పవన్ కళ్యాణ్‌ని ప్యాకేజీ స్టార్ అని రోజూ విష ప్రచారం చేసే వైసీపీ కోసం పనిచేసే అసలు సిసలు ప్యాకేజీ స్టార్ ముద్రగడ పద్మనాభం అని సాక్ష్యాధారాలతో వెల్లడైంది. కాపు ఉద్యమం మాటున్న ఇన్నాళ్లూ వైసీపీ కోసం పనిచేసిన ముద్రగడ ఒక లెటర్‌తో ముసుగు తీసేసి తాను వైసీపీ ప్యాకేజీ స్టార్‌ని అని ప్రకటించుకున్నారు. వారాహి యాత్రలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడలో పర్యటించారు. ఈ సందర్భంగా కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అవినీతి-దాష్టీకాలపై ధ్వజమెత్తారు. దీనిపై కౌంటర్ ద్వారంపూడి ఇచ్చారు. వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్‌నీ తిట్టారు, వార్నింగులు ఇచ్చారు. ఇంతవరకూ బాగానే ఉంది. వైసీపీ నేత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శిస్తే ముద్రగడ పద్మనాభంకి ఏంటో నొప్పి అంటున్నారు జనసైనికులు. కాపుల కోసమే తన జీవితం అంకితం అని, కాపుల కోసం ప్రాణం ఇస్తాననే ముద్రగడ...రెడ్ల కోసం ఊడిగం చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపణలపై వైసీపీ నేతలు స్పందించడంలో అర్థం ఉందని, కాపు ఉద్యమనేతననే చెప్పుకునే ముద్రగడ వైసీపీ కోసం ఎందుకు స్పందిస్తున్నారని జనసైనికులు ప్రశ్నిస్తున్నారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాపు కాదు, రెడ్డి. ఆయన కోసం ముద్రగడ గుడ్డలు చించుకుని దీర్ఘాలతో ఉత్తరాలు రాయడం ఏంటని నిలదీస్తున్నారు.
ముద్రగడ పద్మనాభం లెటర్ హెడ్ పోయిందని, అది తాడేపల్లి ప్యాలెస్‌లో ఉందని..దానిపై తమకు నోటికొచ్చింది వారు రాసుకుంటున్నా ఏమీ అనలేని నిస్సహాయస్థితిలో వైసీపీ ప్యాకేజీ స్టార్ పద్మనాభం ఉన్నారని జనసేన ఆరోపిస్తోంది. రేషన్ మాఫియా డాన్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిది గౌరవప్రదమైన కుటుంబం అంటోన్న ముద్రగడ పద్మనాభం...కాపులు ఎంతగానో ప్రేమిస్తూ, ప్రజాసేవ కోసం కోట్లు ఖర్చు చేస్తోన్న పవన్ కళ్యాణ్ ది గౌరవనీయమైన కుటుంబం కాదా అని జనసైనికులు ముద్రగడని ప్రశ్నిస్తున్నారు. ముద్రగడ పద్మనాభం లేఖని వైసీపీ సోషల్ మీడియా ఇన్చార్జిలు విడుదల చేయడం, వైసీపీ సోషల్ మీడియా గ్రూపులన్నీ ముద్రగడ లెటర్‌ని ప్రముఖంగా పోస్ట్ చేయడం చూస్తుంటే...వైసీపీ కోసం పనిచేసే అసలు సిసలు లెటర్ ప్యాకేజీ స్టార్ ముద్రగడ పద్మనాభమేనని తేలుతోందని జనసేన అంటోంది.
news
ఆర్ఆర్ఆర్ పైకి ఆదిపురుష్ ప్రయోగం సక్సెస్ అవుతుందా?
భారతదేశ సినీ చరిత్రని తిరగరాసింది ఆర్ఆర్ఆర్. వైకాపా కోటలో కలవరం పుట్టిస్తోంది మరో ఆర్ఆర్ఆర్. ఆయనే వైసీపీ రెబల్ ఎంపీ రఘు రామకృష్ణం రాజు. వైసీపీ టికెట్ పై నర్సాపురం ఎంపీగా గెలిచినా.. తన ప్రభుత్వాన్ని ప్రశ్నించి వైకాపా అధినేతకి శత్రువుగా మారారు. రఘురామకృష్ణంరాజుని కొట్టించారు. అరెస్ట్ చేయించారు. నియోజకవర్గానికి రాకుండా కుతంత్రాలు చేస్తూనే ఉన్నారు. కానీ ఆర్ఆర్ఆర్ అంటే భయపడుతూనే ఉన్నారు వైకాపా పెద్దలు.
ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. నర్సాపురంలో రఘురామకృష్ణంరాజు ఏ పార్టీ నుంచి పోటీ చేసినా ఓడించడమే తమ ముందున్న కర్తవ్యం అనే రేంజులో వైసీపీ ఎన్నికల ప్రణాళిక సిద్ధం చేసుకుంటోంది. రెబల్ స్టార్ కృష్ణం రాజు ఇటీవలే కన్నుమూశారు. నర్సాపురం ప్రాంతీయులు-క్షత్రియులు కావడం, వారి సినీవారసుడు ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ కావడంతో రఘురామకృష్ణంరాజుని ఎదుర్కొనేందుకు రెబల్ స్టార్ కార్డు వాడాలని వైకాపా డిసైడ్ అయ్యిందని సమాచారం.
నర్సాపురం పార్లమెంట్ స్థానం నుంచి వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరపున రెబల్ స్టార్ కృష్ణంరాజు భార్య శ్యామల దేవిని బరిలో దింపాలని వైసీపీ విశ్వప్రయత్నాలు చేస్తోందని వార్తలు వస్తున్నాయి. ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి రెబల్ స్టార్ ఫ్యామిలీతో చర్చలు జరిపారనే సమాచారం గుప్పుమంది. ప్రభాస్ ఇమేజ్, నర్సాపురంలో రెబల్ స్టార్ ఇమేజ్ కలిసి వచ్చి రఘురామకృష్ణంరాజుని ఈజీగా ఓడించేయవచ్చని వైసీపీ వ్యూహకర్తల ఎత్తుగడగా తెలుస్తోంది.
రాష్ట్రం తగలబడిపోతుంటే రాంగోపాల్ వర్మతో జగన్ భేటీలు
వైసీపీ గూండా మూకల దాడులతో రాష్ట్రం రావణకాష్టమైపోయింది. కబ్జాలు, అత్యాచారాలు, సజీవదహనాలు, దాడులతో ఆంధ్రప్రదేశ్ అట్టుడుకుతోంది. నేరాంధ్రప్రదేశ్ అయ్యిందని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. వైసీపీ అరాచకాలకు అండాదండలు అందిస్తోన్న కేంద్రం కూడా విశాఖ క్రైం కేపిటల్ అయ్యిందని ఆందోళన వ్యక్తం చేసింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా విశాఖ సభలో వైసీపీ పాలనలో నేరాలు-ఘోరాలు పెరిగాయని ప్రకటించారు. ఆ మరుసటి రోజే వైసీపీ ఎంపీ, సీఎం ఆత్మీయుడు ఆడిటర్ జీవిల కిడ్నాప్ జరిగింది. బాపట్ల జిల్లా ఉప్పాలవారిపాలెంలో వైసీపీ సైకో పాము వెంకటేశ్వర రెడ్డి ఆయన గ్యాంగ్ గంజాయి మత్తులో పదిహేనేళ్ల బాలుడు అమర్నాథ్ ని అత్యంత దారుణంగా సజీవ దహనం చేశారు. ఇవి రెండు ఉదాహరణలు మాత్రమే. ప్రతిరోజూ ప్రతి గ్రామంలో వైకాపా అరాచకాలు రాసేందుకు పేపర్లలో పేజీలు కూడా చాలడంలేదు. ప్రజల పట్ల ప్రేమ లేకపోయినా, పదవి కోసం నటించేందుకైనా ముఖ్యమంత్రి హోదాలో ఈ నేరాలపై సమీక్ష చేసిన పాపాన జగన్ రెడ్డి పోలేదు. చివరికి డిజిపి వచ్చి జరుగుతున్నవి నేరాలే కాదు, క్రైమ్ రేటు పెరగలేదు, ఏపీలో శాంతీ ఉంది-భద్రతకి ఢోకా లేదంటూ స్టేట్మెంట్ ఇచ్చేసి వెళ్లిపోయారు. రాష్ట్రంలో నేరాలు ఏ స్థాయిలో పెరిగాయో చెప్పేందుకు వైసీపీ కోసం బీజేపీలో ఉండి పనిచేసే ఎంపీ జీవీఎల్ నరసింహారావు ప్రకటన ఉదాహరణ. వైసీపీ నేరాలని కప్పిపుచ్చటం కోసం ఏకంగా బీజేపీ బిగ్ బాస్ అమిత్ షా ప్రసంగాన్నే తిరగేసిన విశ్వాసం జీవీఎల్ నరసింహారావు సొంతం. అటువంటి జీవీఎల్ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ప్రకటించారు. ఇది ఒక్కటి చాలు ఏపీలో భయంకర పరిస్థితులు వివరించడానికి. మహిళలపై అఘాయిత్యాలు, హత్యలు, దౌర్జన్యాలతో రాష్ట్రం రావణకాష్టం అవుతుంటే..పట్టించుకోలేనంత బిజీలో సీఎం జగన్ రెడ్డి ఉన్నారు. అదేంటంటే బూతు దర్శకుడు రాంగోపాల్ వర్మతో భేటీ అయ్యారు. తనపై సినిమా తీయించుకుంటున్నారు. శాంతిభద్రతలపై సమీక్షించేందుకు సమయం లేని సీఎం జగన్ రెడ్డికి ఆర్జీవీతో భేటీ అవ్వడానికి మాత్రం టైం బాగానే దొరికింది.
వారు చంపుతూ పోతారు..వీరు బతికించుకుంటూ వస్తారు
వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం అయ్యారు. వందలమంది టిడిపి కార్యకర్తలు, నేతలను అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చంపించింది. తల్లిదండ్రుల్లేని పిల్లలు ఏమయ్యారు? కన్నవారిని కర్కశంగా అంతమొందించిన వారిపై కసి తీర్చుకునే వారు మాత్రం కాలేదు. తెలుగుదేశం పార్టీ తల్లిదండ్రుల్లా ఆ పిల్లల్ని ఎన్టీఆర్ మోడల్ స్కూల్ అనే దేవాలయంలో పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు నేర్పించి ప్రయోజకుల్ని చేసింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు హత్యకి గురైన టిడిపి కేడర్ పిల్లలందరినీ కక్షలు, కార్పణ్యాలకు దూరంగా విద్య విజ్ఞానాలకి దగ్గర చేశారు టిడిపి అధినేత చంద్రబాబు. చాలా మంది పిల్లలు ఉన్నతాధికారులు, సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా ఎదిగారు. వైఎస్ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన పదేళ్లకు ఆయన తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నవ్యాంధ్రకి సీఎం అయ్యారు. మళ్లీ కత్తులు రక్తదాహం తీర్చుకుంటున్నాయి. ప్రతీపల్లె వైసీపీ హింసకి రక్తమోడుతోంది. మాచర్లలో చంద్రయ్య, ప్రొద్దుటూరులో సుబ్బయ్య, పులివెందులలో కృష్ణయ్య..నాలుగేళ్లలో కొన్ని వందల మందిని పొట్టనపెట్టుకున్నారు వైకాపా కాలకేయులు. తండ్రి బాటలోనే తనయుడు పయనిస్తూ జనహననం చేస్తున్నాడు. అనాథలవుతున్న పిల్లలకి తెలుగుదేశం పార్టీనే తల్లిదండ్రులుగా చంద్రబాబు నిలుపుతున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ దేవాలయమై ఆదరిస్తోంది. ఎన్టీఆర్ మోడల్ స్కూల్ ఆ పిల్లలకి పెద్ద దిక్కు అవుతోంది. రేపల్లె నియోజకవర్గం ఉప్పాలవారిపాళెంలో వైసీపీ కేడర్ అయిన సైకో పాము వెంకటేశ్వర్ రెడ్డి ఆయన గ్యాంగ్ చేతితో దారుణ హత్యకు గురైన టెన్త్ స్టూడెంట్ అమర్నాథ్ గౌడ్ కుటుంబ సభ్యులను టిడిపి అధినేత చంద్రబాబు పరామర్శించారు. టిడిపి తరఫున రూ.10లక్షలు ఆర్ధిక సాయం అందించారు. అమర్నాథ్ సోదరి ఎంత వరకూ చదువుకుంటే అంతవరకూ ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున చదివించే బాధ్యత తీసుకుంటానని చంద్రబాబు హామీ ఇచ్చారు.