ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కని కులాల నేతలను ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎంపిక చేసి ఎప్పుడూ లేని విధంగా సామాజిక న్యాయం చేస్తున్నామని సీఎం జగన్ రెడ్డి ప్రకటించారు. 18 మంది అభ్యర్థులలో 14 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు చెందినవారేనని, ఇది చరిత్రలో లేని సామాజిక న్యాయం అంటూ ప్రచారం కూడా చేసుకుంటున్నారు. అయితే ఏ వర్గాలకైతే న్యాయం చేశామని సీఎం ప్రకటించారో ఆయా వర్గాల నుంచే వైసీపీ తమకు సామాజిక అన్యాయం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్సీ టిక్కెట్ ఇవ్వకుండా వైసీపీ ప్రభుత్వం అన్యాయం చేసిందని, ఇది తూర్పు కాపులను అణగదొక్కే చర్యల్లో భాగంగానే చేశారని తూర్పుకాపు సంక్షేమ సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. వైసీపీ సర్కారు చేసిన అన్యాయానికి నిరసనగా తూర్పు కాపు ఆధ్వర్యంలో ఇండిపెండెంట్ ని బరిలొకి దింపుతామని సంఘ నేతలు ప్రకటించారు. ఎమ్మెల్సీ స్థానాల భర్తీలో అగ్నికుల క్షత్రియులకు తీరని ద్రోహం వైసీపీ చేసిందని సంఘ నాయకులు ఆందోళనకి దిగారు. అగ్నికుల క్షత్రియులకు ఒక స్థానంలోనైనా ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. వైసీపీ ఎమ్మెల్సీ స్థానాల కేటాయింపులో అన్యాయం జగిరిందన్న రజక పోరాట సమాఖ్య నిరసన తెలిపింది. పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీని జగన్ విస్మరించారని , వచ్చే ఎన్నికల్లో తడాఖా చూపుతామని సంఘ నేతలు హెచ్చరించారు. బీసీల్లో అత్యధిక జనాభా కలిగిన గౌడ సామాజికవర్గం నుంచి ఒక్కరికి అవకాడం ఇవ్వకపోవడం గౌడలను అవమానించడమేనని ఆ సంఘం ఆవేదన వెలిబుచ్చింది. బీసీల్లో అత్యధిక జనాభా ఉన్న గౌడ, తూర్పుకాపులతోపాటు వివిధ బీసీసంఘాలు వైసీపీ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి.
news
వివేక కేసు పై బాంబు పేల్చిన సిబిఐ... అవినాష్ రెడ్డి ఇంట్లో స్కెచ్ మొత్తం కోర్టుకు చెప్పేసింది...
వివేక కేసు పై, ఈ రోజు సిబిఐ తెలంగాణా హైకోర్టులో కౌంటర్ వేసింది. ఇందులో కొన్ని సంచలన విషయాలు ఉన్నాయి. వివేక నంద రెడ్డి హ-త్య రోజు నిందితులందరూ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి ఇంట్లోనే ఉన్నారు. అవినాష్ రెడ్డికి హ-త్య గురించి ముందే తెలుసు సంఘటనా స్థలంలో సాక్ష్యాలు చెరపటంలో అవినాష్ రెడ్డి కీలకపాత్ర పోషించారు. నిందితులందరూ ఉదయం ఐదు గంటల 30 నిమిషాలకు భాస్కర్ రెడ్డి ఇంట్లో ఉన్నారు. అవినాష్ రెడ్డి తన సెల్ ఫోన్ నుంచి రెండు నెంబర్లకు కాల్ చేసి వివేక మృతి పై సమాచారం ఇచ్చారు. దీనికోసం పీఏ రాఘవరెడ్డి ఫోన్ కూడా ఉపయోగించారు. ఘటనా స్థలానికి త్వరగా రావాలని సిఐని కోరలేదు. నలుగురు కానిస్టేబుల్ను పంపితే చాలు అన్నాడు. హ-త్య గురించి ముందే తెలుసు. హ-త్య కేసులో సునీల్, ఉమా శంకర్ రెడ్డి, దస్తగిరి ఉదయం ఐదు గంటల 20 నిమిషాలకు భాస్కర్ రెడ్డి ఇంట్లో ఉన్నారు. వీరి ముగ్గురి ప్రమేయం బయటికి రాకుండా అవినాష్ రెడ్డి జాగ్రత్తలు తీసుకున్నాడు. ఇలా పూర్తి సమాచారం కోర్టుకు తెలిపారు. సిబిఐ ఇలా అవినాష్ రెడ్డి మొత్తం చేసారని చెప్పటం ఇదే మొదటి సారి. అలాగే అవినాష్ రెడ్డి ఫోన్ చేసిన రెండు నంబర్లు ఎవరివి అనేది కూడా ఇప్పుడు సస్పెన్స్ గా మారింది.
నాడు మండలి రద్దు ..నేడు ముద్దు ఎలా అయ్యింది జగన్?
నాడు శాసన మండలి రద్దు చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసిన సిఎం వైఎస్ జగన్ కు ఇప్పుడు పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కు ఎక్కడిదని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. సీఆర్డీఏ రద్దు, మూడు రాజధానుల బిల్లులను మండలిలో ఆధిక్యం ఉన్న తెలుగుదేశం తిప్పి పంపడంతో ఏకంగా మండలి రద్దుకి తీర్మానం చేసింది వైసీపీ ప్రభుత్వం. ఆ తరువాత మండలిలో వైసీపీ బలం పుంజుకోవడంతో మండలి రద్దు తీర్మానాన్ని వైసీపీ లైట్ తీసుకుంది. ఇప్పుడు ఇదే అస్త్రాన్ని టిడిపి అధినేత వైసీపీపై ప్రయోగించారు. తన మాట నెగ్గలేదనే అహంకారంతో నాడు ఏకపక్షంగా జగన్ మండలి రద్దుకు తీర్మానం చెయ్యలేదా అని చంద్రబాబు ప్రశ్నించారు. శాసన మండలి వల్ల ప్రజా ప్రయోజనం లేదని, దీనిపై ఒక్క రూపాయి ఖర్చు పెట్టడం కూడా దండగే అని సిఎం జగన్ అనలేదా అని టిడిపి అధినేత నిలదీశారు. మండలి లాంటి వ్యవస్థలను అగౌర పరిచిన ముఖ్యమంత్రి.. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థులను నిలబెట్టి...ఓట్లు అడుగుతారని చంద్రబాబు నాయుడు నిలదీశారు. పట్ట భద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎన్నికలపై పార్టీ ఇంచార్జ్ లు, ముఖ్యనేతలతో చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ మండలి రద్దు వ్యాఖ్యలను అభ్యర్థులు బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. నేతలంతా ఈ ఎమ్మెల్సీ ఎన్నికలను సీరియస్ గా తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ప్రస్తుతం తీవ్ర ప్రభుత్వ వ్యతిరేక ఉందని.... అదే సమయంలో తెలుగుదేశానికి అనుకూలంగా పరిస్థితి ఉందని అన్నారు. ఈ పరిస్థితుల్లో వచ్చిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ నిలబెట్టిన అభ్యర్థులను గెలిపించాలని చంద్రబాబు నేతలకు సూచించారు. ఈ ఎన్నికలు ఇంచార్జ్ లు, నేతల పరితీరుకు, సమర్థతకు పరీక్ష గా ఉండబోతున్నాయని ఆయన అన్నారు. ఈస్ట్ రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్, వెస్ట్ రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి వి.చిరంజీవి రావు లను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.
శ్రీశైలం ఈవోకి పెద్దిరెడ్డి శివుడు అట..శివమాలలో ఉండి అపచారం?
జగన్ భజన చేయడానికి సిగ్గు పడటం అనేది మానేశారు వైసీపీ నేతలు. ఇప్పుడు ఈ కోవలో ఉన్నతాధికారులూ చేరారు. ఎంత తప్పు చేసైనా తమని తాము సమర్థించుకోవడం అధికారులకు భజనతో పెట్టిన విద్య అయిపోయింది. తెలంగాణ సీఎం కేసీఆర్ కి ఓ ఐఏఎస్ పాదాభివందనం చేయడం చూశాం. ఇప్పుడు ఏపీలో మంత్రి పెద్దిరెడ్డికి శ్రీశైలం ఆలయ ఈవో లవన్న సాష్టాంగ ప్రణామం చేశారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శ్రీశైలం దేవాలయానికి కార్యనిర్వహణాధికారి. మాలలో ఉన్నారు. అన్నీ వదిలేశారు. పెద్దిరెడ్డి కనపడేసరికి కాళ్లపై పడ్డారు ఈవో. దీనిపై మీడియాలో కథనాలు వస్తే ఈవో ఇచ్చిన వివరణ మరింత వివాదాస్పదం అయ్యింది. పెద్దిరెడ్డిని చూసిన ఈవోకి ఆయనలో శివుడు కనిపించాడట. అందుకే కాళ్లకు దండం పెట్టానని ఇచ్చిన వివరణ మరీ అన్యాయంగా ఉంది. కొంతమంది శివరాత్రి దర్శనాలు అడిగారని, ఇవ్వకపోయే సరికి ఇలా తనను టార్గెట్ చేస్తున్నారని ఈవో ఆరోపిస్తున్నారు. ఈవో శివ మాలధారణలో ఉంటే, పెద్దిరెడ్డిలో ఆయనికి శివుడు కనపడటం చాలా విచిత్రంగా ఉందని శివభక్తులు అంటున్నారు. శివ మాల ధరించిన, శ్రీశైలం ఈవో ఇలా ఆలయమర్యాదలు మంటగలిపిన వ్యవహారం రాష్ట్రమంతా చర్చనీయాంశం అయ్యింది. హిందూ ధర్మానికి పేటెంట్ హక్కులు పొందిన బీజేపీ నేతలు మాత్రం దీనిపై స్పందించలేదు ఎందుకో మరి?