నెల్లూరు జిల్లా ఎస్.పి భాస్కర్ భూషణ్ కు జనవరి 18, 2021 న వైకాపా ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన బహిరంగ బెదిరింపుల నేపధ్యంలో తెదేపా అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణా రెడ్డి డిజిపికి లేఖ రాసారు. ఒకవైపు రాష్ట్రంలో రోజురోజు శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని మరోవైపు అధికార పార్టీ వైకాపా నాయకులు పేట్రేగిపోతూ నేరాలు-ఘోరాలకు పాల్పడుతున్నారని, ఇంకోవైపు దళితులు, మైనారిటీలు, మహిళలు, దేవాలయాలపై దాడులు పెరిగిపోయాయని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో జరుగుతన్న అనేక సంఘటనలు డిజిపీ దృష్టికి తీసుకెళ్లినా ఎటువంటి చర్యలు లేవన్నారు. తెలుగుదేశం కార్యకర్తలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద అక్రమ కేసులు నమోదు చేయనందున జనవరి 18, 2021 న నెల్లూరు ఎస్పీ భాస్కర్ భూషణ్ ను బహిరంగంగా పబ్లిక్ మీటింగ్ లో వైకాపా ఎమ్మల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి బెదిరించారని పేర్కొన్నారు. వైకాపా నాయకులతో ఒక వర్గం పోలీసులు కుమ్మక్కై రాష్ట్రంలో ప్రతిపక్ష తెలుగుదేశం నాయకులపై, కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారనడానికి ఇదే సాక్ష్యమని నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పై డిజిపి చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు. ప్రస్థుతం ఆంధ్రప్రదేశ్ పోలీసులలో ఆత్మస్థైర్యం దెబ్బతిందని నల్లపరెడ్డి లాంటి వ్యక్తులపై చర్యలు తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులలో ఆత్మస్తైర్యం నింపడంతో పాటు రాష్ట్రంలో శాంతి భద్రతలు కూడా మెరుగుపడుతాయి ప్రస్తావించారు.
news
విశాఖ వాల్తేరు క్లబ్ విషయంలో, ప్రభుత్వానికి షాక్ ఇస్తూ, ఆదేశాలు ఇచ్చిన హైకోర్టు...
విశాఖపట్నం వాల్తేరు క్లబ్ కు సంబంధించి, ఈ రోజు హైకోర్టు సంచలన ఆదేశాలు ఇచ్చింది. కొంత మంది విశాఖ వాల్తేరు క్లబ్ పై కన్నేసారని, గత కొంత కాలంగా తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అది ప్రభుత్వానిదా, ప్రైవేటుదా అంటూ వివాదం గత కొన్ని నేలలుగా నడుస్తుంది. గతంలో 1964లో వాల్టర్ క్లబ్ కు ఉన్న పట్టాకు సంబంధించి, కావాలని ఇప్పుడు వివాదం తెచ్చారని, ఆ భూములు కొట్టేసే ప్లాన్ వేసారని, విపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీని పై ప్రభుత్వం ఒక సిట్ ను కూడా ఏర్పాటు చేసింది. ఈ మొత్తం వ్యవహారం పై విచారణ చేయాలని ఆదేశించింది. అయితే ఈ కేసు హైకోర్టుకు చేరింది. దీని పై ఈ రోజు విచారణ జరిగింది. అయితే ఈ మొత్తం అంశం పై, ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ పై కోర్టుకు వెళ్ళారు. అయితే ఇరువురి వాదనలు విన్న హైకోర్టు ఈ అంశం పై స్టే విధించింది. సిట్ విచారణ పై కూడా స్టే విధించింది. వాల్తేరు క్లబ్ వివాదం పై, సిట్ ఎటువంటి చర్యలు ఇక ఈ వ్యవహారంలో ముందుకు వెళ్ళకూడదు అని, మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు, ఎలాంటి చర్యలు తీసుకోకూడదు అని, ఇది సివిల్ వివాదం కాబట్టి, సిట్ జోక్యం చేసుకోకూ డదు అని, తదుపరి విచారణ పై స్టే విధించింది.
భారతి సిమెంట్స్ పై సంచలన కధనం రాసిన నేషనల్ మీడియా...
జగన్ మోహన్ రెడ్డి కుటుంబానికి చెందిన భారతి సిమెంట్స్ మళ్ళీ వార్తల్లోకి ఎక్కింది. గతంలో రాజశేఖర్ రెడ్డి ఉండగా, ఈ కంపెనీ పై అనేక ఆరోపణలు వచ్చాయి. కేసులు, జైళ్ళు, బెయిల్ దాకా ఈ క్విడ్ ప్రోకో విషయాలు వెళ్ళిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రావటంతో, మళ్ళీ భారతి సిమెంట్స్ పై ఆరోపణలు మొదలయ్యాయి. ముఖ్యంగా భారతి సిమెంట్స్ , మిగతా సిమెంట్ కంపెనీలతో సిండికేట్ అయ్యి, కృత్రిమ కొరత సృష్టించి, దాదాపుగా బస్తాకు వంద రూపాయలు పెంచేసిందని తెలుగుదేశం ఆరోపిస్తుంది. నిజానికి సిమెంట్ ధరలు భారీగా పెరిగిన మాట వాస్తవమే. ఇక భారతి సిమెంట్ సామర్ధ్యం చుస్తే, బస్తాకు వంద రూపాయలు పెంచితే, వారికి వెయ్యి కోట్ల టర్న్ ఓవర్ పెరుగుతుందని, తెలుగుదేశం పార్టీ ఆరోపణ. ఇదే విషయం భారతి సిమెంట్స్ వాటా టెక్ ఓవర్ చేసిన కంపెనీ కూడా, తన యాన్యుల్ రిపోర్ట్ లో తెలిపినట్టు, ధరలు పెరుగుదల వల్ల, తమకు లాభాలు వచ్చినట్టు, తెలుగుదేశం ఆరోపిస్తుంది. అలాగే ప్రభుత్వ ప్రాజెక్ట్ లు అన్నిటికీ భారతి సిమెంట్స్ వాడేలా, ఆదేశాలు వెళ్లాయని కూడా తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలు పై భారతి సిమెంట్స్ వైపు నుంచి కానీ, ప్రభుత్వం వైపు నుంచి కానీ, వైసీపీ పార్టీ వైపు నుంచి కానీ ఎలాంటి వివరణ రాలేదు. అయితే ఈ రోజు ప్రముఖ జాతీయ పత్రికలో, ఇదే అంశం పై సంచలన కధనం వచ్చింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి తీసుకున్న ఆర్డర్ల మొత్తంలో, కేవలం జగన్ మోహన్ రెడ్డి కుటుంబానికి చెందిన భారతి సిమెంట్స్ నుంచి మాత్రమే, 14 శాతం సిమెంట్ ఆర్డర్లు తీసుకున్నట్టు ఆ కధనం ప్రచురించింది. అంటే, 2,28,370.14 మెట్రిక్ టన్నుల సిమెంట్ ని ప్రభుత్వం, భారతి సిమెంట్స్ నుంచి కొనుగోలు చేసింది. ఏప్రిల్ 2020 నుంచి జనవరి 2021 వరకు, ప్రభుత్వం చేసిన సిమెంట్ కొనుగోళ్ళలో ఈ విషయం అర్ధమవుతుంది. తరువాత ఆర్డర్, జగన్ కేసుల్లో సహా నిందితుడిగా ఉన్న ఇండియా సిమెంట్స్ కు దక్కింది. ముఖ్యంగా భారతి సిమెంట్స్ డైరెక్టర్ గా ఉంటూ, అలాగే ఏపీ సిమెంట్ మాన్యుఫాక్చరింగ్ అసోసియేషన్(APCMA) వైస్-ఛైర్మన్ ఉన్న రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలోనే ఇది జరిగిందని కధనం. ప్రభుత్వ ఇచ్చే సిమెంట్ ఆర్డర్లు, 23 కంపెనీల మధ్య ఈ అసోసియేషన్(APCMA) సర్దుబాటు చేస్తుంది. అంటే, మొత్తం ఆర్డర్ల లో సుమారు 4.35% ఒక్కో కంపెనీకి రావాలి. కానీ ఒక్క భారతి సిమెంటుకే ప్రభుత్వ ఆర్డర్లలో 14% కట్టబెట్టారు అనేది ఆ పత్రిక కధనం. అయితే ప్రభుత్వం మాత్రం, కొన్ని కంపెనీలు సప్లై చేయలేక పోతున్నాయి కాబట్టి, కొన్ని కంపెనీల దగ్గర నుంచి ఎక్కువ కొన్నామని చెప్తుంది.అందుకే భారతి సిమెంట్స్ నుంచి 14 శాతం కొన్నారట.
సంచలనం సృష్టించిన కేసు విషయంలో, పోలీసుల నిర్ణయం తప్పుబడుతూ, కేసు కొట్టేసిన హైకోర్టు...
అమరావతి ఉద్యమం సమయంలో, కృష్ణాయపాలెంలోని, పదకొండు మంది రైతులు పై, పెట్టిన ఎస్సీ, ఎస్టీ కేసుని కొట్టివేస్తూ, కొద్ది సేపటి క్రితం హైకోర్టు నిర్ణయం తీసుకుంది. రాజధాని ప్రాంతంలోకి, మూడు రాజధానుల ఉద్యమం పేరుతో బయట నుంచి వస్తున్నారని, అమరావతి ప్రాంత రైతులు ముందు నుంచి ఆందోళన చేస్తూ వచ్చారు. అయితే, అమరావతికి శంకుస్థాపన చేసి 5 ఏళ్ళు అయిన నేపధ్యంలో, బయట వాళ్ళు ఎవరైనా అమరావతి గ్రామాల్లోకి వస్తే, వెంటనే తమకు తెలియచేయాలి అంటూ, పోలీసులు, అక్కడ ఉన్న గ్రామాల ప్రజలందరికీ నోటీసులు ఇచ్చారు. దీనికి సంబంధించి ఆదేశాలు ఇచ్చారు. అయితే ఈ సందర్భంగానే, కొంత మంది కృష్ణాయపాలెంకి చెందిన, ఎస్సీ, బీసీ సామాజికవర్గానికి చెందిన రైతులు, పోలీసుల నోటీసులు దృష్టిలో పెట్టుకుని, వేరే గ్రామాల నుంచి ఆటల్లో తోలుకుని మూడు రాజధానుల శిబిరానికి తీసుకుని వస్తున్న వారిని ఆడ్డుకున్నారు. మీరు ఎందుకు వస్తున్నారు, మా గ్రామాల్లో శాంతిభద్రతల సమస్య వస్తుంది, బయట వాళ్ళు వస్తే సమాచారం ఇవ్వండి అని పోలీసులు తమకు చెప్పారని వారిని అడ్డుకున్నారు. అయితే అదే గ్రామానికి చెందిన వ్యక్తీ, తమ వారిని ఆడుకున్నారు అంటూ కేసు పెట్టగా, పోలీసులు అత్యుత్సాహంతో, వారి పై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసారు.
అయితే ఇక్కడ విశేషం ఏమిటి అంటే, ఎస్సీలుగా ఉన్న వారి పైన కూడా ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టి వారిని అరెస్ట్ చేసే దాకా వ్యవహారం వెళ్ళింది. అయితే కేసు పెట్టిన వ్యక్తి, తాను ఎస్సీ ఎస్టీ కేసు కింద కేసు పెట్టమని చెప్పలేదని, ఈ కేసుని వెనక్కు తీసుకుంటున్నా అని చెప్పినా, పోలీసులు మాత్రం కోర్టులోనే తేల్చుకోవాలని చెప్పారు. అయితే ఇదే సందర్భంలో రైతులకు బేడీలు కూడా వేసారు. మొత్తంగా ఈ సంఘటన అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. ఈ కేసు దేశ వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించింది. అయితే అప్పట్లోనే రైతులకు బెయిల్ వచ్చింది. ఆ సందర్భంలోనే హైకోర్టు పోలీసులు పై అక్షింతలు వేసింది. అయితే ఇప్పుడు ఈ కేసు తదుపరి విచారణ రాగా, ఈ కేసు చెల్లదు అంటూ, హైకోర్టు ఈ కేసుని కొట్టేసింది. రైతులు పై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టటానికి వీలు లేదు అంటూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. రాష్ట్రంలో ప్రభుత్వం, పోలీసులు ఎలా పని చేస్తున్నారో చెప్పటానికి, ఇది ఒక ఉదహరణ అని అమరావతి జేఏసి, విపక్షాలు వాపోతున్నాయి. ఎన్ని సార్లు హైకోర్టులో ఎదురు దెబ్బలు తగిలినా, చేసిన తప్పు మళ్ళీ మళ్ళీ చేస్తున్నారని వాపోయారు.