తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులతో మంగళవారం చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు వివిధ అంశాల పై సీనియర్ నేతలతో చర్చించారు. క-రో-నా కేసులు, అమరావతి ఉద్యమం, భారీ వర్షాలతో రైతుల ఇబ్బందులు, రైతులకు మోటార్లు తదితర అంశాల పై చంద్రబాబు మాట్లాడారు. ఇదే సందర్భంలో రాష్ట్రంలో జరుగుతున్న హాట్ టాపిక్ అయిన, న్యాయవ్యవస్థ పై ఆరోపణల విషయం పై కూడా చంద్రబాబు స్పందించారు. దేశంలో ఎప్పుడూ చూడని పరిణామాలు చూస్తున్నామని అన్నారు. ముందుగా సోషల్ మీడియాలో జడ్జిలను టార్గెట్ చేసారని, ఇప్పుడు ఏకంగా న్యాయమూర్తుల పైనే ఫిర్యాదులు చేస్తూ, 16 కేసుల్లో నిందితుడుగా ఉన్న వ్యక్తి ఇలా చేయటం మరో వింత అని చంద్రబాబు అన్నారు. గతంలో ముఖ్యమంత్రులుగా చేసిన లాలూ ప్రసాద్ యాదవ్, మధుకోడా, జయలలిత, ఓం ప్రకాష్ చౌతాలా, శిబుసోరెన్ వంటి వారి పై కూడా ఇలాంటి అభియోగాలే ఉన్నా, వారు ఎప్పుడు ఇలా న్యాయస్థానాలపై, న్యాయమూర్తులపై ఇలాంటి క్యారక్టర్ అసాసినేషన్ చేయలేదని అన్నారు. వారికి అధికారం చేతిలో ఉన్నా, వ్యవస్థలపై దా-డి చేసే దుస్సాహసానికి ఎప్పుడు తెగబడలేదని గుర్తు చేసారు.
ఎప్పుడూ లేని దుర్మార్గపు పాలన మన రాష్ట్రంలో నడుస్తుంది, నేర ప్రవర్తి ఉన్న వాళ్ళకు అధికారం వస్తే ఎలా ఉంటుందో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఒక ఉదాహరణ అని చంద్రబాబు అన్నారు. ఒక తప్పు చేస్తారని, ఆ తప్పు కప్పిపుచ్చుకోవటానికి, మరో పెద్ద తెప్పు చేస్తున్నారని, ఈ క్రమంలో మంచి చెడు లేకుండా, విచక్షణ లేకుండా ప్రవర్తించంటం, జగన్ మోహన్ రెడ్డికి నిత్యకృత్యం అయిపోయిందని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు కుప్ప కూల్చేసారని, ఇప్పుడు ఏకంగా న్యాయవ్యవస్థ పైనే దా-డి చేసారని అన్నారు. తప్పుడు వార్తలు, తప్పుడు సమాచారంతో అపోహలు కలిగించటం, తన పై అంటిన బురదను ఇతరులకు అంటించటం, జగన్ మోహన్ రెడ్డికి అలవాటు అయిపోయిందని, చంద్రబాబు అన్నారు. ప్రజాప్రతినిధుల కేసులు ఏడాదిలో తెల్చేయాలని కోర్టు ఇప్పుడు చెప్పలేదని, ఆ ఆదేశాలు ఇప్పుడు అమలు చేస్తుంటే, అదేదో తన కోసమే చేస్తున్నట్టు, జగన్ మోహన్ రెడ్డి కంగారు పడి, ఏకంగా కోర్టుల పైనే టార్గెట్ పెట్టటం బరితెగింపునకు పరాకాష్ట అని చంద్రబాబు అన్నారు.