తమకు సంఖ్యా బలం లేదని, అక్కడ తమ మాట వినటం లేడని, ఏకంగా శాసనమండలిని రద్దు చేస్తూ, జగన్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి, కేంద్రానికి పంపించిన సంగతి తెలిసిందే. శాసనమండలి రద్దు చర్చ సందర్బంగా, మండలి దండగ అని, మండలి అంటే పెద్దల సభ అని, మన అసెంబ్లీ లోనే, అన్ని రకాల వారు ఉన్నారని, డాక్టర్లు, ఇంజనీర్లు, టీచర్లు, మాజీ అధికారులు, జర్నలిస్టులు ఉన్నారని, శాసనమండలి పై ఒక్క పైసా ఖర్చు పెట్టినా వృధా అని, అందుకే శాసనమండలి రద్దు చేస్తున్నాం అంటూ, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం శాసనమండలి రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. నిజానికి ఈ నిర్ణయం తీసుకోవటానికి, కారణాలు వేరే ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియం విషయంలో, అది దేశ చట్టలకే వ్యతిరేకం అని, ఇంగ్లీష్ మీడియంతో పాటుగా, తెలుగు మీడియం ఆప్షన్ కూడా ఉంచాలని, శాసనమండలి, బిల్లుని తిప్పి పంపించింది. ఇక సీఆర్డీఏ రద్దు, మూడు ముక్కల రాజధాని పై బిల్లులు కూడా శాసనమండలి ఆపింది. ఈ రెండు బిల్లులు సెలెక్ట్ కమిటీకి పంపించాలని కోరింది. ఆ రోజే సెలెక్ట్ కమిటీకి పంపించి ఉండి ఉంటె, ఈ పాటికి ఆ గడువు అయిపోయేది, ప్రభుత్వానికి ఏది ఇష్టం వస్తే, అది చేసుకునే పని. కాని జగన్ మోహన్ రెడ్డి, నా మాటకే ఎదురు చెప్తారా అని, ఏకంగా మండలిని రద్దు చేసి, తీర్మానం కేంద్రానికి పంపించారు.

అయితే కేంద్రం ఇప్పటికే ఈ బిల్లుని పాస్ చేసే అవకాసం కనిపించటం లేదు. కరోనా వల్ల, ఎప్పుడు పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయో తెలియదు. జరిగినా, అవి ముఖ్యమైన బిల్లులు వరుకే పరిమితం అవుతాయి కాని, ఇలాంటి బిల్లులు పరి చర్చించే అవకాసం ఉండదు. దీంతో, అప్పటి వరకు ఆగకుండా, శాసనమండలిలోనే బలం పెంచుకోవాలని వైసీపీ తమ వ్యుహన్ని మార్చుకుంది. ప్రస్తుతం కొత్తగా వచ్చిన డొక్కాతో కలుపుకుని, వైసీపీకి 10 మంది ఉన్నారు. ఇక రెండు ఇప్పటికే ఖాళీగా ఉండగా, మరో రెండు మోపిదేవి, బోసు స్థానాలు ఖాళీ అయ్యాయి. ఈ నాలుగు కూడా వైసిపీ ఖాతాలో అతి త్వరలోనే వెళ్తాయి. ఇక వచ్చే జూన్ నాటికి ఈ నాలిగిటితో కలుపుకుని 25 స్థానాలు ఖాళీ కానున్నాయి. గవర్నర్ కోటా, ఎమ్మెల్యేల కోటాలో 12 స్థానాలు ఖాళీ అవ్వగా, అవీ వైసీపీ గెలుచుకుంటుంది. ఇక మిగతా 7 స్థానిక సంస్థల నుంచి ఎన్నిక అయ్యేవి. అందుకే వీలు అయినంత త్వరగా స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టి, అక్కడ కూడా బలం పెంచుకుంటే, ఈ 7టిలో కూడా మెజారిటీ తమకే వస్తాయని వైసిపీ అంచనా వేస్తుంది. ఇక మరో వ్యూహంగా, కొంత మంది టిడిపి నేతలను తమ వైపు తిప్పుకుని, రాజీనామా చేసి, మళ్ళీ వారికే ఆ స్థానం ఇచ్చి, తమ పార్టీ ఖాతాలో వేసుకోవాలనే వ్యూహం కూడా ఉంది. మొత్తానికి మండలి పై పైసా ఖర్చు కూడా దండగ అనే దగ్గర నుంచి, మండలిలో ఎలా బలం పెంచుకోవాలనే వ్యూహంలో వైసిపీ ముందుకు వెళ్తుంది.

వైసిపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డికి, అదే పార్టీకి చెందిన ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాసారు. షోకాజ్ నోటీసుకి సమాధానం ఇస్తారు అనుకున్న సమయంలో, అది కాకుండా, జగన్ మోహన్ రెడ్డికి ఆరు పేజీల లేఖ రాసారు రఘురామకృష్ణం రాజు. విజయసాయి రెడ్డి తనకు పంపించిన నోటీసును, ఆ లేఖలో ప్రస్తావించారు రఘురామకృష్ణ రాజు. విజయసాయి రెడ్డి తనకు ఇచ్చిన నోటీసులో, లెటర్ హెడ్ చూస్తే, మన పార్టీది లాగా లేదని అన్నారు. మన పార్టీ వైఎస్ఆర్ పేరును ఉపయోగించోద్దని ఎన్నికల కమిషన్ చెప్పిందని అన్నారు. ఎలక్షన్ కమిషన్ దగ్గర రిజిస్టర్ అయిన పార్టీ పేరుకు బదులు, మరో పేరుతో ఉన్న లెటర్ హెడ్ తో తనకు నోటీసు ఇచ్చారని అన్నారు. వెంకటేశ్వర స్వామీ భక్తుడిగానే నేను తిరుమల తిరుపతి దేవస్థానం భూములు వేలం పై స్పందించానని అన్నారు. మీ కోటరీ నా పై, క్రీస్టియన్ వ్యతిరేకిగా ముద్ర వేసే ప్రయత్నం చేస్తుందని అన్నారు. అలాగే ఇంగ్లీష్ మీడియం పైనా కొందరు నా వ్యాఖ్యలని వక్రీకరించారని అన్నారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు ఎప్పుడూ పాల్పడలేదని అన్నారు.

తనపై వచ్చిన ఆరోపణలు అన్నీ అవాస్తవం అని లేఖలో పేర్కొన్నారు. మిమ్మల్ని నేను కలవాలి అనుకుంటున్నాను, మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు తనకు అపాయింట్మెంట్ ఇవ్వాలని కోరారు. అయితే రఘురామరాజు లేఖ విడుదలకు ముందు, ప్రధాని మోడీ పై, అనుకూలంగా ఉన్న ఒక ఆడియో సంగ్ ని కూడా ఆయన విడుదల చేసారు. సోషల్ మీడియాలో కూడా దాన్ని షేర్ చేసారు. చైనాతో కనుక మనకు యుద్ధం జరిగితే, ఆ యుద్ధంలో మోడీ గెలుస్తారు అంటూ, పాట సాగుతుంది. అయితే దీని పై కొందరు స్పందిస్తూ, రఘురామకృష్ణ రాజు, బీజేపీకి దగ్గర అవుతున్నారా అనే అనుమానం కూడా కలుగుతుంది. అయితే దీని పై స్పందించిన రఘురామరాజు,తనకు ఇద సినీ పరిశ్రమలో పని చేసే ఒక మిత్రుడు ఫార్వర్డ్ చేసారని, అదే నేను అందరికీ ఫార్వర్డ్ చేసానని, ఇలాంటి క్లిష్ట సమయంలో, ప్రధానికి అందరూ అండగా నిలవాల్సిన అవసరం ఉందని, దాంట్లో తప్పు ఏమి ఉంది అంటూ ప్రస్తావించారు. అయితే, ఇప్పుడు ఈ ఆడియోతో పాటు, జగన్ కు రాసిన లేఖ పై, జగన్ ఎలా స్పందిస్తారో చూడాలి.

తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ లోని వివిధ జిల్లాలకు వాహనాల్లో వెళ్ళేందుకు పోలీస్ శాఖ ఆంక్షలు విధించింది. ఏపీ సరిహద్దుల్లో ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు మాత్రమే వాహనాలకు అనుమతిస్తామని నల్గొండ జిల్లా ఎస్పీ ఆకుల వెంకట రంగనాథ్ చెప్పారు. తెలంగాణ నుంచి చౌటుప్పల్, చిట్యాల, నార్కట్‌పల్లి, మిర్యాలగూడ ద్వారా వాడపల్లి మీదుగా వెళ్ళే వాహనాలు రాత్రి 7 గంటల్లోగా ఏపీ సరిహద్దులకు చేరుకోవాలని సూచించారు. పాస్ ఉంటేనే తెలంగాణ వాహనాలను ఏపీలోకి అనుమతిస్తామని చెప్పారు. సరుకు రవాణా, అత్యవసరర సేవలకు మినహాయింపు ఉంటుందని నల్గొండ మీదుగా మాచర్ల వెళ్ళే వాహనాలకు అనుమతి లేదని ఆయన వివరించారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క-రో-నా వికృత రూపం దాలుస్తోంది. రోజు రోజుకు క-రో-నా మహమ్మారి విస్తృత స్థాయిలో విజృంభిస్తూ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా ఒకే రోజు రికార్డు స్థాయిలో 813 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి.

గడిచిన 24 గంటల్లో 25,778 మంది నుంచి నమూనాలు సేకరించి, పరీక్షించగా, ఈ కొత్త కేసులు బయట పడ్డాయి. తాజాగా రిపోర్టెన క-రో-నా పాజిటివో రాష్ట్రంలో 755 కేసులు నమోదుకాగా, ఇతర రాష్ట్రాల నుంచి తిరిగి వచ్చినవారికి 55 మందికి, విదేశాల నుంచి తిరిగి వచ్చినవారిలో 8మంది కరోనా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో క-రో-నా కేసులు అత్యంత వేగవంతంగా 13 వేలు దాటేశాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 13,098 కేసులు ఉన్నాయి. వీటిలో 10,848 కేసులు రాష్ట్ర పరిధిలోని కాగా.. ఇతర రాష్ట్రాల నుంచి 1,865, విదేవఝల నుంచి 385 కేసులు ఉన్నాయి. అలాగే ఈ మొత్తం పాజిటిలో తాజాగా 24 గంటల్లో కోలుకున్న 401 మంది బాధితులతో కలుపుకుని ఇప్పటి వరకు 5,908 మంది కోలుకుని, డిశ్చార్జి అయ్యారు. ప్రసుత్తం రాష్ట్ర వ్యాప్తంగా 5,480మంది ఆసుపత్రుల్లో 1,541 మంది క-రో-నా కేర్ సెంటర్లలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం 7,021 యాక్టివ్ కేసులు రాష్ట్రంలో ఉన్నాయి. ఇక క-రో-నాకు బలైపోతున్న వారి సంఖ్య రాష్ట్రంలో రోజు రోజుకీ పెరిగిపోతోంది. తాజాగా రాష్ట్రంలో ఒకే రోజు 12 మంది మృతి చెందారు. వీరిలో కర్నూ లులో ఆరుగురు, కృష్ణల్లో అయిదు గురు, పశ్చిమ గోదావరిలో ఒక్కరు మరణించారు. దీంతో ఈ రెండు జిల్లాల్లో క-రో-నాతో మరణించిన వారి సంఖ్య 116గా ఉంది. రెండు జిల్లాల్లోనూ 58 మంది చొప్పున కరోనాతో మరణించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ నేత, రఘురామకృష్ణం రాజు. ఆయన ఎంపీ అయిన దగ్గర నుంచి, రాష్ట్రంలో ఏ తప్పు జరిగినా, తన అభిప్రాయాలు కుండబద్దలు కొడుతున్నారు. తాను ఎంపీగా ప్రమాణం చేసిన వ్యాఖ్యలు గుర్తు తెచ్చుకుంటూ, ప్రజల కోసమే పని చేస్తానని, ప్రజలకు ఇబ్బంది జరిగితే అది చెప్పాల్సిన బాధ్యత తన పై ఉందని చెప్తూ ఉంటారు. అయితే ఈ క్రమంలోనే ఆయన ప్రభుత్వం చేస్తున్న కొన్ని పనులు పై, బహిరంగంగా ఎత్తి చూపటంతో, ఆ పార్టీకి చెందిన నేత, జనరల్ సెక్రటరీ విజయసాయి రెడ్డి, రఘురామకృష్ణంరాజుకి షోకాజ్ నోటీస్ ఇచ్చారు. అయితే దీని పై గత నాలుగు రోజులుగా రఘురామరాజు తన అభిప్రాయాలని చెప్తూ వచ్చారు. ఈ రోజు తాను వైసిపీ ఇచ్చిన షోకాజ్ నోటీస్ కు రిప్లై ఇవ్వటమా, లేక జగన్ మోహన్ రెడ్డికి నేరుగా లేఖ రాయటమా, ఏదో ఒకటి చేస్తానని, ఈ రోజు 12 గంటల లోపు వారికి రిప్లై ఇస్తానని చెప్పిన సంగతి తెలిసిందే. ఆయన ఏమి చేస్తారా అని అందరూ టెన్షన్ గా ఉన్న సమయంలో, ప్రాముఖ న్యాయవాది జంధ్యాల రవిశంకర్ చేసిన ట్వీట్ ఇప్పుడు చర్చనీయంసం అయ్యింది. ఇవన్నీ చూస్తుంటే, రఘురామరాజు ఏదో భారీ ప్లాన్ తోనే ఉన్నారని తెలుస్తుంది.

జంధ్యాల రవిశంకర్ ట్వీట్ చేస్తూ, "Will Raghu Raju’s arrow Bow and arrow hit the bulls eye ???? today !!! Hold you breath !!!" అంటూ ట్వీట్ చేసారు. రఘురామరాజు ఈ రోజు కుంభస్థలాన్ని కొడతారా ? ఊపిరి బిగబట్టండి అంటూ ట్వీట్ చేసారు. సహజంగా జంధ్యాల రవి శంకర్ ఏదో విషయం ఉంటే తప్ప హైప్ చెయ్యరు. శాసనమండలిలో సెలెక్ట్ కమిటీ విషయం, నిమ్మగడ్డ విషయం, అమరావతి విషయం ఇలా అనేక విషయాల్లో, ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. రఘురామకృష్ణం రాజు విషయంలో కూడా ఆయన ఏమైనా న్యాయ సలహాలు ఇచ్చారా ? అంటే, ఈ ట్వీట్ చూస్తే నిజమే అనిపిస్తుంది. రఘురామరాజు లేవనెత్తిన అంశాలు, ఏకంగా యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ మనుగడకే ప్రమాదం అనే వార్తలు కూడా వచ్చాయి. మరి ఆ విషయంలో, ఏదైనా చట్టం బయటకు తీసి, ఇరికించబోతున్నారా ? ఏది చేసినా జగన్ ని ఇబ్బంది పెట్టె వ్యూహమే కాని, పార్టీ రద్దు వరుకే వెళ్ళే అవకాశం ఉండదు అనే విశ్లేషణ కూడా వస్తుంది. చూద్దాం ఏమి చేస్తారో ?

Advertisements

Latest Articles

Most Read