తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం ప్రెస్ మీట్ లో చేసిన వ్యాఖ్యలు, వైసీపీ నేతలకు గట్టిగానే తగిలాయి. మంత్రుల నుంచి, నేతల వరకు అందరూ ప్రెస్ మీట్లు పెట్టి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్లు ఇస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం జమిలీ ఎన్నికల గురించి, చర్చ చేసిన విషయం తెలిసిందే. క-రో-నా రాకపోయి ఉండి ఉంటే, ఈ పాటికే ఆ అంశం ఒక కొలిక్కి వచ్చేది. అయితే ఈ ప్రక్రియ కొంచెం నెమ్మదించింది. అయితే గత వారం ప్రధాన మంత్రి కార్యాలయంలో, ఒక దేశం, ఒక ఎన్నికల జాబితా పై ఒక ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. దీంతో ఈ ప్రక్రియ జమిలీ ఎన్నికల కోసమే అని ప్రచారం జరుగుతుంది. జమిలీ ఎన్నికలు జరిగితే 2022 చివర్లో కానీ, 2023 మొదట్లో కానీ జరిగే అవకాశం ఉంది. 2022లో జరిగే ఎన్నికలు ఆపేసి, అలాగే 2024లో జరిగే రాష్ట్రాలు ఎన్నికలు ముందుగా పెట్టి, ఒకే దేశం, ఒకే ఎన్నిక జరపాలని, తద్వారా ఖర్చు ఆదా అవుతుందని, అభివృద్ధి పనులకు ఆటంకం కలగదు అని, కేంద్రం యోచన. ఈ చర్చ జరుగుతూ ఉండటంతో, చంద్రబాబు కూడా ఇదే విషయం తన ప్రెస్ మీట్ లో చెప్పారు. ఈ ప్రభుత్వం చేస్తున్న పనులు, అప్రజాస్వామికంగా ఉన్నాయని, 2023లో జమిలీ ఎన్నికలు వచ్చే అవకాసం ఉంది కాబట్టి, తొందరగానే మనకు విముక్తి లభిస్తుంది అని, తన ప్రెస్ మీట్ లో చెప్పారు.

cbn 07092020 2

అయితే ఈ విషయం పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వరుస పెట్టి ప్రెస్ మీట్లు పెడుతున్నారు. చంద్రబాబు ప్రెస్ మీట్ అవ్వగానే బొత్సా ప్రెస్ మీట్ పెట్టి, జమిలీ ఎన్నికలు వచ్చే అవకశమే లేదు, ఆ వాతావరణమే లేదని, చంద్రబాబు వెంటనే కుర్చీ ఎక్కేయాలనే ఆతృతలో ఉన్నారని అన్నారు. ఇక మిగతా నేతలు కూడా ప్రెస్ మీట్లు పెట్టి, జమిలీ ఎన్నికలు అంటూ చంద్రబాబు చేసిన ప్రకటన పై అభ్యంతరం వ్యక్తం చేసారు. ఇందులో ముఖ్యంగా చంద్రబాబు మాటలు కనుక బలంగా ప్రజల్లోకి వెళ్తే, తమకు నష్టం అనే భావనలో వైసీపీ నేతలు ఉన్నారు. ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు, కేవలం అప్పు చేసి, చేస్తున్న సంక్షేమం మాత్రమే కొంత ఊరట, ఇప్పుడు ఎన్నికలు ముందే వచ్చేస్తే, అంతకు ముందు ఏడాది కాలం నుంచే ఎన్నికల వాతావరణం వచ్చేస్తుంది. ప్రజలకు చూపించటానికి, తాము చేసిన పని ఏమి ఉండదు అని వైసీపీ నేతల భావన. అంతే కాకుండా, టిడిపి నుంచి బయటకు వచ్చేద్దాం అనుకునే నేతలు ఎవరైనా ఉంటే వారు కూడా, ఆలోచనలో పడతారు. అందుకే చంద్రబాబు జమిలీ అనగానే, దాన్ని డైల్యూట్ చేసే పనిలో పడింది వైసీపీ. చంద్రబాబు చెప్పినా, జగన్ చెప్పినా, పైన ఉన్న ప్రధాని మోడీ ఆగే పని ఉండదు. ఆయన ఏమి అనుకుంటే, అది చేసి తీరుతారు. చూద్దాం ఏమి జరుగుతుందో.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గుర్తుండి పోయే సంఘటన, కోడి క-త్తి సీన్. అప్పటి ప్రతిపక్ష నాయుకుడు, జగన్ మోహన్ రెడ్డి, పాదయాత్ర ముగించుకుని, వైజాగ్ ఎయిర్ పోర్ట్ నుంచి హైదరాబాద్ లోటస్ పాండ్ కు వెళ్ళటానికి ప్రయత్నం చేస్తూ ఉండగా, వైజాగ్ ఎయిర్ పోర్ట్ లో, ఒక రెస్టారెంట్ లో పని చేస్తున్న, శీను అనే వ్యక్తి , జగన్ తో సేల్ఫీ దిగుతాను అని చెప్పి దగ్గరకు వచ్చి, కోడి క-త్తి ఒకటి తీసుకుని, జగన్ భుజం పై గుచ్చారు. అయితే తాను సెన్సేషన్ కోసమే ఇలా చేసానని, కోడి క-త్తి శీను, ఒక లెటర్ కూడా జేబులో పెట్టుకున్నారు. ఇక ఆ తరువాత కోడి క-త్తి శీను వైసీపీ సానుభూతి పరుడు అని, అతను జగన్ కోసం కట్టిన ఫ్లెక్స్ లు ఇవన్నీ బయట పడ్డాయి. అయితే దీని పై పెద్ద కుట్ర ఉంది అంటూ, కేంద్రానికి ఫిర్యాదు చెయ్యటంతో, కేంద్రం, ఉగ్రవాదులను ఏరి పారేసి, ఎన్ఐఏ వాళ్లతో ఎంక్వయిరీకి ఆదేశించింది. అయితే, ఆ ఎంక్వయిరీ ఇప్పటి వరకు ఘటన ఎందుకు జరిగింది, ఎవరు చెయ్యమంటే జరిగింది అనే వివరాలు అయితే ఏమి ఇవ్వలేదు. కోడి క-త్తి శీను మాత్రం, అప్పటి నుంచి రిమాండ్ లో ఉన్నారు.

kodikatti 07092020 2

ఈ నేపధ్యంలో ఇప్పుడు కోడి క-త్తి శీను హైకోర్టులో ఒక పిటీషన్ దాఖలు చేసాడు. కోడి క-త్తి కేసులో అరెస్ట్ అయి, రిమాండ్ లో ఉన్న తనకి, బెయిల్ ఇవ్వాలి అంటూ, హైకోర్టు లో పిటీషన్ వేసాడు. ఇప్పటికే ఎన్ఐఏ విచారణ పూర్తి చేసిందని, తాను 21 నెలలుగా జైలులోనే ఉన్నానని, తనకు పెద్ద వయసు ఉన్న తల్లి దండ్రులు ఉన్నారని, వారిని పోషించాల్సిన బాధ్యత తన పైనే ఉందని, కోర్టుకు తెలిపారు. కోర్టు ఇచ్చే షరతులకు లోబడి ఉంటానని, తనకు బెయిల్ ఇవ్వాలని కోరాడు. ఒక వేల బెయిల్ ఇవ్వలేని పక్షంలో, కనీసం జగన్ మోహన్ రెడ్డిని అయినా, రాబోయే 15 రోజుల్లో ఎన్ఐఏ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పేలా ఆదేశాలు ఇవ్వాలని, తన పిటీషన్ లో కోరాడు. ఈ ఏడాది మే 22న బెయిల్ కోడి క-త్తి శీనుకు బెయిల్ మంజూరు అయ్యింది. అయితే సాక్ష్యులను శీను తారుమారు చేస్తాడని ఎన్ఐఏ వాదించటంతో, కోర్టు బెయిల్ రద్దు చెయ్యటంతో, మళ్ళీ శీనుని అదుపులోకి తీసుకుని రిమాండ్ కు పంపించారు.

తెలుగు మీడియా చాలా వరకు పార్టీల పరంగా విడిపోయింది. రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రభుత్వాల వారికీ సొంత మీడియా ఉంది. ఇక కొన్ని చానల్స్ వాళ్ళ అనునాయులవి. ఇక కొన్ని మీడియా చానల్స్, సందర్భానికి తగ్గట్టు చేస్తూ ఉంటాయి. మరికొన్ని, ఒక పార్టీ మీద వ్యతిరేకతతో, మరో పార్టీకి అనుకూలంగా ఉంటాయి. ఒకటి రెండు తప్ప, మిగతావి అన్నీ ఒక సైడ్ తీసుకుని వాయిస్తూ ఉంటారు. అయితే, ఈ సందర్భంలో ఎవరు ఎటు వైపు ఉన్నారో, తెలుసుకోక, గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తన పై కొన్ని చానల్స్ లో పని గట్టుకుని, తెలుగుదేశం పార్టీ ప్రచారం చేపిస్తుంది అంటూ, వరుసగా ట్వీట్లు వేసి చేసిన రచ్చ తెలిసిందే. అయితే ఇప్పుడు అదే ఛానల్ పవన్ కళ్యాణ్ ని కించ పరిచే కధనాలు వేస్తుంది అంటూ, జనసేన పార్టీ అఫిషియల్ ప్రెస్ నోట్ విడుదల చేసి ఖండించింది. అయితే ఆ ఛానల్, అప్పుడు ఇప్పుడు, చంద్రబాబు కంట్రోల్ లో లేదు. తెలంగాణా అధికార పక్షానికి కావాల్సిన వారి ఛానల్ అది. కానీ పవన్ కళ్యాణ్ ఈ సారి ఎవరినీ నినదించకుండా, ఆ ఛానల్ వైఖరిని ఖండిస్తూ సరి పెట్టారు. గతంలో లాగా, చంద్రబాబు కారణం అంటూ, వారం రోజులు పాటు రచ్చ చెయ్యలేదు. ఇక విషయానికి వస్తే, దీని మొత్తం వెనుక ఒక బీజేపీ నాయకురాలు పెట్టిన సోషల్ మీడియా కామెంట్, ఈ రచ్చకు కారణం అయ్యింది.

పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా, అనేక మంది విష్ చేసారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తులో ఉండటంతో, అనేక మంది ఉత్తరాది నాయకులు పవన్ కు విష్ చేసారు. అయితే ఎప్పుడూ లేనిది, ఈ సారి పవన్ కళ్యాణ్ అందరినీ పేరు పేరునా విష్ చేసారు. ఈ నేపధ్యంలో ఉత్తరాది నాయకులకు కూడా విష్ చేసారు. అయితే, సినీ నటి, బీజేపీ నాయకురాలు అయిన మాధవీ లత, పవన్ అలా ఉత్తరాది వారికి స్పందించటం బాగోలేదు అంటూ, ఒక కామెంట్ పెట్టారు. ఆ పోస్ట్ వైరల్ కావటంతో, ఒక ప్రముఖ ఛానల్ ఆ పోస్ట్ ని, తన ఛానల్ లో ప్రచారం చేసింది. అయితే దీని పై జనసేన తీవ్రంగా స్పందించింది. దేశ సమగ్రతకు భంగం కలిగించే అలాంటి విషయాల పై ఎందుకు ఇంత ప్రచారం అంటూ ఒక బహిరంగ లేఖ ఆ ఛానల్ కు రాసింది.

బాధ్యతగా మెలగాలని కోరింది. ఇక జనసేన సోషల్ మీడియా కార్యకర్తలు, ఆ ఛానల్ పై సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోస్తున్నారు. అయితే ఒక పక్క జనసేనతో పొత్తు ఉన్నా, బీజేపీ నేత, గత ఎన్నికల్లో పోటీ చేసిన మాధవీ లత అలా ఎందుకు పవన్ పై కామెంట్స్ చేసారో ఎవరికీ అర్ధం కాలేదు. అయితే ఆమె ఎన్నికల తరువాత పెద్దగ ఆక్టివ్ గా లేదు, అలా అని పార్టీ నుంచి బయటకు వచ్చింది లేదు. మరి బీజేపీ ఆమెను ఈ చర్య తరువాత సస్పెండ్ చేస్తుందో లేదో చూడాలి. అయితే, గతంలో తన పై వచ్చిన ప్రోగ్రాంలు అన్నీ చంద్రబాబు చేపించాడు అని చెప్పిన పవన్ కళ్యాణ్, ఇప్పటికైనా నిజం తెలుసుకున్నారో లేదో. అదీ ఇప్పుడు ఆ ఛానల్ ఎవరి చేతిలో ఉందో అందరికీ తెలిసిందే. చంద్రబాబుని అన్నట్టు, ఆయన్ను అంటే కుదరదు అనుకున్నారో ఏమో కానీ, ఖండనతో ఆపారు. ఏది ఏమైనా, ఇలాంటివి ఎవరు చేసినా మంచిది కాదు. పవన్ లేఖతో అయినా ఆ టీవీ ఛానల్ కంట్రోల్ అవుతుందేమో చూద్దాం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో మరో ఎదురు దెబ్బ తగిలింది. ఇది కూడా మళ్ళీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో కావటం విశేషం. ఇప్పటికే నిమ్మగడ్డ రమేష్ ను రాష్ట్ర ఎన్నికల కమీషనర్ గా తప్పిస్తూ తీసుకున్న నిర్ణయం పై హైకోర్టులో, సుప్రీం కోర్టులో పోరాడి, నిమ్మగడ్డ రాష్ట్ర ప్రభుత్వం పై గెలిచి మళ్ళీ పదవి చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఆయన విధుల్లో చేరిన తరువాత, ఆయన పని ఆయన చేసుకుంటూ, ప్రభుత్వం పని ప్రభుత్వం చేసుకుంటూ, ఈ వివాదానికి ఫూల్ స్టాప్ పెట్టారు. అంతా ప్రశాంతంగా సాగిపోతున్న తరుణంలో, మళ్ళీ నిమ్మగడ్డ తాజాగా హైకోర్టులో మరో పిటీషన్ వెయ్యటంతో, మరోసారి ఆసక్తిగా ఏమి జరుగుతుందా అని చూసే పరిస్థితి. తన ఆఫీస్ లో పని చేస్తున్న వారికి ఆటంకం కలిగిస్తూ, తమ విధుల్లో జోక్యం చేసుకుంటూ, తమను ఇబ్బంది పెడుతున్నారని, తమ పై సిఐడి కేసు వేసారని, ఆ కేసు కొట్టేయాలి అంటూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో పాటు, ఎలక్షన్ కమిషన్ లో పని చేసే మరో ఉద్యోగి హైకోర్టులో విడివిడిగా పిటీషన్ వేసారు. ఈ అంశం పై ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. సాంబమూర్తి వేసిన పిటీషన్ తో పాటు, ఎన్నికల కమిషన్ కూడా హైకోర్టులో పిటీషన్ వేసారు.

nimmagadda 07092020 2

ఒక ప్రభుత్వంలో ఉంటూ, ఒక డిపార్టుమెంటు ఏకంగా ప్రభుత్వం చేస్తున్న విచారణ పైనే , కోర్టుకు వెళ్ళటం చాలా అరుదు. అలాంటి సంఘటన ఆంధ్రప్రదేశ్ లో జరిగింది. అయితే దీని పై విచారణ జరిపిన హైకోర్టు, సిఐడి విచారణ పై స్టే విధించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు స్టే విధిస్తూ, కౌంటర్ దాఖలు చెయ్యాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరింది. అలాగే కేసుని వచ్చే వారానికి వాయిదా వేసింది. ఎన్నికల కమీషనర్ గా ఉన్న నిమ్మగడ్డ ఎన్నికలు వాయిదా వేసారు. తరువాత వైసిపీ నుంచి ఎదురుదాడి జరగటంతో, ఆయన కేంద్రానికి ఘాటు లేఖ రాస్తూ, తనకు కేంద్ర బలగాల రక్షణ కావలని కోరారు. అయితే ఈ లేఖ పై విజయసాయి రెడ్డి అభ్యంతరం చెప్తూ, ఇది తెలుగుదేశం ఆఫీస్ లో తయారు అయిన లేఖ అని, దీని పై విచారణ చెయ్యాలని డీజీపీని కోరటం, దీని పై సిఐడి విచారణ చకచకా జరిగిపోయాయి. అయితే, తానే లేఖ రాసాను అని నిమ్మగడ్డ చెప్పినా, కేంద్రం కూడా ఒప్పుకుని, బద్రత ఇచ్చిన, సిఐడి విచారణ కొనసాగింది. ఈ క్రమంలో ఈసి ఆఫీస్ నుంచి కంప్యూటర్ కూడా తీసుకు వెళ్లారు. ఈ మొత్తం వ్యవహారం పై నిమ్మగడ్డ కోర్టుకు వెళ్లారు. దీని పై ఈ రోజు కోర్టు ఆదేశాలు ఇచ్చింది.

Advertisements

Latest Articles

Most Read