జగన్ మోహన్ రెడ్డి ఎవరినీ నమ్మరు. ఎవరినీ దగ్గరకు రానివ్వరు. ఎవరినీ కలవరు అనే ప్రచారం ఉంది. అందుకు తగ్గట్టే ఆయన నిర్ణయాలు ఉంటాయి. 151 మందితో గెలిచినా, కేవలం పది మందిలోపే ఆయన దగ్గరకు రానిస్తారు. సొంత పార్టీ నేతలను కానీ, ఎమ్మెల్యేలు, ఎంపీలను కానీ కలవరు అనే అపవాదు ఉంది. రఘురామ రాజు ఉదంతమే ఇందుకు కారణం. ఆనం రాంనారయణ రెడ్డి లాంటి సీనియర్ నేతలను కూడా కలవకుండా, జగన్ ఉన్నారు. ఇక పరిపాలనలో కూడా అంతే, మొత్తం కేవలం కొంత మంది అధికారులను మాత్రమే జగన్ నమ్ముతారు. అందులో కొంత మందిని మాత్రమే దగ్గరకు రానిస్తారు. అందులో మొదటి వ్యక్తి ప్రవీణ్ ప్రకాష్. అయితే గత పది పదిహేను రోజులుగా జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు, అటు పార్టీ వర్గాల్లోను, ఇటు అధికార యంత్రాంగంలోనూ చర్చకు దారి తీసాయి. జగన్ తీసుకున్న నిర్ణయాలు వారికి షాక్ ఇచ్చాయి. జగన్ కలిసేది, నమ్మేది అతి కొద్ది మందిని. ఇప్పుడు ఆ కొద్ది మందిలో, కొంత మందికి షాక్ ఇచ్చారు జగన్.
ముందుగా పార్టీ పరంగా చూసుకుంటే, నేనే పార్టీలో నెంబర్ 2 అంటూ హడావిడి చేస్తున్న విజయసాయి రెడ్డికి, సజ్జల రామకృష్ణా రెడ్డికి షాక్ ఇచ్చారు జగన్. ఇంకా చెప్పాలంటే, విజయసాయి రెడ్డికే ఎక్కువ దెబ్బ. ఎవరికీ ఎక్కువ అధికారాలు ఇవ్వకుండా, విజయసాయి రెడ్డిని కేవలం ఉత్తరాంధ్ర మూడు జిల్లలకు పరిమితం చేసారు. సజ్జలకు పార్టీ ఆఫీస్ బాధ్యతలు ఇచ్చారు. దీంతో పార్టీలో తాను ఒక్కడే నెంబర్ వన్ అని, 2,3,4 ఎవరూ లేరనే సంకేతాలు ఇచ్చారు. అలాగే విజయసాయి దూకుడకు బ్రేక్ వేసారు. ఇక అధికారుల విషయానికి వస్తే, సిఏంవోలో పని చేస్తున్న అజయ్ కల్లం రెడ్డి, పీవీ రమేష్ కు ఉన్న బాధ్యతలు మొత్తం కట్ చేసారు. ఇప్పుడు సియంవోలో మొత్తం ప్రవీణ్ ప్రకాష్ చేతిలో పెట్టారు. మరో ఇద్దరు అధికారులు ఉన్నా, ప్రవీణ్ కే వైట్ ఎక్కువ. ఇలా అధికారులకు కూడా సందేశం ఇచ్చారు. అటు పార్టీని, ఇటు అధికారులకు తన శైలి ఎలా ఉంటుందో, చేసి చూపించారు. ఇది భయమో, ముందు జాగ్రత్తో, లేక ఇంకా ఏమైనానేమో కానీ, ఈ నిర్ణయాల పై ప్రభావం ఎలా ఉంటుందో చూడాలి.