మంత్రివర్గం మళ్లీ విస్తరిస్తారని ప్రచారం సాగుతోంది. ఈ సారి కొందరు కొత్త మంత్రుల్ని బయటకి పంపుతారని టాక్ వినిపిస్తోంది. ఈ జాబితాలో పర్యాటకశాఖా మంత్రి రోజా గత కొద్దిరోజుల వరకూ లేదు. అయితే ఇటీవలే టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర నగరి నియోజకవర్గంలో సాగింది. ఈ సందర్భంగా రోజాని టార్గెట్ చేసుకుని వైసీపీ సర్కారుని డ్యామేజ్ చేసేలా చాలా వ్యూహాత్మకంగా నారా లోకేష్ అవినీతి ఆరోపణలు గుప్పించారు. అయితే లోకేష్‌కి పార్టీ నుంచి ఎవరైనా కౌంటర్ ఇస్తారని ఎదురుచూసిన మంత్రి రోజా, ఒక రోజు గడిచినా ఎవరూ స్పందించకపోవడంతో తానే లోకేష్ పై ఎదురుదా-డికి దిగింది. ఆ తరువాత కొడాలి నాని వంటి వారు వచ్చి సానుభూతి బూతులు గుప్పించి వెళ్లారు. అయితే నగరి నియోజకవర్గాన్ని ప్రత్యేకంగా లోకేష్ టార్గెట్ చేసుకున్నాడని తెలిసినా రోజాకి మద్దతు దొరకకపోవడంతో వైసీపీలో హాట్ టాపిక్ అయ్యింది. జగన్ రెడ్డి కంటే మంత్రివర్గంలో పవర్ ఫుల్ అని పేరుపడిన మంత్రి పెద్దిరెడ్డితో రోజాకి పడదు. అటు నుంచి మద్దతు లేదు. నియోజకవర్గంలోనూ వైసీపీలో ఉన్న మూడు గ్రూపులూ రోజాకి వ్యతిరేకమే. ఈ కారణాలతో లోకేష్ రేపిన మాటలు మంటలు సెగలు రోజాని చుట్టుముట్టాయి. ఆరోపణలకు సమాధానం ఇవ్వలేకపోయినా, కనీసం నియోజకవర్గంలో లోకేష్‌ని అడ్డుకుని నిరసన తెలిపేందుకు కూడా రోజాకి మనుషులు లేకపోయారా అనే కోణంలో అధిష్టానం సీరియస్‌గా ఉంది. మంత్రివర్గ విస్తరణ అంటూ జరిగితే రోజాని బయటకి పంపడం ఖాయమని వైసీపీలో చర్చ నడుస్తోంది. లోకేష్ పాదయాత్రని అడ్డుకోలేకపోయిందనే కారణంతోనే రోజా మంత్రి పదవి పోయే అవకాశాలున్నాయని ప్రచారం సాగుతోంది.
news
మంత్రి గుడివాడకి `గుడ్డు బై` ? త్వరలో మంత్రి పదవి హుష్ కాకి ?
మంత్రి గుడివాడ అమర్ నాథ్. అనతికాలంలోనే తెలుగు రాష్ట్ర రాజకీయాలకు కామెడీ పంచ్ యంగ్ ఐకాన్‌గా పరిచయం అయ్యారు. చార్లీ చాప్లిన్ తన అమాయకత్వంతో హాస్యం పండిస్తే గుడివాడ అమర్ నాథ్ తన అతి తెలివితో ఎంటర్ టైన్ మెంట్ పంచుతున్నాడు. గుడ్డు కథ చెప్పినా, గుడ్డు మీద ఈకలు పీకే థియరీ వివరించినా గుడివాడ అమర్ స్టైలే వేరు. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ అని మనకందరికీ తెలుసు. ఏపీలో ఏఐ అంటే అనకాపల్లి ఇంటిలిజెన్స్ అనే పేరు వచ్చేలా స్వయంకృషి చేశారు అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాథ్. పవన్‌తో సెల్ఫీ స్టోరీ ఎవర్ గ్రీన్ ట్రోల్ మెటీరియల్. రుషులు తపస్సు చేసిందే రుషికొండ అని చెప్పడం ఆ టైమింగ్ రైమింగ్ బ్రహ్మానందానికి కూడా సాధ్యం కాదు. దావోస్ వెళ్తే స్నానం చేయననే కర్ణకఠోర నిజం చెప్పే అభినవ సత్యహరిశ్చంద్రుడు గుడివాడ అమర్ నాథ్‌కి గుడ్డు కథలు తరువాత గడ్డుకాలం దాపురించిందని సమాచారం. కాపు కోటాలో గుడివాడ అమర్ నాథ్ మంత్రి పదవిని తోట త్రిమూర్తులు ఎగరేసుకుపోతున్నారని వైసీపీలో చర్చ నడుస్తోంది. మొత్తానికి కామెడీతో ఫేమస్ అయి అదే కామెడీతో తన మంత్రి పదవి పోగొట్టుకునే చరిత్ర మూటకట్టుకునేలా ఉన్నాడు గుడివాడ అమర్ నాథ్.
డీజీపీ కార్యాలయం దగ్గర ముళ్ళ కంచెలు... టిడిపి శ్రేణులు మెరుపు దా-డి చేస్తారని సమాచారం..
మంగళగిరి దగ్గర ఉన్న డీజీపీ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. కన్నా లక్ష్మీనారాయణ చేరిక సందర్భంగా పెద్దఎత్తున టీడీపీ కార్యకర్తలు వస్తున్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‍కు వస్తున్నాయి పార్టీ శ్రేణులు. డీజీపీ కార్యాలయాన్ని టీడీపీ నేతలు ముట్టడిస్తారన్న అనుమానంతో పోలీసుల భద్రత ఇచ్చారు. ఇటీవల గన్నవరం ఘటన దృష్ట్యా ముట్టడిస్తారేమోనని పోలీసుల మోహరించారు. డీజీపీ కార్యాలయం నుంచి టీడీపీ కార్యాలయం వరకు ముళ్లకంచెలు ఏర్పాటు చేసారు. అలాగే సర్వీసు రోడ్డు-జాతీయ రహదారి మధ్య ముళ్లకంచెలు ఏర్పాటు చేసారు. - డీజీపీ కార్యాలయానికి వెళ్లే సర్వీస్ రోడ్డులో మూడంచెల బారికేడ్ల వ్యవస్థ ఏర్పాటు చేయటంతో, స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు.
విజయసాయిరెడ్డికి ఆ అవార్డ్ ఎందుకు ఇచ్చారో ? ఆయన ట్విట్టర్ చూసి ఇచ్చారా ?
నిత్యమూ బూతులు, రోత ట్వీట్లు వేస్తూ సోషల్మీడియాలో `ఏ` సర్టిఫికెట్ పొందిన విజయసాయిరెడ్డికి ఏ కేటగిరిలో సంసద్ రత్న అవార్డు ఇచ్చారో అని ఏపీలో చర్చలు జోరందుకున్నాయి. వైసీపీ రాజ్యసభ సభ్యుడైనా వైసీపీ మొత్తం ఢిల్లీ వ్యవహారాలు చక్కబెట్టేది సాయిరెడ్డే. ఏపీకి సంబంధించి కేంద్రం ఏ ఒక్క హామీ నెరవేర్చకపోయినా, కేంద్రానికి భేషరతు మద్దతు ప్రకటించడమే సాయిరెడ్డి అవార్డు వరించటానికి కారణమని వైసీపీ ఎంపీలే తమలో తాము జోకులేసుకుంటున్నారు. ఇప్పటికే లెక్కకు మించిన పదవులు పొందిన సాయిరెడ్డి, అవార్డులు కూడా వదలడంలేదని వైసీపీ ఎంపీలు లబోదిబోమంటున్నారు. రాజ్యసభ సభ్యులు, వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలో కీలక పాత్ర, ప్యానల్ స్పీకర్ వంటి పదవులన్నీ సాయిరెడ్డి ఖాతాలోనే ఉన్నాయి. తాజాగా సంసద్ రత్న (పార్లమెంటు రత్న)-2023 అవార్డుకి సాయిరెడ్డిని ఎంపిక చేశారు. పార్లమెంటులో ఉన్నా అన్ పార్లమెంటరీ భాష వాడటంలో సాయిరెడ్డిని మించిన వారు లేరు. దీంతోపాటు అక్రమాస్తుల కేసుల్లో జగన్ రెడ్డి ఏ1 అయితే సాయిరెడ్డి ఏ2. సాయిరెడ్డిపై ఎన్ని ఫిర్యాదులు చేసినా ప్యానల్ స్పీకర్‌గా అవకాశం కల్పించింది కేంద్రంలో బీజేపీ సర్కారు. కళంకిత చరిత్ర ఉన్నా అత్యున్నత పదవులైన ఎథిక్స్ కమిటీలోనూ సాయిరెడ్డిని తీసుకున్నారు. తాజాగా సంసద్ అవార్డు ప్రకటించడం బీజేపీ-వైసీపీ మ్యాచ్ ఫిక్సింగ్ అవార్డు అని విమర్శలు వినిపిస్తున్నాయి.