ఈ రోజు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, స్థానిక ఎన్నికల ప్రకటన వచ్చిన నేపధ్యంలో, రాష్ట్రంలో ఉన్న సీనియర్ నేతలు అందరితో మాట్లాడారు. టెలి కాన్ఫరెన్స్ లోకి అందరినీ తీసుకున్న చంద్రబాబు, ఎన్నికల అజెండా గురించి చర్చించారు. అయితే ఈ సందర్భంలో చంద్రబాబు, ఈ రోజు పత్రికల్లో వచ్చిన ఒక వార్త పై స్పందించారు. ఈ రోజు పత్రికల్లో జగన్ అభినవ శ్రీరాముడు అంటూ, వైసీపీ నాయకులు పెట్టిన ఒక ఫ్లెక్సీ వార్తగా వచ్చింది. అందులో శ్రీరాముడు, లక్ష్మణుడు వేష ధారణలో జగన్ మొఖం పెట్టారు. బాణం ఎక్కుపెట్టినట్టు ఉంది. ఆ బాణం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, సోము వీర్రాజు మీద ఎక్కు పెట్టినట్టు ఉంది. ఒక పక్క రాష్ట్రంలో దేవాలయాల పై వరుస ఘటనలు జరుగుతున్న నేపధ్యంలో వైసీపీ పార్టీ, తమ హిందూ ఇమేజ్ పెంచుకోవటానికి, నానా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే, నిన్న విజయవాడలో కొత్తగా గుడులు కడుతున్నాం అంటూ శంకుస్థాపన చేసి హడావిడి చేసారు. ఈ రోజు ఇలా జగన్ అభినవ శ్రీరాముడు అంటూ ఫ్లెక్స్ లు ఏర్పాటు చేసారు. అయితే ఇది హిందువులకు చూడటానికి ఎంతో ఎబ్బుట్టుగా ఉందని, ఉదయం నుంచి ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. కొన్ని హిందూ సంఘాలు ఆందోళన కూడా చేసాయి. ఈ నేపధ్యంలోనే చంద్రబాబు కూడా ఈ విషయం పై ప్రస్తావించారు.
జగన్ మోహన్ రెడ్డి క్రిస్టియన్ అని, ఈ ఫ్లెక్స్ పెట్టింది కూడా, క్రిస్టియన్ మంత్రి నియోజకవర్గంలో అని, ఇలా ఎందుకు చేస్తున్నారు, జగన్ మోహన్ రెడ్డి మొఖాన్ని శ్రీరామ చంద్ర మూర్తికి పెడతారా, హిందువుల మనోభావాలను గాయపరుస్తారా ? అంటూ చంద్రబాబు ఫైర్ అయ్యారు. ఒక పక్క రామతీర్ధంలో శ్రీరాముడి తల పెకిలిస్తే, ఇప్పటి వరకు కనీసం అక్కడకు వెళ్లి స్పందించని జగన్ మోహన్ రెడ్డిని, శ్రీరాముడితో పోలుస్తారా ? హైందవ సంస్కృతిపై ఇంతకంటే మరో దా-డి ఉంటుందా అని చంద్రబాబు ప్రశ్నించారు. ఎన్నికల ముందు ఓట్ల కోసం, నదిలో మునిగి నాటకాలు అడారని, ఇప్పుడేమో ఇలా చేస్తున్నారని అన్నారు. జగన్ మోహన్ రెడ్డి చెప్పేదానికి, చేసేదానికి పోలిక ఉండదని చంద్రబాబు అన్నారు. అపరిచితుడు సినిమాలో లాగా చేస్తున్నారాణి, చెప్పింది చెయ్యడు, చేసేది చెప్పడు అంటూ చంద్రబాబు ఫైర్ అయ్యారు. అమరావతిలో వెంకటేశ్వర స్వామి గుడి కుదించారని, గతంలో పెట్టిన దివ్యదర్శనం రద్దు చేసారని, ఇప్పుడేమో, నాటకాలు ఆడుతున్నారని చంద్రబాబు అన్నారు.