ఈరోజు జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ ఆంద్రప్రదేశ్ కొత్త గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేసారు. రాజ్‍భవన్‍లో కొత్త గవర్నర్ చేత హైకోర్టు సీజే జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం జగన్ మోహన్ రెడ్డి హాజరయ్యారు. ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు కూడా హాజరయ్యారు. ఈ ప్రమాణస్వీకార కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ముఖ్యమైన అధికారులు, న్యాయమూర్తులు కూడా పాల్గున్నారు.

చంద్రబాబు ఈ రోజు గన్నవరం లో పర్యటన చేస్తున్నారు. మూడు రోజుల క్రిందట వైసిపీ సైకోల విధ్వంసంలో, గన్నవరం టిడిపి ఆఫీస్ ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. అలాగే టిడిపి నేతల వాహనాలు కూడా ధ్వంసం చేసారు. అయితే వెరైటీగా పట్టాభి పై కేసులు పెట్టి ఆయన్ని అరెస్ట్ చేసారు. అయితే ఈ రోజు చంద్రబాబు గన్నవరం టిడిపి ఆఫీస్ పరిశీలినకు వచ్చారు. అంతకంటే ముందు బీసీ నేత చిన్నా ఇంటికి వెళ్లి చంద్రబాబు కుటుంబ సభ్యులని పరామర్శించి ధైర్యం చెప్పారు. చిన్న ఇంటి దగ్గర నుంచి చంద్రబాబు గన్నవరం టిడిపి ఆఫీస్ కు రావలసి ఉండగా, ట్రాఫిక్ మొత్తం ఆగిపోయింది. చంద్రబాబు వెళ్ళే వీలు లేకపోవటంతో, చంద్రబాబు నడుచుకుంటూ గన్నవరం టిడిపి ఆఫీస్ కు చేరుకున్నారు. పోలీసులు కావాలనే కంట్రోల్ చేయలేక పోయారని, టిడిపి శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. జెడ్ క్యాటగరీ భద్రత ఉన్న నేతకు ఇలా చేస్తారా అని మండి పడుతున్నారు.

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‍కు తిరుపతిలోని అలిపిరి పోలీసులు నోటీసులు ఇచ్చారు. అలిపిరిలోని అంకుర హాస్పిటల్ రోడ్డు దగ్గర పోలీసులు ఆయనకు  నోటీసులు ఇచ్చారు. విద్యార్థులతో ముఖాముఖి ప్రోగ్రాం కి వెళ్తున్న లోకేష్ ను పోలీసులు అడ్డగించారు . ఆ కార్యక్రమానికి  ముందుగా పర్మిషన్ తీసుకోలేదని, కావున  ఆ కార్యక్రామానికి వెళ్ళడానికి వీల్లేదు అంటూ పోలీసులు అడ్డగించారు. ఇలాంటి కార్యక్రమాలకు ముందుగా తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని వారు చెప్పారు. దీనిపై టిడిపి నేతలు స్పందిస్తూ ,పోలీసుల ఉద్దేశపూర్వకం గానే  ఇలా అడ్డగిస్తున్నారని మండిపడ్డారు. ఇలా అడుగడుగునా లోకేష్ పాదయాత్రను  అడ్డుకోవటమే వైసిపి ప్రభుత్వ లక్ష్యమని , దీనికోసమే వీళ్ళు పోలీసులను అడ్డం పెట్టుకుని, ఇలాంటి చర్యలాకు పాల్పడుతున్నారని టిడిపి శ్రేణులు ద్వజమెత్తారు. ఇక ఈ రోజు తిరుపతిలో లోకేశ్‍కు పాదయాత్రపై టెన్షన్.. నెలకొంది. తిరుపతి నగర వీధుల్లో పాదయాత్రకు అనుమతి లేదంటున్న పోలీసులు, భారీగా మొహరించాయి. పది రోజుల క్రితమే అడ్మిన్ ఎస్పీని కలిసి రూట్ మ్యాప్ ఇచ్చామని, ఇప్పుడు అభ్యంతరం తెలపటం పై, టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. వైసీపీ నేతల ఒత్తిడితోనే పాదయాత్రకు అనుమతి ఇవ్వలేదని, పోలీసులు అనుమతి ఇవ్వకపోయినా నగరవీధుల్లోనే పాదయాత్ర కొనసాగుతుందని టిడిపి నేతలు తేల్చి చెప్పారు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గన్నవరం చేరుకున్నారు. రెండు రోజుల క్రితం, సైకోల దా-డి లో ధ్వంసమైన గన్నవరం టిడిపి ఆఫీస్ పరిశీలించారు. అలాగే గన్నవరం టిడిపి నేత, బీసీ నాయకుడు దొంతు చిన్నా ఇంటికి వెళ్ళిన చంద్రబాబు, అక్కడ కుటుంబ సభ్యులని పరామర్శించారు. చిన్నా కుటుంబంతో పాటుగా, అరెస్ట్ అయిన అందరి కుటుంబాలని పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని చెప్పారు. చంద్రబాబు గన్నవరం పర్యటన నేపధ్యంలో, భారీగా పోలీసులు మొహరించారు. టిడిపి శ్రేణులు కూడా పెద్ద ఎత్తున చేరుకున్నాయి. సైకోలు మళ్ళీ ఎక్కడ వచ్చి పడతారో అని టెన్షన్ టెన్షన్ గా పోలీసులు ఉన్నారు. ఇప్పటికీ గన్నవరం టిడిపి ఆఫీస్ దగ్గర భారీ పోలీస్ బందోబస్తు ఒక పక్క, టిడిపి శ్రేణులు ఒక పక్క ఉండటంతో, టెన్షన వాతావరణం నెలకొంది.

Advertisements

Latest Articles

Most Read