ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీకి సొంత మీడియా ఉన్న సంగతి తెలిసిందే. స్వయానా జగన్ మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులే, ఈ మీడియాను నడుపుతున్నారు. ఛానల్, పత్రికలో జగన్ మోహన్ రెడ్డి గురించి, ఆకాశానికి ఎత్తేస్తూ, కధనాలు రాస్తూ ఉంటారు. సరే అక్కడ వరకు పరవలేదు కానీ, ప్రత్యర్ధుల పై కట్టు కధలు అల్లటంలో కూడా ముందు ఉంటారు. గతంలో ప్రభుత్వంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, ఆ బులుగు మీడియా ఎన్ని అబద్ధాలు రాసినా, చూస్తూ ఊరుకోవటంతో, ఆ అబద్ధాలే నిజాలు అని ప్రజలు నమ్మి, చివరకు అధికారం వదులు కోవాల్సి వచ్చింది. అయితే ఈ తప్పు చంద్రబాబు తెలుసుకున్నారో ఏమో, ఈ మధ్య ఫేక్ మీడియా, ఫేక్ వార్తలు, ఫేక్ ఫెలోస్ అంటూ, తరుచూ,వీళ్ళు చేస్తున్న ఫేక్ ని మీడియాలో ప్రెస్ మీట్ లు పెట్టి, సోషల్ మీడియాలో చెప్తూ, ఏది నిజం , ఏది అబద్ధం అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఎన్ని చేసినా, అవతల వైపు నుంచి ఫేక్ చేయటం మాత్రం ఆపటం లేదు. తాజాగా ఆ మీడియాలో చంద్రబాబు పోలీసులను తిడుతున్నారు అంటూ ఒక వీడియో ప్రసారం చేస్తూ కధనాలు వేసారు. చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు, కుతంత్రాలు చేస్తున్నారు అంటూ, అందుకున్నారు. ఇంకేముంది, తమ ఆస్థాన ఛానల్ చెప్పటంతో, వైసీపీ సోషల్ మీడియా మొత్తం ఈ అంశం ఎత్తుకుంది. చంద్రబాబు పోలీసులని కించ పరిచారు అంటూ, గోల గోల చేస్తున్నారు.

cbn 16122020 2

చంద్రబాబు ఈ రోజు తెలుగుదేశం నాయకులతో మాట్లాడుతూ, టిడిపి శ్రేణుల పై తప్పుడు కేసులు పెడుతున్న వైనం పై స్పందిస్తూ, తప్పుడు కేసులు పెడుతున్న పోలీసులను వదిలి పెట్టొద్దు అని, వారి పై తిరిగి ప్రైవేటు కేసులు పెట్టండి, వాళ్ళు ఒకటి పెడితే మీరు నాలుగు పెట్టండి, అప్పుడే దిగి వస్తారు, అంటూ చేసిన వ్యాఖ్యలను, "తప్పుడు కేసులు" అనేది తీసేసి, పోలీసులు పై కేసులు పెట్టండి, వేధించండి అనేది మాత్రమే చూపిస్తూ వైసీపీ తప్పుడు ప్రచారం చేయటంతో, వెంటనే తెలుగుదేశం పార్టీ అలెర్ట్ అయ్యింది. దీనికి సంబంధించి పూర్తి వీడియోని తెలుగుదేశం పార్టీ విడుదల చేసింది. అందులో స్పష్టంగా, "ఆ రోజులు అయిపోయాయి, తప్పుడు కేసులు పెట్టే రోజులు. మీరు కూడా ఎదురు కేసులు పెడితే, తప్పుడు కేసులు పెట్టటం మానేసి మీ కాళ్ళ దగ్గరకు వస్తారు. ఆ మెసేజ్ కూడా ఇవ్వండి. మీ మీద కేసు పెడుతున్నాం. (తప్పుడు కేసులు పెడుతున్న వారిని ఉద్దేశించి)" అని చంద్రబాబు చెప్పిన మాటలు చూపించకుండా, ఫేక్ చేసారని, అసలు వీడియో తెలుగుదేశం విడుదల చేసింది.

జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మరో సంచలనానికి తెర లేపింది. తమకు ఎవరు అడ్డు వచ్చినా, ఎవరైనా తప్పు అని చెప్పినా, వారిని తప్పించే ప్రయత్నాలు ప్రభుత్వం చేస్తూ వస్తుంది. శాసనమండలి రద్దు చేయటం కానీ, ఎలక్షన్ కమీషనర్ గా నిమ్మగడ్డను తప్పించటం కానీ, జడ్జిల మీద ఫిర్యాదులు కానీ, మాస్కు అడిగిన ప్రభుత్వ డాక్టర్ ను తప్పించటం కానీ, ఇలా అనేకం ఉన్నాయి. రెండు నెలల క్రితం, ఏకంగా సుప్రీం కోర్టు కాబోయే చీఫ్ జస్టిస్ ని టార్గెట్ చేస్తూ, లేఖలు బయటకు వదిలారు. అలాగే హైకోర్టులో ఉన్న ఆరుగురు జడ్జిల పై ఫిర్యాదు కూడా చేసారు. ఇవన్నీ జరుగుతూ ఉండగానే, ఇప్పుడు ఏకంగా ఒక హైకోర్టు జడ్జిని తమ కేసుని వాదించకుండా తప్పించాలి అంటూ, ఫిర్యాదు చేసి సంచలనానికి తెర లేపారు. హైకోర్టులో ఈ విషయం పై అఫిడవిట్ దాఖలు చేయటంతో, ఇది ఏ పరిణామానికి దారి తీస్తుందో ఆసక్తికరంగా మారింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీవ్రమైన ఆర్ధిక ఒత్తిడిలో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ 18 నెలల్లో లక్షా 30 వేల కోట్లు అప్పులు చేసారు. అవి కూడా సరిపోక పోవటంతో, బిల్డ్ ఏపి అనే పేరు పెట్టి, రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ భూములు అమ్మేసి, డబ్బు తెచ్చుకోవాలని ప్లాన్ వేసారు. అయితే సహజంగా చివరి అస్త్రంగానే భూములు అమ్ముతారు. ఎక్కడ అప్పు పుట్టకపోతేనే ఆస్తులు అమ్ముకుంటారు. మరి ప్రభుత్వం ఇలా చేస్తే, ప్రజలు చూస్తూ ఊరుకోరు కదా.

judge 16122020 2

దీని పై హైకోర్టులో కేసు వేసారు. ఈ కేసు జస్టిస్‌ రాకేష్‌ కుమార్‌ ధర్మాసనం ముందుకు వచ్చింది. అయితే ఈ పిటీషన్ పై జస్టిస్‌ రాకేష్‌ కుమార్‌, తీవ్రంగా స్పందించారు. దేశం ఏమైనా దివాళా తీసిందా ? భూములు అమ్ముకుని బ్రతకాల్సిన పరిస్థితి ఏమి వచ్చింది, అంత దయనీయ స్థితిలో ఉన్నారా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అయితే ఈ ప్రశ్నల పై ప్రభుత్వానికి సమాధానం లేకపోవటంతో, ఈ కేసులో వ్యతిరేక తీర్పు రావటం ఖాయం అని భావించిందో ఏమో కానీ, జడ్జి జస్టిస్ రాకేష్‌ కుమార్‌ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు అంటూ, ఆయన్ను ఈ కేసు విచారణ నుంచి తప్పించాలి అంటూ, హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసారు. దీనికి సంబంధించి, పత్రికల్లో వచ్చిన వార్తలు పిటీషన్ లో జోడించారు. అయితే అసాధారణ రీతిలో, కేసు మధ్యలో ఉండగా, ఇప్పుడు జడ్జి తమకు అనుకూలంగా లేరని తప్పించమని అఫిడవిట్ వేయటం పై, హైకోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి. జస్టిస్‌ రాకేష్‌ కుమార్‌ బెంచ్ ముందే, రాజ్యాంగ విచ్ఛిన్నం కేసు కూడా ఉంది. మొత్తానికి ప్రభుత్వం, న్యాయమూర్తులు ఇచ్చే తీర్పులు గురించి అలోచించి సరి చేసుకోకుండా, తమకు వ్యతిరేకంగా తీర్పు వస్తే, న్యాయమూర్తుల పైనే ఫిర్యాదులు చేయటం పై, చర్చ జరుగుతుంది.

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో, హెబియస్ కార్పస్ పిటిషన్‍పై ఈ రోజు మళ్ళీ వాదనలు జరిగాయి. హెబియస్ కార్పస్ పిటిషన్‍పై హైకోర్టు ధర్మాసనం ఈ రోజు విచారణ నిర్వహించింది. ఇందులో, ముఖ్యంగా రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందా లేదా అనే విషయం పై, హైకోర్టులో జరుగుతున్న విచారణ పై సుప్రీం కోర్టులో, స్పెషల్ లీవ్ పిటీషన్ దాఖలు చేసామని, అంత వరకు కూడా విచారణ వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వం తరుపు న్యాయవాది హైకోర్టు ధర్మాసనం ముందు వాదించారు. అయితే స్పెషల్ లీవ్ పిటీషన్ పై, సుప్రీం కోర్టు ఎటువంటి నిర్ణయం అయినా తీసుకుందా అని చెప్పి, హైకోర్టు ప్రశ్నించింది. అయితే స్పెషల్ లీవ్ పిటీషన్ తాము దాఖలు చేసామని, సుప్రీం కోర్టు ఇంకా ఎటువంటి నిర్ణయం ప్రకటించ లేదు అని చెప్పి, ప్రభుత్వ న్యాయవాది పేర్కొన్నారు. అయితే దీని పై స్పందించిన ధర్మాసనం, సుప్రీం కోర్టు స్టే ఇస్తే అప్పుడు విచారణ ఆపుతామని చెప్పింది. ప్రస్తుతానికి మాత్రం వాదనలు కొనసాగించాలని చెప్పి ప్రభుత్వ న్యాయవాదులకు ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. అయితే రాజ్యాంగ విచ్ఛిన్నం ఏ అంశం పై జరిగిందో తాము వాదనలు వినిపిస్తామని ప్రభుత్వ తరుపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. తాము ఈ విషయం పై గతంలోనే చెప్పాం కదా అంటూ హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.

hc 16122020 2

అయితే మీరు గతంలో మౌకికంగా చెప్పారు, రాత పూర్వకంగా ఇచ్చిన ఆర్డర్స్ లో ఈ అంశం ఎక్కడా లేదు కదా అని ప్రభుత్వ తరుపు న్యాయవాది హైకోర్టుకు చెప్పారు. తమకు రాత పూర్వకంగా రాజ్యాంగ విచ్ఛిన్నం ఏ అంశం పై జరిగిందో చెప్తే, దాని పై మేము వాదనలు వినిపించటానికి కానీ, అఫిడవిట్ దాఖలు చేయటానికి కానీ తాము సిద్ధం అని ప్రభుత్వ తరుపు న్యాయవాది చెప్పారు. అయితే ఈ లోపు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటీషన్ పై, సుప్రీం కోర్టులో కూడా ఒక నిర్ణయం వచ్చే అవకాసం ఉంది అని కూడా ధర్మాసనం ముందు వివరించారు. ఈ నేపధ్యంలోనే హైకోర్టు ధర్మాసనం, ఈ కేసు విచారణను రేపటికి వాయిదా వేసింది. ఈ రోజు సుప్రీం కోర్టులో ఈ కేసు విచారణకు వస్తే, సుప్రీం కోర్టు ఆదేశాల పై హైకోర్టు రియాక్ట్ అవుతుంది. లేకపోతే రేపు విచారణ యధా ప్రకారం ఉండే అవకాసం ఉంది. ఇప్పటికే ఈ అంశం అనేక విధాలుగా మలుపులు తిరుగుతుంది. హైకోర్టు , రాష్ట్ర ప్రభుత్వం పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన తరువాత, ఈ కేసు ఎటు తిరుగుతుందో అనే ఆసక్తి నెలకొంది.

వైసిపీలో నెంబర్ 2, విజయసాయి రెడ్డి ప్రతి రోజు, తన ట్విట్టర్ లో, పోస్టులు పెడుతూ, ప్రతిపక్షాలను కవ్విస్తూ, జగన్ మోహన్ రెడ్డి పాలనకు ఓవర్ హైప్ ఇస్తూ, ట్విట్టర్ లో హడావిడి చేస్తూ ఉంటారు. ఆయన పెట్టే ట్వీట్లు మరీ దిగజారి ఉంటాయనే అభిప్రాయం ఉంది. అయినా ఆయన పంధా మార్చుకోరు. ప్రతి రోజు రెండు మూడు ట్వీట్లు వేసి, ప్రతి రోజు ప్రతిపక్షాల చేత తిట్టించుకుంటూ ఉంటారు. అయితే అదే ఉత్సాహంలో ఈ రోజు విజయసాయి రెడ్డి ఒక ట్వీట్ వేసి, అభాసుపాలు అయ్యారు. తప్పు తెలుసుకుని, వెంటనే ట్వీట్ డిలీట్ చేసారు. డిసెంబర్ 25 నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క-రో-నా వాక్సినేషన్ ప్రారంభం అవుతుంది అంటూ ట్విట్టర్ వేదికగా విజయసాయి రెడ్డి ప్రకటించారు. మొదటగా కోటి మందికి పైగా ప్రజలకు ఈ వ్యాక్సిన్ ఇస్తున్నాం అంటూ ట్వీట్ చేసారు. మొత్తం నాలుగు వేలకు పైగా కేంద్రాల్లో ఈ వ్యాక్సిన్ ఇస్తున్నాం అని విజయసాయి రెడ్డి తెలిపారు. ఇప్పటికే క-రో-నా కట్టడిలో తమ ప్రభుత్వం ఇరగదీసింది అని, కోటి మందికి పైగా టెస్ట్ లు చేసామని అన్నారు. గతంలో విజయసాయి రెడ్డి ట్వీట్ చేస్తూ, తాము వైరస్ ని ఎదుర్కుంటున్న విధానం చూసు, బ్రిటన్ లాంటి దేశాలు కూడా ప్రేరణ పొందాయని, గొప్పగా చెప్పుకున్న విషయం తెలిసిందే. అయితే విజయసాయి రెడ్డి ట్వీట్ పై అందరూ షాక్ అయ్యారు.

vsreddy 16122020 2

అసలు దేశంలో ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఏ ఒక్క వ్యాక్సిన్ కూడా అప్రోవ్ చేయలేదు. ఎప్పుడు వస్తుందో తెలియదు. ఏ కంపెనీ వ్యాక్సిన్ వస్తుందో తెలియదు. మన దేశంలో ఇంకా ప్రయోగ దశలోనే వ్యాక్సిన్ ఉంది. అయితే ఇలాంటి కీలకమైన విషయం పై, ఏదో ప్రతి రోజు వేసే ట్వీట్ లాగా, ఈ రోజు కూడా విజయసాయి ట్వీట్ వేసారు. సహజంగా ఇలాంటివి సియం కార్యాలయం కానీ, హెల్త్ సెక్రటరీ స్థాయి అధికారులు కానీ, ప్రజలకు వివరిస్తారు. ఏ హోదాలో విజయసాయి రెడ్డి ఇలా ప్రకటన చేసారో ఎవరికీ అర్ధం కాలేదు. మితిమీరి విజయసాయి రెడ్డి ట్వీట్ చేసారని విమర్శలు వచ్చాయి. మరి సియం కార్యాలయం నుంచి అక్షింతలు పడ్డాయో, లేక ఎవరు చెప్పారో కానీ, విషయం తెలుసుకుని నాలుక కరుచుకున్న విజయసాయి రెడ్డి ట్వీట్ డిలీట్ చేసారు. అయితే దీని పై ప్రతిపక్షాలు విరుచుకు పడ్డాయి. దేశంలో ఇంకా వ్యాక్సిన్ రాలేదు, మీరు మందు కనిపెట్టేసారా ? ఇది కూడా మూడు మాస్కులు లాంటిదేనా ? మాస్కులు ఇవ్వలేని మీరు, వ్యాక్సిన్ ఏమి వేస్తారు అంటూ అయ్యన్నపాత్రుడు కౌంటర్ ఇచ్చారు.

Advertisements

Latest Articles

Most Read