ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు అంటే జ‌నాల‌కి కామెడీ అయిపోయింది  కానీ, బీజేపీలో ఆయ‌న‌ది బాషా బ్యాక్ గ్రౌండ్‌. ఆయ‌న‌ని ట‌చ్ చేయాల‌ని చూసినా వారే ఎగిరిపోతున్నారు. ఏపీలో ఎంత పెద్ద బీజేపీ నేత‌యినా సోము వీర్రాజుపై ఆరోప‌ణ‌లు చేసినా, విమ‌ర్శించినా త‌మ‌కు తాముగా పార్టీ నుంచి వెళ్లిపోయేలా చేస్తారు. బీజేపీలో అస‌లైన క‌మ‌ల‌నాథులు, వైసీపీ కోసం ప‌నిచేసే బ్యాచ్, టిడిపి సానుభూతిప‌రుల బ్యాచ్ మాదిరిగా మూడువ‌ర్గాలుంటాయి. టిడిపి అధికారంలో వున్న‌ప్పుడు హార్డ్ కోర్ బీజేపీ నేత‌ల‌కంటే టిడిపి సానుభూతిప‌రులైన నేత హ‌వా సాగేది. వైసీపీ అధికారంలోకి వ‌చ్చాక ఏపీ బీజేపీ అంటే వైసీపీ బ్రాంచి ఆఫీసు లెక్క మారిపోయింద‌నే ప్ర‌చారం ఉంది. వైసీపీతో స‌త్సంబంధాలున్న సోము వీర్రాజుని అధ్య‌క్ష ప‌ద‌వి నుంచి దింప‌డానికి ఇత‌ర రెండు వ‌ర్గాలు ప్ర‌య‌త్నించి విఫ‌లం అయ్యాయి. సోము వీర్రాజు అవ‌స‌రం వైసీపీకి ఉంద‌ని, వారు కేంద్రంలో బీజేపీ పెద్ద‌ల ద‌గ్గ‌ర ప‌ర‌ప‌తి వాడుతూ రెండోసారి అధ్య‌క్షుడిగా కంటిన్యూ చేయించ‌గ‌లిగార‌ని కొంద‌రు అసంతృప్త క‌మ‌ల‌నేత‌ల‌కు క్లారిటీ వ‌చ్చేసింది. దీంతో సోముని ఏమీ చేయ‌లేమ‌ని, ఇక్క‌డ ఉన్నా త‌మ‌ని కూడా సోము ఏమీ చేయ‌నివ్వ‌డ‌ని డిసైడైన నేత‌లు ఒక్కొక్క‌రుగా ఇత‌ర పార్టీల్లోకి జారుకుంటున్నారు. రావెల కిశోర్ బాబు బీఆర్ఎస్లో చేర‌గా, క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ టిడిపిలోకి జంప్ ఇచ్చారు. ఒక్క వార్డుమెంబ‌ర్ లేని రాష్ట్రంలో ఇన్ని క‌ల‌హాల‌తో స‌త‌మ‌త‌వుతోన్న బీజేపీని చ‌క్క‌దిద్దే ప‌నిని అధిష్టానం చూడ‌టంలేదంటే అనుమానించాల్సిందే. వంద‌ల‌కోట్ల ద‌ళితుల భూమి కారుచౌక‌గా కొట్టేసిన సోము వీర్రాజుపై పోలీసుల‌కు బాధితులు ఫిర్యాదు చేసినా ఏపీ స‌ర్కారూ స్పందించ‌డంలేదు. అధిష్టాన‌మూ వివ‌ర‌ణ అడ‌గ‌డ‌డంలేదు. అంటే ఇరు పార్టీల‌కు కావాల్సిన వ్య‌క్తి సోము అని అర్థం అవుతూనే ఉంది. అయితే కొంద‌రు ఉత్సాహ‌వంతులు సోమువీర్రాజు వైఖ‌రితో నేత‌లు పార్టీ వీడి వెళ్లిపోతున్నార‌ని, ఆయ‌న‌ని మార్చాల‌ని చెప్పేందుకు ఢిల్లీ వెళ్లారు.  కేంద్రమంత్రి మురళీధరన్ ను కలిశారు. ఏపీలో పార్టీ పరిస్థితి ఏమాత్రం బాగాలేదని ఫిర్యాదు చేశారు. సోము వీర్రాజు జిల్లా అధ్యక్షులను కూడా రాత్రికి రాత్రే మార్చేశార‌ని, దీంతో ద‌శాబ్దాలుగా బీజేపీని అంటిపెట్టుకుని ఉన్న నేత‌లు పార్టీని వీడుతున్నార‌ని వివ‌రించారు. రాష్ట్ర నాయకత్వాన్ని మార్చాల్సిన అవసరం ఉంద‌ని తెలిపారు. అయితే ఏపీ నేత‌ల‌పై అధిష్టానం ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read