నారా లోకేష్ యువగళం పాదయాత్ర పై పోలీసుల ఉక్కుపాదం మోపుతున్నారు. వజ్రవాహనాలను మొహరించారు. వేలాది మంది పోలీసులు పాదయాత్రని నలువైపుల నుంచి చుట్టుమాట్టారు. పాదయాత్ర కు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నా, తగ్గకుండా లోకేష్ దూసుకుపోతున్నారు. దీంతో ఫ్రస్టేషన్కి గురైన తాడేపల్లి పెద్దలు, ఖాకీ బాసులకి ఏదో పెద్ద టార్గెట్ ఇచ్చారని పాదయాత్రలో మొహరించిన పోలీసులు బలగాలు స్పష్టం చేస్తున్నాయి. డ్రోన్ కెమెరాలు, ఇంటెలిజెన్స్ అధికారుల రోజూ ఉండే దాని కంటే ఇంకా తీవ్రం అయ్యింది. పాదయాత్ర వెళ్తున్న రూట్ లో టిడిపి శ్రేణులు కట్టిన జెండాలు, బ్యానర్లను పోలీసులే తొలగిస్తున్నారు. ప్రశ్నించిన టిడిపి కార్యకర్తలు, నాయకుల పై పోలీసులు గూండాల్లా దాడులు చేస్తున్నారు. సత్యవేడు నియోజకవర్గంలో పాదయాత్ర జరిగే తిమ్మ సముద్రం, రాగి కుంట, కొత్తూరు, పివి కండ్రిగ గ్రామాల్లో ఏర్పాటు చేసిన జెండాలు, బ్యానర్లు మొత్తం తొలగించారు. లోకేష్ పాదయాత్రని వెయ్యి మంది పోలీసులు, 30 వాహనాల్లో 20 మంది ఎస్సై లు, 10 మంది సిఐ లు, 6 గురు డీఎస్పీలు ఫాలో అవుతున్నారు. వజ్ర వాహనాన్ని వెంట తీసుకెళుతున్నారు. మంత్రి రోజా అవినీతిని బట్టబయలు చేసిన లోకేష్ పై రోజా విరుచుకుపడింది. తన అనుచరులతో లోకేష్ ఫ్లెక్సీలను తగలబెట్టించడం వంటి కవ్వింపు చర్యలకు రోజా పాల్పడింది. సత్యవేడులో పాదయాత్ర అనంతరం రాయపేడులో నారా లోకేశ్ రాత్రి బస చేయనున్నారు. రోజా కూడా నియోజకవర్గంలో ఉండడం, పోలీసులు వేల సంఖ్యలో పాదయాత్రలో మొహరించడం ఏదో కీడు తలపెట్టేలా ఉన్నారనే అనుమానాలు టిడిపి వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.
news
ఇన్వెస్టర్లకి 1, ప్రజలకు 3 రాజధానులు..ఎవర్ని మోసం చేస్తున్నారు ?
వైసీపీ ప్రభుత్వం చెప్పే మాటకి, చేసే పనికి అస్సలు సంబంధం ఉండదని వారి తీరుతో నిరూపించుకున్నారు. ప్రతిపక్షనేతగా జగన్ రెడ్డి అమరావతిలో ఇల్లు కట్టుకున్నాడు, రాజధాని మారుస్తాడని చేసే ప్రచారాన్ని నమ్మొద్దంటూ మొత్తం వైసీపీ నేతలు మైకు ముందుకొచ్చి మరీ చెప్పారు. ప్రభుత్వంలోకి వచ్చాక మూడు రాజధానులు అంటూ ప్రకటించారు. కోర్టులు-వివాదాలు చుట్టూ తిరుగుతున్న రాజధాని వ్యవహారంలో విశాఖే రాజధాని అని సీఎం జగన్ రెడ్డి, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కుండబద్దలు కొట్టారు. దీంతో ఇప్పటివరకూ సాగించిన మూడు రాజధానుల పాట జగన్ నాటకంలో భాగమేనని తేలిపోయిందని మూడు ప్రాంతాల ప్రజలకి అర్థమైపోయింది. ఈ డ్యామేజీని కంట్రోల్ చేయడానికి మాది మూడు రాజధానుల విధానమేనని, విశాఖలో ఇన్వెస్టర్ల సదస్సు ఉన్న నేపథ్యంలో పెట్టుబడులు ఆకర్షించేందుకు, కొత్త పరిశ్రమల స్థాపనని ప్రోత్సహించేందుకు అలా విశాఖ రాజధాని అని చెప్పామని సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ముందు వివరణ ఇచ్చారు. అంటే ప్రజల కోసం మూడు రాజధానులు, ఇన్వెస్టర్ల కోసం ఒక రాజధాని రాగమా అని మేధావులు ప్రశ్నిస్తున్నారు. జగన్ నేను ఎక్కడుంటే అక్కడే రాజధాని అని, విశాఖకి షిఫ్ట్ అవుతున్నానని ప్రకటిస్తుంటే, మూడు రాజధానులే మా ప్రభుత్వ విధానం అని, అభివృద్ధి వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నామని మంత్రి బొత్స సత్యనారాయణ చెబుతున్నారు. మొత్తానికి టిడిపి నేతలు అంటున్నట్టు మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట వైసీపీ ఆడుతున్నట్టే ఉంది.
నిఘా విభాగం మాజీ బాస్ ఏబీ వెంకటేశ్వరరావును జగన్ ఏమీ చేయలేడా?
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఇటీవల అన్నివైపుల నుంచి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుని ఎలాగైనా డిస్మిస్ చేయాలనుకున్న వైసీపీ సర్కారుకి కేంద్రం నిర్ణయంతో సగం మోదం-సగం ఖేదం మిగిలింది. ఏబీ వెంకటేశ్వరరావును డిస్మిస్ చేయాలన్న ఏపీ ప్రభుత్వ విజ్ఞప్తిని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తిరస్కరించింది. అవసరమైతే శాఖాపరమైన చర్యలు తీసుకోవచ్చని కేంద్ర హోంశాఖ ఏపీ ప్రభుత్వ కార్యదర్శికి లేఖ రాసింది. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఏబీ వెంకటేశ్వరరావు ఇంక్రిమెంట్లు రద్దు చేసేందుకు వెసులుబాటు కల్పించింది. టిడిపి హయాంలో ఇంటిలిజెన్స్ చీఫ్గా పనిచేసిన ఏబీ వెంకటేశ్వరరావు కోడికత్తి కేసులోనూ, బాబాయ్ హత్య కేసులోనూ తన గుట్టుమట్లన్నీ ప్రభుత్వానికి అందించింది ఏబీ వెంకటేశ్వరరావు అని వైసీపీ అధినేతకి అనుమానాలున్నాయి.వైసీపీ సర్కారు వచ్చిన నుంచి ఏబీవీని ఏదో రకంగా వేధిస్తూ వచ్చారు. టిడిపి హయాంలో ఇంటిలిజెన్స్ చీఫ్గా ఉన్న ఏబీ వెంకటేశ్వరావు నిఘా పరికరాల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారంటూ వైసీపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించి, విధుల నుంచి తొలగించింది. దీనిపై ఏబీ వెంకటేశ్వరరావు న్యాయపోరాటం చేయగా సస్పెన్షన్ ఎత్తివేసి వెంటనే విధుల్లోకి తీసుకోవాలని గతేడాది సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ తర్వాత ఆయనకు ప్రింటింగ్ అండ్ స్టేషనరీ విభాగంలో పోస్టింగ్ ఇచ్చారు. అయితే ఆ పోస్టింగ్ ఇచ్చి, ఓ కేసులో సాక్షుల్ని ప్రభావితం చేశారని మళ్లీ సస్పెండ్ చేశారు. వైసీపీ పాలనలో అసలు పోస్టింగ్ ఇవ్వకుండా ఏబీవీని రిటైర్ అయ్యేలా, లేదంటే ఉద్యోగం నుంచి తొలగించాలనుకున్న వైసీపీ అధినేత కోరిక నెరవేరలేదు. ఏబీ వెంకటేశ్వరరావును ఉద్యోగం నుంచి తొలగించడం, తప్పనిసరిగా పదవీ విరమణ చేయించడం కుదరదని స్పష్టం చేసింది. శాఖాపరమైన చర్యలు తీసుకోవచ్చని, రిటైర్ అయ్యే వరకు లభించే ఇంక్రిమెంట్లను రద్దు చేయవచ్చని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఏపీ సీఎస్ కు లేఖ రాసింది. యూపీఎస్సీ సలహా మేరకు తదుపరి చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
1వ తేదీనే ఎమ్మెల్యేలకు జీతాలు..ఉద్యోగులకు మాత్రం ఏ తేదీయే కూడా చెప్పలేరు
వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఏ ప్రభుత్వ ఉద్యోగికి ప్రతీ నెలా ఒకటో తేదీన జీతం పడిన దాఖలాలు లేవు. కొందరికి మూడు వారాలు తరువాత కూడా జీతాలు పడుతున్నాయి. కొందరికైతే నెలల తరబడి జీతాలు లేవని ఆందోళనలు సాగుతున్నాయి. జీతాలు సకాలంలో చెల్లించకపోతే నిరవధిక సమ్మెలోకి వెళ్తామని యూటీఎఫ్ నేతలు హెచ్చరించారు. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గవర్నర్ని కలిసి తమ జీతాలు సకాలంలో ఇప్పించాలని కోరడం దేశంలోనే కలకలం రేపింది. ఉద్యోగసంఘంపై ఏపీ సర్కారు సీరియస్ అయి నోటీసులు ఇచ్చింది. గవర్నర్ అపాయింట్మెంట్ ఇప్పించిన కార్యదర్శి ఆర్ పి సిసోదియాని జీఏడీకి అటాచ్ చేసింది. కానీ జీతాలు మాత్రం ఇవ్వడంలేదు. అయితే రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది ఉద్యోగ, ఉపాధ్యాయులకు జీతాలు సకాలంలో చెల్లించని సర్కారు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మాత్రం ఠంచనుగా ఒకటో తేదీనే జీతాలు, వేతనాలు, భత్యాలు చెల్లిస్తూ వస్తోంది. జీతభత్యాలు అవసరమే లేని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అడగకుండానే ఒకటో తేదీనే జీతభత్యాలన్నీ వేసేస్తున్న ప్రభుత్వం ...ఈఎమ్ఐలు, లోన్లు కట్టాల్సిన లక్షలాది ఉద్యోగులకు మాత్రం ఒకటో తేదీ వెళ్లి మూడు వారాలైనా జీతాలు చెల్లించకపోవడంతో ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి.