ఆంధ్రప్రదేశ్ శాసనసభ గత అయుదు రోజులుగా జరుగుతుంది. అయితే అయుదు రోజులు తెలుగుదేశం ఎమ్మెల్యేలు సస్పెండ్ అయ్యారు. మొదటి రోజు పంటకు కట్టే క్రాప్ ఇన్సురన్సు ఎందుకు కట్టలేదు అంటే సస్పెండ్ చేసారు, రెండో రోజు పేదలకు టిడ్కో ఇళ్లు అడిగితే సస్పెండ్ అన్నారు, మూడో రోజు పోలవరం నిధులు పై కేంద్రం పై ఎందుకు ఒత్తిడి తేవటం లేదు అంటే సస్పెండ్ చేసారు, నిన్న 250 రూపాయల పెన్షన్ ఎప్పుడు ఇస్తున్నారు అంటే సస్పెండ్ అన్నారు, ఈ రోజు నరేగా నిధుల పై అడిగితె సస్పెండ్ చేసారు. మొత్తానికి తెలుగుదేశం పార్టీ వాయిస్ వినిపించకుండా, వైసీపీ ఈ అయుదు రోజులు అసెంబ్లీ కానిచ్చేసింది అనే చెప్పాలి. అయితే వైసీపీ మాత్రం, ప్రజలు ఎదుర్కుంటున్న వాటి పై కాకుండా, మేము చాలా అద్భుతంగా చేసాం అని చెప్పటానికే, అసెంబ్లీ ఉపయోగించుకుని, సెల్ఫ్ భజన చేసుకున్నట్టు కనిపించింది. ఇదే సందర్భంలో ప్రతిపక్షాల పై దాడి చేసారు. అయితే ఈ సందర్భంగా నిన్న జగన్ మోహన్ రెడ్డి పెన్షన్ విషయాలు చెప్తూ, రామానాయుడు తప్పుడు సమాచారం ఇచ్చారని, తాము 45 ఏళ్ళకు పెన్షన్ అని చెప్పలేదని, మా మ్యానిఫెస్టో లో అలా లేదని, ఇప్పటికే ఈ విషయం పై ఒకసారి క్లారిటీ ఇచ్చిన తరువాత కూడా, రామానాయుడు తప్పుడు సమాచారం ఇచ్చారు కాబట్టి, ఆయన పై ప్రివిలేజ్ నోటీస్ ఇవ్వాలని సభలో చెప్పారు. దీనికి స్పీకర్ కూడా ఒప్పుకున్నారు.

jagan 04122020 2

అయితే ఇదే విషయం చెప్తూ, జగన్ మోహన్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేసారు. తెలుగుదేశం హయంలో పెన్షన్ లు కేవలం 44 లక్షలు మాత్రమే అని, దాన్ని మేము 60 లక్షలకు పైగా చేసాం అని చెప్పుకొచ్చారు. అయితే గతంలో తెలుగుదేశం హయాంలో 54 లక్షల పెన్షన్ లు ఇచ్చారు. ఇదే విషయం పై చంద్రబాబు నిన్న ప్రెస్ మీట్ లో చెప్పారు. గతంలో ఇచ్చిన వివరాలు చెప్తూ, ఆ సంఖ్యను జగన్ వచ్చిన తరువాత తగ్గించి, మళ్ళీ పెంచారని చెప్పుకొచ్చారు. అయితే జగన్, రామానాయుడు వ్యాఖ్యలు పై ప్రినిలేజ్ నోటీస్ ఇస్తాం అని చెప్పటంతో, దీనికి కౌంటర్ గా తెలుగుదేశం కూడా రంగంలోకి దిగింది. నిన్న జగన్ మోహన్ రెడ్డి తప్పుడు సమాచారం ఇచ్చి, తప్పుదోవ పట్టించారని, అందుకే ఆయన పై ప్రివిలేజ్ మోషన్ ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుంది. జగన్ మోహన్ రెడ్డి సభను తప్పుదోవ పట్టించారని, జగన్‍పై సభాహక్కుల ఉల్లంఘన చర్యలు తీసుకోవాలని స్పీకర్ ని కలిసి తెలుగుదేశం పార్టీ నేతలు, ప్రివిలేజ్ మోషన్ నోటీసు ఇవ్వనున్నారు. ఈ రకంగా అయినా చర్చ జరిగి ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయని తెలుగుదేశం భావిస్తుంది.

విజయవాడ స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాద ఘటనలో డా.రమేశ్ బాబు పోలీస్ కస్టడీపై ఆస్పత్రి మేనేజర్ రాజశేఖర్ వివరణ ఇచ్చారు. జిల్లా ప్రభుత్వ యంత్రాంగం విజ్ఞప్తి మేరకు కోవిడ్ రోగులకు వైద్యం అందించేందుకు మొట్టమొదటగా మా ఆస్పత్రి ముందుకొచ్చిందని ఆయన తెలిపారు. అయితే స్వర్ణ ప్యాలెస్ హోటల్ లో కోవిడ్ సెంటర్ నడిపేందుకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అనుమతిచ్చారని స్పష్టం చేసారు. రోగులకు సౌకర్యాల కల్పన, అద్దె వసూలు చేసుకునే విధంగా స్వర్ణ ప్యాలెస్ హోటల్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస్ ఒప్పందం చేసుకున్నారాని అన్నారు. ఈ ఒప్పందానికి సంబంధించిన ఆధారాలను పోలీసులకు అందించాం అని తెలిపారు, రమేష్ ఆస్పత్రి మేనేజర్ రాజశేఖర్. అగ్ని ప్రమాదంలో, వైద్యం చేయటానికి వచ్చిన రమేష్ హాస్పిటల్స్ కు సంబంధం ఉండదని, పర్మిషన్ ఇచ్చిన అధికారులకు, అలాగే హోటల్ యాజమాన్యానికి సంబంధం ఉంటుందని, ఇప్పటికే కోర్టులో వాదనలు వినిపించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో భారీ షాక్ తగిలింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తమకు ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహణ కష్టం అని, అందుకే ఎన్నికలు వాయిదా వేయాలి అంటూ, హైకోర్టులో పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం వేసిన పిటీషన్ పై , ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఫిబ్రవరిలో ఎన్నికల నిర్వహణకు నిర్ణయం తీసుకున్న విషయం పై స్టే ఇవ్వాలని ప్రభుత్వం కోరింది. ప్రభుత్వం తమ వాదనలు వినిపిస్తూ కొన్ని ప్రధానమైన అంశాలు పేర్కొంది. క-రో-నా నేపధ్యంలో చాలా మంది అధికారులు, పోలీసులకు క-రో-నా వ్యాప్తి చెందింది. సుమారుగా 11 వేల మంది అధికారులు కానీ, పోలీసులు కానీ వైరస్ బారిన పడ్డారని, ప్రధానంగా కోర్టు దృష్టికి తెచ్చారు. అదే విధంగా గత ఏడాది ఎన్నికలు జరపాల్సిన టైంలో, వైరస్ వ్యాప్తి చెందుతుందనే ఉద్దేశంతో, రాష్ట్ర ఎన్నికల సంఘం వాయిదా వేసిందని, ఇప్పుడు వ్యాప్తి ఎక్క్వుగా ఉన్న సమయంలో, ఎన్నికల నిర్వహణ కష్టం అని కోర్టుకు తెలిపారు. మరో వైపు, అక్టోబర్ లో రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసిన రాష్ట్ర ఎన్నికల కమిషన్ అనంతరం, కొన్ని సమీక్షలు జరిపి, అందరి అభిప్రాయం తీసుకుని, మెజారిటీ అభిప్రయం ప్రకారం, ఎన్నికల నిర్వహణకు మొగ్గు చూపారు. అలాగే ఫిబ్రవరిలో ఎన్నికల నిర్వహణకు ప్రొసీడింగ్స్ ఇచ్చారు. అయితే దీని పై చీఫ్ సెక్రటరీ ఉత్తరం రాస్తూ, తాము ఈ పరిస్థితిలో ఎన్నికలు నిర్వహించలేమని, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు తెలిపారు. అయితే తమ అభిప్రాయం పరిగణలోకి తీసుకోకుండా, ఎన్నికల కమిషన్ ముందుకు వెళ్తుందని, అందుకే ఈ ఎన్నికల ప్రక్రియ నిలిపి వేయాలని తెలిపారు.

hc 03122020 2

ప్రస్తుతం రెండో వేవ్ కూడా వస్తుందని అంటున్నారని, అందుకే తగు జాగ్రత్తలు తీసుకుంటూ, ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయం పై స్టే ఇవ్వాలని కోరారు. అయితే హైకోర్టు మాత్రం, ఈ విషయంలో తాము స్టే ఇవ్వలేమని తేల్చి చెప్పింది. తదుపరి విచారణ రేపు చేస్తాం అని, కోర్ట్ తెలిపింది. ప్రభుత్వం తరుపు సంప్రదించి మరిన్ని వివరాలు రేపు ఇస్తామని, రేపు కూడా వాదిస్తామని ప్రభుత్వం తరుపు న్యాయవాది చెప్పటంతో, హైకోర్టు ఒప్పుకుంది. మరో వైపు రాష్ట్ర ఎన్నికల కమిషన్ తరుపు వాదనలు వినిపిస్తూ, బీహార్ లాంటి చోట అసెంబ్లీ ఎన్నికలే నిర్వహించారని, హైదరాబాద్ లో కూడా ఎన్నికలు జరిగాయని, ప్రస్తుతం రాష్ట్రంలో కూడా కేసులు బాగా తగ్గిపోయాయని, అంతే కాకుండా చాలా రాజకీయ పార్టీలు, క-రో-నా నిబంధనలు పాటిస్తూ, ఎన్నికలు జరపటానికి అభ్యంతరం లేదని చెప్పారని తెలిపాయి. ఈ నేపధ్యంలో రేపు విచారణ వాయిదా పడటంతో, రేపు మరిన్ని వివరాలు తెలిసే అవకాసం ఉంది.

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ రోజు చేసిన ప్రకటన పై స్పందించారు. ఈ రోజు అసెంబ్లీలో జరిగిన పరిణామాల పై చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా విలేఖరులు అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పారు. ఈ సందర్భంగా ఈ రోజు రజినీకాంత్ తాను పొలిటికల్ పార్టీ పెడుతున్నట్టు చేసిన ప్రకటన గురించి విలేఖరులు చంద్రబాబుని ప్రశ్నించారు. ఆయన్ను అభిప్రాయం అడిగారు. ఈ సందర్భంగా చంద్రబాబు స్పందిస్తూ, ప్రజాస్వామ్యంలో ఎవరు రాజకీయ పార్టీ పెట్టినా స్వాగాతించాలని అన్నారు. రజినీకాంత్ తనకు మంచి మిత్రుడని చంద్రబాబు అన్నారు. ఆయన రాజకీయాల్లోకి రావటాన్ని స్వాగతిస్తున్నానని చంద్రబాబు అన్నారు. అలాగే ఆయన రాణించాలని కోరుకుంటున్నానని అన్నారు. ఈ రోజు రజినీకాంత్ తన పొలిటికల్ ఎంట్రీ పై స్పందించారు. గత కొన్ని రోజులుగా పార్టీ పై వస్తున్న ఊహాగానలకు ఫుల్ స్టాప్ పెడుతూ, తాను రాజకీయాల్లోకి వస్తున్నా అని, కొత్త పార్టీ పెడుతున్నా అని, వచ్చే ఏడాది జనవరిలో పార్టీ అనౌన్స్మెంట్ ఉంటుందని చెప్పారు. ఈ ప్రకటన పై ఈ రోజు మీడియా అడిగిన ప్రశ్నకు చంద్రబాబు తన అభిప్రయం చెప్పారు.

Advertisements

Latest Articles

Most Read