ఒకే పత్రికకు, అదీ రాష్ట్ర అధినేతకు చెందిన పత్రికకు, అర్హత లేకపోయినా ఎక్కువ ప్రకటనలు ఇచ్చారంటూ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఒక పిటీషన్ దాఖలు అయ్యింది. ఈ కేసు పై ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. నిబంధనలకు విరుద్ధంగా సాక్షి పత్రికకు రాష్ట్ర ఖజానా నుంచి ప్రకటనలు ఇచ్చారంటూ, పిటీషనర్ హైకోర్టులో కేసు దాఖలు చేసారు. అలాగే ఆ ప్రకటనల్లో కూడా వైసీపీ పోలిన రంగులు ఇస్తున్నారు అంటూ, తన పిటీషన లో పేర్కొన్నారు. అయితే ఈ పిటీషన్ ద్విసభ్య ధర్మాసనం ముందుకు వచ్చింది. జస్టిస్ రాకేశ్‍కుమార్, జస్టిస్ ఉమాదేవితో కూడిన బెంచ్ ముందుకు ఈ కేసు వచ్చింది. అయితే ఈ కేసు పై విచారణ చేయకుండా, ఈ కేసుని చీఫ్ జస్టిస్ బెంచ్ కు బదిలీ చెయ్యాలని, ద్విసభ్య ధర్మసనం కోరింది. దీంతో ఈ కేసు చీఫ్ జస్టిస్ బెంచ్ కు వెళ్ళే అవకాసం ఉంది. త్వరలోనే దీని పై, విచారణ జరగనుంది. గత వారం ఒక సామాజిక సంస్థ, రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది కాలంలో ఇచ్చిన ప్రకటనల పై ఒక ఆర్టీఐ వేసింది. ఆ ఆర్టీఐలో ఈ ఏడాది కాలంలో వంద కోట్లు ప్రకటనలు పత్రికల్లో ప్రభుత్వం ఇచ్చింది. అయితే ఇందులో అర్హత లేకపోయినా సాక్షి దినపత్రికకు 52 కోట్ల ప్రకటనలు ఇవ్వగా, అత్యంత పెద్ద సర్క్యులేషన్ ఉన్న ఈనాడుకు మాత్రం, 35 కోట్లు ప్రకటనలే ఇచ్చారు. ఇక మూడో అత్యంత సర్క్యులేషన్ ఉన్న ఆంధ్రజ్యోతికి మాత్రం అన్ని పత్రికల కంటే తక్కువగా, కేవలం లక్షల్లో ఇచ్చారు.

hc 31082020 2

అయితే అర్హత లేకపోయినా, సాక్షికి 50 శాతం పైగా ప్రకటనలు ఇచ్చారని, హైకోర్టు దృష్టికి తీసుకువెళ్ళారు. అత్యంత సర్క్యులేషన్ ఉన్న పేపర్ కి ఎక్కువ ప్రకటనలు ఇవ్వాలని, గతంలో కొన్ని జడ్జిమెంట్ లు ఉన్నాయని, పిటీషన్ లో తెలిపారు. సాక్షి పేపర్, ముఖ్యమంత్రికి చెందినది కాబట్టే, ఎక్కువ ప్రకటనలు ఇచ్చారని, అత్యంత ఎక్కువ సర్క్యులేషన్ ఉన్న ఈనాడుకు తక్కువగా, మూడో సర్క్యులేషన్ ఉన్న ఆంధ్రజ్యోతికి అన్నిటికంటే తక్కువగా ప్రకటనలు ఇచ్చారని, ఇవి రూల్స్ కి విరుద్ధం అంటూ పిటీషన్ లో తెలిపారు. అలాగే ఇస్తున్న ప్రకటనల్లో కూడా వైసీపీ పార్టీ జెండా రంగులు పోలిన ప్రకటనలు ఇస్తున్నారని, ఇది కూడా రూల్స్ కు విరుద్ధం అని పిటీషన్ లో తెలిపారు. గతంలో రంగులు విషయంలో హైకోర్టు, సుప్రీం కోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసు విషయంలో ముఖ్యమంత్రికి చెందిన సంస్థ ఉందనో ఏమో కానీ, ద్విసభ్య ధర్మాసనం, ఈ కేసుని చీఫ్ జస్టిస్ బెంచ్ కు ట్రాన్స్ఫర్ చేసింది. ఇది ఎప్పుడు విచారణకు వస్తుందో, కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందో చూడాలి.

వైసీపీ నేతలు అక్రమ మైనింగ్ చేస్తున్నారు అంటూ, తెలుగుదేశం పార్టీ నేతలు ఈ రోజు ఇబ్రహీంపట్నంలో క్షేత్ర స్థాయి పర్యటనకు వెళ్లారు. అక్రమ మైనింగ్ ను కళ్ళారా చూపించటానికి తెలుగుదేశం బృందం అక్కడకు వెళ్ళింది. తెలుగుదేశం అధికార ప్రతిన్దిహి పట్టాభిరాం నేతృత్వంలో అక్కడకు వెళ్లారు. అయితే తమ అక్రమ మైనింగ్ ను పరిశీలించి వస్తున్న టీడీపీ బృందం పై దా-డి చేసారు వైసిపీ శ్రేణులు. కొండపల్లి రిజర్వ ఫారెస్ట్ లో, గత కొంత కాలంగా అక్రమ మైనింగ్ జరుగుతుంది అంటూ, వరుస కధనాలు మీడియాలో వస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ కూడా దీనికి సంబంధించి, కొన్ని వీడియోలు ఫోటోలు బయట పెడుతూ వచ్చింది. ఈ నేపధ్యంలో తెలుగుదేశం పార్టీ క్షేత్ర స్థాయి పరిశీలనకు అక్కడకు వెళ్ళింది తెలుగుదేశం పార్టీ అధికార ప్రటింది కొమ్మారెడ్డి పట్టాభి నేతృత్వంలోని బృందం, అక్రమ మైనింగ్ పరిశీలించటానికి వెళ్లి, తిరిగి వస్తూ ఇబ్రహీంపట్నంలోని ఆల్ఫా హోటల్ లో వద్ద భోజనానికి ఆగారు. ఆ సమయంలో ఒకేసారి వచ్చి బృందం పై దా-డి చేసారు. ఈ దా-డిలో తెలుగుదేసం జెడ్పీటీసి అభ్యర్ది సజ్జా అజయ్ పై ఏడుగురు కలిసి దా-డి చేయటంతో, ఆయన తీవ్రంగా గాయ పడ్డారు. ఘటన ఫై తెలుగుదేశం పార్టీ నేతలు ఇబ్రహీంపట్నం పోలిస్ స్టేషన్‍లో ఫిర్యాదు చేసారు.

pattabhi 3108200 2

అలాగే ఈ ఘటన పై , విజయవాడ పోలీస్ కమీషనర్ కు కూడా తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు చేయ్యనుంది. అయితే ఈ అక్రమ మైనింగ్ లో ఒక కీలక నేత ఉన్నారని, ఆ కీలక న నేత ఉండబట్టే, ఇటు పోలీసులు కానీ, అటు మైనింగ్ అధికారులు కానీ చూసి చూడనట్టు వదిలేస్తున్నారని, తెలుగుదేశం పార్టీ ఆరోపణ. అయితే జరుగుతున్న అక్రమాలు పరిశీలిస్తే ఇలా దా-డి చేస్తారా అని తెలుగుదేశం ప్రశ్నిస్తుంది. తమ సమాచారం ముందే తెలుసుకుని, ఒక గ్రూప్ గా ఏర్పాడి, ఒక ప్లాన్ ప్రకారం దా-డి చేసారని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది. మాజీ మంత్రి దేవినేని ఉమాతో పాటు, పట్టాభి కూడా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేసారు. నేషనల్ హైవేలో, ప్రజలు అందరూ ఉన్న చోట, వచ్చిలవిడిగా ప్రవర్తిస్తూ, దా-డి చేసారని, ఈ రాష్ట్రంలో ఏమి జరుగుతుంది అని ప్రశ్నించారు. గతంలో కూడా మార్చర్లలో ఇదే మాదిరిగా చేసారని, ఘటన పై సమగ్ర దర్యాప్తు జరిపి, తగు చర్యలు తీసుకోవలాని తెలుగుదేశం పార్టీ నేతలు కోరుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వింత పరిస్థితి నెలకొంది. ఎవరు అధికార పక్షమో, ఎవరు ప్రతిపక్షమో, ఎన్నికలు అయ్యి 15 నెలలు అయినా అర్ధం కావటం లేదు. చేతిలో అధికారం ఉంచుకుని కూడా, ఒక్క ఆరోపణ కూడా నిరూపించ లేకుండా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసినట్టు, సోషల్ మీడియాలో, తమ అనుకూల మీడియాలో తెలుగుదేశం పై ప్రచారం చేసి, ఆ రోజు గడిపేస్తుంది. తాము అధికారంలో ఉన్నాం, గతంలో చంద్రబాబు 6 లక్షల కోట్లు అవినీతి చేసారు, ఆ మొత్తం బయటకు తియ్యాలి అనే ఆలోచన లేదు. ఒకటి ఆ ఆరోపణలు రాజకీయ ఆరోపణలు అయినా అయ్యి ఉండాలి, లేక చేతకానితనం అయినా అయ్యి ఉండాలి. ఇక పొతే అధికారంలో ఉండి కూడా, ప్రతి రోజు ప్రెస్ మీట్లు పెట్టి చంద్రబాబుని టార్గెట్ చేసే పనిలోనే వైసీపీ ఉంది. చంద్రబాబు చేసిన ఆరోపణలు తప్పు అయితే, దాన్ని ఖండించి, నిజా నిజాలు బయట పెట్టి, తప్పుడు ఆరోపణలు చేసినందుకు తెలుగుదేశం పై ఆక్షన్ తీసుకోవాలి. కానీ వైసీపీ మాత్రం, ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్టే, ప్రెస్ మీట్లు పెట్టి, చంద్రబాబు పై ఎదురు దాడి చేస్తుంది. అయితే ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి, రేపు చంద్రబాబు పైనే రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపు ఇచ్చింది వైసీపీ. అధికారపక్షంలో ఉంటూ, ఇలా రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపు ఇవ్వటం , మరో హైలైట్.

ycp 30082020 2

గత కొంత కాలంగా దళితుల పై ఆంధ్రప్రదేశ్ లో వరుస దాడులు జరుగుతున్నాయి. శిరోమండనం దగ్గర నుంచి, దాడులు వరకు, ప్రతి రోజు ఏదో ఒక సంఘటన దళితుల పై జరుగుతూనే ఉంది. అయితే ఇవి ప్రధాన ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ లేవనెత్తుతుంది. అయితే వైసీపీ మాత్రం, అవన్నీ గ్రామాల్లో జరిగే చిన్న చిన్న సంఘటనలు అని, అవి కూడా రాష్ట్ర వ్యాప్త సమస్యలుగా చంద్రబాబు చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని, నిజానికి చంద్రబాబు దళిత ద్రోహి అని, చంద్రబాబు వివిధ పధకాలు దళితులకు అందకుండా అడ్డు పడుతున్నారని, అందుకే చంద్రబాబు పై, రేపు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తాం అంటూ వైసీపీ పిలుపు ఇచ్చింది. అయితే ఈ పిలుపు పై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు స్పందించటమే తప్పా అని ? సంఘటనలు జరుగుతుంటే స్పందించాలి కదా, అవి జరగకుండా చూసుకోవాలి కానీ, చంద్రబాబు స్పందించటమే తప్పు అన్నట్టు వైసీపీ చప్పటం, అలాగే అధికారం ఉంచుకుని కూడా, చంద్రబాబు పధకాలు అడ్డుకుంటున్నారు అని చెప్పటం, హాస్యాస్పదంగా ఉందని పలువురు వాపోతున్నారు.

అనంతపురం జిల్లా హిందూపురంలో, ఈ రోజు నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటించారు. హిందూపూర్ లో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్ లో పీపీఏ కిట్లు, ఇతర వైద్య పరికరాలు అందచేసారు. మొత్తం 55 లక్షల రూపాయల ఖరీదు చేసే పరికారాలు అందచేసారు. హిందూపురం తన గుండె చప్పుడు అని, హిందూపురం అభివృద్ధి కోసం, రాజకీయాలు పక్కన పెట్టి, ముందుకు వెళ్ళటానికి కూడా సిద్ధం అనంరు. ఇక హిందూపూర్ మెడికల్ కాలేజీ కేటాయింపు విషయమై బాలకృష్ణ మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ, "నేను ఏది అవసరం కానిది కోరను. ప్రజలకు ఏది అవసరమో అదే కోరతాను. అవసరం అయితే పోరాడతాను. ఇవన్నీ జగన్ గారికి తెలుసు. కాబట్టి, నా నిజాయతీ గురించి అయితే ఏమి, మన హిందూపురం నియోజవర్గ ప్రత్యేకతలు అయితే ఏమి, ఇవన్నీ అందరికీ తెలుసు. హిందూపురంలో మెడికల్ కాలేజీకి అన్ని అర్హతలు ఉన్నాయి. నేను ఈ విషయం కోసం అందరితో మాట్లాడతాను. ప్రతిపక్షంలో ఉన్నానని, మన పనులు జరగకుండా నిశబ్దంగా ఉంటే కుదరదు కదా. పోరాడతాం, సాన దాన బేధ దండోపాయలు అన్నీ ఉపయోగించుకుని, ప్రజలకు సేవ చేస్తాం. నేను అడగాను అంటే, అది అవసరం అయితేనే అని వారికి కూడా తెలుసు. నా వ్యక్తిత్వం తెలుసు. అధికారులు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అందరి సహాయ సహకారాలు తీసుకుంటాం.

nbk 31082020 2

"హిందూపూర్ కి మెడికల్ కాలేజీ కోసం, నేను జగన్ గారిని అప్పాయింట్మెంట్ కూడా అడిగాను. ఆయన ఎప్పుదిస్తే అప్పుడు కలుస్తాను. ఇప్పటికే రెండు సార్లు అడిగాను. బహుసా ఈ క-రో-నా వల్ల ఇవ్వలేదమో. మళ్ళీ అప్పాయింట్మెంట్ అడుగుతాను. ఆయన ఎప్పుడు ఇస్తే, అప్పుడు ఆయన్ను కలుస్తాను." ఇక 15 నెలల పాలన పై కూడా బాలకృష్ణ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేసారు. "క-రో-నా వచ్చినప్పుడు , రక ముందు అని రెండు ఉన్నాయి. అయితే మన రాష్ట్రంలో మాత్రం అభివృద్ధి ఆగిపోయింది. కియా అనుబంధ సంస్థలు వెనక్కు వెళ్ళిపోయాయి. అభివృద్ధి కంటే కూడా, తిరిగి మళ్ళీ ఎలా రావాలా అనేది చూస్తున్నారు. కక్ష సాధింపు తప్పితే, రాష్ట్రంలో ఏమి లేదు. రాజధాని లేని రాష్ట్రంగా ఏర్పడినా, తెలుగుదేశం హయంలో, అభివృద్ధిలో దూసుకుపోయాం. చంద్రబాబు గారు అనుభవంతో, ఎన్నో పెట్టుబడులు తెచ్చారు. గతంలో పెట్టుబడి కోసం వచ్చిన వారు కూడా, ఇప్పుడు వెనక్కు వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది." అని బాలకృష్ణ అన్నారు.

Advertisements

Latest Articles

Most Read