వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం అయ్యారు. వందలమంది టిడిపి కార్యకర్తలు, నేతలను అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చంపించింది. తల్లిదండ్రుల్లేని పిల్లలు ఏమయ్యారు? కన్నవారిని కర్కశంగా అంతమొందించిన వారిపై కసి తీర్చుకునే వారు మాత్రం కాలేదు. తెలుగుదేశం పార్టీ తల్లిదండ్రుల్లా ఆ పిల్లల్ని ఎన్టీఆర్ మోడల్ స్కూల్ అనే దేవాలయంలో పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు నేర్పించి ప్రయోజకుల్ని చేసింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు హత్యకి గురైన టిడిపి కేడర్ పిల్లలందరినీ కక్షలు, కార్పణ్యాలకు దూరంగా విద్య విజ్ఞానాలకి దగ్గర చేశారు టిడిపి అధినేత చంద్రబాబు. చాలా మంది పిల్లలు ఉన్నతాధికారులు, సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా ఎదిగారు. వైఎస్ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన పదేళ్లకు ఆయన తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నవ్యాంధ్రకి సీఎం అయ్యారు. మళ్లీ కత్తులు రక్తదాహం తీర్చుకుంటున్నాయి. ప్రతీపల్లె వైసీపీ హింసకి రక్తమోడుతోంది. మాచర్లలో చంద్రయ్య, ప్రొద్దుటూరులో సుబ్బయ్య, పులివెందులలో కృష్ణయ్య..నాలుగేళ్లలో కొన్ని వందల మందిని పొట్టనపెట్టుకున్నారు వైకాపా కాలకేయులు. తండ్రి బాటలోనే తనయుడు పయనిస్తూ జనహననం చేస్తున్నాడు. అనాథలవుతున్న పిల్లలకి తెలుగుదేశం పార్టీనే తల్లిదండ్రులుగా చంద్రబాబు నిలుపుతున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ దేవాలయమై ఆదరిస్తోంది. ఎన్టీఆర్ మోడల్ స్కూల్ ఆ పిల్లలకి పెద్ద దిక్కు అవుతోంది. రేపల్లె నియోజకవర్గం ఉప్పాలవారిపాళెంలో వైసీపీ కేడర్ అయిన సైకో పాము వెంకటేశ్వర్ రెడ్డి ఆయన గ్యాంగ్ చేతితో దారుణ హత్యకు గురైన టెన్త్ స్టూడెంట్ అమర్నాథ్ గౌడ్ కుటుంబ సభ్యులను టిడిపి అధినేత చంద్రబాబు పరామర్శించారు. టిడిపి తరఫున రూ.10లక్షలు ఆర్ధిక సాయం అందించారు. అమర్నాథ్ సోదరి ఎంత వరకూ చదువుకుంటే అంతవరకూ ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున చదివించే బాధ్యత తీసుకుంటానని చంద్రబాబు హామీ ఇచ్చారు.
వారు చంపుతూ పోతారు..వీరు బతికించుకుంటూ వస్తారు
Advertisements