ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి తెలిసిన వారు, చంద్రబాబు నైజం గురించి తెలియని వారు ఉండరు. చాలా తక్కువ సందర్భాల్లో చంద్రబాబు సహనం కోల్పోతారు. ఇక అసెంబ్లీలో అయితే చంద్రబాబు ఎప్పుడూ నిరసన తెలపలేదు. ఎమ్మెల్యేలు నిరసన చేస్తారు కానీ, ఎప్పుడూ చంద్రబాబు నిరసన తెలపలేదు. అయితే చరిత్రలో మొదటిసారి చంద్రబాబు అసెంబ్లీలో నిరసన తెలిపారు. రైతులు తుఫాన్ వల్ల తీవ్రంగా నష్టం జరిగిందని, దాని పై తనకు మాట్లాడే అవకాసం ఇవ్వాలని, రైతులు తీవ్రంగా నష్టపోయారని, వారి సమస్యలు ప్రభుత్వ దృష్టికి తేవాలని చంద్రబాబు కోరినా, ఆయనకు మాట్లాడే అవకాసం ఇవ్వలేదు. దీంతో చంద్రబాబు రైతుల కష్టాల గురించి ప్రభుత్వానికి చెప్పాలని, రైతులు ఎదుర్కుంటున్న ఇబ్బందులు చెప్పాలని, అవకాసం ఇవ్వాలని చెప్పినా , ఇవ్వకపోవటంతో, రైతుల తరుపున చంద్రబాబు స్పీకర్ ముందు బైఠాయించారు. ముందుగా కన్నబాబు తమ ప్రభుత్వం ఇది చేసింది , అది చేసింది, తమ ప్రభుత్వంలో రైతులు చాలా సంతోషంగా ఉన్నారు, రైతులు తమ ప్రభుత్వం పై సంతోషంగా ఉన్నారని, మంత్రి చెప్పారు. అయితే మంత్రి సమాధానం పై నిమ్మల రామానాయుడు స్పందిస్తూ, రైతులు ఎదుర్కుంటున్న ఇబ్బందులు గురించి చెప్తూ ఉండగా, జగన్ మోహన్ రెడ్డి కల్పించుకుని, నిమ్మల రామానాయడుకు కౌంటర్ ఇచ్చారు.

cbn 301120202

అయితే జగన్ సమాధానం పై చంద్రబాబు, తనకు మాట్లాడే అవకాసం ఇవ్వాలని కోరారు. రైతులు ఎదుర్కుంటున్న ఇబ్బందులు గురించి తమకు మాట్లాడే అవకాసం ఇవ్వాలని కోరగా, అవకశం ఇవ్వలేదు. స్పీకర్ కు చంద్రబాబుకు మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. అయితే ఈ సందర్భంలో జోక్యం చేసుకున్న జగన్ మోహన్ రెడ్డి, నిమ్మల రామానాయడుకి సమాధానం ఇచ్చాం కాబట్టి, ఆయనే మాట్లాడాలని, చంద్రబాబుకి మాట్లాడే అవకాసం ఎలా ఇస్తాం అంటూ ఆయనకు ఇవ్వటానికి వీలు లేదని జగన్ అన్నారు. దీంతో రైతుల తరుపున మాట్లాడే అవకాసం ఇవ్వకపోవటంతో, చంద్రబాబు స్వయంగా అసెంబ్లీ స్పీకర్ ముందు కింద కూర్చుని , నిరసన తెలిపారు. తుఫాను వల్ల నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని, రైతుల కష్టాల గురించి, మాట్లాడే అవకాసం ఇవ్వాలని నిరసన తెలిపారు. అయితే ఆయానకు మాట్లాడే అవకాసం ఇవ్వకూడదు అని, అది సాంప్రదాయం కాదని, తాము ఇంకా బిజినెస్ చేసుకోవాలని, వారిని సభ నుంచి సస్పెండ్ చేయాలనీ, జగన్ కోరారు. దీంతో రైతులు సమస్యల పై ప్రతిపక్షం మాట్లాడకుండానే అందరినీ సస్పెండ్ చేసారు.

ఈ రోజు ఉదయం మంత్రి పేర్ని నాని పై ఒక తాపీ మేస్త్రి దా-డి చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ దాడిలో మంత్రికి ఏమి అవ్వలేదు. అయితే తాపీ మేస్త్రి ఎందుకు ఈ దాడి చేసారు అనే విషయం పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రాధమికంగా అతను మద్యం తాగి ఉన్నాడని, పనులు లేక ఇబ్బందులు పడుతూ, మంత్రిని టార్గెట్ చేసారని వార్తలు వచ్చాయి. అయితే పోలీసులు ఇంకా పూర్తి స్థాయి విచారణ చేస్తున్నారు. ఈ ఘటన పై పూర్తి వివరాలు ఇంకా చెప్పలేదు. అయితే వైసీపీ నేతలు మాత్రం, ఇందలో కూడా రాజకీయ కోణం తెచ్చారు. ఆ తాపీ మేస్త్రి, వైసీపీ లోకల్ నేతకు ఏదో చుట్టం అని, తెలుగుదేశం పార్టీ ఈ దా-డి చేపించిందని, దీని వెనుక కొల్లు రవీంద్ర ఉన్నారు అంటూ ప్రచారం మొదలు పెట్టారు. అయితే ఇంకా పోలీసులు ఈ విషయం పై క్లారిటీ ఇవ్వాల్సి ఉండి. ఇద ఇలా ఉండగా, తన పై జరుగుతున్న ప్రచారం పై కొల్లు రవీంద్ర తీవ్రంగా స్పందించారు. దీని పై ఒక ప్రెస్ నోట్ విడుదల చేసి, వైసీపీ ప్రచారం ఖండించారు. ఆ ప్రెస్ నోట్ ఇదే " వైసీపీ సృష్టించిన కృత్రిక ఇసుక కొరత వల్ల 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారు. మంత్రి పేర్ని నాని వద్ద నిరసన తెలిపిన బడుగు నాగేశ్వరరావు టీడీపీకి చెందిన వాడని వైసీపీ నేతలు దుష్పరచారం చేయడం దుర్మార్గం. పనుల్లేక పస్తులుండటంతోనే కార్మికునిగా తన ఆవేదన తెలిపారు. అతను టీడీపీ చెందిన వ్యక్తి అని ప్రచారం చేయడాన్ని ఖండిస్తున్నాం."

kollu 29112020 2

" మొన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంటిని, నేడు మంత్రి అవంతి శ్రీనివాస్ ఇంటిని ముట్టడించి కార్మికులు నిరసన తెలిపారు. ఇసుకాసురులను జగన్ రెడ్డి ప్రభుత్వం పెంచి పోషిస్తోంది. ఇసుక సక్రమంగా అందడం లేదనడానికి భవన నిర్మాణ కార్మికులు రోడ్డెక్కి నిరనన తెలపడమే ప్రత్యక్ష సాక్ష్యం. వైసీపీ నేతలు సృష్టించిన కృత్రిమ కొరతతో 60 మంది భవన నిర్మాణ కార్మికుల మరణించారు. దీనికి వైసీపీ నాయకులు ఏం సమాధానం చెప్తారు. 18 నెలలుగా భవన కార్మికులకు పనుల లేకుండా చేసి వారి పొట్టగొట్టారు. పునాదుల్లోకి వెళ్లాల్సిన ఇసుక వైసీపీ నేతల బ్లాక్ మార్కెట్ లోకి వెళ్తోంది. ఒక్క రోజన్నా మంత్రులు కూర్చుని ఇసుక సమస్యపై మాట్లాడారా? దొరికినకాడికి ఇసుకను వైసీపీ అండ్ కో బొక్కుతోంది. నిర్మాణ రంగాన్ని జగన్ రెడ్డి ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. దోచుకోవడానికి ఇబ్బంది ఎదరవుతోందని రోజుకో పాలసీని తెరపైకి తెస్తున్నారు. సామాన్య కార్యకర్త నుండి ముఖ్యమంత్రి వరకూ ఇసుక దోపిడీలో భాగమయ్యారు. అధికారం మళ్లీ రాదన్న భయంతో కుంభకరుల మాదిరి తింటున్నారు. ఒక్క భవన నిర్మాణ కార్మికులే కాదు.. ప్రతి ఒక్కరూ జగన్ పాలనపై వ్యతిరేకతతో ఉన్నారు." అంటూ తన ప్రెస్ నోట్ లో తెలిపారు.

మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, ఈ రోజు పోలవరం ప్రాజెక్ట్ పై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యపు వైఖరిని, అలాగే జగన్ మోహన్ రెడ్డి కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించటం లేదు అంటూ, ప్రెస్ మీట్ పెట్టి, ఎండగట్టారు. పోలవరం విషయంలో మీకు మొత్తం ఇచ్చేది 20 వేల కోట్లే అని కేంద్రం లేఖ రాసిందని ఉండవల్లి అన్నారు. ఇందులో ఇంకా కేవలం 7 వేల కోట్లు ఇస్తే సరిపోతుందని, కేంద్రం చెప్పిందని ఉండవల్లి అన్నారు. జల శక్తి మంత్రి శాఖ నుంచి, ఆంధ్రప్రేదేశ్ ప్రభుత్వానికి వచ్చిన లేఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇది అవమానించాల్సిన లేఖ అని అన్నారు. పార్లమెంట్ లో చేసిన చట్టాన్ని చెత్త బుట్టలో వేసి, వీళ్ళు ఇలా లేఖ మన మొఖాన కొట్టారని ఉండవల్లి అన్నారు. చంద్రబాబు ఉన్నంత కాలం ఇలాంటి లేఖ రాకుండా ఆయన జాగ్రత్త పడ్డారేమో కానీ, ఇప్పుడు మాత్రం డైరెక్ట్ గా లేఖ రాసారని, దీని పై ఇప్పుటి ప్రభుత్వం ఎందుకు మాట్లాడటం లేదని ఉండవల్లి అన్నారు. అంగుళం కూడా తగ్గదని మంత్రులు అంటున్నారని, అసలు చర్చ ఇది కాదని, ఎత్తు ఎంత కడతారు అనేది చర్చ కాదని, అది ఎలాగూ అయిపోయింది, నీరు ఎంత నిలుపుతారు అనేది ఇక్కడ చర్చ అని ఉండవల్లి అన్నారు. 45 మీటర్లకు నీళ్ళు నిలిపితేనే, పోలవరం ప్రాజెక్ట్ ఉపయోగం అని, ఇన్నాళ్ళు పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కాలేదు అంటూ, ఈ 45 మీటర్లకు నిలిపితే, ముంపు ప్రాంతం ఉంటుంది కాబట్టి, ఇప్పటి వరకూ లేట్ అవుతూ వచ్చిందని, ఇక్కడ ఎత్తు సమస్య కాదని అన్నారు. పార్లమెంట్ లో చేసిన బిల్లులో, పోలవరం విషయంలో చట్టం చేసారని అన్నారు.

undvalli 28112020 2

పార్లమెంట్ లో చేసిన చట్టాన్ని, ఎదో క్యాబినెట్ లో నిర్ణయం తీసుకుందని అంటున్నారని, 2017 కేబినెట్‌ నోట్‌లో అసలు ఏముందని, ఈ హడావిడి చేస్తున్నారని అన్నారు. రాష్ట్రానికి ఇంత అన్యాయం జరుగుతుంటే, జగన్ మోహన్ రెడ్డి ఎందుకు స్పందించటం లేదని అన్నారు. ప్రతిపక్షాలు అంటున్నట్టు, నిజంగానే సిబిఐ కేసులకు జగన్ భయపడుతున్నారా అని ప్రశ్నిస్తూ, జగన్ ఇలాగే ఉంటే, ఆ ప్రచారం నిజం అని ప్రజలు నమ్ముతారని, ఇంత బలమైన ప్రభుత్వం ఉంచుకుని కూడా, పోలవరం ప్రాజెక్ట్ కు ఇంత అన్యాయం జరుగుతుంటే, ఎందుకు కేంద్రాన్ని నిలదీయటం లేదని అన్నారు. పోలవరం ప్రాజెక్ట్ చంద్రబాబు ఎందుకు కడుతున్నారని, పాదయాత్రలో చెప్పిన జగన్, ఇప్పుడు ఎందుకు కేంద్రానికి ఇవ్వలేదని ప్రశ్నించారు. అసలు పోలవరం పై మీ పార్టీ స్టాండ్ ఏమిటి ? పోలవరం పై ఒక శ్వేత పత్రం విడుదల చేయండని ఉండవల్లి అన్నారు. ఇక రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగటం లేదని, అన్నీ నవరత్నాలు అంటూ హడావిడి చేస్తున్నారని, నవరత్నాలే ఓట్లు వేస్తాయని నమ్ముతున్నారని, ఉపాధి లేకుండా నవరత్నాలు ఎందుకని ప్రశ్నించారు. రాష్ట్రంలో రోడ్డుల పరిస్థితి అధ్వాన్నంగా ఉన్నాయని ఉండవల్లి అన్నారు. మొత్తానికి, జగన్ మోహన్ రెడ్డి పై ఉండవల్లి కొద్దిగా డోస్ పెంచారు.

ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన పత్రికా ప్రకటనలు చూసి అందరూ షాక్ అయ్యారు. కొత్త పుంతలు తొక్కుతున్న రాజకీయం చూసి షాక్ అయ్యారు. ఎక్కడైనా ప్రజల డబ్బుతో, రాజకీయ ప్రచారం చేయటం ఎప్పుడైనా చూసామా ? బహుసా చరిత్రలో మొదటి సారి ఆ రికార్డు ని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం బ్రేక్ చేసింది. రాజకీయ నాయకులు అంటే, ఇలా అత్యుత్సాహం చూపిస్తారని అనుకోవచ్చు, మరి ప్రభుత్వం అధికారులు ఏమి చేస్తున్నట్టు ? తెలిసి తెలిసి ఇలాంటి ప్రకటనలు ఎందుకు ఒప్పుకున్నారు ? రేపు ఈ విషయం కోర్టుకు వెళ్తే జగన్ మోహన్ రెడ్డికి, ఆయన మంత్రులకు ఏమి అవ్వదు, బలి అయ్యేది అధికారులే. ఇక విషయానికి వస్తే, గత ప్రభుత్వం, దాదాపుగా 7 లక్షలు పైగా టిడ్కో ఇళ్లు పూర్తి చేసింది. కేవలం చిన్న చిన్న పనులు మిగిలి ఉన్నాయి. చాలా వరకు అలాట్మెంట్ కూడా అయిపొయింది. ఇవి మొత్తం మూడు క్యాటగిరీలు ఉంటాయి, 300 చదరపు అడుగులు, 365 చదరపు అడుగులు, 430 చదరపు అడుగులు. వీటికి కేంద్రం లక్షన్నర ఇస్తే, అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 2.5 లక్షలు ఇచ్చింది. మొత్తం లోపల మంచి మెటీరియల్ తో, ఒక గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్ మెంట్ లాగా పార్క్, హెల్త్ కేసు సెంటర్, అంగన్వాడీ సెంటర్, ఓపెన్ జిం, ఇలా అనేక సౌకర్యాలతో గత ప్రభుత్వం నిర్మించింది. మిగతా డబ్బులు, లబ్దిదారులు లోన్ రూపంలో కట్టుకోవాలని చెప్పింది. అయితే 2019 ఎన్నికల్లో అటు చంద్రబాబు, ఇటు జగన్ కూడా తమ మ్యానిఫెస్టో లో, ఆ లోన్ లేకుండా రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజలు జగన్ వైపు మొగ్గి, ఆయన్ను గెలిపించారు.

jagan 29112020 2

ఎన్నికల్లో గెలిచి 18 నెలలు అయ్యింది. ఇస్తానన్న ఇళ్లు ఇవ్వటం లేదు. చేస్తానన్న రుణ మాఫీ హామీ అమలు చేయటం లేదు. సహనం నశించిన లబ్దిదారులు ఉద్యమ బట పట్టారు. రాజకీయ పార్టీలు వీరికి తోడు అయ్యాయి. దీంతో ప్రభుత్వం పై ఒత్తిడి రావటంతో, ఇప్పుడు రాజకీయం చేసి, ప్రజలను గందరగోళ పరుస్తున్నారు. చంద్రబాబు స్కీం కావాలా, జగన్ స్కీం కావాలా అంటూ ఈ రోజు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పేపర్ ప్రకటనలు ఇచ్చారు. ఇందులో చంద్రబాబు ఏంటి, జగన్ ఏంటి ? అవి ప్రజల డబ్బులు. పేదలకు ఇళ్లు ఇచ్చినా, ఇవ్వకపోయినా చంద్రబాబుకు పోయేది ఏమి ఉండదు. ఏది చేసినా అది జగన్ ప్రభుత్వానికి పేరు వచ్చేది. మరి చంద్రబాబు పేరు చెప్పి, ఈ రాజకీయ ప్రకటనలు ఏమిటి ? మీరు ఎన్నికల హామీల్లో రుణాలు అన్నీ రద్దు చేస్తానని, దీర్ఘాలు తీసుకుని చెప్పారు కదా, మరి ఇప్పుడు కేవలం 10 శాతం మాత్రమే ఉండే, 300 చదరపు అడుగులు ఇళ్లు రూపాయకు ఇస్తాం అని చెప్పటం ఏమిటి ? మిగతా 90 శాతం మంది పరిస్థితి ఏమిటి ? అవి బాబు స్కీంలోనే ఉంచుతారా ? అసలు ఈ చంద్రబాబు గోల ఏమిటి ? అధికారం మీది, మీరు ఏమి చేస్తారో చెప్పకుండా, అది కావాలా, ఇది కావాలా అని ప్రజలను అడగటం చూస్తుంటే, అసలు టిడ్కో ఇళ్లు ప్రభుత్వానికి ఇచ్చే ఉద్దేశం ఉందా అనే అనుమానం కలుగుతుంది. ప్రభుత్వ ప్రకటనల్లో రాజకీయ ప్రసంగాలు చూసి అందరూ షాక్ అవుతున్నారు. ఇచ్చినా, ఇవ్వకపోయినా చంద్రబాబుకి ఒరిగేది ఏమి ఉండదు, ఈ చంద్రబాబు ఫోబియా, 18 నెలలు అధికారంలోకి వచ్చిన తరువాత కూడా పోకుండా, ఆయనకు పుబ్లిసిటీ ఇవ్వటం ఏమిటో. ఈ సలహాదారులు నిజంగా గొప్ప వాళ్ళే.

Advertisements

Latest Articles

Most Read