వైసీపీలో నెంబ‌ర్‌2గా ఓ వెలుగు వెలిగిన విజ‌య‌సాయిరెడ్డిని చాలా అవ‌మాన‌క‌రంగా వైసీపీ నుంచి సాగ‌నంపుతున్నారు. విశాఖ‌లో భూదందాల పేరుతో సాయిరెడ్డిని బ‌ద్నాం చేసింది వైసీపీ పెద్ద‌లేన‌ని తెలుసుకునేస‌రికి జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగిపోయింది. అల్లుడి అన్న ఢిల్లీ లిక్క‌ర్ స్కాములో బెయిల్ కూడా దొర‌క‌ని స్థితిలో ఇరుక్కున్నాడు. పార్టీ నుంచి ఎటువంటి మ‌ద్ద‌తు లేక‌పోవ‌డంతో సాయిరెడ్డి ఒంట‌రి పోరాటం సాగిస్తున్నారు. ఉత్త‌రాంధ్ర ఇన్చార్జి ప‌ద‌విని పీకేశారు. జ‌గ‌న్ త‌న బాబాయ్ వైవీ సుబ్బారెడ్డికి ఉత్త‌రాంధ్ర బాధ్య‌త‌లు అప్ప‌గించారు. సోష‌ల్మీడియా బాధ్య‌త‌ల‌ను స‌జ్జ‌ల త‌న‌యుడు భార్గ‌వ్ రెడ్డి చేజిక్కించుకున్నారు. తాజాగా వైసీపీ అనుబంధ సంఘాల విభాగాల బాధ్య‌త‌ల‌నీ సాయిరెడ్డికి చెప్ప‌కుండానే లాక్కున్నారు. విజ‌య‌సాయిరెడ్డికి ఆత్మీయుడైన చెవిరెడ్డివి అనుబంధ సంఘాల బాధ్య‌త‌లు అప్ప‌గించేశారు. తాజాగా జ‌రిగిన అనుబంధ సంఘాల నియామ‌కాల‌న్నీ చెవిరెడ్డి పేరుతో లేఖ‌లు జారీ అయ్యాయి. దీంతో వైసీపీలో విజ‌య‌సాయిరెడ్డిని సాగనంపే కుట్ర‌లు ప‌తాక‌స్థాయికి చేరాయ‌ని తెలుస్తోంది. సాక్షి2గా మారిపోయిన టీవీ9లో విజ‌యసాయిరెడ్డి ప‌ని వైసీపీలో అయిపోయింద‌ని పేద్ద స్టోరీ ర‌న్ చేశారు. తాడేప‌ల్లి ప్యాలెస్ నుంచి స్క్రిప్టు రాక‌పోతే స్క్రోలింగ్ కూడా వేయ‌ని టీవీ9 సాయిరెడ్డిపై ఏకంగా అర‌గంట స్టోరీ కుమ్మేయ‌డం, అందులో నేరుగా సాయిరెడ్డిని వైసీపీ నుంచి గెంటేస్తున్నార‌ని డైరెక్ట్‌గా చెప్ప‌డంతో ఇది వైసీపీ పెద్ద‌ల స్కెచ్ అని అర్థం అవుతోంది. ఒక్కో కీల‌క బాధ్య‌త నుంచి త‌ప్పించుకుంటూ వ‌స్తున్న వైసీపీ పెద్ద‌లు, చివ‌రికి విజ‌య‌సాయిరెడ్డిపై కోవ‌ర్టు ముద్ర వేసి సాగ‌నంపే ప‌నిలో ఉన్నార‌ని స్టోరీ ద్వారా చెప్ప‌క‌నే చెప్పారు. త‌న మ‌ర‌ద‌లి కూతురు భ‌ర్త అయిన తార‌క‌ర‌త్న అంత్య‌క్రియ‌ల‌కు హాజ‌రైన సాయిరెడ్డి చంద్ర‌బాబుతో సాగించిన మంత‌నాలు, వైద్యం సంద‌ర్భంగా బాల‌కృష్ణ‌ని పొగ‌డ‌టం, ఇటీవ‌ల నారా లోకేష్ బ‌ర్త్ డేకి విషెస్ చెబుతూ ట్వీట్ వేయ‌డం వంటి కార‌ణాలు చూపుతూ వైసీపీ నుంచి త‌రిమేసే ఏర్పాటు చేస్తున్నార‌ని టీవీ9 క్లారిటీ ఇచ్చేసింది. భార్య భార‌తి కోరిక మేర‌కే సాయిరెడ్డి జ‌గ‌న్ రెడ్డి దూరం పెట్టినా, అక్ర‌మాస్తుల కేసుల‌న్నీ ఇద్ద‌రి మెడ‌కీ చుట్టుకునే ఉన్నాయి. అవి కూడా ఒక్కొక్క‌టీ విచార‌ణ‌కి వ‌స్తున్న ద‌శ‌లో విజ‌యసాయిరెడ్డిని వ్యూహాత్మ‌కంగా ప‌క్క‌నబెడుతున్నారా? నిజంగానే దూరం చేసుకుంటున్నారా అనేది తేలాల్సి ఉంది.

వైయస్ వివేకా హత్యకేసు లో సీబీఐ స్పీడ్ పెంచేసింది . విచారణలో భాగంగా వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐ కార్యాలయానికి చేరుకున్నారు. తన అనుచరులతో సహా అవినాష రెడ్డి అక్కడకు చేరుకున్నారు. దాంతో పోలీసులు ఆయన అనుచరులను అక్కడనుంచి పంపించేసారు . రూ.40 కోట్ల డీల్ వ్యవహారంపై సీబీఐ ఈరోజు అవినాష్ రెడ్డిని విచారించనున్నారు. అయితే ఈ విచారణకు ఆయన తరపు లాయర్లను అనుమతిస్తారాలేదా అనేది తెలియాల్సి ఉంది. గతం లో జరిగిన విచారణకు అయితే సీబీఐ లాయర్లను అనుమతించలేదు.

వైసీపీ పాలిటిక్స్ చాలా ప్ర‌మాద‌క‌రంగా ఉంటాయి. తాము చేసిన త‌ప్పు క‌ప్పి పుచ్చుకోవ‌డానికి ఎంత‌కైనా తెగిస్తార‌ని నిరూపించుకున్న సంఘ‌ట‌న‌లు కోకొల్ల‌లు. సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి బాబాయ్ వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య‌కేసులో మొత్తం ఎదుగూరి సంధింటి (వైఎస్) ఫ్యామిలీలో ఓ వ‌ర్గమే చేసింద‌ని సీబీఐ క్లారిటీగా అఫిడ‌విట్ వేసింది. దీని నుంచి ప్ర‌జ‌ల దృష్టిని మ‌ర‌ల్చేందుకు గ‌న్న‌వ‌రంలో వ‌ల్ల‌భ‌నేని వంశీతో చేయించిన దాడులు విఫ‌లం అయ్యాయి. సీబీఐ వైఎస్ జ‌గ‌న్ రెడ్డి త‌మ్ముడు వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ ఇచ్చిన గ‌డువు ద‌గ్గ‌ర‌ప‌డింది. ఈ సారి సీబీఐ విచార‌ణ‌కి పిలిచి అరెస్టు చేయ‌వ‌చ్చ‌ని, దీనిని ఏ అంశంతో డైవ‌ర్ట్ చేయాల‌నే దానిపైనే ఇప్పుడు వైసీపీ కీల‌క వ్యూహ‌క‌ర్త‌లు దృష్టిసారించారు. సీబీఐకి విరుగుడుగా త‌న జేబుసంస్థ సీఐడీని వ‌దిలారు సీఎం. తాడేప‌ల్లి నుంచి గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చిన వెంట‌నే హైదరాబాద్లో ప్ర‌త్య‌క్ష‌మైంది సీఐడీ బృందం. టిడిపి నేత‌, మాజీ మంత్రి నారాయణ కూతురు నివాసంలో ఏపీ సీఐడి సోదాలు చేప‌ట్టింది. మాదాపూర్ లోని నారాయణ కూతురు నివాసంలో సీఐడి అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వ‌హించారు. దీనిపై సీఐడీ నుంచి ఏ ప్ర‌క‌ట‌నా లేదు. అంటే అవినాష్ రెడ్డి అరెస్టుని సీబీఐ ఈరోజే ప్రకటిస్తే అదే టైంకి నారాయణ కూతుర్ని అరెస్ట్ అని ప్రకటించేందుకు ఈ జ‌గ‌న్ నాట‌కం సాగుతోంద‌ని రాజ‌కీయ ప‌రిశీల‌కులు విశ్లేషిస్తున్నారు. అవినాష్ అరెస్టు అయితే నారాయ‌ణ‌ని అరెస్టు చేయాల‌ని అనుకున్నా, ఆయ‌న‌కి ఇదే కేసులో వ‌చ్చిన ముందస్తు బెయిల్ పొడిగించింది న్యాయ‌స్థానం. ఈ నేప‌థ్యంలో నారాయ‌ణ‌ని ట‌చ్ చేయ‌లేమ‌ని నిర్ణయించుకుని ఆయ‌న కుమార్తెని టార్గెట్ చేశారని ప్ర‌చారం సాగుతోంది.

ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు అంటే జ‌నాల‌కి కామెడీ అయిపోయింది  కానీ, బీజేపీలో ఆయ‌న‌ది బాషా బ్యాక్ గ్రౌండ్‌. ఆయ‌న‌ని ట‌చ్ చేయాల‌ని చూసినా వారే ఎగిరిపోతున్నారు. ఏపీలో ఎంత పెద్ద బీజేపీ నేత‌యినా సోము వీర్రాజుపై ఆరోప‌ణ‌లు చేసినా, విమ‌ర్శించినా త‌మ‌కు తాముగా పార్టీ నుంచి వెళ్లిపోయేలా చేస్తారు. బీజేపీలో అస‌లైన క‌మ‌ల‌నాథులు, వైసీపీ కోసం ప‌నిచేసే బ్యాచ్, టిడిపి సానుభూతిప‌రుల బ్యాచ్ మాదిరిగా మూడువ‌ర్గాలుంటాయి. టిడిపి అధికారంలో వున్న‌ప్పుడు హార్డ్ కోర్ బీజేపీ నేత‌ల‌కంటే టిడిపి సానుభూతిప‌రులైన నేత హ‌వా సాగేది. వైసీపీ అధికారంలోకి వ‌చ్చాక ఏపీ బీజేపీ అంటే వైసీపీ బ్రాంచి ఆఫీసు లెక్క మారిపోయింద‌నే ప్ర‌చారం ఉంది. వైసీపీతో స‌త్సంబంధాలున్న సోము వీర్రాజుని అధ్య‌క్ష ప‌ద‌వి నుంచి దింప‌డానికి ఇత‌ర రెండు వ‌ర్గాలు ప్ర‌య‌త్నించి విఫ‌లం అయ్యాయి. సోము వీర్రాజు అవ‌స‌రం వైసీపీకి ఉంద‌ని, వారు కేంద్రంలో బీజేపీ పెద్ద‌ల ద‌గ్గ‌ర ప‌ర‌ప‌తి వాడుతూ రెండోసారి అధ్య‌క్షుడిగా కంటిన్యూ చేయించ‌గ‌లిగార‌ని కొంద‌రు అసంతృప్త క‌మ‌ల‌నేత‌ల‌కు క్లారిటీ వ‌చ్చేసింది. దీంతో సోముని ఏమీ చేయ‌లేమ‌ని, ఇక్క‌డ ఉన్నా త‌మ‌ని కూడా సోము ఏమీ చేయ‌నివ్వ‌డ‌ని డిసైడైన నేత‌లు ఒక్కొక్క‌రుగా ఇత‌ర పార్టీల్లోకి జారుకుంటున్నారు. రావెల కిశోర్ బాబు బీఆర్ఎస్లో చేర‌గా, క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ టిడిపిలోకి జంప్ ఇచ్చారు. ఒక్క వార్డుమెంబ‌ర్ లేని రాష్ట్రంలో ఇన్ని క‌ల‌హాల‌తో స‌త‌మ‌త‌వుతోన్న బీజేపీని చ‌క్క‌దిద్దే ప‌నిని అధిష్టానం చూడ‌టంలేదంటే అనుమానించాల్సిందే. వంద‌ల‌కోట్ల ద‌ళితుల భూమి కారుచౌక‌గా కొట్టేసిన సోము వీర్రాజుపై పోలీసుల‌కు బాధితులు ఫిర్యాదు చేసినా ఏపీ స‌ర్కారూ స్పందించ‌డంలేదు. అధిష్టాన‌మూ వివ‌ర‌ణ అడ‌గ‌డ‌డంలేదు. అంటే ఇరు పార్టీల‌కు కావాల్సిన వ్య‌క్తి సోము అని అర్థం అవుతూనే ఉంది. అయితే కొంద‌రు ఉత్సాహ‌వంతులు సోమువీర్రాజు వైఖ‌రితో నేత‌లు పార్టీ వీడి వెళ్లిపోతున్నార‌ని, ఆయ‌న‌ని మార్చాల‌ని చెప్పేందుకు ఢిల్లీ వెళ్లారు.  కేంద్రమంత్రి మురళీధరన్ ను కలిశారు. ఏపీలో పార్టీ పరిస్థితి ఏమాత్రం బాగాలేదని ఫిర్యాదు చేశారు. సోము వీర్రాజు జిల్లా అధ్యక్షులను కూడా రాత్రికి రాత్రే మార్చేశార‌ని, దీంతో ద‌శాబ్దాలుగా బీజేపీని అంటిపెట్టుకుని ఉన్న నేత‌లు పార్టీని వీడుతున్నార‌ని వివ‌రించారు. రాష్ట్ర నాయకత్వాన్ని మార్చాల్సిన అవసరం ఉంద‌ని తెలిపారు. అయితే ఏపీ నేత‌ల‌పై అధిష్టానం ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

Advertisements

Latest Articles

Most Read