ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు తమ పై వ్యవహరిస్తున్న తీరు పై, టీవీ చైర్మెన్, అలాగే ఎడిటర్ మూర్తి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మెట్లు ఎక్కారు. అక్కడ వారికి రిలీఫ్ లభించింది. కేసు వివరాల్లోకి వెళ్తే, యూనివర్సిటీల నియామకాల్లో ఒకే కులానికి ప్రాధాన్యత ఇచ్చారు అంటూ, ఒక నోట్ ఫైల్ బయట పెట్టి, మూర్తి వివరాలు బయట పెట్టారు. అయితే, ఆ నోట్ ఫైల్ దొంగాలించారు అంటూ, టీవీ5 పై సిఐడి కేసు నమోదు అయ్యింది. అయితే దీని పై హైకోర్టుకు వెళ్ళిన మూర్తి, ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. దీంతో అరెస్ట్ చెయ్యకుండా నిరోధించకలిగారు. అయితే విచారణకు పిలిచినప్పుడు వెళ్ళాలి అని చెప్పారు. అయితే తమను పోలీసులు మాటిమాటికి గుంటూరు పిలిస్తున్నారని, గంటలు గంటలు వెయిట్ చేపించి, విచారణ కొంచెం సేపు చేసి పంపిస్తున్నారని, తమ పనులు అన్నీ పక్కన పెట్టుకుని రావాల్సి వస్తుందని మూర్తి అనేక సార్లు ఆరోపించారు. ఇదే విషయం పై ఆయన హైకోర్టుకు వెళ్ళటంతో, విచారణ కోసం అక్కడ వరకు అవసరం లేదని, ఏదైనా కావాలి అంటే వీడియో కాన్ఫరెన్స్ లో విచారణకు హాజరు కావచ్చు అంటూ, మూర్తి, టీవీ5 చైర్మెన్ కు కోర్టు రిలీఫ్ ఇచ్చింది.

ఈ పరిణామం పై టీవీ5 మూర్తి ఒక వీడియో మెసేజ్ వదిలారు.... "ప్రజల పక్షాన నిలుస్తున్న టీవీ5 గొంతు నిలిమేద్దామని, తమ పై చేసిన ప్రయత్నాలకు హైకోర్టు అడ్డుకట్ట వేసింది. మా మీద పెట్టిన తప్పుడు కేసులు నుంచి, మాకు రిలీఫ్ ఇచ్చింది. ఇంతకు ముందు మాకు అంటిసిపేటరీ బెయిల్ ఇచ్చినా, అయినప్పటికీ తమను గుంటూరు పిలిచి, గంటలు గంటలు విచారణ పేరుతో తమను ఇబ్బంది పెట్టారు. ఇక పై మమ్మల్ని పిలవద్దు అని, నన్ను, మా చైర్మెన్ గారిని, ఇక పై గుంటూరు విచారణ పిలవద్దు అని హైకోర్టు, ఈ రోజు ఉత్తర్వులు ఇచ్చింది. మా తరుపున మా కౌన్సిల్ జంధ్యాల రవిశంకర్ గారికి, థాంక్స్ చెప్తున్నాం. ఈ సమయంలో మా వెన్నంట ఉన్న శ్రేయోభిలాషులు అందరికీ థాంక్స్ చెప్తున్నాం. మాతో పాటు నిలచిన లాయర్ ఉమేష్ చంద్రకు కూడా థాంక్స్ చెప్తున్నా" అని మూర్తి అన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కోర్టుల్లో ఎదురు దెబ్బులు కంటిన్యూ అవుతున్నాయి. హైకోర్టులో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చేసిన 70 వరకు ఉన్న రాజ్యాంగ వ్యతిరేక పనుల పై ఎదురు దెబ్బలు తగిలిన విషయం తెలిసిందే. దీంతో కొన్ని విషయాల్లో ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్ళింది. అయితే చాలా విషయాల్లో సుప్రీం కోర్టులో కూడా ఎదురు దెబ్బలు తగిలాయి. అయితే ఇప్పుడు మరో విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటికే హైకోర్టులో అమరావతిలో ఇళ్ల స్థలాల పంపిణీ, ఆర్ 5 జోన్ విషయంలో స్టే ఇచ్చిన సంగతి తెలిసిందే. జీవో 107 పై హైకోర్టు స్టే ఇచ్చింది. దీని పై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్ళింది. అయితే ఈ రోజు సుప్రీం కోర్టులో కూడా ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. ప్రభుత్వం హైకోర్టు స్టే ఎత్తివేయాలని కోరుతూ సుప్రీం కోర్టుకు వెళ్ళిన కేసు పై, ఈ రోజు సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. దీని పై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది.

సుప్రీం కోర్టు విచారణ సందర్భంగా, హైకోర్టు ఇచ్చిన తీర్పుని సుప్రీం కోర్టు సమర్ధించింది. హైకోర్టు విచారణ సరిగ్గానే జరిగింది అంటూ సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ బొబ్డే అభిప్రాయ పడ్డారు. హైకోర్టులో కేసు తుది విచారణ ముగించాలని సుప్రీంకోర్టు సూచించింది. విచారణ మొత్తం పూర్తీ అయ్యే వరకు, హైకోర్టు సస్పెండ్ చేసిన ఉత్తర్వులు అమలులో ఉంటాయి అమరావతి రాజధానిలో, మాస్టర్ ప్లాన్ లో మార్పులు చేసు, గృహ నిర్మాణ జోన్ పై ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు సస్పెండ్ చేసింది. అయితే ఒక పక్క అమరావతిలో ఎలాంటి అభివృద్ధి చెయ్యకుండా, రైతులు ఇచ్చిన భూములు ఇళ్ళ పట్టాలకు ఇవ్వటం పై రైతులు అభ్యంతరం తెలిపారు. మొత్తానికి, ఇది అమరావతి వాసులకు ఇది మరో విషయంగా చెప్పవచ్చు అమరావతి విషయంలో ప్రతి దానిలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి.

ప్రధాని నరేంద్రమోదికి, ఏపి మాజీ సిఎం చంద్రబాబు లేఖ. ఏపిలో ప్రాధమిక హక్కులు కాలరాయడం, రాజ్యాంగంలో ఆర్టికల్స్ 19, 21 ఉల్లంఘించడం, పాలక వైయస్ఆర్సీపి ద్వారా ఫోన్ ట్యాపింగ్, ప్రతిపక్ష పార్టీల నాయకులు, న్యాయవాదులు, జర్నలిస్టులు, కార్యకర్తల ఫోన్లను ట్యాపింగ్ చేయడం, ప్రజాస్వామ్య సంస్థలను నాశనం చేయడంపై ఆ లేఖలో ప్రధాని మోదికి ఫిర్యాదు చేసిన చంద్రబాబు. మీ సమర్ధ, శక్తివంతమైన నాయకత్వంలో దేశ భద్రత ఇనుమడించింది. భారత సాయుధ దళాల్లో నూతన విశ్వాసం పెరిగింది. అంతర్గత ఉగ్రవాదులు, సంఘ వ్యతిరేక శక్తులతో వచ్చే ముప్పు తగ్గింది. విదేశీ సరిహద్దులు బలోపేతం చేయబడ్డాయి: ప్రధానికి లేఖలో చంద్రబాబు ఏపిలోని రాజకీయ నాయకులు, ఇతరుల ఫోన్‌ల ట్యాపింగ్ తో తీవ్ర ముప్పు ఉంది. దేశ భద్రతకే ఇది పెను ప్రమాదంగా పరిణమించే ప్రమాదం ఉంది. వైకాపా పాలనలో ఏపి ప్రజలు తీవ్ర ముప్పు ఎదుర్కొంటున్నారు. వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుండి, రాష్ట్రంలో ప్రజాస్వామ్య వ్యవస్థలపై దాడులు పెరిగాయి. మొదట్లో గత ప్రభుత్వ పాలనలో వచ్చిన పెట్టుబడిదారులపై, విధానాలపై దాడి చేశారు. దీంతో రాష్ట్రంలో పాలనా ప్రక్రియ పూర్తిగా పట్టాలు తప్పింది.

రాష్ట్ర ఎన్నికల సంఘం, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఎపిపిఎస్సీ) తదితర సంస్థలపై దాడులు.. ప్రతిపక్ష పార్టీల నాయకులు, న్యాయవాదులు, మీడియా ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలపై వైకాపా దాడులు, బెదిరింపులకు వైకాపా పాల్పడుతోంది. ప్రతిపక్ష పార్టీల నాయకులు, న్యాయవాదులు, మీడియా వ్యక్తులు, సామాజిక కార్యకర్తల ఫోన్‌లను చట్టవిరుద్ధంగా ట్యాపింగ్ చేయడం అధికార వైసిపి దినచర్యగా మారింది. ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం, 1885 [సెక్షన్ 5 (2)] మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, 2000 [సెక్షన్ 69] ప్రకారం, జాతీయ భద్రతకు ముప్పు ఉన్న సందర్భంలో లేదా సార్వభౌమాధికారం, దేశ సమగ్రత కోసం, విదేశీ స్నేహ పూర్వక సంబంధాలకు ముప్పు వాటిల్లే సందర్భాల్లో టెలి ఫోన్ ట్యాపింగ్ చేస్తారు. వివిధ వర్గాల ప్రజల ఫోన్లను ట్యాప్ చేయడంలో ఎటువంటి చట్టబద్ధమైన విధానాన్ని వైసిపి ప్రభుత్వం పాటించడం లేదు. ఇది రాజ్యాంగంలో పేర్కొన్న ఆర్టికల్ 19, ఆర్టికల్ 21లో హామీ ఇచ్చిన ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమే. పౌరుల గోప్యతా హక్కును కాలరాయడమే ఇది. భారతీయ టెలిగ్రాఫ్ చట్టంలోని సెక్షన్ 5 (2) , ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000 లోని సెక్షన్ 69 లను కూడా వైసిపి ప్రభుత్వం ఉల్లంఘిస్తోంది.  ఏపిలో ప్రతిపక్ష పార్టీల నాయకులు, న్యాయవాదులు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తల ఫోన్లను వైసిపి ప్రభుత్వం ట్యాపింగ్ చేస్తోంది.

రాజకీయ లాభాల కోసమే చట్టవిరుద్ధంగా ఫోన్లను ట్యాపింగ్ చేస్తోంది. ఇల్లీగల్ సాఫ్ట్‌ వేర్ ద్వారా, చట్టవిరుద్ధంగా ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందనేది మా ఆందోళన. జాతీయ భద్రతకు ప్రత్యక్ష ముప్పువాటిల్లే ప్రమాదం ఉంది. ఇటువంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అరాచకశక్తుల చేతిలో ఉంటే, వ్యక్తుల గోప్యతా హక్కు కాలరాయడమే.. అత్యున్నత స్థానాల్లోని వ్యక్తుల బ్లాక్ మెయిలింగ్ కు, బెదిరించడానికి ఈ ఫోన్ ట్యాపింగ్ దారితీస్తుంది. ఏదోవిధంగా తమ అధికారాన్ని నిలుపుకోవాలనే తపనతో అధికార వైసిపి దారుణంగా బెదిరిస్తోంది. వైసిపి తప్పుడు పనులకు వ్యతిరేకంగా గళం వినిపించే వ్యక్తులు, సంస్థలపై దాడి చేస్తోంది. ప్రతిపక్ష పార్టీల నాయకులతో పాటు న్యాయవాదులు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు ఎవరినీ వదలడం లేదు. తమ చర్యలకు న్యాయవ్యవస్థ నుండి అడ్డంకులు ఎదురవుతున్నాయనే ఉద్దేశంతో, ప్రజాస్వామ్య వ్యవస్థ మూడో స్తంభమైన న్యాయవ్యవస్థను కూడా పాలక వైయస్ఆర్సిపి ప్రస్తుతం లక్ష్యంగా చేసుకుంది. ప్రైవేటు వ్యక్తులు కూడా కటింగ్ ఎడ్జ్ టెక్నాలజి, పరికరాలు వినియోగించి ఫోన్లను అక్రమంగా ట్యాపింగ్ చేస్తున్నారు. ఈవిధమైన ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ లకు అడ్డుకట్ట వేయకపోతే దేశ భద్రతకు, సార్వభౌమాధికారానికే పెనుముప్పు. ప్రభుత్వాలు, ప్రైవేటు వ్యక్తుల చట్టవిరుద్దమైన అక్రమ చర్యలను కట్టడి చేయకపోతే ఎన్నో ఏళ్లుగా కష్టపడి నిర్మించుకున్న వ్యవస్థల విధ్వంసానికి దారితీస్తుంది. ఇటువంటి దుశ్చర్యలు దీర్ఘకాలంలో ప్రజాస్వామ్య విలువల పతనానికి, భావ ప్రకటనా స్వేచ్ఛకు భంగం కల్గిస్తాయి. ఆటవిక రాజ్యం(జంగిల్ రాజ్) వైపు దారితీస్తాయి. ఏపిలో అధికార వైసిపి, ప్రైవేటు వ్యక్తులతో ఫోన్ ట్యాపింగ్ లాంటి చట్టవిరుద్ద కార్యకలాపాలకు మళ్లీ పాల్పడకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. ఏపిలో ఫోన్ ట్యాపింగ్ వంటి అక్రమాలు, చట్టవిరుద్ద చర్యలపై కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలతో విచారణకు ఆదేశించడం సముచితం. ప్రధాని మోదికి రాసిన లేఖలో పేర్కొన్న చంద్రబాబు.
కేంద్ర ఐటి శాఖా మంత్రికి కూడా లేఖ ప్రతిని పంపిన చంద్రబాబు

విశాఖను రాజధానిగా ప్రకటించిన తర్వాత ఒక్క సారిగా ఇక్కడి భూమి ధరలకు రెక్కలొచ్చాయి. దీంతో ఖాళీ భూములను కొనుగోలు చేసేందుకు ఇతర జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో బడా వ్యాపా రులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు రంగంలోకి దిగారు. అదే ఆసమయంలో విశాఖలో ప్రభుత్వ, ప్రవేట్ భూములలో కూడా కబ్జాదారులు పాగా వేస్తున్నారు. కబ్జాదారుల పై ఉక్కు పాదం మోపుతామని చెప్పిన ప్రభుత్వ పెద్దల పేర్లే నేడు కబ్జా వ్యవహారాల్లో వినబడుతున్నాయి. తాజాగా ఇసుకతోటలో ఒక ప్రైవేట్ స్థలానికి సంబంధించిన వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. రాయలసీమ నుంచి వచ్చామని చెప్పి ఆ స్థలంలో ఉన్న వాచ్ మెన్ పై దౌర్జన్యం చేసి తాళ్లతో కట్టేసి, ఆ స్థలం పై ఎవరైనా కన్నెత్తి చూస్తే చంపేస్తామంటూ బెదిరించిన సంఘటన హాట్ టాపిక్ గా మారింది. ఆదివారం తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో సుమారు 20 మంది గుర్తు తెలియని వ్యక్తులు ఆ స్థలం వద్దకు వచ్చి హడావుడి చేశారు. తాము రాయలసీమ నుంచి వచ్చామని చెప్తూ దాడులకు తెగబడ్డారు. అక్కడ ఉన్న వాచ్ మెన్ పై దాడి చేశారు. ఎవరైనా ఈ స్థలం పై కన్నెత్తి చూస్తే ప్రాణాలు తీసేస్తాం అంటూ బెదిరించారు.

ఇసుకతోట బస్సు స్టాప్ వద్ద సుమారు 15 కోట్ల విలువైన 4 వేల గజాల ఓ ప్రవేట్ స్థలం ఉంది. ప్రస్తుతం అక్కడ 20 సంవత్సరాలకు లీజు తీసుకుని ఓ వ్యక్తి మార్బల్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ స్థలా నికి సంబంధించి కోర్టులో వ్యాజ్యాలు నడుసున్నాయి. ఇదివరకు ఈ స్థలాన్ని ఓ మహిళ మరొకరికి విక్రయించింది. రిజిస్ట్రేషన్ జరగక పోవడంతో ఇరువర్గాల మధ్య గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తుంది. స్థలం కొనుక్కుని డబ్బు అప్పగించాం కాబట్టి ఆ స్థలం తమదే అని కొను గోలు దారుడు చెబుతుండగా, ఒప్పంద సమయంలో ధర ఫిక్స్ కాలేదని, రేటు పెరిగిన కారణంగా కొత్త రేటు ప్రకారం ధర ఇస్తే రిజిస్ట్రేషన్ చేస్తామని సదరు మహిళ చెప్పినట్లు తెలుస్తుంది. దీంతో ఇరువర్గాల మధ్య కొన్నేళ్లుగా వాగ్వాదం నడుస్తుంది. రాజకీయ నాయకులు వద్దకు ఈ వ్యవహారం వెళ్లినప్పటికి ఇరు వర్గాలు రాజీకి ఒప్పుకోలేదు. దీంతో పరిస్థితి యధాతథంగా మారింది. తాజాగా ఆదివారం నాడు వేకువజా మున గుర్తు తెలీని 20 మంది వ్యక్తులు ఈ స్థలం వద్దకు వచ్చి హల్ చల్ చేయడం తో మళ్ళీ ఈ స్థలానికి సంబంధించిన వాగ్వాదం వార్తల కెక్కింది. ఆ స్థలంలో ఉన్న వాచ్ మెన్ పై భౌతిక దాడి చేసి అతన్ని తాళ్లతో కట్టేశారు.

అతని సెల్ ఫోన్ లాగేసుకున్నారు. అక్కడ ఉన్న ల్యాప్ టాప్, కంప్యూటర్ లను తీసుకెళ్లారు. అంతే కాకుండా అక్కడున్న సీసీ కెమెరా లను పూర్తిగా ధ్వంసం చేశారు. రాత్రికి రాత్రే గదులు, ప్రహరీకి సున్నం కూడా వేశారు. ఆ స్థలం తమదే అంటూ హద్దు రాయి కూడా పెట్టారు. తమకు ప్రభుత్వ పెద్దల అండ ఉందని ఈ స్థలం తమదే అని ఎవరైనా ఈ స్థలం వైపు చూస్తే వారికి చావే గతని హెచ్చరించి వెళ్లిపోయారు. పోలీసులకు వాచ్ మెన్ ఇచ్చిన ఫిర్యాదులో ఈ విషయాలు వెల్లడించారు. అలాగే వచ్చిన 20మందిలో ఒకరి పేరు పాండా, మరొకరి పేరు గంగిరెడ్డి అని పిలుచుకున్నట్లు తన ఫిర్యా దులో చెప్పాడు. ఈ గొడవ నేపథ్యంలో నైట్ డ్యూటీ లో ఉన్న ఇద్దరు ఎస్సైలు అక్కడ కాసేపు ఉన్నట్లు తెలుస్తుంది. ఇసుకతోట జంక్షన్ వద్ద ఆదివారం తెల్లవారు జామున ఓ స్థలం వద్దకు వచ్చి 20 మంది హడావుడి చేసిన ఘటనపై విజయసాయిరెడ్డి స్పందించారు. నగర పోలీస్ కమిషనడ్ కి ఫోన్ చేసి ఈ వ్యవహారంలో దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు

Advertisements

Latest Articles

Most Read