కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో, తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన వల్లభనేని వంశీ, అనధికారికంగా వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. అయితే అప్పటి నుంచి గన్నవరం వైసీపీలో ఎక్కడో ఒక చోట వివాదం చోటు చేసుకుంటూనే ఉంటుంది. ఎందుకంటే అంతకు ముందు, గన్నవరం నుంచి పోటీ చేసిన యార్లగడ్డ, అలాగే సీనియర్ నెట్ దుట్టా రామచంద్రరావు ఒక వర్గంగా అవ్వటంతో, వంశీ వైసీపీలోకి వెళ్ళిన దగ్గర నుంచి వర్గ విబేధాలు ఎక్కువ అయిపోయాయి. తమను గత 10 ఏళ్ళుగా వేధించిన వంశీ రాకను, వైసీపీ క్యాడర్ అంగీకరించలేక పోతుంది. దీంతో వంశీ వర్గం, దుట్టా వర్గం ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవటంతో పాటు, ఇరు వర్గాలు చాలా సార్లు బాహాబాహీకి దిగాయి. అయితే వైసీపీ అధిష్టానం వైవీ సుబ్బా రెడ్డిని పంపించి, ఇద్దరి మధ్య సయోధ్యకు ప్రయత్నం చేసింది కానీ, ఎక్కడా ఇరు వర్గాలు మాత్రం శాంతించటం లేదు. అయితే ఈ నేపధ్యంలోనే, ఈ రోజు మరోసారి ఇరు వర్గాలు బాహా బాహీకి దిగాయి.

ఈ సారి ఏకంగా వంశీ సమక్షంలోనే కొట్టుకున్నారు. బాపులపాడు మండలం కాకులపాడులో రైతు భరోసా కేంద్రం శంకుస్థాపనకు వంశీ వెళ్లారు. అయితే అక్కడ దుట్టా వర్గం, వంశీ వర్గం రెండూ వచ్చాయి. దుట్టా వర్గం మేము శంకుస్థాపన చేస్తాం అంటూ ముందుకురావటం, వంశీ వర్గం శంకుస్థాపన చెయ్యటంతో, నువ్వు ఎవడివిరా అంటూ, వంశీ ముందే దాడి చేసుకున్నారు. చివరకు ఈ గొడవ పెద్దది అయ్యి రాళ్ళు రువ్వుకునే దాకా వెళ్ళింది. వంశీ ఇరు వర్గాలకు సర్ది చెప్పే ప్రయత్నం చేసినా, వంశీ మాట వినే పరిస్థితి లేదు. వంశీ బ్యానర్లను దుట్టా వర్గం చిమ్పెసింది. అయితే కాకులపాడు నుంచి గన్నవరం దండగుంట్ల మీదుగా వెళ్తున్నారని తెలుసుకుని, దండిగుంట్లలో వంశీని అడ్డుకోవటానికి దుట్టా వర్గం ప్రయత్నం చేస్తుందని తెలుసుకుని, పోలీసులు అలెర్ట్ అయ్యారు. అయితే ఈ అంశం పై వైసీపీ అధిష్టానం ఏమి చేస్తుంది అనేది చూడాల్సి ఉంది. గొడవకు సంబధించిన విజువల్స్ https://youtu.be/qLY_fbabqHA 

తెలంగాణా హైకోర్టు, రాష్ట్రంలో ఉన్న అన్ని కోర్టులకు మార్గదర్శకాలు విడుదల చేసింది. అందులో ఎంపీలు, ఎమ్మెల్యేలుకు సంబంధించిన కేసుల పైన, ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేసింది. ఎంపీలు, ఎమ్మెల్యేల పై ఉన్న కేసుల పై రోజు వారీ విచారణ చేపట్టాలని, ప్రత్యెక న్యాయస్థానాలకు, హైకోర్టు ఉన్నత న్యాయస్థానం, ఆదేశించింది. ప్రధానంగా వీటిలో సిబిఐ కోర్టు, ఏసిబి కోర్టు, మెట్రోపాలిటన్, సెషన్స్ కోర్టుల్లో, ప్రధానంగా ఎంపీలు, ఎమ్మెల్యేల పై అనేక కేసులు విచారణలో ఉన్నాయి కాబట్టి, తెలంగాణా హైకోర్టు పరిధిలో ఉన్నటు వంటి ప్రత్యెక కోర్టుల్లో, ఎంపీలు, ఎమ్మెల్యేలు పై ఉన్న కేసుల పై రోజు వారీ విచారణ చేపట్టాలని, తమ ఆదేశాల్లో స్పష్టం చేసింది. ఇటీవల సుప్రీం కోర్టు జారీ చేసిన ఉత్తర్వులకు అనుగుణంగా, వీటి పై రోజు వారీ విచారణ చేపట్టాలని, ఉత్తర్వుల్లో పేర్కొంది. అందుకే రాష్ట్రంలో ఉన్నటు వంటి, ఎంపీలు, ఎమ్మెల్యే పై ఉన్న కేసులు, ప్రధానంగా సిబిఐ కోర్టుల్లో ఉన్న కేసులు, ఏసిబి కేసులు, వివిధ కేసులు పై ప్రత్యేక కోర్టు ఏర్పాటు అయ్యింది.

ఈ అన్ని కేసులు పై రోజు వారీ విచారణ చెయ్యాలని, సుప్రీం కోర్టు ఆదేశాలు పాటించాలని, తెలంగాణా హైకోర్టు ఆదేశించింది. అలాగే ఎంపీలు, ఎమ్మేల్య పై ఉన్న కేసులు విషయంలో, ఒక రోడ్ మ్యాప్ తాయారు చెయ్యాలని, ఇటీవల సుప్రీం కోర్టు ఆదేశించిన నేపధ్యంలోనే, ఈ రోజు తెలంగాణా హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. మొత్తం మీద, సుమారు ఆరు నెలలుగా, కోర్టులు అన్నీ స్థంబించి పోయాయి. అయితే కొన్ని కేసులు మాత్రం ఆన్లైన్ లో విచారణ చేస్తున్నారు. ఇక తెలంగాణా హైకోర్టు ఇచ్చిన తాజా ఆదేశాలు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా చర్చ కానున్నాయి. ఎందుకంటే, తెలంగాణాలో ఉన్న సిబిఐ కోర్టులో, జగన మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి కేసులు నడుస్తున్నాయి. కోరనా రాక ముందు వరకు, ఈ కేసు విచరణ ప్రతి శుక్రవారం జరిగేది. మరి ఈ విషయం, ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి...

అమరావతి ఉద్యమం గత 300 రోజులుగా కొనసాగుతూనే ఉంది. అయితే ప్రభుత్వం వైపు నుంచి మాత్రం ఎలాంటి స్పందన లేదు. ఇంకా అవే అవహేళనలు చేస్తూనే ఉన్నారు. అయితే మరో పక్క, రైతులు, జేఏసి నేతలు, న్యాయ పోరాటం కూడా చేస్తూనే ఉన్నారు. పలు కేసులు ఇప్పటికే హైకోర్టు ముందు ఉన్నాయి. ఒక పక్క ధర్మ పోరాటం, మరో పక్క న్యాయ పోరాటం చేస్తూ, అమరావతి ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. ఈ నేపధ్యంలోనే, అమరావతి ఉద్యమం, ఢిల్లీ పెద్దలకు వివరించి వారి మద్దతు కూడా తెచ్చే ప్రయత్నంలో భాగంగా, గాంధీ జయంతిని వేదికగా చేసుకున్నారు. అమరావతి జేఏసి నేతలు, రైతులు, నిన్న ఢిల్లీ వెళ్లారు. అయితే ఈ బృందంలో, ఒక అనూహ్య వ్యక్తి వచ్చి మద్దతు పలికారు. ఆయినే మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా. వంగవీటి రాధా తెలుగుదేశం పార్టీలో ఉన్నా, పార్టీ కార్యక్రమాలకు మాత్రం దూరంగా ఉంటున్నారు. అయితే అమరావతి పోరాటానికి అవసరం వచ్చిన ప్రతి సారి మద్దతు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్ళిన బృందంలో ఉన్నారు.

నిన్న ఢిల్లీ వెళ్ళిన ఈ బృందం, ఈ రోజు ఢిల్లీలోని రాజ్‍ఘాట్ వద్ద, బాపూజీకి నివాళులు అర్పించి, మౌన ప్రదర్శన చేసారు. మౌన ప్రదర్శనలో అమరావతి జేఏసి నేతలు, రైతులు, వంగవీటి రాధా, అలాగే ప్రొఫెసర్ జీవీఆర్ శాస్త్రి కూడా పాల్గున్నారు. అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేసారు. అయితే మీడియాతో మాట్లాడిన నేతలు, ఈ రోజు మౌన ప్రదర్శన చేసామని, రేపటి నుంచి, కేంద్రంలో మంత్రులుగా ఉన్న వారిని, వివిధ పార్టీల ప్రతినిధులను, ఇతర ముఖ్య నేతలను కలుస్తామని అన్నారు. అమరావతి కోసం రైతుల చేసిన త్యాగం, ఇప్పటి వరకు అక్కడ జరిగిన నిర్మాణాలు, అలాగే పెట్టిన ఖర్చు, మూడు ముక్కల రాజధాని వల్ల కలిగే ఇబ్బందులు, ఇవన్నీ వారికి వివరిస్తామని, అమరావతి కోసం మద్దతు కూడగడతామని, ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుందని అన్నారు. అమరావతి నేతల, ఢిల్లీ పర్యటన ఈ వీడియోలో చూడవచ్చు https://youtu.be/-sDG0bLnCDY

రాజకీయాల్లో అధికార పక్షం, ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం కొనసాగటం సహజమే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా, అధికార ప్రతిపక్షాల మాధ్య మాటల యుద్ధం నడుస్తుంది. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, వాలంటీర్ వ్యవస్థను ప్రవేశ పెట్టి, నేటికి ఏడాది అయ్యింది. ఈ సందర్భంలో, వాళ్ళను చప్పట్లు కొట్టి అభినందించాలి అంటూ, రాష్ట్ర ప్రభుత్వం పిలుపు ఇచ్చింది. వాళ్ళు ఎంతో సేవ చేస్తున్నారని, అందుకే మేము ఈ పిలుపు ఇచ్చాం అని చెప్పింది. అయితే దేశంలో కోవిడ్ పై పోరాటం చేస్తున్న ఫ్రంట్ లైన్ వారియర్స్ కు చప్పట్లు కొడితే, ఇక్కడ వాలంటీర్లకు చప్పట్లు కొట్టటం పై ఆసక్తికర చర్చ జరుగుతుంది. వాలంటీర్లు చేసే పని, గతంలో రెవిన్యూ డిపార్టుమెంటు చేసేది. ఇక పొతే, పెన్షన్లు ఇంటికి తెచ్చ ఇస్తున్నారు. ఇది ఒక్కటే పెద్దగా చెప్పుకునే అంశం. అయితే వాలంటీర్ వ్యవస్థ పై అనేక ఆరోపణలు, కేసులు కూడా వచ్చాయి. మహిళల పై లైంగిక వేధింపులు దగ్గర నుంచి, నాటు సారా, అక్రమ మద్యం, దొంగతనాలు, హత్యలు, ఇలా అనేక ఆరోపణలు వచ్చాయి.

మొదటి నుంచి ఈ వ్యవస్థను తెలుగుదేశం పార్టీ వ్యతిరేకిస్తుంది. యువతకు ఉద్యోగాలు అని చెప్పి, 5 వేలు ఇచ్చి, ఇవా ప్రభుత్వం చేపించేది, వాలంటీర్ వ్యవస్థ వల్ల నష్టాలు తప్ప లాభం లేదు, రెవిన్యూ వ్యవస్థనే పటిష్టం చెయ్యాలని వాపోతుంది. ఈ నేపధ్యంలోనే ప్రభుత్వం ఇచ్చిన చప్పట్ల పిలుపుకు, టిడిపి నిరసన తెలిపింది. చప్పట్లు కాదు, చెప్పుతో కొట్టాలి అంటూ, తెలుగు యువత నిరసన తెలిపింది. వాలంటీర్లు చేసిన వేధింపులు, దొంగ తనాలు, చట్ట వ్యతిరేక కార్యక్రమాల వార్తా పత్రికలు ప్రదర్శిస్తూ, వాటిని చెప్పుతో కొడుతూ, ఇలాంటి వారికి చప్పట్లు కొట్టాలా ? వీళ్ళని చెప్పుతో కొట్టాలి అంటూ నిరసన తెలియ చేసారు. విజయవాడ పార్టీ ఆఫీస్ లో ఈ నిరసన కార్యక్రమం జరిగింది. మహిళలు వేదిస్తున్నందుకు, అత్యాచారాలు చేస్తున్నందుకు, దొంగతనాలు చేస్తున్నందుకు, ఎర్రచందనం దోపిడీ చేస్తున్నందుకు వీళ్ళకు చప్పట్లు కొట్టాలా అంటూ, నిరసన తెలియ చేసారు. ఆ నిరసన ఇక్కడ చూడవచ్చు https://youtu.be/kkwbJ9ChExM

Advertisements

Latest Articles

Most Read