ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కోర్టుల్లో ఎదురు దెబ్బులు కంటిన్యూ అవుతున్నాయి. హైకోర్టులో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చేసిన 70 వరకు ఉన్న రాజ్యాంగ వ్యతిరేక పనుల పై ఎదురు దెబ్బలు తగిలిన విషయం తెలిసిందే. దీంతో కొన్ని విషయాల్లో ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్ళింది. అయితే చాలా విషయాల్లో సుప్రీం కోర్టులో కూడా ఎదురు దెబ్బలు తగిలాయి. అయితే ఇప్పుడు మరో విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటికే హైకోర్టులో అమరావతిలో ఇళ్ల స్థలాల పంపిణీ, ఆర్ 5 జోన్ విషయంలో స్టే ఇచ్చిన సంగతి తెలిసిందే. జీవో 107 పై హైకోర్టు స్టే ఇచ్చింది. దీని పై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్ళింది. అయితే ఈ రోజు సుప్రీం కోర్టులో కూడా ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. ప్రభుత్వం హైకోర్టు స్టే ఎత్తివేయాలని కోరుతూ సుప్రీం కోర్టుకు వెళ్ళిన కేసు పై, ఈ రోజు సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. దీని పై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది.

సుప్రీం కోర్టు విచారణ సందర్భంగా, హైకోర్టు ఇచ్చిన తీర్పుని సుప్రీం కోర్టు సమర్ధించింది. హైకోర్టు విచారణ సరిగ్గానే జరిగింది అంటూ సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ బొబ్డే అభిప్రాయ పడ్డారు. హైకోర్టులో కేసు తుది విచారణ ముగించాలని సుప్రీంకోర్టు సూచించింది. విచారణ మొత్తం పూర్తీ అయ్యే వరకు, హైకోర్టు సస్పెండ్ చేసిన ఉత్తర్వులు అమలులో ఉంటాయి అమరావతి రాజధానిలో, మాస్టర్ ప్లాన్ లో మార్పులు చేసు, గృహ నిర్మాణ జోన్ పై ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు సస్పెండ్ చేసింది. అయితే ఒక పక్క అమరావతిలో ఎలాంటి అభివృద్ధి చెయ్యకుండా, రైతులు ఇచ్చిన భూములు ఇళ్ళ పట్టాలకు ఇవ్వటం పై రైతులు అభ్యంతరం తెలిపారు. మొత్తానికి, ఇది అమరావతి వాసులకు ఇది మరో విషయంగా చెప్పవచ్చు అమరావతి విషయంలో ప్రతి దానిలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read