వైసిపీలో నెంబర్ 2, విజయసాయి రెడ్డి ప్రతి రోజు, తన ట్విట్టర్ లో, పోస్టులు పెడుతూ, ప్రతిపక్షాలను కవ్విస్తూ, జగన్ మోహన్ రెడ్డి పాలనకు ఓవర్ హైప్ ఇస్తూ, ట్విట్టర్ లో హడావిడి చేస్తూ ఉంటారు. ఆయన పెట్టే ట్వీట్లు మరీ దిగజారి ఉంటాయనే అభిప్రాయం ఉంది. అయినా ఆయన పంధా మార్చుకోరు. ప్రతి రోజు రెండు మూడు ట్వీట్లు వేసి, ప్రతి రోజు ప్రతిపక్షాల చేత తిట్టించుకుంటూ ఉంటారు. అయితే అదే ఉత్సాహంలో ఈ రోజు విజయసాయి రెడ్డి ఒక ట్వీట్ వేసి, అభాసుపాలు అయ్యారు. తప్పు తెలుసుకుని, వెంటనే ట్వీట్ డిలీట్ చేసారు. డిసెంబర్ 25 నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క-రో-నా వాక్సినేషన్ ప్రారంభం అవుతుంది అంటూ ట్విట్టర్ వేదికగా విజయసాయి రెడ్డి ప్రకటించారు. మొదటగా కోటి మందికి పైగా ప్రజలకు ఈ వ్యాక్సిన్ ఇస్తున్నాం అంటూ ట్వీట్ చేసారు. మొత్తం నాలుగు వేలకు పైగా కేంద్రాల్లో ఈ వ్యాక్సిన్ ఇస్తున్నాం అని విజయసాయి రెడ్డి తెలిపారు. ఇప్పటికే క-రో-నా కట్టడిలో తమ ప్రభుత్వం ఇరగదీసింది అని, కోటి మందికి పైగా టెస్ట్ లు చేసామని అన్నారు. గతంలో విజయసాయి రెడ్డి ట్వీట్ చేస్తూ, తాము వైరస్ ని ఎదుర్కుంటున్న విధానం చూసు, బ్రిటన్ లాంటి దేశాలు కూడా ప్రేరణ పొందాయని, గొప్పగా చెప్పుకున్న విషయం తెలిసిందే. అయితే విజయసాయి రెడ్డి ట్వీట్ పై అందరూ షాక్ అయ్యారు.

vsreddy 16122020 2

అసలు దేశంలో ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఏ ఒక్క వ్యాక్సిన్ కూడా అప్రోవ్ చేయలేదు. ఎప్పుడు వస్తుందో తెలియదు. ఏ కంపెనీ వ్యాక్సిన్ వస్తుందో తెలియదు. మన దేశంలో ఇంకా ప్రయోగ దశలోనే వ్యాక్సిన్ ఉంది. అయితే ఇలాంటి కీలకమైన విషయం పై, ఏదో ప్రతి రోజు వేసే ట్వీట్ లాగా, ఈ రోజు కూడా విజయసాయి ట్వీట్ వేసారు. సహజంగా ఇలాంటివి సియం కార్యాలయం కానీ, హెల్త్ సెక్రటరీ స్థాయి అధికారులు కానీ, ప్రజలకు వివరిస్తారు. ఏ హోదాలో విజయసాయి రెడ్డి ఇలా ప్రకటన చేసారో ఎవరికీ అర్ధం కాలేదు. మితిమీరి విజయసాయి రెడ్డి ట్వీట్ చేసారని విమర్శలు వచ్చాయి. మరి సియం కార్యాలయం నుంచి అక్షింతలు పడ్డాయో, లేక ఎవరు చెప్పారో కానీ, విషయం తెలుసుకుని నాలుక కరుచుకున్న విజయసాయి రెడ్డి ట్వీట్ డిలీట్ చేసారు. అయితే దీని పై ప్రతిపక్షాలు విరుచుకు పడ్డాయి. దేశంలో ఇంకా వ్యాక్సిన్ రాలేదు, మీరు మందు కనిపెట్టేసారా ? ఇది కూడా మూడు మాస్కులు లాంటిదేనా ? మాస్కులు ఇవ్వలేని మీరు, వ్యాక్సిన్ ఏమి వేస్తారు అంటూ అయ్యన్నపాత్రుడు కౌంటర్ ఇచ్చారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read