ప్రభుత్వ కార్యాలయ తరలింపు, రాజధాని వికేంద్రీకరణ బిల్లులు, సిఆర్డీఏ రద్దు బిల్లులు, కొత్త హైకోర్టు నిర్మాణం పై దాఖలైన పిటీషన్ల పై, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ జరిగింది. రాజధాని ఎక్కడ ఉండాలి అన్నది, కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్న అంశం అని, పిటీషన్ తరుపు న్యాయవాది తన పిటీషన్ లో పేర్కొన్నారు. పిటీషన్ పై కౌంటర్లు దాఖలు చెయ్యాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఆగష్టు 6కి వాయిదా వేసింది కోర్టు. మొత్తంగా, ఈ రోజు ఈ అంశాల పై 32 కేసులు కోర్టు ముందుకు వచ్చాయి. మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో, ఇప్పటికే కోర్టు పరిధిలో ఉన్న అంశం పై మళ్ళీ బిల్లు తేవటం, అలాగే శాసనమండలిలో చైర్మెన్ సెలెక్ట్ కమిటీ నియమించమని చెప్పినా, సెలెక్ట్ కమిటీ నియమించకపోవటం పై, మండలి సెక్రటరీ మీద కూడా ఒక కేసు నమోదు అయ్యింది. అదే విధంగా, మరి కొన్ని పిటీషన్లు కూడా ఇందులో ఇంప్లీడ్ అయ్యాయి.
news
రెండు బిల్లుల పై ఆరా తీసిన, ప్రధాని కార్యాలయం ! అదనపు సమాచారం కోరిన పీఎంఓ !
రాజధానికి సంబంధించిన బిల్లులు పై పీఎంఓ ఆరా తీసింది. రెండు బిల్లుల పై మరింత సమాచారం, పీఎంఓ అడిగినట్టు వార్తలు వస్తున్నాయి. సంబంధించిన వివిధ అధికారుల దగ్గర నుంచి సమాచారం సేకరించే పనిలో, పీఎంఓ అడిషనల్ సెక్రటరీ స్థాయి అధికారి ఉన్నట్టు తెలుస్తుంది. ఏదైతే పాలన వికేంద్రీకరణ, సిఆర్డీఏ రద్దుకు సంబంధించిన బిల్లులు ఇప్పటికే గవర్నర్ వద్దకు చేరాయి. ఈ బిల్లులు పై గవర్నర్ ఏ నిర్ణయం తీసుకుంటారా అని అందరూ ఉత్కంటగా ఎదురు చూస్తున్నారు. గవర్నర్ ఈ బిల్లులను యదాతధంగా ఆమోదిస్తారా, లేక న్యాయ సలహా తీసుకుంటారా, లేదా తమ వద్ద ఉంచుకుంటారా అనేది చూడాల్సి ఉంటుంది. ఈ నేపధ్యంలోనే, కేంద్రానికి కూడా పలు ప్రజా సంఘాలు, అమరావతి పరిరక్షణ సమితి, పలు పార్టీలు, ఈ బిల్లులు ఆమోదించకుండా చూడాలి అంటూ, వాటి వల్ల జరిగే నష్టాన్ని వివరిస్తూ, లేఖలు రాసారు.
రాష్ట్రపతికి కూడా ఈ లేఖలు వెళ్ళాయి. అలాగే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా రెండు వేల కోట్ల వరకు ఇప్పటికే ఖర్చు పెట్టింది. మరో పక్క కేంద్ర సంస్థలు కూడా అమరావతి రాజధాని ప్రాంతంలో, అనేక సంస్థలు ప్రారంభించటమే కాకుండా, కొన్ని ప్రారంభానికి సిద్ధం చేసుకుంది. ఇప్పుడు మళ్ళీ రాజధాని మార్పు అంటూ, ఒకే రాష్ట్రంలో, ఒకే రాజధాని పై, మళ్ళీ మళ్ళీ ఖర్చు పెట్టాలి అంటే కేంద్ర కూడా దీని వల్ల ప్రయోజనం ఏమిటి అంటూ ఆలోచనలో కూడా పడ్డాయి. వీటి అన్నిటి నేపధంలోనే, ప్రధాని కార్యాలయం, ఈ మొత్తం వ్యవహారం పై, సంపూర్ణ నివేదిక తెప్పించుకునే పనిలో పడింది. మొత్తానికి, ఎప్పటి నుంచో, ప్రజలు, పార్టీలు కోరుకుంటున్నట్టు, ఎట్టకేలకు కేంద్రం జోక్యం చేసుకుందనే చెప్పాలి. మరి సరైన న్యాయం చేస్తారా లేదా అనేది చూడాలి.
అలా చెయ్యకపోతే, రాష్ట్రపతి పాలన వస్తుంది.. సరైన సలహాలు ఇస్తారని అనుకుంటున్నా అంటున్న రఘురామ రాజు...
నిమ్మగడ్డ నియామకం పై, హైకోర్టు ఆదేశాలు పాటించాలి అంటూ, గవర్నర్, ప్రభుత్వానికి ఇచ్చిన ఆదేశాల పై, వైసిపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు స్పందించారు. ఆయన మాట్లాడుతూ, "ప్రభుత్వానికి ఎదురు దెబ్బ కాదా అనేది పక్కన పెడితే, నేను రాజ్యాంగం పరిరక్షంచబడిందని చెప్తున్నాను. ఇది మంచి పరిణామం. గవర్నర్ గారు ఆలస్యం అయినా, సరైన నిర్ణయం తీసుకున్నారు. ఇందాకే నేను ట్వీట్ చేశాను. మా రాష్ట్ర ప్రభుత్వం, ఇంకా సాగతియ్యకుండా, గవర్నర్ నిర్ణయన్ని అమలు చెయ్యటమే ఉత్తమం. ఎందుకంటే ఇప్పటికే చాలా ఎదురు దెబ్బలు తగిలాయి. రేపు సుప్రీం కోర్టుకు వెళ్ళినా, ఇదే తీర్పు వస్తుంది. అలా కాదని, ముందుకు వెళ్తే, రాజ్యాంగా సంక్షోభం వస్తుంది. అప్పుడు ఆర్టికల్ 356 ఇన్వొక్ చేస్తే చాలా ఇబ్బందులు ఉంటాయి. బలవంతంగా, ప్రెసిడెంట్ రూల్ పెట్టే అవకాసం ఉంటుంది కాబట్టి, ప్రభుత్వం, సరైన నిర్ణయం తీసుకుంటుందని, మాకు చాలా మంది సలహాదారులు ఉన్నారు కాబట్టి, సరైన సలహాలు ఇస్తారనే అనుకుంటున్నా. అలా కాకుండా, గతంలో లాగా, మళ్ళీ ఈ విషయం పై, ఏదో చిన్న చిన్న విషయాలు పట్టుకుని, మళ్ళీ దీన్ని ఏదో ఒకటి చేసి, పీకలు మీదకు తెచ్చుకోకుండా, నిమ్మగడ్డను మళ్ళీ నియమించటమే ఉత్తమం."
"రేపు స్థానిక ఎన్నికలు ఆయనతో జరిగితే అందరికీ మంచింది. అయితే సుప్రీం కోర్టులో పెండింగ్ లో ఉంది, అక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా వస్తే, అది వేరే విషయం. కానీ కనకరాజు గారి, అపాయింట్మెంట్, ఆర్డినెన్స్, వీటి అన్నిటి పై, హైకోర్టు ఇచ్చిన తీర్పు పై, అమలు చెయ్యాలని, గవర్నర్ గారు ఆదేశాలు ఇచ్చారు. మా ప్రభుత్వం, అవి అమలు చేస్తుందని అనుకుంటున్నా. మరింత రాజ్యాంగా సంక్షోభానికి, దారి తీసే పరిస్థితి తీసుకు రావద్దు అని మా ప్రభుత్వానికి చెప్తున్నాను. ప్రభుత్వం గవర్నర్ చెప్పిన దాన్ని, అడ్డుకోవటం ఉండదు. అలా చెయ్యకుండా ఉంటే, రాజ్యాంగా సంక్షోభం, రాష్ట్రపతి పాలన వస్తుంది. అంత వరకు వెళ్ళరు అనే అనుకుంటున్నా. నన్ను అడిగితే, సుప్రీం కోర్టు నిర్ణయం వరకు కాకుండా, ఇప్పుడే నిర్ణయం తీసుకుంటే అందరికీ మంచిది. కోర్టుల పై ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న వారికి, మా ముఖ్యమంత్రి గారు, వార్నింగ్ ఇవ్వాలి, లేకపోతే మనం నవ్వుల పాలు అవుతాం" అని రఘురామ కృష్ణం రాజు అన్నారు.
ఈ రోజు గవర్నర్ చేసింది చాలా పెద్ద తప్పు అంటున్న జంధ్యాల రవి శంకర్...
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిస్వభూషణ్ హరిచందన్, ఈ రోజు చాలా పెద్ద తప్పు చేసారని, ప్రాముఖ్య న్యాయవాది జంధ్యాల రవి శంకర్ అభిప్రాయ పడ్డారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం, రాష్ట్ర మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో, గవర్నర్ ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారని అందరూ భావించగా, గవర్నర్ మాత్రం అందుకు భిన్నంగా ప్రవర్తించారు. హైకోర్టు ఆదేశాలు ప్రకారం, నిమ్మగడ్డను రీస్టోర్ చెయ్యకుండా, మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వాన్నే, ఈ విషయం పై నిర్ణయం తీసుకోవాల్సిందిగా గవర్నర్ కోరటం, తప్పు అని జంధ్యాల రవి శంకర్ అన్నారు. హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ లోని, పేరా 318లో, గవర్నర్ కు రాష్ట్ర ఎన్నికల కమీషనర్ ను మళ్ళీ నియమించమని చెప్పారని అన్నారు. ఇప్పుడు మళ్ళీ గవర్నర్, ఈ విషయాన్ని ప్రభుత్వానికే నివేదించటం అంటే, 73వ అమెండ్మెంట్ ని, గవర్నర్ ఆఫీస్ పట్టించుకోలేదని అర్ధం అని అన్నారు. రాజ్యాంగం లోని, 73వ అమెండ్మెంట్ ప్రకారం, ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల కమిషన్ పై ఎలాంటి కంట్రోల్ ఉండదని అన్నారు.
2011లో పార్లిమెంట్ ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్సు కూడా, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు ఉన్న ఇండిపెండెంట్ హక్కులు గురించి చెప్పిందని అన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కాని, చీఫ్ ఎలక్షన్ కమిషన్ కు కానీ ఒకే హక్కులు ఉంటాయని, ఇప్పటికే అనేక సుప్రీం కోర్టు తీర్పులు ఉన్నాయని రవిశంకర్ అన్నారు. ఆర్టికల్ 243 (కే) గురించి మాట్లాడితే, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను నియమించే అధికారం గవర్నర్ కు ఉంటుందని అన్నారు. నిమ్మగడ్డ కేసు వ్యవహారం మొత్తం, రాష్ట్ర ఎన్నికల కమీషనర్ ను నియమించే, తొలగించే విషయంలో, రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి హక్కు లేదనే విషయం పై, కేసు నడుస్తుంటే, ఇప్పుడే గవర్నర్, రాజ్యాంగ పదవిలో ఉండి, మళ్ళీ అదే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ విషయం పై చూడాలి అనటం తప్పని అన్నారు. హైకోర్ట్ జడ్జిమెంట్ లోని 318 వ పేరాని గవర్నర్ ఫాలో అవ్వలేదని అన్నారు.