ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం, పోలీసులు కలిసి చేస్తున్న పనులు రోజుకి ఒక రికార్డుని దాటుతున్నాయి. రామతీర్ధం ఘటనలో చంద్రబాబు, అచ్చేన్నాయుడు, కళా వెంకట్రావ్, విజయసాయి రెడ్డిని అంతం చేసే కుట్ర చేసారు అంటూ, పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో తెలపటం సంచలనం సృష్టిస్తుంది. చంద్రబాబుని ఏ1గా, అచ్చేన్నాయుడుని ఏ2గా, కళా వెంకట్రావ్ ని ఏ3 గా పెట్టి, మొత్తం 12 మంది ముద్దాయులుగా పోలీసులు తేల్చారు. ఈ కేసులో ఏడుగురుని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి, రిమాండ్ రిపోర్ట్ కోర్టుకు సమర్పించారు. కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్ లో, విజయసాయిరెడ్డిని అంతం చేసేందుకు కుట్ర పన్నారని, దానికి ప్రధాన కారణం చంద్రబాబు అని రిమాండ్ రిపోర్ట్ లో పెట్టారు. విజయసాయి రెడ్డి, ముగ్గురు పేర్లు చెప్పి, తనను చంపేందుకు కుట్ర పన్నారని విజయసాయి రెడ్డి ఫిర్యాదు చేసినట్టు రిమాండ్ రిపోర్ట్ లో తెలిపారు. విజయసాయి రెడ్డిని అంతం చేసేందుకే ఆయన కార్ పై చెప్పులు, వాటర్ ప్యాకెట్లు, రాళ్ళు వేసారని, ఒక రాయి కారుకి తగలి అద్దం డ్యామేజ్ అయ్యిందని, మరో రాయి విజయసాయి రెడ్డి, పర్సనల్ సెక్యూరిటీ కు తగిలిందని, ఆయనకు గాయం అయ్యిందని తెలిపారు. ఇక మరో పక్క ఇప్పటికే నాలుగు రోజుల క్రితం, కళా వెంకట్రావ్ ని, రాత్రి పూట వచ్చి అరెస్ట్ చేసి, కొద్ది సేపటి తరువాత విడుదల చేసిన సంగతి తెలిసిందే.

cbn 24012021 2

అయితే తన పై కేసు పెట్టటం పై, కళా వెంకట్రావ్ హైకోర్టుకు వెళ్లారు. తన పై అక్రమ కేసు పెట్టారని, విజయసాయి రెడ్డి ఘటనలో, తాను అక్కడ లేకపోయినా, తన పై అక్రమంగా కేసు పెట్టారని అన్నారు. దీని పై స్పందించిన హైకోర్ట్, తదుపరి విచారణ వచ్చేంత వరకు, ఎలాంటి తొందరపాటు చర్యలు వద్దు అంటూ పోలీసులను ఆదేశించి, విచారణ వాయిదా వేసింది. ఇక ఘటన గురించి చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. లేని వివాదాన్ని విజయసాయి రెడ్డి ఎలా చేసారో అర్ధం అవుతుంది. నిజానికి చంద్రబాబు రామతీర్ధం వెళ్ళాలని అనుకున్నారు. ఆయన వెళ్లి వచ్చేస్తే ఏమి ఉండేది కాదు. కానీ విజయసాయి రెడ్డి, చంద్రబాబు వచ్చే గంట ముందు రామతీర్ధం వెళ్లారు. అంటే అక్కడ జనాన్ని రెచ్చగొట్టటానికి అని అర్ధం అవుతుంది. అసలు పోలీసులు ఎలా విజయసాయి రెడ్డికి పర్మిషన్ ఇచ్చారో తెలియదు. మధ్యలో దూరింది, హడావిడి చేసింది, విజయసాయి రెడ్డి. పర్మిషన్ ఇచ్చింది పోలీసులు. మధ్యలో ఎవరో చెప్పులు వేసి కొడితే, దానికి చంద్రబాబు కారణం అని చెప్పటం, అరెస్ట్ లు దాకా వెళ్ళటం, ఇవన్నీ ఏదో సినిమాలో చూసినట్టు ఉంది. మరి ఏ1గా చంద్రబాబుని పెట్టి ఏమి సాధించాలని, జగన్ అనుకుంటున్నారో..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించే స్థానిక సంస్థల ఎన్నికల పై, రేపు సుప్రీం కోర్టులో ఏమి జరుగుతుంది అని అందరూ అనుకుంటున్న సమయంలో, సుప్రీం కోర్టులో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరపవద్దు అంటూ, రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు తీర్పు సస్పెండ్ చేయమని సుప్రీం కోర్టుకు వెళ్ళిన సంగతి తెలిసిందే. ఈ కేసుని జస్టిస్ లావు నాగేశ్వరరావు బెంచ్ ముందు లిస్టు కూడా చేసారు. అయితే ఉద్యోగ సంఘాలు కూడా మరో కేసు విడిగా వేసారు. ఈ కేసు కూడా రేపు సుప్రీం కోర్టులో లిస్టు అయ్యింది. ఈ కేసుని జస్టిస్ సంజయ్ కిషన్‍కౌల్ ధర్మాసనం ముందు లిస్టు చేసారు. ఉద్యోగ సంఘాల తరుపున పిటీషన్ వేసిన శ్రీధర్ రెడ్డి, తాను అంతకు ముందు జస్టిస్ లావు నాగేశ్వరరావు ఆఫీస్ లో పని చేసానని, ఈ ఉద్యోగులు పిటీషన్ ఆయన బెంచ్ ముందుకు వెళ్తే, నాట్ బిఫోర్ మీ అని ఆయన అంటే, మరింత ఆలస్యం అవుతుందని ఆయన తెలిపారు. దీంతో, ఈ పిటీషన్ ను, జస్టిస్ లావు నాగేశ్వరరావు బెంచ్ ముందు కాకుండా, జస్టిస్ సంజయ్ కిషన్‍కౌల్ ధర్మాసనం ముందు లిస్టు చేసారు. దీంతో నిన్న ప్రభుత్వం వేసిన పిటీషన్ ను కూడా, జస్టిస్ లావు నాగేశ్వరరావు బెంచ్ నుంచి తీసి, జస్టిస్ సంజయ్ కిషన్‍కౌల్ ధర్మాసనం ముందు రీ లిస్టు చేసారు.

sc 24012021 2

దీంతో అటు ప్రభుత్వం వేసిన పిటీషన్, అలాగే ఉద్యోగులు వేసిన పిటీషన్ కూడా, జస్టిస్ సంజయ్ కిషన్‍కౌల్ ధర్మాసనం ముందు రేపు విచారణకు రానుంది. దీంతో రేపు ఎలాంటి ఆదేశాలు సుప్రీం కోర్టు ఇస్తుందో అనే అంశం ఇప్పుడు రాష్ట్రం మొత్తం సస్పెన్స్ గా మారింది. ఇక ఈ రోజు హైకోర్టులో కూడా మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఈ రోజు హైకోర్టులో అత్యవసరంగా విచారణ జరపాలి అంటూ, ఒక హౌస్ మోషన్ పిటీషన్ దాఖలు అయ్యింది. 2019 ఎన్నికల జాబితా ప్రకారం ఎన్నికలు జరుపుతాం అని రాష్ట్ర ఎన్నికల కమిషన్ అంటుందని, 2021 ఎన్నికల జాబితా ప్రకారమే అన్నికలు జరపాలని, దీని వల్ల 3.60 లక్షల మంది ఓటు వేసే హక్కు కోల్పోతున్నారు అంటూ, హౌస్ మోషన్ పిటీషన్ దాఖలు కాగా, ఆ పిటీషన్ ని హైకోర్టు తిరస్కరించి, రేపు రెగ్యులర్ పిటీషన్ గానే దీన్ని విచారణ చేస్తామాని హైకోర్టు చెప్పింది. అయినా ఈ పిటీషన్ కనుక హైకోర్టు సీరియస్ గా తీసుకుంటే, దెబ్బ పడేది ప్రభుత్వానికే. నిన్న ప్రెస్ మీట్ లో ఎన్నికల కమిషన్, ఈ విషయం పై తాము ఎన్ని సార్లు చెప్పినా, ప్రభుత్వం రెడీ చేయలదనే చెప్పారు. జాప్యానికి ప్రభుత్వమే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇక ఈ కారణంతో ఎన్నికలు ఆపటం అనేది, అవుతుందో లేదో రేపు కానీ తెలియదు.

విద్యార్ధులకు సంబంధించిన సమస్య పైన, శుక్రవారం నాడు, తెలుగుదేశం పార్టీ విద్యార్ధి విభాగం అయిన, తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్, జగన్ మోహన్ రెడ్డి ఇంటి ముట్టడికి పిలుపు ఇచ్చారు. దీనికి సంబంధించి పోలీసులు ముందు జాగ్రత్తగా అందరినీ హౌస్ అరెస్ట్ చేసి, బద్రత పెంచి, చివరకు మంగళగిరి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి బయటకు కూడా ఎవరినీ రానివ్వకుండా, భారీ బందోబస్తు ఏర్పాట్లు చేసినప్పటికీ, కొంత మంది జగన్ నివాసానికి ఒక అర కి.మీ దూరం వెళ్ళగలిగారు. దీంతో తెలుగు తల్లి విగ్రహం వద్ద వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని, అరెస్ట్ చూపించారు. దానికి సంబంధించి పలు ఐపీసి సెక్షన్ల కింద కేసు బుక్ చేసారు. దీనికి సంబంధించి ఈ రోజు అరెస్ట్ చేసిన వారిని జడ్జి ముందు ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా పోలీసులు ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్ చేసిన న్యాయమూర్తి అందులోని కంటెంట్ చేసి ఆశ్చర్యపోయారు. ఎందుకుంటే, ఆ రిమాండ్ రిపోర్ట్ లో, వారు అటెంప్ట్ రేప్ చేసినట్టు అభియోగాలు నమోదు చేసారు. పెట్టిన సెక్షన్ లు వేరేగా ఉండగా, అభియోగాలు మాత్రం, వేరేగా ఉండటంతో, న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇది అటెంప్ట్ రేప్ ఎలా అవుతుంది అంటూ, పోలీసులను నిలదీసారు. దీంతో పోలీసులు నాలుకు కరుసుకున్నారు.

judge 23012021 2

పాత రిమాండ్ రిపోర్ట్ లు మర్చి, కొత్త రిపోర్ట్ తయారు చేసే క్రమంలో, ఇవి పొరపాటున తీసి ఉండకపోవచ్చని పోలీసులు భావిస్తున్నారు. వెంటనే ఆ అయుదు మందిని తాడేపల్లి పోలీస్ స్టేషన్ కు తీసుకుని వెళ్లారు. ఆ రిమాండ్ రిపోర్ట్ లో, పూర్తి స్థాయిలో మార్పులు చేసి, సెక్షన్ లు, అభియోగాలు నమోదు చేసి, వారి పై నాన్ బైలబుల్ కేసులు పెట్టి, మళ్ళీ న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచేందుకు తీసుకుని వెళ్లారు. కాసేపట్లో న్యాయమూర్తి, దీనికి సంబంధించి ఏమి ఆదేశాలు ఇస్తారో చూడాల్సి ఉంటుంది. అయితే ఈ సందర్భంగా పోలీసులు డొల్లతనం మాత్రం బయట పడింది అనే చెప్పాలి. ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడించిన కేసులో, అటెంప్ట్ రేప్ అని చెప్పటం పై, వీళ్ళ నిర్ల్యక్షం ఎలా ఉందొ అర్ధం అవుతుంది. సహజంగా న్యాయమూర్తులు రిమాండ్ రిపోర్ట్ మొత్తం చదివి, తడ్పుఅరి చర్యలు ప్రకటిస్తారు. దీంతో ఈ విషయం బయట పడింది. ఇంత ముఖ్యమైన కేసులో కూడా, ఇలా తప్పులు తడకగా రిమాండ్ రిపోర్ట్ ఇవ్వటంపై, అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా జగన్ ఇల్లు ముట్టడికి, అటెంప్ట్ రేప్ కేసు ఏమిటో, ఇంత పెద్ద తప్పు ఎలా చేసారో, ఏంటో. మీడియాలో కూడా ఈ కధనం రావటంతో, ప్రభుత్వం పెద్దల నుంచి, ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి.

ఆంధ్రప్రదేశ్ మాజీ చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం గురించి తెలియని వారు ఉండరు. గత సార్వత్రిక ఎన్నికల్లో, ఆయన పై తెలుగుదేశం పార్టీ అనేక ఆరోపణలు చేసింది. ఎన్నికల సమయంలో, అప్పటి చీఫ్ సెక్రటరీ పునేటాను తొలగించి, ఎల్వీ సుబ్రహ్మణ్యంను పెట్టారు. ఆ సమయంలో ఆయన వైసీపీ పార్టీకి అనుకూలంగా పని చేస్తున్నారని, అనేక ఆరోపణలు వచ్చాయి. అయితే ఇప్పటి లాగా అప్పుడు,మేము పని చేయం, మా ఇష్టం అని చెప్పలేదు, అప్పటి చీఫ్ మినిస్టర్ చంద్రబాబు, నిరసన తెలిపారు కానీ, ఇప్పటి లాగా, సహాయ నిరాకరణ చేసి, ఎన్నికలు జరపం అంటూ తప్పుకోలేదు. ఇక తరువాత ఎల్వీ సుబ్రహ్మణ్యం, జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో సంతోషంగా ఉన్నటే కనిపించారు. జగన్ కూడా, సుబ్బన్నా సుబ్బన్నా అంటూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. అయితే ఏమైందో ఏమో కానీ, ఉన్నట్టు ఉండి ఒక రోజు ఎల్వీ సుబ్రహ్మణ్యం, బాపట్ల ట్రాన్స్ఫర్ అయిపోయారు. ఒక చీఫ్ సెక్రెటరిని బదిలీ చేయటం అనేది చాలా అరుదు. జగన్ కు, ఎల్వీ సుబ్రహ్మణ్యంకు ఏమి తేడాలు వచ్చాయో కానీ, బదిలీ అయిపోయారు. అయితే ఇన్నాళ్ళకు ఎల్వీ సుబ్రహ్మణ్యం మళ్ళీ మీడియా ముందు కనిపించారు. అది కూడా, ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల కమిషన్, ప్రభుత్వం, ఉద్యోగుల మధ్య గొడవకు సంబంధించి, మాట్లాడారు.

subbu 240120212

నిన్న తెనాలిలో ఎల్వీ సుబ్రహ్మణ్యం పర్యటించారు. అయోధ్యలో రామజన్మభూమిలో, నిర్మిస్తున్న దేవాలయం నిర్మాణానికి సంబంధించి విరాళాలు సమీకరించటంలో భాగంగా, ఆయన నిన్న తెనాలి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో జరుగుతున్న వివాదం పై స్పందించారు. ఎంతటి ఉద్యోగి అయినా సరే, రాజ్యాంగానికి లోబడి పని చేయాలని, ఎన్నికల సంఘానికి సహకరించాలని అన్నారు. సామాన్యులతో పోలీస్తే, ఉద్యోగులు రాజ్యాంగాన్ని వెయ్యి రెట్లు ఎక్కువ గౌరవించాలని అన్నారు. ఉద్యోగులు రాజ్యాంగ స్పూర్తితో పని చేయాలని అన్నారు. రాజ్యాంగాన్ని మనం రక్షిస్తేనే, రాజ్యాంగం మనల్ని రక్షిస్తుందని అన్నారు. ఎన్నికల నిర్వహణలో, క-రో-నా భయం అని ఉద్యోగులు అంటున్నారని, అలాంటి సమయంలో ఎన్నికల కమిషన్ ని, ప్రభుత్వాన్ని అడిగి మరిన్ని జాగ్రత్తలు తీసుకుని, రాజ్యాంగాన్ని గౌరవించాలని అన్నారు. గతంలో రాజ్యాంగం కోసం, ప్రాణాలు ఇచ్చిన వారు ఉన్నారని, ఇప్పుడు ప్రాణత్యాగం చేయాల్సిన అవసరం లేదని, గౌరవిస్తే చాలని అన్నారు. కోర్టులు ఇస్తున్న తీర్పులు కూడా అదే చెప్తున్నాయని అన్నారు.

Advertisements

Latest Articles

Most Read