ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదాయం రోజు రోజుకీ దిగాజారి పోతుంది. అసలకే లోటుతో ప్రారంభం అయిన రాష్ట్రం, గత ప్రభుత్వం కూడా 5 ఏళ్ళలో లక్ష కోట్ల వరకు అప్పు చేసింది. అయితే కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం వచ్చిన తరువాత, ప్రజలకు పంచె పధకాలు ఎక్కవ కావటంతో, ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. అదే సమయంలో ఆదాయం తగ్గిపోతూ వస్తుంది. ముందు ఆరు నెలలు ఇసుక లేక పనులు లేక, ఎక్కడికక్కడ నిర్మాణాలు ఆగిపోవటంతో ఆదాయం తగ్గిపోయింది. గత 4-5 నెలల నుంచి క-రో-నా రావటం పూర్తిగా చతికల పడింది. అయితే ఈ 15 నెలల్లోనే ప్రభుత్వం లక్ష కోట్ల అప్పు చేసిందని కాగ్ రిపోర్ట్ లు చెప్తున్నాయి. తగ్గిపోతున్న ఆదాయం ఓక వైపు, పెరిగిపోతున్న ఖర్చులు ఒక వైపు, అప్పులు మరో వైపు, ఇలా అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్న రాష్ట్రానికి, అక్టోబర్ 11 గండం ఉంది అంటూ ఒక ప్రముఖ పత్రిక ఆసక్తికర కధనం ప్రచురించింది. ఈ నెలలో ఇప్పటికే ప్రభుత్వం 5 వేల కోట్లు అప్పు చేసింది. నెల మొదటిలో 3 వేల కోట్లు, రెండో వారంలో మరో 2 వేల కోట్లు అప్పు చేసారు. తరువాత 2400 కోట్లు ఓడీ కూడా తీసుకున్నారు. అయితే ప్రభుత్వ ఖర్చులు, తీర్చాల్సిన బాకీలు చూసుకుంటే, అక్టోబర్ 11 నాటికి ప్రభుత్వానికి 14 వేల కోట్లు కావలసిన అవసరం ఉంది.

అయితే ఆదాయం ఆ స్థాయిలో వచ్చే అవకాసం లేకపోవటంతో, ప్రభుత్వం దీన్ని ఎలా అదిగమిస్తుంది అనేది చూడాలి. ఈ స్థాయిలో అప్పులు కూడా పుట్టే అవకాసం లేదు. మరి ఈ పరిస్థితి నుంచి బుగ్గన ఎలా గట్టేక్కిస్తారో చూడాలి. ఇక ఖర్చులు విషయానికి వస్తే, అక్టోబర్ 11 నాటికి ఉద్యోగాలకు పెట్టిన పెండింగ్ జీతాలు , వడ్డీతో సహా ఇవ్వాలని కోర్టు ఆదేశాలు ఉన్నాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు , పెన్షన్లు, అలాగే సామాజిక పెన్షన్లు, అప్పుల రీ పేమెంట్లు, ఓడి పేమెంట్ ఇలా అనేక ఖర్చులు ప్రభుత్వం ముందు ఉన్నాయి. అయితే ఇందులో ప్రభుత్వానికి ఉన్న ప్రత్యామన్యాయం, మళ్ళీ కోర్టుకు కానీ, పై కోర్టుకు కానీ వెళ్లి, ఉద్యోగులకు పెండింగ్ జీతాల ఇవ్వటానికి టైం అడగటం. అలాగే కేంద్రం నుంచి ఎక్కువ అప్పు తెచ్చుకోవటానికి అనుమతి తెచ్చుకోవటం. అయితే ఆ పత్రికలో వచ్చిన కధనం పై ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించ లేదు. మరి ప్రభుత్వం ఈ విషయం పై క్లారిటీ ఇస్తుందా, లేదా అనేది చూడాలి. ఏది ఏమైనా ఆదాయం తగ్గి, ఖర్చులు పెరిగి, అపులు పెరిగాయనేది మాత్రం కాగ్ రిపోర్ట్ లు చూస్తే అర్ధం అవుతుంది.

క-రో-నా సమయంలో ఎరువులు, పురుగు మందులు భారీగా పెరిగిపోయాయి. ఇది రైతు ప్రభుత్వమని గొప్పలు చెప్పుకుంటున్న వేళ, ధర విషయంలోనూ రైతులకు న్యాయం చేస్తారని ఆశపడి సాగుచేశారు. నెల్లూరు జిల్లాలో సాగునీటి ఇబ్బందులున్నా, ఏదో విధంగా కష్టపడి 3 లక్షల ఎకరాల్లో వరిసాగు చేశారు. దాదాపు 9 లక్షల పుట్ల వరకు దిగుబడి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వం ప్రకటించిన గిట్టుబాటు ధర కల్పించకుండా మిల్లర్లు, దళారులు అడ్డదారుల్లో కొనుగోలు చేసుకుంటున్నారు. మంత్రి అనిల్‌కుమార్ వచ్చినప్పుడల్లా రైతులకు అన్యాయం జరగనివ్వం, మద్దతు ధరకే కొనుగోలు చేస్తాం. ప్రతి గింజా కొంటాం అంటూ మాటలు చెబుతున్నారు. కలెక్టర్ మాత్రం ప్రతి గింజా కొనుగోలు చేస్తామని పదేపదే చెబుతున్నారు. వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. కొనుగోలు కేంద్రాలకు వెళితే రాజకీయాలు చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. వైసిపి నేతల సిఫార్సులుంటేనే కొన్ని కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేస్తున్నారని తెలుస్తోంది. ఏదో సాకు చెప్పి కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లిన ధాన్యాన్ని తిరిగిపంపుతున్నారు. తేమ శాతం 17 కన్నా ఎక్కువ ఉన్నా కొనుగోలు చేయాలని కలెక్టర్ ఆదేశాలున్నాయి. కేంద్రాల్లో తీసుకోవడం లేదు.

దాంతో రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర దక్కక ఆవేదన చెందుతున్నారు. నెల్లూరు జిల్లా వ్యాపితంగా ఆకాల వర్షం పండించిన పంటను నీటిపాలు చేస్తుంది. ఇదే అదునుగా కొందరు మిల్లర్లు, దళారులు రెచ్చిపోతున్నారు. ఒక పథకం ప్రకారం కొనుగోలు కేంద్రాల్లోని సిబ్బంది, మిల్లరు, దళారులతో కుమ్మక్కై వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో దళారులకు తక్కువ ధరకు అమ్ముకుంటున్నారు. ధాన్యం తీసుకొని అక్కడో, ఇక్కడో తిరగలేక పోతున్నారు. ఇప్పటికే పుట్టికి రూ.4 వేలకు తక్కువకు అమ్ముకుంటున్నారు. మళ్లీ రవాణా ఛారీలు ఎక్కువ అవుతుండడంతో ఎవరికొకరికి అమ్ముకొని ఉసురూమంటున్నారు. ప్రభుత్వం చెబుతున్న మాటలు కేవలం నీటి మూటలుగానే కనిపిస్తున్నారు. ఇద్దరు మంత్రులు, ఎమ్మెల్యేలు రైతులకు జరుగుతున్న అన్యాయం పై నోరుమెదపడం లేదు. ప్రకటనలు మాత్రం ఇస్తూనే ఉన్నారు. ప్రభుత్వం మాత్రం కొనుగోలు చేయడం లేదు.

అంతా బాగుంటేనే ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదు. వర్షాలకు ధాన్యం తడవడంతో రంగుమారే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. రంగుమారిన ధాన్యం పరిస్థితి ఏమిటనేది రైతులను వేధిస్తోన్న ప్రశ్నగా ఉంది. కేంద్ర ప్రభుత్వం పెంచిన ధరలను పక్కన పెట్టేసి, గిట్టుబాటు ధర కల్పించకుండా రైతులను ప్రభుత్వం కన్నీరు పెట్టిస్తోంది. ప్రభుత్వ తీరుపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంత్రులు, అధికారులు మాటలు చెప్పడం మాని, రైతులకు : గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ జిల్లాలో రైతులు రోడ్డెక్కుతున్నారు. మంగళవారం సంగం వద్ద రైతులు రోడ్డుపై బైటాయించారు. ధాన్యాన్ని రోడ్డుపై పోసి నిరసన తెలిపారు. నెల్లూరు-ముంబాయి జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. గిట్టుబాటు ధర కల్పించాలని, రైతులను మోసగించొద్దని నినదించారు.

ఎన్ని నేరాలు చేసినా, ఎన్ని క్రిమినల్ కేసులు ఉన్నా, ఎన్ని ఆర్ధిక నేరాల కేసులు ఉన్నా, దర్జాగా ఎన్నికల్లో గెలిచేసి, కేసులతో సంబంధం లేదు, మాకు ప్రజా తీర్పు లభించింది అని భావిస్తున్న నేతలకు, ఇక మూడింది. దేశ వ్యాప్తంగా, ఇలా ఉన్న నేతల అవినీతి చిట్టా తీసి, వారి పై ఉన్న కేసులను ఏడాది లోపు విచారణ చేసి, ఒక వేళ నిజం అని తేలితే, వారు ఎన్నికల్లో పోటీ చెయ్యకుండా చెయ్యాలనే పిటీషన్ పై సుప్రీం కోర్టులో ఈ రోజు వాదనలు జరిగాయి. జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీం కోర్టు ధర్మాసనం, గత కొన్ని రోజులుగా ఈ పిటీషన్ పై విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలోనే ఈ కేసు పై ఈ రోజు విచారణ జరిగింది. కోర్టు నియమించిన అమికస్ క్యూరి హన్సారి, కోర్టుకు అడిషనల్ అఫిడవిట్ దాఖలు చేసినట్టు తెలిపారు. ఈ అఫిడవిట్ లో సిబిఐ, ఈడీ కేసులు నమోదు అయిన నేతల పేర్లు ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆ కేసుల వివరాలు అమికస్ క్యూరిని అడిగిన జస్టిస్ సూర్యకాంత్ తెలుసుకున్నారు. మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే, తెలంగాణా సిబిఐ కోర్టులో 13 కేసులు పెండింగ్ లో ఉన్నాయని కోర్టుకు చెప్పారు.

ఇందులో ఎమ్మెల్యేల కేసులే ఎక్కువ అని, చాలా కేసుల్లో విచారణ దశకు కూడా కేసులు రాలేదని తెలిపారు. విచారణ వేగవంతం అయ్యేలా చూడాలని, అమికస్ క్యూరి, సుప్రీం కోర్టుకు సూచించింది. అయితే ఇదే సందర్భంలో కేంద్రం కూడా ఈ పిటీషన్ పై స్పందించింది. సొలిసిటరీ జనరల్ స్పందిస్తూ, ప్రజా ప్రతినిధుల పై ఉన్న కేసులు ఒక కాల పరిమితి లోపు పూర్తి చెయ్యటానికి తామకు ఎలాంటి అభ్యంతరం లేదని కోర్టుకు తెలిపారు. ఈ విషయంలో ప్రత్యేక కోర్టుల ఏర్పాటు, ఇతర మౌలిక సదుపాయాల కోసం, తమకు రెండు నెలల సమయం ఇవ్వాలని సొలిసిటరీ జనరల్ కోర్టును కోరారు. కేసులు తీవ్రతను బట్టి, ప్రాధాన్యతా క్రమంలో విచారణ జరగాలని, జిల్లాకు ఒక ప్రత్యేక కోర్టు పెట్టాలని, అమికస్ క్యూరి సుప్రీం కోర్టుకు తెలిపారు. అయితే ఈ విషయంలో కోర్టు ఏ ఆదేశాలు ఇచ్చినా తాము సిద్ధంగా ఉన్నామని, కేంద్రం కోర్టుకు తెలిపింది. దీని పై విచారణ చేసిన సుప్రీం, అమికస్ క్యూరి సూచనలు అన్నీ తీసుకుని, తగిన ఆదేశాలు ఇస్తామని కేసుని వాయిదా వేసింది.

ఆంధ్రప్రదేశ్ లో క-రో-నా ఉదృతి ఎలా ఉందో అందరికీ తెలిసిందే. దేశంలోనే రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం క-రో-నా కేసుల్లో ఉంది. మహరాష్ట్ర లాంటి పెద్ద రాష్ట్రం తరువాత ఏపి ఉంది. ఇప్పటికే 5 లక్షలకు పైగా కేసులు ఆంధ్రప్రదేశ్ లో వచ్చాయి. దాదాపుగా 4 వేల మంది వరకు చనిపోయారు. అయితే ఇప్పుడు తాజాగా క-రో-నా బారిన పడి ఏకంగా ఒక ఎంపీ చనిపోయారు తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్, ఈ రోజు మృతి చెందారు. చెన్నైలోని అపోలో హాస్పిటల్ లో ఆయన క-రో-నా చికిత్స తీసుకుంటూ, ప్రాణాలు విడిచారు. ఆయన క-రో-నా బారిన పడటంతో, ఇటీవలే చెన్నై అపోలో లో చేరారు. ఆయన చికిత్స తీసుకుంటూ ఉండగానే, గుండె పోటు వచ్చి చనిపోయినట్టు చెప్తున్నారు.  ఎంపీ గారికి 64 ఏళ్ళు. 1985లో రాజకీయాల్లో వచ్చిన ఆయన, నాలుగు సార్లు ఎమ్మెల్యేగా చేసారు. మంత్రిగా కూడా పని చేసారు. 2019లో ఆయన వైసీపీలో చేరి, ఎంపీగా గెలుపొందారు.

Advertisements

Latest Articles

Most Read