రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఎన్నికల్లో సహకరించకుండా, సహాయ నిరాకరణ చేసిన అధికారులు పై జూలు విదిల్చారు. గత ఏడాది మర్చిలో, ఎన్నికల నిర్వహణలో అలసత్వం వహించిన కొంత మంది ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. ఆ క్రమంలోనే గుంటూరు, చిత్తూరు, కలెక్టర్లతో పాటుగా, మొత్తం తొమ్మిది మంది పై చర్యలు తీసుకోవాలని కోరిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల నిమ్మగడ్డ మళ్ళీ ఏఅ ఆదేశాలు అమలు చేయాలని లేఖ రాసారు. అయితే దీని పై స్పందించిన చీఫ్ సెక్రటరీ కుదరదు అని చెప్పారు. అయితే ఈ రోజు సుప్రీం కోర్టులో తీర్పు రావటం, మొత్తం వాతావరణం మారిపోవటంతో, ప్రభుత్వం కూడా ఎన్నికలకు సహకరిస్తాం అని చెప్పింది. ఈ నేపధ్యంలోనే, మళ్ళీ రోజు నిమ్మగడ్డ ఈ విషయం పై, చీఫ్ సెక్రటరీకి లేఖ రాసారు. అయితే ఇప్పుడు ఇదే విషయంలో, పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ, కమిషనర్ గిరిజా ప్రసాద్ పై కూడా బదిలీ వేటు వేస్తూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీంతో ప్రభుత్వం కూడా, ఇక గత్యంతరం లేక, ప్రభుత్వం కూడా బదిలీ వేటు వేసింది. వాళ్ళ స్థానంలో, ముగ్గురు పేర్లను నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ప్రభుత్వం పంపించనుంది. వీరి నుంచి, ఎన్నికల కమీషనర్ ఒకరిని సెలెక్ట్ చేయనున్నారు.
మూడు రోజుల క్రితం, ఎన్నికల కమిషన్ రివ్యూకి రావాల్సిందిగా, ఎలక్షన్ కమిషన్, పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ, కమిషనర్ గిరిజా ప్రసాద్ ను తన ఆఫీస్ కు రమ్మని కోరారు. మూడు సార్లు టైం మార్చినా, వాళ్ళు రాలేదు. అలాగే కలెక్టర్ ల వీడియో కాన్ఫరెన్స్ కు కూడా, ఒక్కరు కూడా హాజరు కాలేదు. ఈ ధిక్కరణను ఎన్నికల కమీషనర్ సీరియస్ గా తీసుకున్నట్టు అర్ధం అవుతుంది. ఇక ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామి రెడ్డి లాంటి వారిని, ఎలక్షన్ కమిషన్ ఏమి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. అలాగే ప్రభుత్వం కూడా గుంటూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లను కూడా ఈ రోజో, రేపో బదిలీ చేయాల్సిందే. లేకపోతే మళ్ళీ ఎన్నికల కమీషనర్ సీరియస్ అయితే, ప్రభుత్వానికి, ఎన్నికల కమిషన్ కు మధ్య మళ్ళీ ఘర్షణ వాతావరణం వస్తుంది. ఇక ఈ ప్రక్రియ మొత్తం సాఫీగా సాగేలాగా, గవర్నర్ కూడా రంగంలోకి దిగి, ఇరు వైపులా సంధి కుదిర్చి, ఇద్దరినీ సమనవ్యం చేసే బాధ్యత కూడా గవర్నర్ పై ఉంటుంది. మరి గవర్నర్ ఎలా స్పందిస్తారో చూడాలి.