గా తీసుకున్నట్టు అర్ధం అవుతుంది. ఇక ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామి రెడ్డి లాంటి వారిని, ఎలక్షన్ కమిషన్ ఏమి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. అలాగే ప్రభుత్వం కూడా గుంటూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లను కూడా ఈ రోజో, రేపో బదిలీ చేయాల్సిందే. లేకపోతే మళ్ళీ ఎన్నికల కమీషనర్ సీరియస్ అయితే, ప్రభుత్వానికి, ఎన్నికల కమిషన్ కు మధ్య మళ్ళీ ఘర్షణ వాతావరణం వస్తుంది. ఇక ఈ ప్రక్రియ మొత్తం సాఫీగా సాగేలాగా, గవర్నర్ కూడా రంగంలోకి దిగి, ఇరు వైపులా సంధి కుదిర్చి, ఇద్దరినీ సమనవ్యం చేసే బాధ్యత కూడా గవర్నర్ పై ఉంటుంది. మరి గవర్నర్ ఎలా స్పందిస్తారో చూడాలి.

పంచాయితీ ఎన్నికలపై సుప్రీంకోర్టు తీర్పును తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్వాగతించారు. వైసిపి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో జరుగుతోన్న రాజ్యాంగ ఉల్లంఘనలు అన్నీఇన్నీ కావు. రాష్ట్రంలో ఏ వ్యవస్థను సజావుగా పని చేయనీయకుండా అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తున్నారు. చట్టసభలు, పాలనా యంత్రాంగం, న్యాయవ్యవస్థ, మీడియా 4 మూల స్థంభాలను ధ్వంసం చేయడమే పనిగా పెట్టుకున్నారు. శాసన మండలి రద్దుకు బిల్లు, నిజాయితీగా పనిచేసే అధికారులకు వేధింపులు, న్యాయవ్యవస్థపై దాడి, న్యాయమూర్తులపై దుర్భాషలు, ఎన్నికల సంఘంపై దాడి, ఈసిని కులం పేరుతో దూషించడం, జీవో 2430ద్వారా మీడియాపై ఆంక్షలు విధించడం, ప్రభుత్వ కార్యాలయాలకు వైసిపి రంగులు వేయడం, కోర్టు తీర్పులను కూడా అమలు చేయకపోవడం, రాజ్యాంగ వ్యవస్థల విచ్చిన్నమే అజెండాగా పెట్టుకున్నారు. ప్రతి సందర్భంలోనూ కోర్టులే జోక్యం చేసుకుని న్యాయం చేయడం, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడం హర్షణీయం. పంచాయితీ ఎన్నికలపై ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వైసిపి ఉన్మాద పాలనకు కనువిప్పు కావాలి. రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికలను స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించాలి. నిష్పక్షపాతంగా, సజావుగా పంచాయితీ ఎన్నికలు జరపాలి. మార్చిలో స్థానిక ఎన్నికల్లో చోటుచేసుకున్న హింసా విధ్వంసాలు, తప్పుడు కేసులు- అక్రమ నిర్బంధాలు పునరావృతం కాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరుతున్నాం.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఎట్టకేలకు సుప్రీం కోర్టు తీర్పు పై స్పందించింది. ఈ రోజు సుప్రీం కోర్టులో స్థానిక సంస్థల ఎన్నికలు పై, తీర్పు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం వేసిన పిటీషన్ ను, సుప్రీం కోర్టు కొట్టేసింది. ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల్లో జోక్యం చేసుకోం అని, ఈ పిటీషన్ చూస్తుంటే ఉద్దేశాలు ఆపాదిస్తున్నట్టు ఉందని, సుప్రీం కోర్టు వాపోయింది. ఇక ఉద్యోగులు పిటీషన్ పై కూడా సుప్రీం కోర్టు తీవ్ర ఆగహ్రం వ్యక్తం చేసింది. అయితే ఈ తీర్పు తరువాత, ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో అనే టెన్షన్ నెలకొంది. అయితే తీర్పు వచ్చిన వెంటనే, సమీక్షలు అన్నీ రద్దు చేసిన జగన్ మోహన్ రెడ్డి, ఒక అర్జెంటు మీటింగ్ కు పిలుపిచ్చారు. సజ్జల, డీజీపీ, అడ్వొకేట్ జెనెరల్ కలిసి, దాదాపుగా నాలుగు గంటలుగా, తీర్పు పై స్పందించారు. ఇంకా ఏమైనా మార్గాలు ఉన్నాయేమో అని చూసిన తరువాత, ఇక సుప్రీం కోర్టు తీర్పుని సిరసహావహించటం మినిహా, మరో ఆప్షన్ లేదనే నిర్ణయానికి వచ్చారు. సుప్రీం కోర్టు తీర్పు పై, ప్రభుత్వం తరుపున ప్రధాన సలహాదారు, సజ్జల రామకృష్ణా రెడ్డి మీడియాతో మాట్లాడుతూ స్పందించారు. సుప్రీం కోర్టు నిర్ణయం ప్రకటించిన తరువాత, ఇక ఇందులో వేరే ఉద్దేశం ఉండదని, సుప్రీం కోర్టు తీర్పుని సిరసహావహిస్తున్నమాని సజ్జల తెలిపారు.

sajjala 25012021 2

ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ చెప్పినట్టే నడుచుకుని, వారికి సహకరిస్తామని తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయం ప్రకరామే ఎన్నికలు జరుగుతాయని అన్నారు. ఉద్యోగులతో చర్చించి, చీఫ్ సెక్రటరీ సరైన నిర్ణయం తీసుకుంటారని సజ్జల అన్నారు. మేము కేవలం వ్యాక్సిన్, ఎన్నికలు ఒకేసారి జరిగితే ఇబ్బంది అని చెప్పి మాత్రమే ఎన్నికలు వద్దు అన్నామని సజ్జల అన్నారు. ఎన్నికల ద్వారా కరోనా పెరిగితే మాత్రం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ దే బాధ్యత అని సజ్జల అన్నారు. ఉద్యోగులు మా ప్రభుత్వంలో భాగం అని, వారి ప్రాణాలు తమకు ముఖ్యం అని అన్నారు. కేంద్రం వ్యాక్సిన్ గ్యారెంటీ అంటున్నారని, అలాగే ఎన్నికలు జరపాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ అంటుందని, సుప్రీం కోర్టు, రెండు ముఖ్యమే అంటుందని, కాబట్టి ఇక కోర్టు చెపినట్టు చేస్తాం అని సజ్జల అన్నారు. మధ్యలో ఆగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను పక్కనపెట్టి.. పంచాయతీ ఎన్నికలను ముందుకు తీసుకురావడంలోనే కుట్ర ఉందని అర్ధమవుతుందని సజ్జల అన్నారు. ఎన్నికల్లో పోటీకి మా పార్టీ రెడీ గా ఉందని, మేము ఎన్నికలకు భయ పడటం లేదని సజ్జల అన్నారు. మొత్తానికి సుప్రీం కోర్టు తీర్పుకి ఎదురు చెప్పలేక, ఇప్పటికీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని తిడుతూనే ఉన్నారు.

Advertisements

Latest Articles

Most Read