ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ గా రెండు రోజుల క్రితం బాధ్యతలు చేపట్టిన నిమ్మగడ్డ, ఈ రోజు ఆక్షన్ లోకి దిగారు. తన కార్యాలయంలో, తాను లేని సమయంలో చేసిన మార్పులు పై ఆయన విచారణకు ఆదేశించారు. ఎవరు చెప్తే ఈ మార్పులు చేసారు, ఎందుకు చేసారు అనే విషయాల పై సమగ్ర దర్యాప్తు చెయ్యాలని ఆదేశించారు. తన కార్యాలయంలో ఎందుకు మార్పులు చెయ్యాల్సి వచ్చిందో, తేల్చాలని అన్నారు. నిమ్మగడ్డ లేని సమయంలో, ఆయన కార్యాలయంలో కొన్ని మార్పులు చేసారు. ఇవి వాస్తు మార్పులుగా చెప్పారు. స్టేట్ ఎలక్షన్ కమీషనర్ చాంబర్, అలాగే అధికారులు కార్యాలయం మధ్యలో ఉన్న తలుపు మూసివేసారు. అయితే ఈ విషయం పై, కొన్ని వార్తా పత్రికల్లో, తానె ఈ వాస్తు మార్పులు చేసినట్టు కధనాలు రావటంతో, ఆయన స్పందిస్తూ, ఈ విషయం పై ఎంక్వయిరీకి ఆదేశించామని, తానూ "rationalist" అని చెప్పుకొచ్చారు. తాను రాక ముందే, కార్యాలయంలో మార్పులు జరిగాయని, దీని పై విచారణ జరుగుతున్నట్టు, నిమ్మగడ్డ చెప్పారు.
ఆంద్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ తిరిగి శుక్రవారం బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. బాధ్యతలు చేపట్టిన సమయంలో,ఆయన మాట్లాడుతూ ఈ వ్యవస్థ రాజ్యంగ వ్యవస్థ అని, స్వాతంత్ర సంస్థ అని, రాగద్వేషాలు లేకుండా పని చేస్తానాని చెప్పారు. తనకు ప్రభుత్వం వైపు నుంచి కూడా సంపూర్ణ సహకారం అందుతుందని, ఆశిస్తున్నా అంటూ, నిమ్మగడ్డ చెప్పారు. తానూ గత శుక్రవారం గవర్నర్ ఆదేశాలు రాగానే, బాధ్యతలు చేపట్టానని, ఈ విషయం అధికారులకు కూడా తెలియ చేసానని చెప్పారు. గతంలో రమేష్ కుమార్ ని ప్రభుత్వం తొలగించి, కనక రాజ్ ని పెట్టటం, తరువాత నిమ్మగడ్డ హైకోర్టు కు వెళ్ళటం, హైకోర్టు ప్రభుత్వ నిర్ణయాన్ని కొట్టేయటం, అయినా ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వక పోవటంతో, కోర్టు ధిక్కరణ పిటీషన్ వెయ్యటం, ఇదే క్రమంలో ప్రభుత్వం పలు మార్లు సుప్రీం కోర్టుకు వెళ్ళటం, సుప్రీం కోర్టు కూడా కొట్టేయటం, ఇలా అనేక విషయాలు జరిగిన తరువాత, నిమ్మగడ్డ ఎన్నికల కమీషనర్ గా నియమింప బడ్డారు.