ఆంధ్రప్రదేశ్ లో క-రో-నా ఉదృతి ఎలా ఉందో అందరికీ తెలిసిందే. దేశంలోనే రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం క-రో-నా కేసుల్లో ఉంది. మహరాష్ట్ర లాంటి పెద్ద రాష్ట్రం తరువాత ఏపి ఉంది. ఇప్పటికే 5 లక్షలకు పైగా కేసులు ఆంధ్రప్రదేశ్ లో వచ్చాయి. దాదాపుగా 4 వేల మంది వరకు చనిపోయారు. అయితే ఇప్పుడు తాజాగా క-రో-నా బారిన పడి ఏకంగా ఒక ఎంపీ చనిపోయారు తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్, ఈ రోజు మృతి చెందారు. చెన్నైలోని అపోలో హాస్పిటల్ లో ఆయన క-రో-నా చికిత్స తీసుకుంటూ, ప్రాణాలు విడిచారు. ఆయన క-రో-నా బారిన పడటంతో, ఇటీవలే చెన్నై అపోలో లో చేరారు. ఆయన చికిత్స తీసుకుంటూ ఉండగానే, గుండె పోటు వచ్చి చనిపోయినట్టు చెప్తున్నారు. ఎంపీ గారికి 64 ఏళ్ళు. 1985లో రాజకీయాల్లో వచ్చిన ఆయన, నాలుగు సార్లు ఎమ్మెల్యేగా చేసారు. మంత్రిగా కూడా పని చేసారు. 2019లో ఆయన వైసీపీలో చేరి, ఎంపీగా గెలుపొందారు.
క-రో-నాతో మృతి చెందిన ఆంధ్రప్రదేశ్ ఎంపీ...
Advertisements