ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని మూడు ముక్కలు చేస్తూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం, దీని పై ఒక చట్టం ఉన్నా, అగ్రిమెంట్ ఉన్నా, రైతులను ప్రభుత్వం అన్యాయం చేస్తుందని చెప్తూ, కొంత మంది రైతులు హైకోర్టుని ఆశ్రయించారు. దోనే సాంబశివరావు అనే వ్యక్తి, అమరావతి రాజధాని అంశంలో కేంద్రానికి కూడా సంబంధం ఉందని, విభజన చట్టంలో, ఒక రాజధాని అని స్పష్టంగా ఉందని, దాని ఆధారంగా కేంద్రం ఈ విషయం పై స్పందించాలని కోరుతూ, హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. ఈ పిటీషన్ పై ఈ రోజు కేంద్రం హోం శాఖ కౌంటర్ దాఖలు చేసింది. విభజన చట్టంలో, కేంద్రం రాజధానికి ఆర్ధిక సహాయం చేస్తుందని మాత్రమే ఉందని, ఒక రాజధాని ఉండాలా, మూడు రాజధానులు ఉండాలా అనేది, రాష్ట్రాల నిర్ణయం అని, మేము అందులో జోక్యం చేసుకోమని అన్నారు. రాజధానుల ఎంపిక విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదని, కేంద్రం హోం శాఖ స్పష్టం చేసింది. విభజన చట్టం ప్రకారం, మూడు రాజధానులు తప్పు లేదని, అది రాష్ట్రాల ఇష్టం అని కేంద్రం చెప్పింది.
అయితే కేంద్రం ఏదో చేస్తుందని నమ్ముతున్న అమరావతి రైతులకు, ఈ రోజు కేంద్రం ఇచ్చిన అఫిడవిట్ తో మొత్తం క్లారిటీ వచ్చేసింది. ఇక బీజేపీ అమరావతి విషయంలో ఏమి చెయ్యలేదని అర్ధం అయిపోయింది. ఇక చట్టాలు, న్యాయాలు ప్రకారం, కోర్టులు ఇచ్చే తీర్పుల పైనే రాజధాని ప్రాంత రైతులు ఆశలు పెట్టుకున్నారు. గతంలోనే కేంద్రం ఇదే విషయం పై, విభజన చట్టానికి చెందిన అఫిడవిట్ ఇచ్చిన టైంలో, ఈ ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయం తీసుకుందని చెప్పింది. అయితే ఇక్కడ మరో విషయం ఏమిటి అంటే, హైకోర్టులో వాదనల సమయంలో, రాష్ట్రపతి నోటిఫై చేస్తే, మీరు ఎలా మారుస్తారు అంటూ గతంలో చేసిన వ్యాఖ్యలతో, హైకోర్టు మారదు అనే ధీమాతో ఉంటే, దీని పై కూడా కేంద్రం స్పందిస్తూ, హైకోర్టు కూడా మా పరిధిలో లేదు, హైకోర్టు రాజధానిలోనే ఉండాలని లేదు అంటూ, తన అఫిడవిట్ లో చెప్పింది. మొత్తానికి బీజేపీ ఏదో చేసేస్తుంది అనే వారికి, ఇక బీజేపీ ఏమి చెయ్యదు అనే క్లారిటీ వచ్చేసింది.