గతంలో చంద్రబాబు అధికారంలో ఉండగా, చంద్రబాబుని ఇబ్బంది పెట్టిన లిస్టులో ముద్రగడ మొదటి వరుసలో ఉన్నారనే చెప్పాలి. 2014-19 మధ్య కాదు, అంతకు ముందు చంద్రబాబు ఉన్నప్పుడు కూడా ముద్రగడ హడావిడి చేసి, వైఎస్ఆర్ అధికారంలోకి రాగానే సైలెంట్ అయ్యారు. ఇప్పుడు కూడా జగన్ సియం అవ్వగానే, ఒకటి రెండు లేఖలు తప్ప, ముద్రగడ సైలెంట్ అయిపోయారు. చంద్రబాబు కాపు కార్పొరేషన్ పెట్టినా, కాపులకు 5 శాతం రిజర్వేషన్లు పెట్టినా, శాంతించని ముద్రగడ ప్రతి రోజు ఏదో ఒక ఆందోళన చేస్తూనే ఉండేవారు. అయితే జగన్ వచ్చిన తరువాత రిజర్వేషన్ ఎత్తేసినా, కాపు కార్పొరేషన్ నిర్వీర్యం అవుతున్నా ముద్రగడ పట్టించుకోలేదు. అయితే ఈ రోజు సడన్ గా కాపులను ఉద్దేశించి ముద్రగడ లేఖ రాసారు. తనను సోషల్ మీడియాలో తిట్టిస్తున్నారని, మానసికంగా కృంగిపోయాను అని, ఇక కాపు ఉద్యమం చెయ్యలేను అంటూ చేతులు ఎత్తేస్తూ, వీడ్కోల లేఖ రాసారు ముద్రగడ. ఇంత పెద్ద ఉద్యమ నేతను అని చెప్పుకునే ముద్రగడ, కేవలం సోషల్ మీడియా విమర్శలకే ఉద్యమం ఆపేస్తారా అనే ప్రశ్నలు వస్తున్నాయి.
ఇవాళ్టి రోజున సోషల్ మీడియా బారిన పడని వారులేరు. మరి ముద్రగడ నిర్ణయం వెనుక ఎవరు ఉన్నారు ? రకరకాల మాటలు వినిపిస్తున్నా, అవేమి నిర్ధారణ లేని వార్తలు కాబట్టి, దాన్ని గురించి మాట్లాడుకోలేం కానీ, ముద్రగడ రాసిన లేఖలో విషయాలను బట్టి ఒక అంచనాకు రావచ్చు. ముద్రగడ లేఖలో, తనకు ఎవరో ఫోన్ చేసి, వాళ్ళు ఎవరో కాపు ఉద్యమం పై చేసిన స్టేట్మెంట్ కు మద్దతు ఇచ్చి, వారితో కలిసి నడవమన్నారని రాసారు. కాపు ఉద్యమం పై ఎవరు మాట్లాడింది అంటే, ఈ మధ్య కాలంలో జనసేన పార్టీ, మరాఠా తరహాలో కాపు రిజర్వేషన్ కావాలని కోరింది. అయితే దీని పై ముద్రగడ మాత్రం స్పందించలేదు. ఈ రోజు ముద్రగడ లేఖలో రాసింది ఈ అంశం ఏనా అనే అనుమానం వస్తుంది. నేను ఉద్యమం చేసినప్పుడు వారు నాతొ వచ్చారా, ఇప్పుడు వారి ఉద్యమానికి నేను ఎందుకు రావాలి అని ముద్రగడ రాసారు. ఇలా చేస్తున్నందుకు, తన పై బురద చల్లుతున్నారని, ముద్రగడ లేఖలో చెప్పారు. అయితే ఆ ఫోన్ చేసిన వ్యక్తి ఎవరు ? తాము చేస్తున్న కాపు ఉద్యమానికి మద్దతు తెలపమని ఎవరు కోరారు ? ఇలాంటి ప్రశ్నలు ఎన్నో వస్తున్నాయి. అయితే ఒకటి మాత్రం కళ్ళకు కనపడుతుంది, చరిత్ర చెప్తున్న వాస్తవం కూడా ఇదే. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే, ముద్రగడ బయటకు వస్తారు.