ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ స్కూల్స్ లో, తెలుగు మీడియం ఎత్తేసి, కేవలం ఇంగ్లీష్ మీడియం మాత్రమే పెడతాం అని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఇది విద్యా హక్కు చట్టానికి వ్యతిరేకం అని, ఏ మీడియం కావాలో అది ఆప్షన్ ఇవ్వాలని, ప్రతిపక్షాలు చెప్తున్నాయి. ప్రభుత్వం మాత్రం ఇంగ్లీష్ మీడియం మాత్రమే ఉంటుందని చెప్తుంది. అయితే దీని పై కేంద్రం కూడా ఇటీవల కొత్త పాలసీ తీసుకు వచ్చి, దాంట్లో ప్రాధమిక విద్య మాతృభాషలోనే ఉండాలని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఇదే విషయం పై హైకోర్టులో కేసు పడటంతో, హైకోర్టులో విచారణ జరిపి, ఇది విద్యా హక్కు చట్టానికి వ్యతిరేకం అని, కోర్టు తీర్పు ఇచ్చింది. అయితే దీని ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్ళింది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు కొట్టేయాలని కోరింది. మేము సర్వే చేసామని, 96 శాతం మంది ఇంగ్లీష్ మీడియం కోరుకుంటున్నారని తమ పిటీషన్ లో తెలిపింది. అయితే ఈ కేసు ఈ రోజు సుప్రీం కోర్టులో విచారణకు వచ్చింది. ఈ కేసు చీఫ్ సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ బాబ్డే బెంచ్ ముందుకు వచ్చింది.
అయితే ఈ కేసు గతంలో వేరే బెంచ్ లో ఉండగా, అక్కడ నుంచి బదిలీ అయ్యి, చీఫ్ జస్టిస్ బెంచ్ ముందుకు వచ్చింది. అయితే ఈ పిటీషన్ వేరే బెంచ్ నుంచి బదిలీ అయ్యింది కాబట్టి, దీన్ని స్టడీ చెయ్యటానికి తమకు కొంత సమయం కావాలని, వచ్చే వారానికి ఈ పిటీషన్ వాయిదా వేసారు. అయితే ఈ దశలో ఏపి ప్రభుత్వం తరుపున న్యాయవాది కలుగు చేసుకుని, మూడు నిముషాలు తమ వాదన వినాలని చెప్పి, పేదల కోసమే, ఈ నిర్ణయం తీసుకున్నామని, పేదలు ప్రైవేటు స్కూల్స్ కు వెళ్ళలేక ఇబ్బంది పడుతున్నారని, కోర్టుకు వాదనలు వినిపించారు. అయితే ఈ సందర్భంగా, సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ బాబ్డే, కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు. మాతృభాషలోనే ప్రాధమిక విద్య ఉండాలని, ఇంగ్లీష్ తో పాటుగా, మాతృభాషలోనే విద్యా బోధన ఉండాలని, అభివృద్ధి చెందిన దేశాలు కూడా, ప్రాధమిక విద్య మాతృభాషలోనే ఉంటుందని, పిల్లలకు కూడా త్వరగా అర్ధం అవుతుందని అన్నారు. అయితే దీని పై వాచ్చే వారం విచారణ చేస్తామని, వచ్చే వారానికి వాయిదా వేసారు.