ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసులు ఎన్ని తనిఖీలు చేస్తున్నా, అక్రమ మద్యం మాత్రం దొరుకుతూనే ఉంది. కొన్ని సార్లు పెద్ద పెద్ద వ్యక్తుల వద్ద కూడా అక్రమ మద్యం దొరుకుంతుంది. అయితే ఈ సారి అక్రమం మద్యం పట్టుకున్న వారిని చూసి పోలీసులతో పాటుగా, మీడియా , ప్రజలు కూడా అవాక్కయ్యారు. ఈ రోజు కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో, అక్రమ మద్యం పట్టుకున్నారు పోలీసులు. అయితే పట్టుబడింది దుర్గగుడి పాలకమండలి సభ్యురాలు చక్క నాగ లక్ష్మి కారులో. దీంతో పోలీసులు ఆశ్చర్యపోయారు. తమకు వచ్చిన సమాచారంతో, సీతారాంపురంలో ఉన్న ఒక అపార్ట్మెంట్ వద్దకు చేరుకొని, అక్కడ పార్క్ చేసి ఉన్న కారులో సోదాలు చెయ్యగా, అక్రమ మద్యం బయట పడింది. దీంతో ఆకారం మద్యం స్వాధీనం చేసుకుని, ఇద్దరిని అదుపులోకి తీసుకుని, కేసు బుక్ చేసి, పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే ఒక గౌరవప్రదమైన స్థానంలో ఉంటూ, దేవుడికి సేవ చేస్తూ, ఇలా అక్రమ మద్యం సరఫరా చెయ్యటం పై, అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తున్నాయి.
అధికార పార్టీ నేతలు కావటం, అలాగే చీఫ్ విప్ సామినేని ఉదయభాను అనుచరులు కావటంతో, తెలుగుదేశం పార్టీ కూడా, విమర్శలు బాణాలు ఎక్కు పెట్టింది. దేవాలయాల పై దాడులతో అపవిత్రం చేస్తుందే కాక, ఇప్పుడు ఇలాంటి పనులు చేపిస్తూ, దుర్గమ్మ గుడికే కళంకితం తెచ్చారని వాపోతున్నారు. అయితే తెలంగాణాలోని ఖమ్మం నుంచి, ఈ మద్యం తీసుకు వచ్చినట్టుగా భావిస్తున్నారు. ఇవన్నీ చాలా ఖరీదుగల మద్యం సీసాలుగా పోలీసులు గుర్తించారు. వీటి విలువ కూడా భారీగా ఉంటుందని చెప్తున్నారు. అయితే ఆ కారు పై, దుర్గామల్లేశ్వర స్వామి పాలకమండలి సభ్యులు అని పెద్ద బోర్డు పెట్టి ఉంది. తమను ఎవరూ ఆపకుండా, ఇలా పెట్టుకుని ఉంటారని భావిస్తున్నారు. అయితే ఇది ఎప్పుడు నుంచి చేస్తున్నారు, ఎక్కడ నుంచి మద్యం తెచ్చి, ఎక్కడ అమ్ముతున్నారు ? దీని వెనుక ఇంకా ఎవరు ఉన్నారు అనే అంశం పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి, పోలీసులు పట్టుకున్న వీడియో ఇక్కడ చూడవచ్చు.... https://youtu.be/U8MNbYjO2N8