రాజధానికి సంబంధించిన బిల్లులు పై పీఎంఓ ఆరా తీసింది. రెండు బిల్లుల పై మరింత సమాచారం, పీఎంఓ అడిగినట్టు వార్తలు వస్తున్నాయి. సంబంధించిన వివిధ అధికారుల దగ్గర నుంచి సమాచారం సేకరించే పనిలో, పీఎంఓ అడిషనల్ సెక్రటరీ స్థాయి అధికారి ఉన్నట్టు తెలుస్తుంది. ఏదైతే పాలన వికేంద్రీకరణ, సిఆర్డీఏ రద్దుకు సంబంధించిన బిల్లులు ఇప్పటికే గవర్నర్ వద్దకు చేరాయి. ఈ బిల్లులు పై గవర్నర్ ఏ నిర్ణయం తీసుకుంటారా అని అందరూ ఉత్కంటగా ఎదురు చూస్తున్నారు. గవర్నర్ ఈ బిల్లులను యదాతధంగా ఆమోదిస్తారా, లేక న్యాయ సలహా తీసుకుంటారా, లేదా తమ వద్ద ఉంచుకుంటారా అనేది చూడాల్సి ఉంటుంది. ఈ నేపధ్యంలోనే, కేంద్రానికి కూడా పలు ప్రజా సంఘాలు, అమరావతి పరిరక్షణ సమితి, పలు పార్టీలు, ఈ బిల్లులు ఆమోదించకుండా చూడాలి అంటూ, వాటి వల్ల జరిగే నష్టాన్ని వివరిస్తూ, లేఖలు రాసారు.
రాష్ట్రపతికి కూడా ఈ లేఖలు వెళ్ళాయి. అలాగే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా రెండు వేల కోట్ల వరకు ఇప్పటికే ఖర్చు పెట్టింది. మరో పక్క కేంద్ర సంస్థలు కూడా అమరావతి రాజధాని ప్రాంతంలో, అనేక సంస్థలు ప్రారంభించటమే కాకుండా, కొన్ని ప్రారంభానికి సిద్ధం చేసుకుంది. ఇప్పుడు మళ్ళీ రాజధాని మార్పు అంటూ, ఒకే రాష్ట్రంలో, ఒకే రాజధాని పై, మళ్ళీ మళ్ళీ ఖర్చు పెట్టాలి అంటే కేంద్ర కూడా దీని వల్ల ప్రయోజనం ఏమిటి అంటూ ఆలోచనలో కూడా పడ్డాయి. వీటి అన్నిటి నేపధంలోనే, ప్రధాని కార్యాలయం, ఈ మొత్తం వ్యవహారం పై, సంపూర్ణ నివేదిక తెప్పించుకునే పనిలో పడింది. మొత్తానికి, ఎప్పటి నుంచో, ప్రజలు, పార్టీలు కోరుకుంటున్నట్టు, ఎట్టకేలకు కేంద్రం జోక్యం చేసుకుందనే చెప్పాలి. మరి సరైన న్యాయం చేస్తారా లేదా అనేది చూడాలి.